Jump to content

పెదసింగు లక్ష్మణరావు

వికీపీడియా నుండి

పెదసింగు లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యుడు. అతను 1962, 1967, 1972 శాసన సభ ఎన్నికలలో పోటీ చేసి మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

పెదసింగు లక్ష్మణరావు 1922 నవంబరు 14వ తేదీన పెదసింగు వెంకట రంగయ్య, మంగతాయారు దంపతులకు 4వ సంతానంగా జన్మించాడు. అతను లక్ష్మణరావుగారు పుట్టుకతో ఆగర్భ శ్రీమంతులు. లక్ష్మణ రావు గారి తండ్రి పెదసింగు వెంకట రంగయ్య 1932లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసాడు. నౌకాయానం, ఓడలపై వ్యాపారం చేయటం ద్వారా ఆర్థికంగా పరిపుష్టత సాధించి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అతను చేస్తున్న సేవలను గుర్తించి బ్రిటీష్ ప్రభుత్వం "రాయ్ సాహెబ్ " (ఈ బిరుదుని తర్వాత బహుదూర్ గా మార్చారు) బిరుదుతో సత్కరించడం జరిగింది. బహుశా బ్రిటిష్ చరిత్రలోనే ఒక కుటుంబంలో రెండు "రాయ్ సాహెబ్" బిరుదులు ఇవ్వడం మొట్టమొదట పెదసింగు కుటుంబానికే దక్కింది. పెదసింగు వెంకట రంగయ్య గారి అన్న కొడుకు పెదసింగు వెంకట నారాయణ గారికి కూడా "రాయ్ సాహెబ్ " బిరుదు ఇవ్వడం జరిగింది. వీరు కార్మిక సంఘాల బాధ్యత -ప్రెస్ నిర్వహణ - కుల చరిత్రకు సంబంధించి పుస్తకాల ముద్రణ - విద్యార్థుల సౌకర్యార్థం తమ ఇంటినే భోజన శాలగా మలిచారు.

ధన సంపద, అనేక జిల్లాల్లో విస్తరించిన స్థిర ఆస్తులు, ఎంతో ఐశ్వర్యంతో తులతూగే కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మణరావు ప్రజల కోసం తపన పడిన తీరు ముఖ్యంగా బీసీ కులాల కొరకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మత్స్యకార కులాల కొరకు తన తుదిశ్వాస వరకు కూడా కట్టుబడి ఉన్నారు. అత్యంత విలాసవంతమైన "ప్లేమౌత్ " (Plymouth) వంటి కారులో తిరిగిన లక్ష్మణరావు చివరకు రాష్ట్రంలో తొలి రిక్షా యూనియన్ స్థాపకుడిగా /అధ్యక్షుడిగా రిక్షాలో తిరుగుతూ సమస్యలపై జాలరి కత్తి దూసిన పల్లెకార్ల సామాజిక విప్లవ వీరుడు పెదసింగు లక్ష్మణరావు.

రాజకీయ జీవితం

[మార్చు]

స్వతంత్ర అభ్యర్థిగా 1962 లో మచిలీపట్నం శాసన సభ్యునిగా ఎన్నికై దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలపై తన ప్రత్యేక ముద్ర చాటుకున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా మత్స్యకారులకు గుర్తింపు నిచ్చింది లక్ష్మణరావుగారి వ్యక్తిత్వం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా బందరుకు ఏదో ఒక రాజకీయ పార్టీ నుండి తన సామాజిక వర్గానికి సీటు కేటాయించే విధంగా రాజకీయంగా తమ సామాజికవర్గాన్ని పురిగొల్పిన బాహుబలి.

