వరద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1634 సంవత్సరంలోని 11 మరియు 12 అక్టోబర్ మధ్య రాత్రిలో జర్మనీ మరియు డెన్మార్క్ ఉత్తర సముద్రతీరంలో సంభవించిన బుర్చర్ది వరదల సమకాలీన చిత్రం

వరదలు అంటే భూమిని ముంచివేసే నీటి ప్రవాహం లేదా ఎక్కువైన నీరు ఒక్కచోటకి చేరడం.[1] "నీటి ప్రవాహం" అనే అర్థంలో ఈ పదాన్ని సముద్రం యొక్క ఆటుపోటులకు కూడా ఉపయోగించవచ్చు. వరదలు అనేవి నది లేదా సరస్సు వంటి జలవనరులు వాటి పరిధులను దాటి విస్తరించిన కారణంగా ఏర్పడతాయి.[2] వర్షాకాలంలో సంభవించే మార్పులు మరియు మంచు కరగడం వంటి కారణాల వలన సరస్సు లేదా జలవనరు యొక్క పరిమాణం మారుతుంది, ఈ విధంగా పొర్లిన నీరు ప్రజలు నివసించే పల్లె, నగరం లేదా ఇతర నివాస యోగ్యమైన ప్రాంతాలను ముంచకుండా ఉన్నంత వరకూ పెద్ద ప్రభావం ఉండదు.

నదిలో నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు అది దాని శాఖలు నుండి ముఖ్యంగా వంపులు లేదా మెలికలు వద్ద చాలా వేగంగా వెలుపలకి ప్రవహించే నది వలన కూడా వరదలు సంభవించవచ్చు మరియు ఇటువంటి నదులు ఇళ్లు మరియు వ్యాపారాల నాశనానికి కారణం కావచ్చు.వరదల వలన సంభవించే నష్టాలను నదులు లేక ఇతర నీటి సముదాయాల నుండి దూరంగా నివసించడం ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చును. అనాదిగా ప్రజలు నీటికి సమీపంలో తమ నివాసాలను ఏర్పరుచుకొని, చౌకైన మరియు సులభమైన రాకపోకలు, వ్యాపారంలో ప్రయోజనం కోసం జీవిస్తున్నారు.వరదల వలన నష్టం కలగవచ్చని హెచ్చరిక చేసిన ప్రాంతాల్లో ఇటువంటి ప్రజలు ఇంకా జీవనం సాగించడం వలన నీటి సమీపంలో వారి జీవితం విలువ, తరచూ కాలానుగతంగా సంభవించే వరదలకు అయ్యే నష్టం కంటే ఎక్కువ ఉండటమే దీనికి నిదర్శనం.

"ఫ్లడ్" అనే పదం జర్మనీక్ భాషల్లో కూడా వాడే పదం (ఫ్లో, ప్లోట్‌లో కనిపించే విధంగా జర్మన్ ఫ్లూట్, డచ్ వ్లోడ్‌తో సరిపోల్చే), పాత ఇంగ్లీష్ పదం ప్లడ్ అనే దాని నుండి పుట్టింది."ఫ్లడ్" అనే పదం యొక్క అర్థం, సృష్టిని వివరించే గ్రంథం బైబిల్‌లో చెప్పినట్లు సృష్టి యొక్క మహా ప్రళయాన్ని సూచిస్తుంది మరియు ప్రళయంగా భావిస్తారు.

వరదలలో ముఖ్య రకాలు[మార్చు]

ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతమైన డార్విన్‌లో భారీ వర్షాలు మరియు భారీ అలలు కారణంగా సంభవించిన వరదలు.
విల్మాస్ తుఫాన్ తాకిడి వలన అక్టోబర్ 2005లో యునైటెడ్ స్టేట్స్‌లోనికీ వెస్ట్, ఫ్లోరిడా సమీపంలో సంభవించిన వరదలు.
భారీ తుఫాను వలన అకస్మాత్తుగా సంభవించే వరదలు.

