Coordinates: 28°27′22″N 77°01′44″E / 28.456°N 77.029°E / 28.456; 77.029

గుర్‌గావ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్‌గావ్
గురుగ్రామ్
పైనుండి, ఎడమ నుండి కుడికి: డిఎల్‌ఎఫ్ సైబర్ సిటీ, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, అప్పు ఘర్ నుండి గురుగ్రాం నగర దృశ్యం, సైబర్ సిటీ
Nickname: 
మిల్లెన్నియం సిటీ
గుర్‌గావ్ is located in Haryana
గుర్‌గావ్
గుర్‌గావ్
హర్యాణాలో నగర స్థానం
Coordinates: 28°27′22″N 77°01′44″E / 28.456°N 77.029°E / 28.456; 77.029
దేశం India
రాష్ట్రంహర్యాణా
జిల్లాగుర్‌గావ్
Area
 • మొత్తం732 km2 (282.7 sq mi)
Elevation
217 మీ (711.9 అ.)
Population
 (2011)[1]
 • మొత్తం8,76,900
 • Density1,200/km2 (3,100/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
122xxx
Area code0124
Vehicle registrationHR-26 (City)
HR-55 (Commercial)
HR-72 (Sohna )
HR-76 Pataudi (Gurgaon)

గుర్‌గావ్ హర్యానా రాష్ట్రం లోని నగరం. ఇది ఢిల్లీ- హర్యానా సరిహద్దు సమీపంలో జాతీయ రాజధాని న్యూ ఢిల్లీ నుండి30 కి.మీ. దూరంలో, రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి 268 కి.మీ. దూరంలో ఉంది.[2] ఢిల్లీలోని ప్రధాన ఉపగ్రహ నగరాల్లో గుర్‌గావ్ ఒకటి. ఇది భారత రాజధాని ప్రాంతంలో భాగం .[3] దీని అధికారిక పేరు గురుగ్రాం. 2011 నాటికి గుర్‌గావ్ జనాభా 8,76,900

ముంబై, చెన్నైల తరువాత గుర్‌గావ్ భారతదేశంలో ప్రముఖ ఆర్థిక, బ్యాంకింగ్ సేవల కేంద్రం.[4] ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ 1970 లలో గుర్‌గావ్‌లో ఒక తయారీ కర్మాగారాన్ని స్థాపించడంతో నగర ఆర్థికాభివృద్ధి కథ మొదలైంది.[5] నేడు, 250 కి పైగా ఫార్చ్యూన్ 500 కంపెనీల భారత కార్యాలయాలు గుర్‌గావ్‌లోనే ఉన్నాయి.[6] 2017 లో గుర్‌గావ్‌ను మానవాభివృద్ధి సూచికలో హెచ్‌డిఐ 0.889 తో వెరీ హై అని వర్గీకరించారు.[7]

ఐక్యూ ఎయిర్ విజువల్, గ్రీన్ పీస్ సంస్థలు 2019 మార్చిలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం గుర్‌గావ్ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరం.[8][9]

చరిత్ర[మార్చు]

గుర్‌గావ్ ప్రాంతం కురు సామ్రాజ్యంలో ఉండేది.[10] ఈ ప్రాంతంలో నివసాలు ఏర్పరచుకున్న తొలి ప్రజలు హిందువులు. అహిర్ వంశపు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు.[11] యదు తెగలు ఈ వంశంలో ఒక భాగం. నేడు యాదవ్ అనే చివరి పేరును కలిగి ఉన్నవారు వారి వారసులే. మహాభారతంలో, గుర్‌గావ్‌ను కౌరవ పాండవుల గురువైన గురు ద్రోణాచార్యుని గ్రామంగా అభివర్ణించారు.[12] క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం చివరలో, చంద్రగుప్త మౌర్యుడు తన రాజ్యపు మొట్టమొదటి విస్తరణలో భాగంగా ఈ నగరాన్ని మౌర్య సామ్రాజ్యంలో కలుపుకున్నాడు.

