గౌడపాదులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌడపాదులు
ఆది గురు శ్రీ గౌడపాదాచార్య
స్థాపించిన సంస్థశ్రీ గౌడపాదాచార్య మఠం
తత్వంఅద్వైత వేదాంతం

గౌడపాదులు శంకరాచార్యుని గురువు అయిన గోవింద భగవత్పాదుల గురువు. అద్వైతం అనే మహాసౌధానికి తర్కంతో పునాదులు వేసిన వేదాంతి, మేధావి, తత్త్వజ్ఞడు. శంకరాచార్యులు, ఆయన శిష్యులు రచించిన పుస్తకాలలో ఈయనను గౌడాచార్యులు, గౌడపాదాచార్యులు, గౌడాచరణ, గౌడ వంటి పేర్లతో స్తుతించారు.[1]

పూర్వాశ్రమం (సన్యాసానికి ముందు జీవితం)

[మార్చు]

గౌడపాదులు రచించిన మాండూక్య కారికకు శంకరాచార్యులు వ్రాసిన భాష్యం చిగురున వారు గౌడపాదులను "పరమ గురువు" అని సంబోధించారు. అంటే గురువుకు, గురువు అని అర్థం. అందుచేత ఈయన శంకరాచార్యుని కంటే రెండు తరాల ముందు, సుమారుగా 5వ శతాబ్దంలో, జీవించి ఉండి ఉండాలి.[2]

ఆనందగిరి అనే అద్వైత వేదాంతి గౌడపాదుని రచన అయిన మాండూక్య కారికకు శంకరాచార్యుని భాష్యానికి టీకా వ్రాస్తూ ఆయన హిమాలయాలలోని బదరికాశ్రమంలో తపస్సు చేసారని, దానికి మెచ్చి నారాయణుడు శుకుని చేత ఈయనకు అద్వైతోపదేశం చేసాడని వ్రాసారు. బాలకృష్ణానంద అనే మఱొక అద్వైతి గౌడపాదులు ఉత్తర బెంగాల్ లో ఉండేవారని వ్రాసారు. "గౌడ" శబ్దం ఉత్తర బెంగాలీయులకు వర్తిస్తుంది కాబట్టి ఇది కూడా నిజమవ్వచ్చును.[1]

అజాతివాదం

[మార్చు]

గౌడపాదులు అద్వైతానికి వేసిన పునాదులలో ముఖ్యమైనది అజాతివాదం. అజాతివాదం అంటే "అసలు పుట్టుకే లేదు" అనడం. దీనికే అస్పర్శవాదం అని కూడా పేరు ఉంది.[3] ఆదిలో అవ్యక్తమైనది, అంతంలో అవ్యక్తమైనది మధ్యలో కూడా అవ్యక్తమే అయ్యి ఉండాలి కనుక మన చుట్టూ ఉన్న సృష్టి అంతా మిథ్య అని గౌడపాదుల వాదన.[4]

రచనలు

[మార్చు]

గౌడపాదుల రచనలలో ముఖ్యమైనవి మాండూక్యోపనిషత్ పైన వ్రాసిన మాండూక్య కారిక (దీనికే ఆగమ శాస్త్రమని పేరు), ఈశ్వరకృష్ణుని సాంఖ్యకారిక పైన ఒక భాష్యం, ఉత్తరగీత పైన ఒక వృత్తి. కొంతమంది ఈయన తాంత్రికగ్రంథాలైన సుభాగోదయస్తుతి, శ్రీ విద్యారణ్య సూత్ర కూడా రచించారనిచెప్తారు. కానీ తగిన ఆధారాలు లేవు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 N. V. Isaeva, From Early Vedanta to Kashmir Shaivism: Gaudapada, Bhartrhari and Abhinavagupta, 14వ పుట, 1995, "http://books.google.com/books?id=hMCFQ39cHNkC"
  2. విధుశేఖర భట్టాచార్య, The Āgamaśāstra of Gauḍapāda, 72 (lxxii) వ పుట, 1989, "http://books.google.com/books?id=Lz08gSuuLQkC"
  3. Raphael, The Pathway of Non-duality, Advaitavada, 3వ అధ్యాయం, 1992, "http://books.google.com/books?id=P_u-4_kMfKwC"
  4. Karl H. Potter, Encyclopedia of Indian Philosophies (Volume 3): Advaita Vedānta up to Śaṃkara and his pupils, 63వ పుట, 1998, "http://books.google.com/books?id=TCWU_ua5kxgC"