నదుల వలన సంభవించు వరదలు[మార్చు]

 • నెమ్మదిగా సంభవించేవి: ఎడతెగని వర్షాలు లేక మంచు కరగడం వలన నదుల యొక్క కాలవలు పొంగి,వాటి పరిమాణాన్ని మించిన నీటి సముదాయం. వర్షాకాలం, తుఫానుల వలన సంభవించే భారీ వర్షాలు మరియు ఉష్ణోగ్రత మార్పులు, విదేశీ గాలులు మరియు మంచును ప్రభావితం చేసే ఉష్ణ వర్షాలు వీటికి కారణం కావచ్చు.ఊహించని విధంగా భూపాతాలు, మంచుపెళ్ళలు లేదా శిథిలాలు వంటి వాటి కారణంగా మురుగునీటి ప్రవాహంలో కలిగిన అడ్డంకులు వలన తక్కువ స్థాయి వరద సంభవించవచ్చు.
 • వేగంగా సంభవించేవి : అతివేగంగా ప్రవహిస్తున్న ప్రవాహం (భారీ తుఫానులు) కారణంగా లేదా ఒక ఆనకట్ట, భూపాతం లేదా మంచునది నుండి ఒకేసారి విడుదల అయి పొంగుతున్న ప్రవాహం కారణంగా సంభవించే ఆకస్మిక వరదలతో సహా.

నదీముఖ వరదలు[మార్చు]

సముద్రతీరంలో సంభవించే వరదలు[మార్చు]

భారీ నష్టాన్ని సృష్టించే వరదలు[మార్చు]

 • ప్రమాదకరమైన లేదా ఊహించని విపత్తు ఉదా: ఆనకట్ట తెగడం లేదా మరొక వైపరీత్యం (ఉదా: భూకంపం లేదా అగ్నిపర్వతం పేలడం) కారణంగా సంభవించేవి.

బురదతో కూడిన వరదలు[మార్చు]

పంట భూములలో వేగంగా ప్రవహించే అదనపు నీరు ఒకేచోట చేరడం వలన బురదతో కూడిన వరద సంభవిస్తుంది.ప్రవాహం వలన పేరుకుపోయిన మడ్డి తొలగించబడి, వేరు చేయబడిన వస్తువు వలె కొట్టుకుని పోతాయి.నివాస యోగ్యమైన ప్రాంతాలలో బురదతో కూడిన ప్రవాహాన్ని మనం గుర్తించవచ్చు.

బురదతో కూడిన వరదలు అనేవి హిల్‌స్లోప్ విధానం మరియు భారీ కదలికలుచే ఏర్పడే మట్టి వరదతో పోల్చకూడదు.

ఇతర రకాలు[మార్చు]

 • వరదలు సాధారణంగా నీరు, వ్యాపించడం వీలుకాని ప్రదేశాలకు చేరినప్పుడు (ఉదా. వర్షపు నీరు) మరియు వేర్వేరు శాఖలుగా వేరుపడలేని ప్రాంతాల్లోకి ప్రవహించినప్పుడు (అంటే సాధారణ ధోరణి లేదా నెమ్మదిగా ఆవిరవడం) సంభవిస్తాయి.
 • ఒకే ప్రాంతంలో నిరంతరంగా తుఫాను రావడం.
 • ఆనకట్ట అధిక నీటి ప్రవాహం కారణంగా తరచూ పల్లంలో ఉన్న నగరాలు మరియు గ్రామాల్లో వరదలు సంభవించవచ్చు, దీని కారణంగా అధిక నష్టం కలగవచ్చు.

ప్రభావాలు[మార్చు]

ప్రధానమైన ప్రభావాలు[మార్చు]

 • ఆస్తి నష్టం- ఇది వంతెనలు, కారులు, భవనాలు,మురికి నీళ్ల వ్యవస్థలు,రహదారులు,కాలువలు మరియు ఇతర రకాల కట్టడాలు ప్రభావితం కావచ్చు .
 • ప్రమాద బాధితులు - మునిగిపోవడం వలన మరణించిన ప్రజలు మరియు జీవసముదాయలు.ఇవి అంటువ్యాధులు మరియు నీటి ద్వారా సంభవించే వ్యాధులకు కూడా కారణం కావచ్చు.