12 వ శతాబ్దపు గ్రంథం పృథ్వీరాజ విజయలో పేర్కొన్న గుడపుర పట్టణం ఇదే అయి ఉండవచ్చు. ఈ గ్రంథం ప్రకారం, చాహమాన రాజు పృథ్వీరాజ్ చౌహాన్కు బంధువైన నాగార్జున, రాజుపై తిరుగుబాటు చేసి ఈ పట్టణాన్ని వశపరచుకున్నాడు. పృథ్వీరాజ్ ఆ తిరుగుబాటును అణిచివేసి, పట్టణాన్ని తిరిగి తన అధీనం లోకి తీసుకున్నాడు.[13][14]

మొఘలుల కాలంలోను, బ్రిటిషు సామ్రాజ్య ప్రారంభం లోనూ గురుగ్రాం, ఢిల్లీ సుబా లోని ఝర్సా పరగణాలో ఉన్న ఒక చిన్న గ్రామం. 1882-83లో అప్పటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్, తూర్పు రాజ్‌పుతానాలో తాను చేసిన పర్యటనపై ఇచ్చిన నివేదికలో (దీన్ని 1885 లో ప్రచురించారు) గురుగావ్ వద్ద స్థానిక భూస్వామ్య ప్రభువు "దుర్గా నాగా"కు చెందిన ఒక రాతి స్తంభం గురించి పేర్కొన్నాడు. ఆ స్తంభంపై "సంవత్ 729 లేదా 928, వైశాఖ్ బాడి 4, దుర్గా నాగ లోకతారి భూటా" అనే 3 లైన్ల శాసనం ఉంది. అది సా.శ. 672 లేదా సా.శ. 871 నాటిది. ఝార్సా పరగణా, 1776-77లో బేగం సమ్రూ అధీనం లోకి వెళ్ళింది. 1836 లో ఆమె మరణించిన తరువాత బ్రిటిషు వారి పాలనలోకి వచ్చింది. బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలోని ఝార్సా వద్ద సివిల్ లైన్లు, సమీపంలోని హియాదత్పూర్ వద్ద అశ్వికదళ కంటోన్మెంటూ ఏర్పాటు చేశారు.1882 భూ ఆదాయ పరిష్కార నివేదికలో, సిత్లా మాత విగ్రహాన్ని 400 సంవత్సరాల క్రితం గురుగ్రామ్‌కు తీసుకువచ్చినట్లు (అంటే 15 వ శతాబ్దంలో) పేర్కొన్నారు. అప్పట్లో ఈ సిత్లా మాత ఆలయంలో చైత్ర మాసంలో ఉత్సవం జరిగేది. ఆలయ ఆదాయం తక్కువగా ఉండడం చేత బేగం సమ్రూ, ఒక్క చైత్ర మాసంలో వచ్చే ఆదాయాన్ని మాత్రమే స్వీకరించేది. మిగతా సంవత్సరమంతా ఆలయానికి వచ్చే ఆదాయాన్ని ఈ ప్రాంతంలోని ప్రముఖ జాట్ జమీందార్లకు పంపిణీ చేసేవారు.[15]

1818 లో, భరావాస్ జిల్లాను రద్దు చేసి, గురుగ్రామ్‌ను కొత్త జిల్లాగా చేసారు. 1821 లో, భరావాస్ కంటోన్మెంట్‌ను గురుగ్రామ్‌లోని హిదాయత్‌పూర్‌కు తరలించారు.[16] గురుగ్రాం లోని "ఆలివర్దీ మసీదు", " బాద్‌షాపూర్ బావోలి " (1905).[17] " భోండ్సి " (16 నుండి 17 వ శతాబ్దం) లను మొఘల్, బ్రిటిష్ కాలంలో నిర్మించారు. "చర్చ్ ఆఫ్ ది ఎపిఫనీ", "కమాన్ సెరాయ్" ("కమాండ్ సెరాయ్") లను బ్రిటిషు వారు 1925 లో సివిల్ లైన్లలో నిర్మించారు.[18]

