మైత్రాయణి ఉపనిషత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైత్రాయణీ ఉపనిషత్తు

ఇందు 7అధ్యాయములుకలవు. ఇందాత్మనుగురుంచి చెప్పబడినది. ఈరహస్యము ఇక్ష్వాకువంశొద్భోవుడైన బృహద్రధునకు ఉపదేశించడమైనది. ఇందు చర్చింపబడిన విషయమంతయు మూడు ప్రశ్నలలోనిముడ్పంబడియున్నది. (1) ఆత్మ దేహములో నెట్లు ప్రవేశించును (2) పరమాత్మ జీవాత్మ యెట్లగుచున్నది? (3) మోక్షసాధనమెట్లు? ఈ ఉపనిషత్తులోని మిగిలన భాగమంతయు ఖిలకాండమని చెప్పవచ్చును. ఇందు ప్రపంచోత్పత్తికగాధ గలదు. రజ,స్సత్వ, తమోగునములు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు గలవని చెప్పబడియున్నది. ఓంకారముయొక్క ప్రాముఖ్యమును గూర్చి చర్చింపబడినది. జాగ్రత్, స్వప్నా, సుషుప్తావస్థలేకాక బ్రహ్మకు దురీయావస్థకూడ నున్నదని చెప్పబడియున్నది.