ఇతర ప్రభావాలు[మార్చు]

 • నీటి సరఫరా - నీటి కాలుష్యం.పరిశుద్ధమైన త్రాగునీరు కలుషితం అవుతుంది.
 • వ్యాధులు - అనారోగ్యమైన పరిస్థితులు నీటి వలన కలిగే రోగాలు వ్యాపించడం.
 • పంటలు మరియు ఆహార సరఫరా - మొత్తం వ్యవసాయం నాశనం కావడం వలన ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది.[3] అయితే, స్థానిక మట్టికి బలాన్ని అందించడానికి వరదలచే పేరుకుపోయిన మడ్డిని నదుల సమీపంలో ఉన్న పంటభూమికి వాడతారు.
 • చెట్లు - శ్వాస అందక పోవడం వల్ల కొన్ని తట్టుకోలేని వృక్ష జాతులు మరణిస్తాయి.[4]

తృతీయ/దీర్ఘకాల ప్రభావాలు[మార్చు]

 • ఆర్ధిక పరిస్థితి - ఆర్థిక పరిస్థితి వీటి వలన క్లిష్టంగా మారుతుంది: పర్యాటక ప్రదేశాల్లో తాత్కాలిక అవరోధం, పునర్నిర్మాణ ఖర్చులు, ఆహార పదార్దాల కొరత వల్ల ధరల పెరగడం.

వరదల నియంత్రణ[మార్చు]

1997లో అలికంటే (స్పెయిన్)లో సంభవించిన శరత్కాల మధ్యధరా వరదలు

ప్రపంచంలోని పలు దేశాలు, వరదలకు తరచుగా కారణమయ్యే నదులను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. నదులు పొంగకుండా నియంత్రించడానికి అడ్డుకట్టలు,[5] గట్టులు, జలాశయాలు మరియు చిన్నఆనకట్టలు వంటి సంరక్షణలను ఉపయోగించాలి. ఈ సంరక్షణలు విఫలమైనప్పుడు, అత్యవసర పరిస్థితులలో ఇసుక సంచులను లేదా సులభముగా విస్తరించగల ట్యూబ్‌లను ఉపయోగించాలి. ఐరోపా మరియు అమెరికాలో సముద్రపు వరదలను సముద్రపు అడ్డుగోడలు, సముద్రతీరాల నిర్వహణ మరియు అవరోధ ద్వీపాల వంటి సముద్రపు సంరక్షణలతో నియంత్రిస్తున్నారు.

యూరప్[మార్చు]

నిర్దిష్ట స్థాయిని మించిన తర్వాత తెరవడానికి వీలుగా నిర్మించిన భారీ యంత్రంతో కూడిన అడ్డుకట్ట ద్వారా లండన్లోని థేమ్స్ నదిని నియంత్రిస్తున్నారు (థేమ్స్ అడ్డుకట్టను చూడండి).

వెనిస్‌లో ఇదే ఏర్పాటు ఉంది, అయితే ఇది ఇప్పటికే అధిక ఆటుపోటులను తట్టుకోలేకపోతుంది.సముద్ర మట్టం పెరిగినప్పుడు లండన్ మరియు వెనిస్ రెండింటిలోనూ సంరక్షణ సదుపాయాలు ప్రమాదాలను నివారించలేకపోవచ్చు.

2002లో చెక్ రిప్లబిక్‌లోని బెరౌంకా నది ఉప్పొంగడంతో సంభవించిన యూరోపియన్ వరదలు మరియు నీటిలో మునిగిపోయిన బెరూన్ జిల్లాలో హ్లాస్నా ట్రెబన్ గ్రామంలోని ఇళ్లు.