ఉన్నత శ్రేణి కుటుంబానికి చెందిన లక్ష్మణ రావు గారి కుటుంబం తమ వారసులకు మత్స్యకార వృత్తి పట్ల, కార్మిక రంగ సమస్యలను అభ్యుదయ స్ఫూర్తితో పరిష్కరించడంతో పాటుగా, అనేక స్వతంత్ర సంఘాల స్థాపనకు పునాది అయ్యింది. లక్ష్మణరావు గారు తన ఆలోచనలను కేవలం బందరుకే పరిమితం చేయక రాష్ట్ర వ్యాప్తం చేయాలని కార్యాచరణ ప్రారంభించారు. ఆ ఆలోచనే "ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల హక్కుల రక్షణ సమితి" అనే వృత్తి హక్కుల పరిరక్షణ సంఘానికి నాంది అయ్యింది. ఈ సమితిని నర్సాపూరంలో ఏర్పాటు చేశారు. సాంప్రదాయ మత్స్యకార వృత్తి చేస్తూ, అసంఘటితంగా ఉన్న అనేక మత్స్యకార కులాలను ఏకం చేసి బిసి-ఏ గ్రూప్ లో ఒకే సముదాయంగా చేర్చడంలో లక్ష్మణరావుగారు కీలకపాత్ర వహించారు. ఈ రోజు మత్స్యకార ఉపకులాల్లో వృత్తిస్ఫూర్తిని దెబ్బతీసే విధంగా స్వయం ప్రకటిత యువజన సంఘాల ప్రచార తీరు మత్స్యకార ఉపకులాలు ఐక్యతకి ఎంతో అవరోధం అనీ పెదసింగు లక్ష్మణరావు గారిని అధ్యయనం చేసీ, బిసి-మత్స్యకార ఉపకులాల కులవృత్తుల కోణంలో చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ విధమైన విభజన-వేర్పాటువాద సంఘ రాజకీయాలను ఏకోన్ముఖంగా లక్ష్మణరావు గారు ఖండించారనేది ఆయన పని విధానం ద్వారా మనకు అవగతమవుతుంది. మంచి వాగ్దాటి కలిగిన లక్ష్మణరావు గారు, తన భావాలను స్పష్టంగా, ముక్కు సూటిగా చెప్పడమే కాకుండా, రాతపూర్వకంగా కూడా తెలియజేసేవాడు. ఆంగ్ల భాషపై తనకు ఉన్న పట్టు మరింత గౌరవాన్ని పెంచింది. అంతేగాక, "అనంతరామన్ కమిషన్"లో సభ్యుడిగా ఉండి రాష్ట్రం మొత్తం కూడా పరిశీలించి మత్స్యకారుల జీవన విధానాన్ని అధ్యయనం చేస్తూ, మరో పక్క బీసీల స్థితిగతులను కూడా నిశితంగా పరిశీలన చేసి బీసీల్లో కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయని గమనించి బీసీ జాబితా వర్గీకరణకు నాంది అయ్యాడు. వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించడంలో కలిసికట్టుగా ఉండాలనీ, మత్స్యకార స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించే ఏ ఒక్క ఆలోచనలను కూడా లక్ష్మణరావుగారు సహించేవాడు కాదనేది ఆయన పోరాట పటిమ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సంఘ నిర్మాణం, సొసైటీల నిర్మాణం, జట్టీల నిర్మాణం, వృత్తిని బలోపేతం చేయటం, ప్రభుత్వం నుంచి గ్రాంట్ పొందే విషయంలో అనేక ఆలోచనలు చేసేవాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అనే సూత్రీకరణ ప్రాతిపదికన మత్స్యకారు- ఉప కులాలు ఆత్మగౌరవ పోరాటాలు సాగించాలని చాటేవారు. ధైర్య సాహసాలు, పోరాట పటిమ కలిగిన ఈ వృత్తి కోట్ల మందికి ఆహార సమస్యను తీర్చుతుంది అంటూ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నిలిపాడు. ప్రజలతో ఆయన కలివిడితన౦, మమేకమవడం, చిన్నవారితో సైతం గౌరవంగా ప్రవర్తించే ఆయన వ్యక్తిత్వానికి ఆదర్శనీయం.

ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ, వేల మందితో ర్యాలీ-ధర్నా నిర్వహించి అసెంబ్లీ ముట్టడి ( మత్స్యకార కులాలను షెడ్యూల్డు కులాల జాబితాలో చేర్చాలనే డిమాండ్ తో-హైదరాబాద్, April 24-1964) వంటి సంచలన కార్యక్రమాలకు ఆనాడే కేంద్ర బిందువు అయ్యాడు. అసెంబ్లీలో మత్స్యకారులను షెడ్యూల్ కులాల జాబితాలో చేరుస్తూ చేసిన తీర్మానాన్ని కేంద్రం కూడా తక్షణమే ఆమోదించాలని పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఆందోళనలు చేసిన పోరాట ధీరుడు. అంతేకాక, తాను ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ సంఘం ద్వారా మత్స్యకార సమస్యలపై రాజీలేని పోరాటాన్ని కొనసాగించి మత్స్యకార సంఘాలకు దిశ దశ నిర్దేశం చేసిన మహానీ యుడు. సముద్ర తీర ప్రాంత భూములు మత్స్యకారులకే చెందాలి అనే డిమాండ్ తో పోరాటాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా, బందరులో కొన్ని వేల ఎకరాలు మత్స్యకారులకు పంచి ఇచ్చిన భూ పోరాటం మనకు ఎన్నటికీ స్ఫూర్తిదాయకమే. మంత్రి పదవిని ఆఫర్ ని తృణప్రాయంగా త్యజించి మత్స్యకారుల సమస్యలపై రాజీలేని పోరాటాన్ని కొనసాగించి మత్స్యకారుల జీవితాల్లో "లైట్ హౌస్" వలే వెలుగొందాడు.

1962 నుంచి 17 ఏళ్ల పాటు శాసనసభ్యులుగా పెదశింగు లక్ష్మణరావు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. నేషనల్‌ సాల్ట్‌ బోర్డు సభ్యుడిగా, మైనర్‌ పోర్టు డెవల్‌పమెంట్‌ సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్‌ అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా పెదశింగు లక్ష్మణరావు సేవలందించారు. ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంఘ ఉపాధ్యక్షులుగా సేవలందించారన్నారు. రిక్షా కార్మికులకు సొసైటీ స్థాపించి సొంత రిక్షాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 22 వేల ఎకరాల అటవీ భూములను డి ఫారెస్టు చే యించి పేద వర్గాల ప్రజలకు పట్టాలు ఇప్పించారన్నారు.

మూలాలు

[మార్చు]