బ్రిటిషు పాలనా కాలం నాటి చారిత్రిక భవనాల్లో గురుగ్రామ్ క్లబ్ ఒకటి. ఈ మూడు గదుల భవనంలో ప్రస్తుతం జిలా పరిషత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర సీనియర్ సెకండరీ పాఠశాల నడుస్తోంది. కింగ్ జార్జ్ V పట్టాభిషేక జ్ఞాపకార్థం 1911 లో భారతదేశంలో స్థాపించిన 13 పాఠశాలలో ఇది ఒకటి.

1980 లలో, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ యోగా గురువు ధీరేంద్ర బ్రహ్మచారి నగర శివార్లలో ఎయిర్ స్ట్రిప్, హ్యాంగరు, ఎయిర్ కండిషన్డ్ యోగాశ్రమం, టివి స్టూడియోలను నిర్మించాడు. మాజీ ప్రధాని చంద్ర శేఖర్ 1983 లో ఈ ఎయిర్‌స్ట్రిప్ సమీపంలోనే 600 ఎకరాల పంచాయతీ భూమిలో తన సొంత ఆశ్రమాన్ని స్థాపించాడు. ఇక్కడ మరొక గురువు చంద్రస్వామి, సౌదీ ఆయుధ వ్యాపారి అడ్నాన్ ఖషోగ్గి ఆయనను కలిసేవారు.[19][20]

2016 ఏప్రిల్ 12 న, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా కేబినెట్, కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి నగరం పేరును గుర్‌గావ్ నుండి గురుగ్రామ్ అని మార్చడానికి అధికారికంగా ఒక ప్రతిపాదనను ప్రకటించాడు. కొత్త పేరు నగరానికి ద్రోణాచార్యతో ఉన్న పౌరాణిక అనుబంధాన్ని నొక్కి చెప్పడం ద్వారా "గొప్ప వారసత్వాన్ని" కాపాడటానికి సహాయపడుతుందని ఆయన అన్నాడు.[21][22][23] కేంద్రం తన ప్రతిపాదనను ఆమోదించిందని అతను 2016 సెప్టెంబరు 27 న ప్రకటించాడు.[24]

భౌగోళికం[మార్చు]

గుర్‌గావ్ హర్యానా రాష్ట్రపు ఆగ్నేయ భాగంలో ఉంది. ఈ నగరం ఢిల్లీ సరిహద్దులో న్యూ ఢిల్లీకి ఈశాన్య దిశలో ఉంది. నగరం మొత్తం వైశాల్యం 738.8 చ.కి.మీ.[25] సముద్ర మట్టం నుండి నగరం 217 మీటర్ల ఎత్తున ఉంది.[26]

వాతావరణం[మార్చు]

కొప్పెన్ వాతావరణ వర్గీకరణ కింద, గుర్‌గావ్‌లో రుతుపవనాలతో ప్రభావితమైన మిశ్రమ వాతావరణం ఉంటుంది. నగరం నాలుగు విభిన్న ఋతువులు ఉంటాయి - వసంతం (ఫిబ్రవరి - మార్చి), వేసవి (ఏప్రిల్ - ఆగస్టు), శరదృతువు (సెప్టెంబరు - అక్టోబరు), శీతాకాలం (నవంబరు - జనవరి). వేసవికాలం అంతాన వర్షాకాలం మొదలౌతుంది. ఏప్రిల్ ప్రారంభం నుండి అక్టోబరు మధ్య వరకు తేమతోకూడిన వేడి ఉంటుంది. సగటు జూన్ అధిక ఉష్ణోగ్రత 40 °C (104 °F) ఉంటుంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు 43 °C (109 °F) చేరుకోవడం మామూలే. శీతాకాలం చల్లగా, పొగమంచుతో ఉంటుంది. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ వలన శీతాకాలంలో కొంత వర్షం పడుతుంది. ఇది చలిని మరింత పెంచుతుంది. వసంత ఋతువు, శరదృతువు తక్కువ తేమతో తేలికపాటి ఉష్ణోగ్రతలతో ఆహ్లాదంగా ఉంటాయి. ఋతుపవనాలు సాధారణంగా జూలై మొదటి వారంలో మొదలై ఆగస్టు వరకు కొనసాగుతాయి. వర్షాకాలంలో ఉరుములతో కూడిన వర్షం ఇక్కడ మామూలు. సగటు వార్షిక వర్షపాతం సుమారు 714 మి.మీ. .[27]