నెదర్లాండ్స్‌లోని ఊస్టెర్షెడ్యూల్ ఆనకట్టతో డెల్టా పనులుగా పిలిచే భారీ మరియు స్పష్టమైన వరద నివారణ సంరక్షణలను కలిగి ఉంది మరియు ఇది అంచనాలకు మించి సహాయపడుతుంది. 1953లో నెదర్లాండ్స్‌లోని నైరుతి భాగంలో సంభవించిన ఉత్తర సముద్రపు వరదలు కారణంగా ఈ పనులను చేపట్టారు. అప్పటికే డచ్ దేశం, దాని ఉత్తర ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటైన ఈ ఆనకట్టను నిర్మించింది: అఫ్స్‌ల్యూట్‌డిజ్క్ (దీన్ని 1932లో మూసివేసారు).

ప్రస్తుతం రష్యాలోని తుఫాను నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను సంరక్షించడానికి చేపట్టిన సెయింట్ పీటర్స్‌బర్గ్ వరద నివారణ సౌకర్య భవనాన్ని 2008లో పూర్తి చేసారు. దీనితో సెయింట్ పీటర్స్‌బర్గ్ చుట్టూ రింగ్ రోడ్‌ను పూర్తి చేయడం వలన ప్రధాన రవాణా నిర్వహణను కూడా పూర్తయ్యింది.పదకొండు ఆనకట్టలు 25.4 కిలోమీటర్లు పొడిగించబడి, నీటి స్థాయికి ఎనిమిది మీటర్లు ఎత్తులో నిర్మించబడ్డాయి.

ఆస్ట్రియాలో, వరదలను 150 సంవత్సరాలుగా అంటే 1870-75 కాలంలో ప్రధాన డెన్యూబేను తవ్వడం మరియు 1972-1988 నుండి కొత్త డెన్యూబేను నిర్మించడం ద్వారా పలు వేర్వేరు వియన్నా డెన్యూబే నియంత్రణ ప్రయత్నాలతో నియంత్రిస్తున్నారు.

ఉభయ అమెరికాలు[మార్చు]

1936లో పిట్స్‌బర్గ్ వరదలు
దస్త్రం:Snoqualmie area flood.jpg
2009లో వాషింగ్టన్, స్నోక్యూల్మైన్ సమీపంలో వరదలు

మరొక విస్తృతమైన వరదల సంరక్షణ వ్యవస్థను కెనడియన్ ప్రాంతమైన మానిటోబా కలిగి ఉంది. ఎర్ర నది యునైటెడ్ స్టేట్స్ నుండి ఉత్తర దిక్కుగా ప్రయాణించి, విన్నిపెగ్ నగరం (ఇక్కడ ఇది ఆసినిబోయినే నదితో కలుస్తుంది) గుండా విన్నిపెగ్ సరస్సులోకి కలుస్తుంది. ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న అన్ని నదులు ఉత్తర అర్ధగోళంలోని ఉష్ణోగ్రత కారణంగా మంచు రూపంలో ఉండగా, దక్షిణ భాగంలోని ఉష్ణోగ్రత కారణంగా ఉత్తర భాగంలో కరిగే దాని కంటే వేగంగా కరిగి నదిలోని నీటి స్థాయి పెరుగుతుంది. దీని వలన 1950లో వసంతకాలంలో విన్నిపెగ్‌లో సంభవించిన విధంగా విధ్వంసకర వరదలు సంభవించవచ్చు. భవిష్యత్తులో సంభవించే వరదలు నుండి నగరాన్ని రక్షించడానికి, మానిటోబా ప్రభుత్వం మళ్లింపులు, కాలువలు మరియు వరదమార్గాలు (ఎర్ర నది వరదమార్గం మరియు మళ్లింపు ద్వారంతో సహా) వంటి పలు భారీ నిర్మాణాలను చేపట్టింది. ఈ వ్యవస్థ విన్నిపెగ్‌ను 1977లో విన్నిపెగ్ నుండి నది ఎగువ భాగంలో ఉన్న గ్రాండ్ ఫోర్స్స్, ఉత్తర డకోటా మరియు స్టీ. అగస్తా, మానిటోబాతో సహా పలు ప్రాంతాలను సర్వనాశనం చేసిన వరదలు నుండి రక్షించింది.

