పూరుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పూరుడు యయాతి కుమారుడు. ఇతని తల్లి శర్మిష్ఠ. ఇతని భార్య కౌసల్య. వీరి కుమారుడు జనమేజయుడు.


యయాతికి శాపవశమును ముసలితనం ప్రాప్తించింది. కాని భోగలాలసత్వం ఇంకా ఎక్కువగా ఉండటంతో కుమారులలో ఎవరైనా తన ముసలితనాన్ని తీసుకొని, యవ్వనాన్ని ప్రసాదించమని అడుగుతాడు. పూరుడు ఒక్కడే అందుకు అంగీకరిస్తాడు. తక్కిన పుత్రులు అందుకు నిరాకరించగా, రాజ్యార్హతను కోల్పోతారు. యయాతి పూరుని యౌవనాన్ని స్వీకరించి, మరికొంత కాలం సుఖములను అనుభవించి, పూరుని రాజ్యాభిషిక్తున్ని చేసెను.

"https://te.wikipedia.org/w/index.php?title=పూరుడు&oldid=2182756" నుండి వెలికితీశారు