కావేరి నది
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
| కావేరి | |
| River | |
పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు వద్ద కావేరి
| |
| దేశం | India |
|---|---|
| రాష్ర్టాలు | కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి |
| ఉపనదులు | |
| - ఎడమ | హేమవతి నది, షింషా, అర్కవతి నది |
| - కుడి | కుబిని నది, భవానీ నది, నొయ్యల్, అమరావతి నది |
| Cities | తలకావేరి, కుషల్‌నగర్, శ్రీరంగపట్టణం, భవానీ, ఈరోడ్, కరూర్, నమ్మక్కల్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్ |
| Source | తలకావేరి, కొడగు, పశ్చిమ కనుమలు |
| - స్థలం | కర్ణాటక, భారతదేశం |
| - ఎత్తు | 1,276 m (4,186 ft) |
| - అక్షాంశరేఖాంశాలు | 12°38′N 75°52′E / 12.633°N 75.867°E |
| Mouth | కావేరీ డెల్టా |
| - location | బంగాళాఖాతం, భారతదేశం & భారతదేశం |
| - ఎత్తు | 0 m (0 ft) |
| - coordinates | 11°21′40″N 79°49′46″E / 11.36111°N 79.82944°E |
| పొడవు | 765 km (475 mi) |
| పరివాహక ప్రాంతం | 81,155 km2 (31,334 sq mi) |
కావేరి నది (Kaveri river) (కన్నడ: ಕಾವೇರಿ ನದಿ, తమిళం: காவேரி ஆறு) భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటక, లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం.
ఉపయోగాలు
[మార్చు]కావేరి నదిలోని నీరు ముఖ్యంగా వ్యవసాయానికి, గృహావసరాలకు, విద్యుదుత్పత్తికీ ఉపయోగిస్తారు. నదిలోకి నీరు ముఖ్యంగా ఋతుపవనాల కారణంగా కలిగే వర్షాలవల్లనే లభిస్తుంది ఈ నదిపై నిర్మించబడిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్, మెట్టూర్ డ్యామ్, మొదలైనవి ఋతుపవనాల సమయంలో నీరు నిల్వచేసి వర్షాభావ పరిస్థితుల్లో విడుదల చేయబడుతాయి.
హిందూ మతంలో కావేరి ప్రాముఖ్యత
[మార్చు]బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న, ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. తుల సంక్రమణం అనే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొను వేలాది మంది భక్తులు ఇక్కడ గల మూడు దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ నీరు ఫౌంటెయిన్ లాగా ఎగజిమ్ముతూ ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం.
పరీవాహక ప్రాంతాలు
[మార్చు]చందనం అడవులకు పేరు గాంచిన, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకొనే కూర్గ్ ఈ నదీమతల్లి వరప్రసాదమే. శ్రీరంగ పట్టణం ఈ నది ఒడ్డునే నెలకొని ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రములు శ్రీరంగం, కుంభకోణం ఈ నది ఒడ్డునే నెలకొని ఉన్నాయి. బృందావన్ గార్దెన్స్ ఈ నది వొడ్దున ఉన్నాయి.
కావేరి జల వివాదం
[మార్చు]ఈ నదీ జలాల వినియోగ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొని ఉంది. తమిళనాడు రాష్ట్రం చాలాకాలంగా ఈ నదీ జలాలను విస్తారంగా వాడుకుంటుండగా, కర్ణాటక దీన్ని చారిత్రక తప్పిదంగా భావిస్తోంది. 2023 వ సంవత్సరం లో ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది.