అగ్నికులక్షత్రియులు
అగ్ని కుల క్షత్రియులు | |
---|---|
వర్గీకరణ | ఇతర వెనుకబడిన తరగతులు (ఆంధ్రప్రదేశ్) |
జనాభా గల రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ |
Reservation (Education) | BC-A |
అగ్నికులక్షత్రియులు అనే కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఏ విభాగానికి చెందుతారు.[1] నేడు ఆంధ్ర ప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్టా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఎక్కువగా వీరు తీరా ప్రాంతాలలో నివసిస్తారు.
ప్రస్తుత సామజిక పరిస్థితి
[మార్చు]నేడు అగ్నికులక్షత్రియ కులం నిరక్షరాస్యత,అనైక్యతగా ఎవరికీ వారీగా వుంటూ పార్టీలుగా వర్గాలుగా విడి విడిగా ఉండటం వలన అన్ని రంగాలలో వెనకబడిపోయారు. అధికశాతం కోస్తా తీరా ప్రాంతంలో చేపల పెంపకం, చేతి వృత్తులు చేసుకుంటూ నిరంతరం జీవిత పోరాటం చేస్తున్నారు.
సమస్యలు
[మార్చు]- ప్రపంచ ప్రఖ్యాత చెందిన దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని, కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలని నిర్మించింనది అగ్నికులక్షత్రియ కులస్తులు.[2]
- కోపనాతి కృష్ణమవర్మ, పెనబోతూ గజేంద్రుడు ఈ ఆలయాల నిర్మించారు.కానీ ధర్మకర్తలుగా వేరే కులస్తులు ఉంటున్నారు. ఆలయ ధర్మకర్తల వీరి కులస్తులు ఉండేలా వీరి కుల సంఘం ఎప్పటినుంచో పోరాటం చేస్తుంది.
ఆచార వ్యవహారాలు
[మార్చు]అగ్నికులక్షత్రియులకు ఉపనయనము, యజ్ఙోపవీతం ఆచారం ఉంది. వివాహానికి ముందు ఉపనయనం చేసుకుంటారు. వీరి కులస్తులు ఎక్కువగా హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరికి రఘుకుల గోత్రం ఉంది.
ప్రముఖులు
[మార్చు]- కొపనాతి కృష్ణమ్మ- అంతర్వేది ఆలయ నిర్మాత.
- మల్లాడిసత్యలింగంనాయకర్ - MSN చారిటీస్ విద్యావేత్త.
- పినపోతు గజేంద్రుడు - వాడపల్లి ఆలయ నిర్మాత.
- పెదసింగు లక్ష్మణరావు - కులం మీద మత్స్యకార ముద్రవేసిన నాయకుడు
మూలాలు
[మార్చు]- ↑ "National Commission for Backward Classes". www.ncbc.nic.in. Retrieved 2023-05-17.
- ↑ "Lakshmi Narasimha Swamy Temple, Antarvedi, Andhra Pradesh". hindupost.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-22. Retrieved 2023-05-17.