శీతోష్ణస్థితి డేటా - Gurgaon (1981–2010, extremes 1965–2000)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.0
(82.4)
33.5
(92.3)
39.5
(103.1)
44.8
(112.6)
49.0
(120.2)
47.5
(117.5)
45.0
(113.0)
41.0
(105.8)
41.2
(106.2)
39.3
(102.7)
38.4
(101.1)
32.5
(90.5)
49.0
(120.2)
సగటు అధిక °C (°F) 20.7
(69.3)
23.7
(74.7)
29.6
(85.3)
36.6
(97.9)
40.2
(104.4)
39.8
(103.6)
35.5
(95.9)
34.0
(93.2)
34.1
(93.4)
32.8
(91.0)
28.3
(82.9)
23.1
(73.6)
31.5
(88.8)
సగటు అల్ప °C (°F) 6.4
(43.5)
8.8
(47.8)
13.5
(56.3)
19.1
(66.4)
24.1
(75.4)
26.5
(79.7)
26.4
(79.5)
25.6
(78.1)
23.8
(74.8)
17.3
(63.1)
11.3
(52.3)
7.0
(44.6)
17.5
(63.5)
అత్యల్ప రికార్డు °C (°F) 0.0
(32.0)
0.7
(33.3)
3.7
(38.7)
9.2
(48.6)
14.8
(58.6)
12.0
(53.6)
21.0
(69.8)
15.5
(59.9)
13.9
(57.0)
9.3
(48.7)
2.6
(36.7)
−0.4
(31.3)
−0.4
(31.3)
సగటు వర్షపాతం mm (inches) 15.0
(0.59)
21.4
(0.84)
12.3
(0.48)
18.2
(0.72)
34.3
(1.35)
57.3
(2.26)
171.4
(6.75)
190.7
(7.51)
93.8
(3.69)
12.0
(0.47)
10.7
(0.42)
9.9
(0.39)
647
(25.47)
సగటు వర్షపాతపు రోజులు 1.2 1.6 1.2 1.1 2.2 3.6 7.6 8.3 4.6 1.0 0.8 0.8 34
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 54 45 37 28 31 40 63 69 59 45 47 55 48
Source: India Meteorological Department[28][29]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం.గుర్‌గావ్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతపు జనాభా 876,900.,

మతం[మార్చు]

గుర్‌గావ్‌లో హిందూ మతం అత్యంత ప్రాచుర్యంలో ఉన్న మతం. తరువాతి స్థానాల్లో ఇస్లాం, సిక్కు మతం ఉన్నాయి. క్రైస్తవులు, బౌద్ధులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రధాన మతాల కొరకు అనేక దేవాలయాలు, గురుద్వారాలు, మసీదులు చర్చిలు ఉన్నాయి.

