Coordinates: 29°48′05″N 76°23′59″E / 29.8015°N 76.3998°E / 29.8015; 76.3998

కైతల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైతల్
కపిస్థల
పట్టణం
కైతల్ లోని పెహోవా చౌక్
కైతల్ లోని పెహోవా చౌక్
కైతల్ is located in Haryana
కైతల్
కైతల్
హర్యానా పటంలో కైతల్ పట్టణ స్థానం
Coordinates: 29°48′05″N 76°23′59″E / 29.8015°N 76.3998°E / 29.8015; 76.3998
దేశం India
రాష్ట్రంహర్యాణా
జిల్లాకైతల్
Named forహనుమంతుడు
Elevation
250 మీ (820 అ.)
Population
 (2011)[1]
 • Total1,44,915
భాషలు[2][3]
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
136027
టెలిఫోన్ కోడ్01746
ISO 3166 codeIN-HR
లింగనిష్పత్తి887 / [4]

కైతల్ హర్యానా రాష్ట్రం లోని పట్టణం. ఇది కైతల్ జిల్లాకు ముఖ్యపట్టణం. నగర పాలనను పురపాలక మండలి నిర్వహిస్తుంది.

భారత ఉపఖండం పటం. వేద కాలంలో కైతల్‌ను కపిస్థల అని పిలిచేవారు.

కపిస్థల్ అని పేరు నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రజల నమ్మకం. కపి, హనుమంతుడికి మరొక పేరు. దీని అర్థం "హనుమంతుడి నివాసం" అని. ఈ పట్టణాన్ని ధర్మరాజు స్థాపించాడని ప్రతీతి. పట్టణంలో హనుమంతుడి తల్లి అంజనీదేవికి ఆలయం ఉంది.[5]

కైతల్ లోని వృద్ధకేదార (విద్కార్) ఆలయ ప్రసక్తి, వామన పురాణంలో ఉంది.[6] కైతల్‌లో అనేక దేవాలయాలున్నాయి. 48 కోసుల పరిక్రమ యాత్రలో[గమనిక 1] కైతల్‌ కూడా ఒక భాగం.

చరిత్ర[మార్చు]

1398 లో ఢిల్లీపై దాడి చేయడానికి ముందు తైమూర్ ఇక్కడ ఆగాడు. తరువాత, ఈ నగరం ఢిల్లీ సుల్తానుల పాలనలో ముస్లిం సాంస్కృతిక కేంద్రంగా మారింది. 13 వ శతాబ్దానికి చెందిన అనేక మంది సూఫీ సాధువుల సమాధులు నగరంలో ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యమైనది భల్ఖ్ (1246 CE) కు చెందిన షేక్ సలా-ఉద్-దిన్ సమాధి. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో ఈ పట్టణాన్ని పునర్నిర్మించి, ఒక కోటను నిర్మించారు. ఐన్-ఇ-అక్బరీ ప్రకారం, ఇది సిర్హింద్ సర్కార్ క్రింద ఒక పరగణాగా ఉండేది. ఇది వ్యవసాయ కేంద్రంగా అభివృద్ధి చెందింది.[7]

రజియా సుల్తానా, 1236 నుండి 1240 వరకు ఢిల్లీ సుల్తానుగా పాలించింది. 1240 అక్టోబరులో ఓటమిపాలైన తర్వాత ఆమె, మాలిక్ అల్తూనియాతో కలిసి ఢిల్లీ వదలి పారిపోయింది. వాళ్ళు మరుసటి రోజున కైతల్‌ చేరుకున్నారు. అక్కడి వారి మిగిలిన సైనికులు కూడా వాళ్ళను విడిచి పెట్టారు. 1240 నవంబరు 13 న వాళ్లను చంపేసారు.[8][9][10] రజియా సుల్తానా సమాధి ఇప్పటికీ కైతల్‌లో ఉంది. ఈ అంశం కైతల్ వెలుపల అంతగా తెలియదు. కాని స్థానికులకు రజియా బేగం మజార్ గురించి తెలుసు.

1398 లో తైమూర్ కైతల్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అతడి సైన్యం స్థానికులను దోచుకుంది, ఊచకోత కోసింది. అస్సాండ్ వెళ్లే దారిలో ఉన్న అన్ని గ్రామాలను నాశనం చేసారు. కైతల్, ఇతర నగరాల ప్రజలు చాలా మంది భయంతో ఢిల్లీకి పారిపోయారు.[11]

1767 లో కైతల్, సింగ్ క్రోరా మిస్ల్ నాయకుడు, భాయ్ దేసు సింగ్ (మ .1781) వశమైంది. అతను తన సొంత గ్రామమైన భుచో నుండి పెద్ద సిక్కు దళానికి నాయకత్వం వహించాడు. అతడి వారసులైన, కైతల్ భాయీలు, అత్యంత శక్తివంతమైన సిస్-సట్లెజ్ రాజులలో ఒకరు. కైతల్ సిక్కు నాయకులు, 1767 నుండి 1843 లో పతనమయ్యే వరకూ పరిపాలించారు. 1808 నాటికి ఇది బ్రిటిషు వారి అధీనం లోకి వచ్చింది. 1803–1805 రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం వరకు మరాఠా సామ్రాజ్యం లోని సింధియా రాజవంశం ఈ రాజ్యాన్ని పాలించింది. వీళ్ళు మరాఠాలకు కప్పం చెల్లించేవారు. ఆ తరువాత ఈ భూభాగాన్ని మరాఠాల నుండి బ్రిటిష్ వారు చేజిక్కించుకున్నారు.[12][13][14] భాయ్ ఉదయ్ సింగ్, కైతల్ ను పరిపాలించిన చివరి రాజు. అతడు1843 మార్చి 14 న మరణించాడు. 1867 లో కైతల్ మునిసిపాలిటీగా మారింది. 1901 లో, ఈ పట్టణ జనాభా 14,408. కర్నాల్ జిల్లాలో తహసీలుగా ఉండేది . భాయీల కోట ఇప్పటికీ ఉంది. సిక్కు పాలకులకు భాయ్ అనే బిరుదు ఉండడం మామూలైంది. 1857 స్వాతంత్ర్య పోరాటంలో కైతల్ ప్రజలు చురుకుగా పాల్గొన్నారు.[15][16][17]

