సింధూ నది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సింధు నది ప్రాంతం.

సింధూ నది (సంస్కృతం: सिन्धु ; ఆంగ్లం: Indus River) భారత ఉపఖండంలో ప్రసిద్దమయిన హిమ నది. ఇది హిమాలయాలలో టిబెట్లో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధ్ రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‍ లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నదికి ఉపనదులు జీలం, చీనాబ్, రావీ, బియాస్, సట్లెజ్ ప్రవహించే ప్రాంతం అంతా అతి సారవంతమయిన నేల. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా డాము, సుక్కూలారు బ్యారేజ్, భారతదేశంలో పంజాబ్‍లో సట్లెజ్ నది మీద భాక్రానంగల్ ఆనకట్ట, భారీ డ్యాములు, ఆనకట్టలు కట్టి సాగునేలకు పంట నీటిని అందించి గోధుమ, వరి, చెరకు విరివిగా పండించుటయేగాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సింధు నది పొడవు 2880 కి.మీ. హరప్పా, మొహంజోదారో ప్రాంతాల్లో ఈ సింధు నదీ లోయలో సుమారు 5,000 ఏళ్ళ ఉజ్జ్వలమైన సింధు లోయ నాగరికత వెలసి వర్థిల్లింది.

సింధూ నది టిబెట్‌లోని మానస సరోవరం, కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీర్‌లోని లడాఖ్‌ మీదుగా- గిల్గిట్‌, బాల్టిస్థాన్‌నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారత్‌లోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహించి పాకిస్థాన్‌లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. భారత పాకిస్తన్‌లు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడికను కుదుర్చుకున్నాయి.

సింధూ నది ఒకరకంగా పాకిస్థాన్‌కు జీవనాడి! పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65శాతం భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90శాతం ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థాన్‌లోని మూడు అతి పెద్ద డ్యాములు, అనేక చిన్నాచితకా డ్యాములు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. సింధూ నది పాక్‌ విద్యుత్తు అవసరాలను, తాగు, సాగునీరు అవసరాలను తీర్చే కామధేనువు. ఈ డ్యాముల్లో తర్బేల ఆనకట్ట ఒకటి.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సింధూ_నది&oldid=2016465" నుండి వెలికితీశారు