పృథ్వీరాజ్ చౌహాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Prithvi Raj Chauhan (Edited).jpg

పృథ్వీరాజ్ చౌహాన్ (1168-1192 సా.శ.) రాజపుత్ర వంశమైన చౌహాన్ (చౌహమాన) వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి. ఈయన 12వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాడు. పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి హిందూ చక్రవర్తి. (చివరి హిందూ చక్రవర్తి హేమూ). 11 ఏళ్ల వయసులో 1179లో సింహాసనాన్ని అధిష్టించిన పృథ్వీరాజు అజ్మీరు, ఢిల్లీలు జంట రాజధానులుగా పరిపాలించాడు. ప్రస్తుత రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలోని చాలామటుకు ప్రాంతం పృధ్వీరాజు పాలనలో ఉండేది . ఈయన ముస్లిం దండయాత్రలకు వ్యతిరేకంగా రాజపుత్రులను సంఘటితం చేశాడు. అందుకు గాను రాజపుత్ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్ అన్న బిరుదును పొందినాడు. పృథ్వీరాజ్ కనౌజ్ ను పరిపాలించిన ఘడ్వాల రాజు జయచంద్ర కూతురైన సంయుక్త (సంయోగిత) ను లేవదీసుకొనిపోయి పెళ్ళి చేసుకోవటం భారతదేశపు జనసాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన ప్రేమకథ. పృథ్వీరాజు ఆస్థానకవి, స్నేహితుడైన చంద్ బర్దాయ్ వ్రాసిన " పృథ్వీరాజ్ రాసో " అనే కావ్యం [[ఆధారం చూపాలి] కథపై ఆధారితమైనదే. పృథ్వీరాజ్ చౌహాన్ రాజపుత్ర సామ్రాట్ అగ్నికులక్షత్రియులు[ఆధారం చూపాలి] అని అతని మిత్రుడు మంత్రి అయిన చాంద్ బర్దాయ్ తను వ్రాసి ప్రచురించిన " పృధ్వీరాజ్ రాసో " అనే పుస్తకంలో తెలియజేసాడు. పృథ్వీరాజు 1191లో మొదటి తారాయిన్ యుద్ధంలో గెలిచాడు.

పుట్టుక[మార్చు]

మూలాలు[మార్చు]