భౌగోళికం[మార్చు]

కైతల్ 29°48′05″N 76°23′59″E / 29.8015°N 76.3996°E / 29.8015; 76.3996 వద్ద,[18] సముద్ర మట్టం నుండి 220 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా[మార్చు]

కైతల్‌లో మతం (2011)[19]
మతం శాతం
హిందూ మతం
  
96.46%
సిక్కుమతం
  
2.47%
ఇస్లాం
  
0.64%
ఇతరాలు
  
0.43%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కైతల్ మొత్తం జనాభా 1,44,915, వీరిలో పురుషులు 76,794 మంది, మహిళలు6 8,121 మంది . ఆరేళ్ళ లోపు పిల్లలు 17,531. కైతల్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 100,944, ఇది జనాభాలో 69.7%. పురుషుల్లో అక్షరాస్యత 75.3% కాగా, స్త్రీలలో 63.3%గా ఉంది. ఇక్కడి షెడ్యూల్డ్ కులాల జనాభా 24,760. కైతల్ 2011 లో పట్టణంలో 28,547 గృహాలున్నాయి.[1]

కైతల్ అధికారిక భాష హిందీ. పంజాబీ, ఇంగ్లీషు కూడా వాడుకలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

నగరంలో కైతల్ (కెఎల్‌ఇ), న్యూ కైతల్ హాల్ట్ (ఎన్‌కెఎల్‌ఇ) అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి నుండి కురుక్షేత్రకు, నార్వానాకూ రైళ్ళున్నాయి. ఢిల్లీ, కురుక్షేత్రల మధ్య నడిచే రైళ్ళు కైతల్ గుండా వెళ్తాయి.

జాతీయ రహదారి 152 కైతల్‌ను రాష్ట్ర రాజధాని చండీగఢ్తో కలుపుతుంది.

పట్టణ ప్రముఖులు[మార్చు]

గమనికలు[మార్చు]

 1. హర్యానా లోని కురుక్షేత్రకు చుట్టుపక్కల 48 కోసుల పరిధిలో (ఒక కోసు అంటే సుమారు 3 కిలోమీటర్లు), మహాభారతానికి సంబంధించిన పలు క్షేత్రాలను, వేదాలకు సంబంధించిన క్షేత్రాలనూ సందర్శించే యాత్రను 48 కోసుల పరిక్రమ యాత్ర అంటారు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Census of India: Kaithal". www.censusindia.gov.in. Retrieved 28 December 2019.
 2. "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 85–86. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 24 మార్చి 2019.
 3. IANS (28 January 2010). "Haryana grants second language status to Punjabi". Hindustan Times. Retrieved 24 March 2019.
 4. "Kaithal City Population Census 2011 - Haryana". Census Commission of India. Retrieved 13 August 2017.
 5. Sajnani, Manohar (2001). Encyclopaedia of tourism resources in India. Gyan Publishing House. pp. 88, 89. ISBN 8178350173.
 6. "NIC-Kaithal". kaithal.gov.in.
 7. Sarkar of Sirhind - Kethal (Kaithal) Archived 2016-03-04 at the Wayback Machine Ain-i-Akbari.
 8. [1] Archived 16 ఏప్రిల్ 2015 at the Wayback Machine Introduction
 9. Razia Sultan Archived 2016-03-04 at the Wayback Machine The History of India, as Told by Its Own Historians. The Muhammadan Period, 1867-1877.
 10. "Razia Sultan Tomb". Archived from the original on 2022-03-31. Retrieved 2020-11-18.
 11. Phadke, H. A. (1990). Haryana, Ancient and Medieval. Harman Publishing House. p. 123. ISBN 9788185151342.
 12. Ahmed, Farooqui Salma (2011). A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid ... - Farooqui Salma Ahmed, Salma Ahmed Farooqui - Google Books. ISBN 9788131732021. Retrieved 26 May 2012.
 13. Chaurasia, R. S. (2004). History Of The Marathas - R.S. Chaurasia - Google Books. ISBN 9788126903948. Retrieved 26 May 2012.
 14. Ray, Jayanta Kumar (2 October 2017). Aspects of India's International Relations, 1700 to 2000: South Asia and the World. Pearson Education India. ISBN 9788131708347 – via Google Books.
 15. Sharma, Suresh K (2006). Haryana: Past and Present. Mittal Publications. p. 144. ISBN 81-8324-046-1.
 16. Hoiberg, Dale; Indu Ramchandani (2000). Students' Britannica India. Popular Prakashan. p. 161. ISBN 0-85229-760-2.
 17. Kaithal Town The Imperial Gazetteer of India, 1909, v. 14, p. 288-289.
 18. "Maps, Weather, and Airports for Kaithal, India". www.fallingrain.com.
 19. "C-1 Population By Religious Community - Kaithal City". census.gov.in. Retrieved 28 December 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=కైతల్&oldid=3852536" నుండి వెలికితీశారు