యు.ఎస్‌లో, సముద్ర స్థాయి కంటే 35 శాతం దిగువలో ఉన్న న్యూ ఒర్లియాన్స్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని వందల మైళ్ల పొడవైన అడ్డుకట్టలు మరియు వరద ద్వారాలతో సంరక్షిస్తున్నారు. ఈ వ్యవస్థ కత్రినా తుఫాన్ సమయంలో పలు విభాగాల్లో విఫలమైంది అంటే నగరం మధ్యలో మరియు మెట్రో ప్రాంతం యొక్క తూర్పు భాగాల్లో 50 శాతం మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ముంచివేస్తూ, సముద్రతీర ప్రాంతాల్లో కొన్ని సెంటిమీటర్లు నుండి 8.2 మీటర్ల మేరకు విస్తరించి (దాదాపు 27 అడుగులు) భారీ ఆర్థిక నష్టానికి కారణమైంది.[6] విజయవంతమైన వరద నివారణ చర్యగా, యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వం ఉత్తరం వైపు 1993 వరదలు తర్వాత తరచుగా సంభవించే ప్రమాదాలను నిరోధించడానికి యునైటెడ్ స్టేట్స్‌లోని వాలుగా ఉండే స్థలాలను కొనుగోలు చేయాలని ప్రకటించింది. దీనికి ప్రభుత్వం మరియు పలు ప్రాంతాలు అంగీకరించిగా, రాష్ట్ర భాగస్వామ్యంతో పల్లపు ప్రాంతాలుగా మార్చబడిన 25,000 స్థలాలను కొనుగోలు చేసింది. తుఫాను సమయంలో ఈ పల్లపు ప్రాంతాలు స్పాంజ్ వలె పనిచేస్తాయి మరియు 1995లో మరలా వరదలు సంభవించినప్పుడు, ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో వనరులను ఉపయోగించలేదు.[7]

ఆసియా[మార్చు]

చైనాలో, వరద మళ్లింపు ప్రాంతాలు అనేవి అత్యవసర పరిస్థితుల్లో నగరాలను సంరక్షించడానికి ఉద్దేశ్యపూర్వకంగా వరద నీటిని మళ్లించడానికి ఉపయోగించే గ్రామీణ ప్రాంతాలు.[8]

ఈ వృక్ష సంపద (అరణ్యాలను నాశనం చేయడం) నష్టం ప్రమాదాన్ని పెంచడానికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.సహజ అరణ్యాలు వరద ప్రభావాన్ని తగ్గిస్తాయి. అరణ్యాలను నాశనం చేసే రేట్‌ను తగ్గించడం వలన వరదల సంభవించే సందర్భాలు మరియు ప్రభావాలు తప్పక తగ్గుతాయి.[9]

ఆఫ్రికా[మార్చు]

ఈజిప్ట్‌లో, ఆస్వాన్ ఆనకట్ట (1902) మరియు ఆస్వాన్ ఎత్తైన ఆనకట్టలు (1976) రెండూ నైల్ నది వలన సంభవించే పలు వరద తీవ్రతలను నియంత్రించాయి.

వరదల శుభ్రతలో జాగ్రత్తలు[మార్చు]

