సరస్వతీ నది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సరస్వతీనది ఈ మార్గంలో ప్రవహించి ఉండవచ్చునని ఊహిస్తున్నారు

సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది. ఋగ్వేదము నందలి నదిస్తుతి నందు చెప్పబడిన సరస్వతీ నదికి, తూర్పున యమునా నది పశ్చిమాన శతద్రూ(సట్లేజ్) నది కలవు. ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడినది. సింధు లోయ నాగరికత కాలంనాటి అవశేషాలు ఎక్కువగా సింధు నదికి తూర్పున, ఘగ్గర్-హాక్రా నది ప్రాంతములలో లభించినాయి. ప్రస్తుతము సరస్వతి అనే పేరుమీద ఓ చిన్న నది కలదు. ఇది ఘగ్గర్ నదికి ఉపనది. బహుశా పురాతన సరస్వతీ నదికి ఓ శాఖ అయి ఉండవచ్చు.

హిందూ పురాణములలో సరస్వతీ నది[మార్చు]

ఋగ్వేదము[మార్చు]

ఋగ్వేదములో సరస్వతీ నది ప్రముఖముగా చెప్పబడినది. మొత్తం అరవై పర్యాయములు (ఉదాహరణకు: 2.41.16; 6.61.8-13; 1.3.12.) ఈ సరస్వతీ నది ప్రస్తావనకు వస్తుంది. ఈ నది ఏడు పుణ్య నదులలో ఒకటి. భాషా పరంగా సరస్వతి అనగా అనేక పాయలతో ప్రవహించు నది అని అర్థము. ప్రస్తుతము చాలామంది పండితులు, గఘ్ఘర్-హక్రా నదే సరస్వతీ నదిగానో, లేదా కనీసం ఓ పాయగానో ఒప్పుకుంటారు, కానీ ఈ పేరు ఆఫ్ఘనిస్తాను నుండి పంజాబుకు వెళ్ళినదా లేదా పంజాబునుండి ఆఫ్ఘనిస్తానుకు వెళ్ళినదా అనే విషయముపై భిన్నాభిప్రాయములు ఉన్నాయి. ఋగ్వేదములో సరస్వతీ నదిని అన్నింటికంటే ఉత్తమమైన నదిగా కీర్తించినారు. దీనిని ఏడవ నదిగా, వరదలకు తల్లిగా, ఉత్తమ తల్లిగా, ఉత్తమ దేవతగా, ఉత్తమ నదిగా కీర్తించినారు. (ఋగ్వేదము 2.41.16-18; మరియు 6.61.13; 7.95.2) (ఋగ్వేదము: 7.36.6. సరస్వతి సప్తః సింధుం", 2.41.16 లో ఆంబితమే నాదీతమే దేవితమే సారస్వతి" ॥ దీనిని బట్టి సరస్వతీనది ప్రాముఖ్యత అర్థము అవుతుంది. ఋగ్వేదము 7.95.1-2 నందు సరస్వతీ నదిని సముద్రమువైపు ప్రయాణము చేయు నది గా కీర్తించినారు.

"ఈ సరస్వతీనది మా ఇనుప కోటకు రక్షణ"
"రథములో వలే సరస్వతీనది ప్రవహిస్తూ మిగిలిన నదుల ఔన్నత్యమునూ, గొప్పతనాన్ని కనుమరుగు చేస్తుంది"

నది ఉనికికి బలమైన ఆధారం[మార్చు]

ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ సింధుశాఖ(రాన్ ఆఫ్ కఛ్) వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మొత్తం పొడవు సుమారు 1,600 కిలోమీటర్లు. ఈ మార్గంలో చాలా ప్రాంతాలలో ఓ.ఎన్.జి.సి. భూగర్భ జలాల నిల్వలను కనుగొంది. రాజస్థాన్ లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో 13 చోట్ల బోరుబావులు తవ్వగా 35-40 మీటర్ల లోతున నీటి నిల్వలు లభించాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ నీరు 4 వేల సంవత్సరాల నాటిదని గుర్తించారు.

పునరుద్ధరణ[మార్చు]

1986 నుండి సరస్వతి పునరుద్ధరణకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి మొదలుపెట్టాయి. హర్యానాలోని సరస్వతి నది శోధ్ సంస్థాన్ చేపట్టిన కార్యక్రమాలు అక్కడి ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచాయి. 2002 లో ఎన్.డి.ఎ. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు, మరియు 50 కిలోమీటర్లు పొడవున్న సరస్వతి మహానది రూపనహర్ కాలువను తవ్వించారు.

మూలాలు[మార్చు]

  • The Quest for the Origins of Vedic Culture. ISBN 0-19-513777-9.  Unknown parameter |Last= ignored (|last= suggested) (help); Unknown parameter |Year= ignored (|year= suggested) (help); Unknown parameter |First= ignored (|first= suggested) (help); Unknown parameter |Publisher= ignored (|publisher= suggested) (help); Unknown parameter |Authorlink= ignored (|authorlink= suggested) (help)
  • Frawley David: The Rig Veda and the History of India, 2001.(Aditya Prakashan), ISBN 81-7742-039-9
  • Gupta, S.P. (ed.). 1995. The lost Sarasvati and the Indus Civilization. Kusumanjali Prakashan, Jodhpur.
  • Keith and Macdonell. 1912. Vedic Index of Names and Subjects.
  • Oldham, R.D. 1893. The Sarsawati and the Lost River of the Indian Desert. Journal of the Royal Asiatic Society. 1893. 49-76.
  • Shaffer, Jim G. Cultural tradition and Palaeoethnicity in South Asian Archaeology. ISBN 0948-1923.  Unknown parameter |Publisher= ignored (|publisher= suggested) (help); Unknown parameter |Year= ignored (|year= suggested) (help)

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]