Jump to content

భాక్రా డామ్

వికీపీడియా నుండి
(భాక్రానంగల్ ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)
భాక్రా డామ్.

భాక్రా డామ్ 1963లో సట్లెజ్ నదిపై నిర్మించిన కాంక్రీట్ ఆనకట్ట (డామ్). ఇది ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులలో నిర్మించబడింది. ఇది భాక్రా నంగల్ ప్రాజెక్టులో భాగము. దీని ముఖ్య ఉద్దేశం సట్లెజ్ నది-బియాస్ నది నదీ పరీవాహక ప్రాంతంలో వరదలను నిరోధించడం, పంట పొలాలకు సాగునీటి పంపిణీ, జల విద్యుత్తు (హైడ్రో విద్యుత్) ను ఉత్పత్తిచేయుట.

భాక్రా డామ్ నిర్మాణం 1948 సంవత్సరంలో మొదలై 1963 లో పూర్తయ్యింది. ఇది 741 అడుగులు (226 మీటర్లు) ఎత్తు కలిగి ప్రపంచంలోని ఎత్తైన డామ్ లలో ఒకటి (పోలిక హూవర్ డామ్ 732 అడుగులు). దీనివలన ఏర్పడిన 166 కిలోమీటర్ల గోవిందసాగర్ రిజర్వాయిర్ కు గురు గోవింద్ సింగ్, పేరుపెట్టారు. ఈ డామ్ ఇంచుమించు 10 మిలియన్ ఎకరాలకు (40,000 కి.మీ) పంటనీరు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలలో అందిస్తుంది. దీనికి రెండు వైపులా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు చేర్చబడ్డాయి. దీనికి క్రిందగా నంగల్ డామ్ నిర్మించబడింది.

గణాంకాలు

[మార్చు]

ఇది భారతదేశంలో అతి పెద్ద ఆనకట్ట డామ్.

  • డామ్ రకం: కాంక్రీట్ డామ్
  • పొడవు: 740 అడుగులు (225.55 మీటర్లు)
  • ఎత్తు: (నది ఒడ్డున) : 550 అడుగులు.
  • పొడవు (పై భాగాన) : 1700 అడుగులు
  • వెడల్పు (పై భాగాన)at top: 30 అడుగులు
  • ఎత్తు at bottom: 325 అడుగులు
  • వెడల్పు at base: 625 అడుగులు
  • Elevation at top of dam: 1700 అడుగులు (above sea level)
  • ఉక్కు ఉపయోగం: 100000 టన్నులు

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

Coordinates: 31°24′39″N 76°26′00″E / 31.41083°N 76.43333°E / 31.41083; 76.43333