వరద నీరు తగ్గిన తర్వాత శుభ్రపరిచే కార్యక్రమాల్లో పాల్గొన్న పనివారు మరియు స్వచ్ఛంద సేవకుల ఆరోగ్యాలకు హాని కలగవచ్చు.వీటితో సహా పలు భయంకరమైన ప్రమాదాలు జరగవచ్చు: మురికి కాలువ పొర్లిపోయి, ఆ నీరు కలవడం వలన కలుషితమైన నీరు, విద్యుత్ ప్రమాదాలు, కార్బన్ మోనాక్సెడ్ వ్యాప్తి, ఎముకలకు సంబంధించిన ప్రమాదాలు, వేడి లేదా చల్లని ఒత్తిడి, మోటర్-వాహనానికి సంబంధించిన ప్రమాదాలు, అగ్నిప్రమాదం, మునిగిపోవడం మరియు ప్రమాదకర వస్తువులను కలిగే ప్రమాదాలు.[10] ఎందుకంటే వరద బాధిత ప్రాంతాలు శుభ్రంగా ఉండని కారణంగా, శుభ్రం చేసే కార్మికులకు పదునైన వస్తువుల వలన ప్రమాదాలు, వరద నీటిలోని జీవసంబంధమైన ప్రమాదాలు, విద్యుత్ తీగలు, రక్తం లేదా ఇతర శరీర ద్రవాలు మరియు జంతువులు మరియు మనుషుల మిగిలిన అవశేషాలు వ్యాప్తి వలన కలిగే ప్రమాదాలు.వరద భాధితుల ప్రణాళికలోనూ మరియు ప్రతిస్పందనలోనూ, నిర్వాహకులు కార్మికులకు గట్టి టోపీలు, కళ్ళజోళ్లు, భారీ చేతి తొడుగులు, రక్షణ కవచాలు మరియు అడుగుభాగం మరియు లోపలిభాగం ఉక్కుతో ఉన్న నీరు ప్రవేశించలేని బూట్లు వంటివి అందిస్తారు.[11]

వరదలు వలన లాభాలు[మార్చు]

వరదల వలన జనజీవన వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థలో పలు అంతరాయాలు సంభవిస్తాయి. అయినప్పటికీ, వరదలు వలన భూమి మరింత సారవంతంగా మారడం, తక్కువస్థాయిలో ఉన్న పోషకాలను పెంపొందించడం వంటి పలు ఉపయోగకర లాభాలు ఉన్నాయి. సకాలంలో సంభవించే వరదలు టిగ్రిల్-యూఫ్రేట్స్ నదులు, నైల్ నది, సింధూ నది, గంగ మరియు యెల్లో నది మరియు పలు వాటితో సహా పురాతన జీవసముదాయాలు వృద్ధి చెందడానికి చాలా ఉపయోపడతాయి. వరదల సంభవించే ప్రాంతాల్లో జలసంబంధితాల ఆధారంగా పునరుద్ధరించబడే మూలకాల శక్తి ఎక్కువగా ఉంటుంది.

వరద నమూనా[మార్చు]

వరద నమునా అనేది సరిక్రొత్త ప్రయోగం, వరద భూభాగాలలో పనిచేసే యంత్రాలను అధ్యయనం చేయడానికి మరియు దాని నిర్వహణకు దాదాపు ఆరు సహస్రాబ్దకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.[12] వరద నమూనా రూపకల్పనలో ఇటీవల అభివృద్ధి ప్రకారం "ఉంచడం లేదా విరవడం" పద్ధతిని పరీక్షించారు మరియు దీని సామర్థ్యం ఇంజనీరింగ్ నిర్మాణాలకు దోహదపడుతుంది. ఇటీవల కాలంలో 1D నమూనాలు(కాలువలలో వరద స్థాయిలను లెక్కించడం) మరియు 2D నమూనాలు(మైదానములో వరద యొక్క లోతును లెక్కించడం) వంటి వివిధ రకాల వరదల అంచనా నమూనాలను తయారు చేసారు. HEC-RAS[13], హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కేంద్ర నమూనా, ఉచితంగా లభించడం వలన చాలా ప్రాముఖ్యతను సంతంరించుకున్నది.TUFLOW[14] వంటి వేరే నమూనాలలో వరద ప్రాంతములో వరద స్థాయిని అంచనా వేయడానికి 1D మరియు 2D పరికరాలను కలయికతో తయారు చేసారు. ఇప్పటి వరకు సముద్రపు ఆటుపోట్లు మరియు నది వరదలపై దృష్టి సారించినా, కాని 2007లో యుకెలో సంభవించిన వరదల సంఘటనల వలన భూమి మీద నీటి ప్రవాహాల ప్రభావంపై దృష్టి సారించారు[15].

