హర్యానా
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హర్యాణా | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
ఛండీగఢ్ - 30°44′N 76°47′E / 30.73°N 76.78°E |
పెద్ద నగరం | ఫరీదాబాద్ |
జనాభా (2001) - జనసాంద్రత |
21,082,989 (16th) - 477/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
44,212 చ.కి.మీ (20th) - 19 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[హర్యాణా |గవర్నరు - [[హర్యాణా |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1966-11-01 - ఎ.ఆర్.కిద్వాయ్ - మనోహర్ లాల్ ఖట్టర్ - ఒకే చట్ట సభ (90) |
అధికార బాష (లు) | హిందీ,పంజాబీ(రెండవ అధికారిక భాష) |
పొడిపదం (ISO) | IN-HR |
వెబ్‌సైటు: haryana.gov.in |
హర్యాణా f
భౌగోళికము[మార్చు]
హర్యాణా ఉత్తరాన 27 డిగ్రీల 37' నుండి 30 డిగ్రీల 35' అక్షాంశముల మధ్య, 74 డిగ్రీల 28' నుండి 77 డిగ్రీల 36' రేఖాంశముల మధ్య ఉంది. హర్యాణా రాష్ట్రము సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉంది. పరిపాలనా సౌలభ్యము కొరకు రాష్ట్రము నాలుగు విభాగములుగా విభజించబడింది. అవి అంబాలా, రోతక్, గుర్‌గావ్, హిస్సార్. రాష్ట్రము 19 జిల్లాలు, 47 ఉప-విభాగములు, 67 తాలూకాలు, 45 ఉప-తాలూకాలు, 116 బ్లాకులుగా విభజించబడింది. హర్యాణాలో మొత్తము 81 నగరములు, పట్టణములు, 6,759 గ్రామాలు ఉన్నాయి. 1,553 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో అడవులు ఉన్నాయి. హర్యాణా యొక్క నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు.
- శివాలిక్ పర్వతశ్రేణులు
- యమునా - ఘగ్గర్ (సరస్వతి) పల్లపు భూమి
- అర్ధ-ఎడారి ఇసుకమయమైన పల్లపు భూమి
- ఆరావళి శ్రేణులు
చరిత్ర[మార్చు]
|
ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద నాగరికతలలో, సింధు లోయ నాగరికత ఉంది. రాఖిగిరి వంటి అనేక తవ్వకాల ప్రదేశాలు పురావస్తు పరిశోధనల యొక్క ముఖ్యమైన ప్రదేశాలు. అత్యంత అభివృద్ధి చెందిన మానవ నాగరికత సింధు నది వెంట వృద్ధి చెందింది, ఇది ఈ ప్రాంతంమధ్యలో ఒక సారి ప్రవహించింది.సింధు లోయలో సుగమం చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద ఎత్తున వర్షపునీటి సేకరణ వ్యవస్థ, టెర్రకోట ఇటుక, విగ్రహ ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన లోహపు పని (కాంస్య, విలువైన లోహాలు రెండింటిలోనూ) ఉన్నాయి. వాస్తవానికి సింధు నాగరికత ఆధునిక మానవ అభివృద్ధికి దారితీసింది.హర్యానాను సుల్తానేట్లు, మొఘలులు వంటి అనేక రాజవంశాలలో పాలించారు. ఇది ఆఫ్ఘన్లు, తిముత్ ఆక్రమణల క్రింద కూడా ఉంది.పంజాబ్ ప్రాంతములో అధికముగా హిందీ మాట్లాడే భాగము హర్యాణా అయినది. పంజాబీ మాట్లాడే భాగము పంజాబ్ రాష్ట్రము అయినది. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న ఛండీగఢ్కేంద్ర పాలిత ప్రాంతముగా యేర్పడి రెండు రాష్ట్రములకు రాజధానిగా వ్యవహరింపబడుతున్నది.
