అతిరాత్రం

వికీపీడియా నుండి
(అతిరాత్రిః నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సప్త సోమయాగాలలో అగ్నిస్టోమం, అత్యగ్నిస్టోమం, ఉక్ధ్యం, షోడసి, వాజపేయం, ఆప్తోర్యామం, అతిరాత్రం ఉన్నాయి. ఈ సప్త సోమయాగాలలో అతి పవిత్రమైంది ‘అతిరాత్రం’ (అతిశయితా రాతిః ఇతి అతిరాత్రః) అని విజ్ఞులు చెబుతున్నారు. మనిషి జీవనానికి 48 సంస్కారాలను మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. వీటిలో 39 వ సంస్కారమే అతిరాత్రం.

‘అతిరాత్రం’ ఉత్కృష్ట సోమయాగం కేరళలో ప్రసిద్ధమైంది.

2012 లో భద్రాచలంకు దగ్గర ఎటపాకలో జరిగిన అతిరాత్రం యాగశాల వద్ద గరుడ ప్రతిమ
అతిరాత్రం యాగశాల, ఎటపాక

రామాయణం

[మార్చు]

ఈ యాగాన్ని దశరథ మహారాజు నిర్వహించినట్టు రామాయణం బాలకాండలోని 14వ సర్గ 39వ శ్లోకం రెండో పాదం, 40వ శ్లోకం మొదటిపాదంలో పేర్కొన్నారు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగంతో పాటు అతిరాత్రం కూడా నిర్వహించినట్టు దీనివల్ల స్పష్టమవుతోంది.

రాజులు

[మార్చు]

అతిరాత్రం మన దేశంలో గతంలో రాజులు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది.

గుప్తరాజులు, చోళరాజులు తదితర రాజులు కూడా అతిరాత్రం యాగాన్ని నిర్వహించినట్టు దాఖలాలు ఉన్నాయి.

నంబూద్రి కుటుంబీకులు

[మార్చు]

కేరళలోని నంబూద్రి కుటుంబీకులు ఈ యాగాన్ని అప్పుడప్పుడు నిర్వహిస్తున్నారు. 1901, 1918, 1956, 1975, 2011 సంవత్సరాల్లో నంబూద్రి కుటుంబీకులు అతిరాత్రం నిర్వహించారు.

2011 ఏప్రిల్ 4 నుండి 15 వరకు కేరళలోని త్రిశూర్ జిల్లా పంజాల్ గ్రామంలో అతిరాత్రం నిర్వహించారు.

2012 లో ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు భద్రాచలానికి దగ్గర ఎటపాకలో జరిగింది. కేరళ నంబూద్రి లే ఈ యాగాన్ని నిర్వహించారు.

2013 లో ఏప్రిల్ నెలలో కీసరగుట్ట గ్రామంలో జరిగింది.

నియమావళి

[మార్చు]

సూర్యశక్తిని కేంద్రీకరించేందుకు అనువైన స్థలం అయి ఉండాలి.

ఈ స్థలం పవిత్రమైన క్షేత్రం అయి ఉండి, నదీ తీరం అయి, చుట్టుపక్కల అటవీ ప్రాంతం అయి ఉండాలి.

ఈ యాగంలో లోహపాత్రలను ఉపయోగించరు. అన్ని వస్తువులను కర్రతో తయారు చేస్తారు.

యాగం కోసం వెదురు, తాటి ఆకులతో ప్రత్యేకంగా పర్ణశాలను నిర్మిస్తారు.

రకాలు

[మార్చు]

యాగం నిర్వహించే రోజుల సంఖ్యను అనుసరించి వీటిని మూడు రకాలుగా విభజించారు.

ఒకరోజు చేసే యాగాన్ని ‘ఏకాహం’ అని,

రెండు రోజుల నుండి 12 రోజుల పాటు నిర్వహించే యాగాన్ని ‘ఆహీనం’ అని,

పనె్నండు రోజులు మించి చేసే యాగాన్ని ‘సత్ర’ యాగమని అంటారు.

12 రోజులపాటు నిర్వహించే అతిరాత్రం ఆహీనం యాగంలో మొదటి మూడు రోజులు దీక్షాసమయంగానూ,

తర్వాతి ఆరు రోజులు ఉపాసనా దినములుగాను,

చివరి మూడు రోజులు సూత్యంగానూ వ్యవహరిస్తారు.

వేదపఠనం

[మార్చు]

యాగం సందర్భంగా వేదపఠనం ఉంటుంది.

యజుర్వేద పఠనం

ఋగ్వేద పఠనం

సామవేద పఠనం