ప్రాణాంతకమైన వరదలు[మార్చు]

విశ్వవ్యాప్తంగా 100,000 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలను బలిగొన్న ప్రాణాంతక వరదలకు సంబంధించిన వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

మరణించినవారి సంఖ్య సంఘటన ప్రాంతం తేదీ
2,500,000–3,700,000[16] 1931 చైనా వరదలు చైనా 1931
900,000–2,000,000 1887 యొల్లో నది (హుయింగ్ హీ) వరదలు చైనా 1887
500,000–700,000 1938 యొల్లో నది (హుయింఘ్ హీ) వరదలు చైనా 1938
231,000 టైఫూన్ నైనా కారణంగా బ్యాంకియో ఆనకట్ట తెగడంవరదల్లో దాదాపు 86,000 మంది మరణించగా, రోగాలతో మరో 145,000 మంది చనిపోయారు. చైనా 1975
230,000 హిందూ మహాసముద్రపు సునామీ భారతదేశం(ఎక్కువగా తమిళనాడులో),థాయిలాండ్,మాల్దీవ్స్ 2004
145,000 1935 యాంగ్స్ నది వరదలు చైనా 1935
100,000కి పైగా సెయింట్ ఫెలిక్స్ వరదలు, తుఫాను నెదర్లాండ్స్ 1530
100,000 హానోయి మరియు ఎర్ర నది డెల్టా వరదలు ఉత్తర వియత్నాం 1971
100,000 1911 యాంగ్స్ నది వరదలు చైనా 1911

వీటిని కూడా చూడండి[మార్చు]

2005 సంవత్సరం అక్టోబర్ ప్రారంభంలో వర్షాలు కారణంగా వాయువ్య బంగ్లాదేశ్‌లోని ఉప్పొంగిన నదులు పలు గ్రామాలను జలమయం చేసాయి.2005 సంవత్సరంలో అక్టోబరులో ఘాఘత్ మరియు ఆత్రాయి నదుల వరదలను NASA యొక్క టెర్రా శాటిలైట్ మోడరేట్ రిజుల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రోరేడియోమీటర్ (MODIS) ద్వారా పై నుండి తీసిన చిత్రం.వరద చిత్రంలో దేశవ్యాప్తంగా విస్తరించిన నదులు.

నమూనాలు[మార్చు]

ఉపప్రమాణం[మార్చు]

 • ఓ'కొన్నోర్,జిమ్ ఇ. మరియు జాన్ ఎ. కోస్టా(2004).ది వర్లడ్స్ లార్జెస్ట్ ఫ్లడ్స్, పాస్ట్ ఎండ్ ప్రెజెంట్: దేయర్ కాజెస్ అండ్ మ్యాగ్నిట్యూడ్ [సర్కిలర్ 1254].వాషింగ్టన్, డి.సి.: యు.ఎస్.డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ఇంటిరీయర్, యు.ఎస్. జియోలాజికల్ సర్వే.
 • థామ్సన్ ఎమ్.టి.(1964).హిస్టారికల్ ఫ్లడ్స్ ఇన్ న్యూ ఇంగ్లాండ్ [జియోలాజికల్ సర్వే వాటర్-సప్లై పేపర్ 1779-M]. వాషింగ్టన్,డి.సి.:యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ప్రింటింగ్ ఆఫీస్.
 • పావెల్,డబ్ల్యూ.గాబ్. 2009.ఐడెంటీఫైయింగ్ ల్యాండ్ యూజ్/ల్యాండ్ కవర్ (LULC) యూజింగ్ నేషనల్ అగ్రికల్చర్ ఇమేజరీ ప్రోగ్రామ్ (NAIP) డాటా యాజ్ ఎ హైడ్రోలాజిక్ మాడల్ ఇన్‌పుట్ ఫర్ లోకల్ ఫ్లడ్ ప్లాన్ మేనేజ్‌మెంట్. అప్లయిడ్ రీసర్చ్ ప్రాజెక్ట్. టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ-సాన్ మార్కొస్. http://ecommons.txstate.edu/arp/296/

