Jump to content

తురీయావస్థ

వికీపీడియా నుండి

హిందూ తత్వశాస్త్రంలో, తురీయావస్థ ( సంస్కృతం : తురియ, అంటే "నాల్గవది") లేదా చతురియా, చతుర్థ, స్వచ్ఛమైన స్పృహ. తురీయం అనేది మూడు సాధారణ స్థితులకు ఆధారమైన నేపథ్యం. స్పృహ యొక్క మూడు సాధారణ స్థితులు: జాగ్రద, స్వప్న, సుషుప్తి. [web 1] [web 2]

మాండూక్యోపనిషత్తు

[మార్చు]

మాండూక్యోపనిషత్తు లోని 7వ శ్లోకం తురీయావస్థ గురించి చర్చించింది; అయితే, ఈ ఆలోచన ఇంకా పురాతన ఉపనిషత్తులలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఛాందోగ్యోపనిషత్తులోని 8.7 నుండి 8.12 అధ్యాయాలు - జాగ్రద, స్వప్న, సుషుప్తి, తురీయం అనే "నాలుగు స్పృహ స్థితులను" చర్చిస్తాయి. [1] [2] అదేవిధంగా, బృహదారణ్యక ఉపనిషత్తు, 5.14.3 అధ్యాయంలో తురీయావస్థను చర్చిస్తుంది, మైత్రాయణి ఉపనిషత్తు 6.19, 7.11లో భాగాల్లో దీన్ని వివరించింది. [3]

తురియావస్థ గురించిన అవగాహన

[మార్చు]

అద్వైత వేదాంతం

[మార్చు]

అద్వైతం, మూడు అవస్థలను సూచిస్తుంది, అవి జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవి మానవులు అనుభవపూర్వకంగా అనుభవిస్తారు. [4] [5] ఈ మూడూ, మూడు శరీరాల సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి: [6]

  1. మొదటి స్థితి మేల్కొన్న స్థితి, దీనిలో మన రోజువారీ ప్రపంచం గురించి మనకు తెలుసు. [7] ఇది స్థూల శరీరం.
  2. రెండవ స్థితి కలలు కనే మనస్సు. ఇది సూక్ష్మ శరీరం. [7]
  3. మూడవ స్థితి గాఢనిద్ర స్థితి. ఇది కారణ శరీరం. [7]

అద్వైతం తురియావస్థ అనే నాల్గవ స్థితిని కూడా ప్రతిపాదిస్తుంది. దీనిని కొందరు స్వచ్ఛమైన స్పృహ అని వర్ణిస్తారు. ఈ మూడు సాధారణ స్థితులనూ అధిగమించే స్థితి. [web 1] [web 2] తురీయం అనేది విముక్తి స్థితి. అద్వైతం ప్రకారం, తురీయావస్థ అంటే ద్వంద్వ అనుభవం నుండి విముక్తి పొంది, అనంతమైన, అభేదమైన అనుభవాన్ని అనుభవించడం. ఇదే అజాత స్థితి (పుట్టుక లేని తనం). [8] చంద్రధర శర్మ ప్రకారం, తురియావస్థ అనేది ఆత్మను తెలుసుకున్న స్థితి, దానికి కొలత లేదు, కార్య కారణాల్లేవు, అన్నిటినీ మించిన, బాధలు లేని, ఆనందకరమైన, మార్పులేని, స్వయం ప్రకాశవంతమైన, నిజమైన, అలౌకికమైన స్థితి. [9] తురీయావస్థను అనుభవించిన వారు అందరిలోనూ, అన్నిటి లోనూ తానుండే ద్వంద్వ రహిత స్థితికి చేరుకుని ఉంటారు. వారికి జ్ఞానం, జ్ఞాని, జ్ఞానార్థి ఒకరే అవుతారు. వారు జీవన్ముక్తులు. [10] [11]

అద్వైతం ఈ సిద్ధాంతపు పునాదిని మరింత ప్రాచీన సంస్కృత గ్రంథాలలో గుర్తించింది. [12] ఉదాహరణకు, ఛాందోగ్య ఉపనిషత్తులోని 8.7 నుండి 8.12 అధ్యాయాలు జాగ్రదావస్థ, స్వప్న, సుషుప్తి, తురీయం అనే "నాలుగు స్పృహ స్థితులను" చర్చిస్తాయి. [12] [2] హిందూ గ్రంధాలలో తురీయం గురించిన తొలి ప్రస్తావన ఒకటి బృహదారణ్యక ఉపనిషత్తులోని 5.14.3 శ్లోకంలో ఉంది. ఇతర ప్రారంభ ఉపనిషత్తులలో కూడా వీటి చర్చ ఉంది. [13]

గౌడపాద

[మార్చు]

గౌడపాద (సుమారు 7వ శతాబ్దం) అద్వైత వేదాంతంలో ప్రారంభ గురువు . గౌడపాదుడు సాంప్రదాయకంగా హిందూ తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ఆది శంకరునికి, [14] గురువు అని భావిస్తారు. ఇతను శ్రీ గౌడపాదాచార్య మఠం స్థాపకుడు మాండూక్య కారిక రచయిత లేదా సంకలనకర్త [15] అని భావిస్తారు.