4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యాణా వైదిక, హిందూ నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితము ఇక్కడే శ్రీకృష్ణభగవానుడు మహాభారతయుద్ధ ప్రారంభ సమయమున గీతను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధము జరిగింది. మహాభారతములో (క్రీ.పూ.900) హర్యాణా బహుధాన్యక (సకల సంపదల భూమి) అని వ్యవహరింపబడింది. హరియానా అన్న పదము మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు సంస్కృత శాసనములో కనిపిస్తున్నది. ఈ శాసనములో ఈ ప్రాంతము భూతల స్వర్గముగా అభివర్ణించబడింది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగినదని చాటుతున్నది.
నౌరంగాబాద్, భివానీలోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని రాఖీగర్హీ, రోతక్ లోని రూఖీ, సిర్సాలోని బనావలి మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి, హరప్ప పూర్వ సంస్కృతుల ఆధారములు లభించినవి. కురుక్షేత్ర, పెహోవా, తిల్‌పట్, పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారములు సమకూర్చినాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్‌పట్), పానప్రస్థ (పానిపట్), సోనప్రస్థ (సోనిపట్) గా ఉల్లేఖించబడినవి.
హర్యానా[మార్చు]
వ.సం. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా (2011) | విస్తీర్ణం (కి.మీ.²) | జన సాంద్రత
(/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | AM | అంబాలా | అంబాలా | 11,36,784 | 1,569 | 722 |
2 | BH | భివాని | భివాని | 16,29,109 | 5,140 | 341 |
3 | CD | చర్ఖీ దాద్రి | ఛర్ఖి దాద్రి | 5,02,276 | 1370 | 367 |
4 | FR | ఫరీదాబాద్ | ఫరీదాబాద్ | 17,98,954 | 783 | 2,298 |
5 | FT | ఫతేహాబాద్ | ఫతేహాబాద్ | 9,41,522 | 2,538 | 371 |
6 | GU | గుర్‌గావ్ | గుర్‌గావ్ | 15,14,085 | 1,258 | 1,241 |
7 | HI | హిసార్ | హిస్సార్ | 17,42,815 | 3,788 | 438 |
8 | JH | ఝజ్జర్ | ఝజ్జర్ | 9,56,907 | 1,868 | 522 |
9 | JI | జింద్ | జింద్ | 13,32,042 | 2,702 | 493 |
10 | KT | కైతల్ | కైతల్ | 10,72,861 | 2,799 | 467 |
11 | KR | కర్నాల్ | కర్నాల్ | 15,06,323 | 2,471 | 598 |
12 | KU | కురుక్షేత్ర | కురుక్షేత్ర | 9,64,231 | 1,530 | 630 |
13 | MA | మహేంద్రగఢ్ | నార్నౌల్ | 9,21,680 | 1,900 | 485 |
14 | MW | నూహ్ | నూహ్ | 10,89,406 | 1,765 | 729 |
15 | PW | పల్వల్ | పల్వల్ | 10,40,493 | 1,367 | 761 |
16 | PK | పంచ్‌కులా | పంచ్‌కులా | 5,58,890 | 816 | 622 |
17 | PP | పానిపట్ | పానిపట్ | 12,02,811 | 1,250 | 949 |
18 | RE | రేవారీ | రేవారీ | 8,96,129 | 1,559 | 562 |
19 | RO | రోహ్‌తక్ | రోహ్‌తక్ | 10,58,683 | 1,668 | 607 |
20 | SI | సిర్సా | సిర్సా | 12,95,114 | 4,276 | 303 |
21 | SO | సోనీపత్ | సోనీపత్ | 14,80,080 | 2,260 | 697 |
22 | YN | యమునా నగర్ | యమునా నగర్ | 12,14,162 | 1,756 | 687 |
రాష్ట్ర గణాంకాలు[మార్చు]
- అవతరణము.1 నవంబరు 1966
వైశాల్యము.44,212 చ.కి.
- జనసంఖ్య. 25,353,081 స్త్రీలు. 11,847,951 పురుషులు. 13,505,130 నిష్పత్తి . 877
- జిల్లాల సంఖ్య.21
- గ్రామాలు. 6,764 పట్టణాలు.106
- ప్రధాన భాష. హింది . పంజాబి. ప్రధాన మతం. హిందు, ఇస్లాం, క్రీస్తు
- పార్లమెంటు సభ్యుల సంఖ్య, 10 శాసన సభ్యుల సంఖ్య.90
- మూలము. మనోరమ యీయర్ బుక్