గమనికలు[మార్చు]

 1. MSN ఎంకార్టా నిఘంటువువరద Archived 2011-02-04 at the Wayback Machine..2006-12-28న రూపొందించారు.
 2. మెట్రోలాజీ (2009) నిఘంటువు.వరద Archived 2007-08-24 at the Wayback Machine. 2009-01-09 న రూపొందించారు.
 3. Southasianfloods.org
 4. స్టీఫెన్ బ్రత్కోవిచ్,లీసా బుర్బన్, మొదలగు., "వరదలు మరియు చెట్లు మీద దాని ప్రభావం", USDA అరణ్య సేవలు, ఈశాన్య రాష్ట్ర ప్రాంతం మరియు ప్రైవేట్ ఫారెస్ట్రీ, సెయింట్ పాల్, MN, సెప్టెంబర్ 1993,వెబ్‌పేజీ: [http] na.fs.fed.us-flood-cover.
 5. Henry Petroski (2006), Levees and Other Raised Ground, 94, American Scientist, pp. pp. 7–11CS1 maint: extra text (link)
 6. United States Department of Commerce (2006). "Hurricane Katrina Service Assessment Report" (PDF). మూలం (PDF) నుండి 2006-07-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-07-14. Unknown parameter |month= ignored (help); Cite web requires |website= (help)
 7. అమండా రిప్లే. "వరదలు, చీలికలు, తుఫానులు, భారీ అగ్నిప్రమాదాలు, భూకంపాలు...ఎందుకు సిద్దంగా ఉండరు."సమయము. ఆగష్టు 28,2006.
 8. "చైనా వరదలు మరలించడానికి ఏడో ఆనకట్టను నిర్మించింది."చైనా డైలీ. 2003-07-07.
 9. బ్రాడ్‌షా సిజె, సోది ఎన్ఎస్, పెహ్ ఎస్‌హెచ్, బ్రూక్ బిడబ్ల్యూ.(2007).అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అరణ్యాలను నాశనం చేయడం వలన వరద ప్రమాదాలు మరియు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని నిర్ధారణ.జంతు శాస్త్రము వలన భూమిలో మార్పులు, 13:2379-2395.
 10. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ (NIOSH)."తుపాను మరియు వరద శుభ్రత". జరిగినది 09/23/2008.
 11. NIOSH.[1]'NIOSH వరద శుభ్రత వలన ప్రమాదాలను హెచ్చరించింది". NIOSH ప్రచురణ సంఖ్య 94-123.
 12. డేహౌస్,జి. మొదలగు. "వరద నమూనా ఉపయోగించి HEC-RAS (మొదటి పత్రిక)."హేస్తాద్ ప్రెస్, వాటర్‌బురే (USA),2003.
 13. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కార్పస్ ఆఫ్ ఇంజనీర్స్.డేవిస్, CA.హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ సెంటర్.
 14. BMT WBM LTD. స్ప్రింగ్ హిల్,క్వీన్స్‌ల్యాండ్. "TUFLOW వరద మరియు అలల సిమ్యూలేషన్ సాఫ్ట్‌వేర్." Archived 2008-06-27 at the Wayback Machine.
 15. క్యాబినెట్ ఆఫీసు, UK."[2] Archived 2010-08-07 at the UK Government Web Archive"పిట్ సమీక్ష: 2007 వరదలు నుండి నేర్చుకున్న పాఠాలు." Archived 2010-08-07 at the UK Government Web Archive జూన్ 2008.
 16. "చరిత్రలో భయంకరమైన సహజ విపత్తులు". మూలం నుండి 2008-04-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-12-17. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

ERROR: {{Expand}} is a disambiguation entry; please do not transclude it. Instead, use a more specific template, such as {{incomplete}}, {{expand list}}, {{missing information}}, or {{expand section}}.
"https://te.wikipedia.org/w/index.php?title=వరద&oldid=2812493" నుండి వెలికితీశారు