గుర్గావ్ లో మతాలు [30]
మతం శాతం
హిందూ మతం
  
93.03%
ముస్లిం మతం
  
4.68%
సిక్కు మతం
  
1.00%
క్రైస్తవమతం
  
0.64%
ఇతరులు
  
0.39%

రవాణా[మార్చు]

రహదారులు[మార్చు]

ఢిల్లీ గుర్‌గావ్ ఎక్స్‌ప్రెస్ వే

గుర్‌గావ్‌ను గుండా వెళ్ళే ప్రధాన రహదారి ఢిల్లీ-ముంబై జాతీయ రహదారి 48. దీనిలో 27.7 కిలోమీటర్ల ఢిల్లీ - గుర్‌గావ్ సరిహద్దు-ఖేర్కీ ధౌలా ముక్కను ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేశారు. మిగితా రహదారిని ఆరు లేన్‌లకు విస్తరించారు.[31]

రైల్వేలు[మార్చు]

గుర్‌గావ్ రైల్వే స్టేషను భారత రైల్వేలకు చెందిన ఉత్తర రైల్వేలో భాగంగా ఉంది. దానితో పాటు గుర్‌గావ్‌లో తాజ్‌నగర్ రైల్వే స్టేషన్, ధన్‌కోట్ రైల్వే స్టేషన్, ఘరి హర్సారు రైల్వే జంక్షన్, ఫరూఖ్‌నగర్ రైల్వే స్టేషన్, పాట్లి రైల్వే స్టేషన్లు ఉన్నాయి . రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కింద, భారత రైల్వే గుర్‌గావ్‌లోని నాలుగు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది.

ఢిల్లీ మెట్రో[మార్చు]

ఢిల్లీ మెట్రో యెల్లో లైన్‌లో హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సేవలు అందిస్తున్న ఎల్లో లైన్‌లో ఐదు స్టేషన్లు ఉన్నాయి, అవి హుడా సిటీ సెంటర్, ఇఫ్కో చౌక్, ఎంజి రోడ్, సికందర్‌పూర్, గురు ద్రోణాచార్య .

రాపిడ్ మెట్రో[మార్చు]

రాపిడ్ మెట్రోలో గుర్‌గావ్‌లో పదకొండు స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ మెట్రో ఎల్లో లైన్ లో సికందర్‌పూర్ మెట్రో స్టేషన్‌లో ఇంటర్‌చేంజ్ సౌకర్యం ఉంది. 2013 నవంబరులో రాపిడ్ మెట్రో పనిచెయ్యడం మొదలైంది. ప్రస్తుతం దీని దూరం 11.7 కిలోమీటర్లు.[32] ఈ ప్రాజెక్టు యొక్క మరో దశ ప్రతిపాదనలో ఉంది దీని వలన నగరంలోని మొత్తం సబ్వే స్టేషన్ల సంఖ్య 16 కు పెరుగుతుంది. ప్రతిరోజూ 33,000 మంది రాపిడ్ మెట్రోను వాడుతారు.[33] గుర్‌గావ్‌లోని రాపిడ్ మెట్రో మూడు పొడిగింపులను హర్యానా ప్రభుత్వం ఆమోదించింది. 

విమానాశ్రయం[మార్చు]

ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గుర్‌గావ్ నగర సరిహద్దులకు బయట జాతీయ రహదారి 8 కి సమీపంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). censusindia.gov.in. Archived (PDF) from the original on 23 July 2013. Retrieved 5 July 2015.
  2. "Gurgaon to New Delhi Distance, Duration, Driving Direction by Road, Trains, Bus / Car at MakeMyTrip Route Planner". www.makemytrip.com. Archived from the original on 6 November 2018. Retrieved 6 November 2018.
  3. "How a Small Experiment in Delhi's Suburbs Sparked a National Car-Free Movement —". 5 July 2018. Archived from the original on 6 November 2018. Retrieved 6 November 2018.
  4. Julka, Harsimran (30 September 2011). "IT firms looking beyond Gurgaon, Noida, Greater Noida to other cities in north India". The Economic Times. ET Bureau. Archived from the original on 5 November 2013. Retrieved 2 October 2013.
  5. Kumar, K.P. Narayana. "Gurgaon: How not to Build a City". Forbesindia.com. Archived from the original on 28 September 2013. Retrieved 2 October 2013.
  6. "Jat stir shakes India Inc". Business Standard India. 20 February 2016. Archived from the original on 22 February 2016. Retrieved 22 February 2016.
  7. "Government of Haryana - district wise HDI" (PDF). Archived from the original (PDF) on 2019-09-30.
  8. "7 out of top 10 most polluted cities are in India; Gurgaon the worst: Study". The Asian Age. 5 March 2019. Archived from the original on 5 March 2019. Retrieved 5 March 2019.
  9. "Inside the most polluted city in the world". BBC Reel (in ఇంగ్లీష్). Retrieved 21 May 2019.
  10. The History of India. The Rosen Publishing Group, Inc, 2010. 15 August 2010. pp. 63. ISBN 978-1615301225.
  11. "History | Gurugram". gurugram.gov.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 September 2018.
  12. "Gurgaon to Gurugram: How the epic 'Mahabharata' inspired Haryana govt to change millennium city's name" (in అమెరికన్ ఇంగ్లీష్). 13 April 2016. Archived from the original on 15 September 2018. Retrieved 14 September 2018.
  13. R. B. Singh (1964). History of the Chāhamānas. N. Kishore. p. 163. OCLC 11038728. Archived from the original on 23 March 2017. Retrieved 22 February 2019.
  14. Dasharatha Sharma (1966). Rajasthan Through the Ages: From the earliest times to 1316 A.D. Rajasthan State Archives. p. 290.
  15. Gurugram plan a misdirected govt move from history to myth Archived 22 జనవరి 2019 at the Wayback Machine, Times of India.
  16. Yashpal Gulia, 2012, Heritage of Haryana.
  17. Will history be buried for a road? A Gurgaon village waits Archived 1 ఫిబ్రవరి 2019 at the Wayback Machine, Indian Express, 18 January 2018.
  18. Gurugram heritage Archived 1 ఫిబ్రవరి 2019 at the Wayback Machine, fridaygurgaon.com.
  19. 1996, "India Today", - Volume 21, Issues 7-12, p. 122.
  20. "Creating a stir.", India Today, 28 February 1991.
  21. "Gurgaon is now 'Gurugram', Mewat renamed Nuh: Haryana government". The Indian Express. 12 April 2016. Archived from the original on 14 April 2016. Retrieved 12 April 2016.
  22. "Welcome to the new office of Gurugram police commissioner". Hindustan Times. 2 May 2016. Archived from the original on 5 May 2016. Retrieved 5 May 2016.
  23. "Gurgaon: The city whose middle name is paradox". The Times of India. Archived from the original on 1 July 2016. Retrieved 12 July 2016.
  24. "Good morning, Gurugram. The name's official". The Times of India. Archived from the original on 1 October 2016. Retrieved 3 December 2016.
  25. "Demographics". Municipal Corporation, Gurgaon. Archived from the original on 2013-10-11.
  26. "GGN/Gurgaon(3)". India Rail Info. Archived from the original on 21 February 2014. Retrieved 2 October 2013.
  27. "Travel Info". The Metropolitan Hotel and Spa New Delhi. Archived from the original on 1 October 2013. Retrieved 2 October 2013.
  28. "Station: Gurgaon Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 305–306. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 1 March 2020.
  29. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M64. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 1 March 2020.
  30. "Gurgaon Religion Data - Census 2011". www.census2011.co.in. Archived from the original on 18 August 2018. Retrieved 22 April 2019.
  31. Dash, Dipak Kumar (7 December 2012). "NH48 stretch on Delhi-Gurgaon border is India's deadliest road". The Times of India. TNN. Archived from the original on 2 March 2013. Retrieved 11 October 2013.
  32. Joseph, Joel (13 November 2013). "From tomorrow, Gurgaon will finally have its Rapid Metro". The Times of India. TNN. Archived from the original on 12 November 2013. Retrieved 13 November 2013.
  33. ASHOK, SOWMIYA (16 June 2014). "Are Gurgaon residents game for a smooth ride on the Rapid Metro?". The Hindu. Archived from the original on 20 June 2014. Retrieved 18 June 2014.