గౌడపాదుడు మాండూక్య కారికను సంకలనం చేసాడు [15] దీనిని మాండూక్య కారిక ఆగమ శాస్త్రం అని కూడా అంటారు. [note 1] ఇందులో గౌడపాద, అవగాహన, ఆదర్శవాదం, కారణవాదం, సత్యం, వాస్తవికతలను చర్చిస్తాడు. తురియావస్థ నిశ్శబ్దానికి ప్రతీక కాగా మిగిలిన మూడు ఓంకి అనుగుణంగా ఉంటాయి. ఇది మిగతా మూడు స్థితులకు మూలాధారం. ఇదే అత్యంత-శూన్యత (సంపూర్ణ శూన్యత). [16]

ఆదిశంకర

[మార్చు]

ఆది శంకరులు మాండూక్య ఉపనిషత్తులో ప్రతిపాదించిన ఆలోచనల ఆధారంగా, జాగ్రద, స్వప్న, సుషుప్తి [web 3] [web 4] అనే మూడు స్థితులను వర్ణించాడు: [6]

  • మొదటి స్థితి జాగ్రదావస్థ. మన రోజువారీ ప్రపంచం గురించి మనకు తెలుసిన స్పృహ. "ఇది బాహ్యంగా తెలిసిన ( బహిష్-ప్రజ్ఞ ), స్థూల (స్థూల), సార్వత్రిక (వైశ్వానర) గా వర్ణించబడింది ". [web 4] ఇది స్థూల శరీరం.
  • రెండవది స్వప్నావస్థ"ఇది అంతర్ దృష్టి (అంతః-ప్రజ్ఞ ), సూక్ష్మ (ప్రవివిక్త), దహనం (తైజస)గా వర్ణించబడింది". [web 4] ఇది సూక్ష్మ శరీరం.
  • మూడవ స్థితి సుషుప్తి. ఇది కలల్లేణి, ఒడిదుడుకుల్లేని అత్యంత ప్రశాంత స్థితి "..సర్వేశ్వరుడూ, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, యోనిః సర్వస్య, ప్రభవ ఆప్యాయౌ హి భూతానాం". [web 4] ఇది కారణ శరీరం.

గమనికలు

[మార్చు]
  1. Nakamura notes that there are contradictions in doctrine between the four chapters.[15]

మూలాలు

[మార్చు]
  1. PT Raju (1985), Structural Depths of Indian Thought, State University New York Press, ISBN 978-0887061394, pages 32-33; Quote: "We can see that this story [in Chandogya Upanishad] is an anticipation of the Mandukya doctrine, (...)"
  2. 2.0 2.1 Robert Hume, Chandogya Upanishad - Eighth Prathapaka, Seventh through Twelfth Khanda, Oxford University Press, pages 268-273
  3. Hume, Robert Ernest (1921), The Thirteen Principal Upanishads, Oxford University Press, p. 392 footnote 11
  4. Arvind Sharma (2004), Sleep as a State of Consciousness in Advaita Vedånta, State University of New York Press, page 3
  5. William Indich (2000), Consciousness in Advaita Vedanta, Motilal Banarsidass, ISBN 978-8120812512, pages 57-60
  6. 6.0 6.1 Wilber 2000, p. 132.
  7. 7.0 7.1 7.2 Arvind Sharma (2004), Sleep as the State of Consciousness in Advaita Vedånta, State University of New York Press, pages 15-40, 49-72
  8. King 1995, p. 300 note 140.
  9. Sarma 1996, pp. 122, 137.
  10. Sarma 1996, pp. 126, 146.
  11. Comans 2000, pp. 128–131, 5–8, 30–37.
  12. 12.0 12.1 PT Raju (1985), Structural Depths of Indian Thought, State University New York Press, ISBN 978-0887061394, pages 32-33
  13. Indich 2000, pp. 58–67, 106–108.
  14. Potter 1981, p. 103.
  15. 15.0 15.1 15.2 Nakamura 2004, p. 308.
  16. Nakamura 2004, p. 285.

వెబ్ మూలాలు

[మార్చు]