అక్షాంశ రేఖాంశాలు: 30°07′59″N 77°17′17″E / 30.133°N 77.288°E / 30.133; 77.288

యమునా నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యమునా నగర్
నగరం
యమునా నగర్ is located in Haryana
యమునా నగర్
యమునా నగర్
హర్యానా పటంలో యమునా నగర్ స్థానం
Coordinates: 30°07′59″N 77°17′17″E / 30.133°N 77.288°E / 30.133; 77.288
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యాణా
జిల్లాయమునా నగర్
Elevation
255 మీ (837 అ.)
జనాభా
 (2011)[1]
 • నగరం2,16,628
 • జనసాంద్రత687/కి.మీ2 (1,780/చ. మై.)
 • Metro3,83,318
భాషలు[3][4]
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
135001
టెలిఫోన్ కోడ్1732
లింగ నిష్పత్తి877 /
Websitehttp://yamunanagar.nic.in/

యమునా నగర్ హర్యానా రాష్ట్రం లోని నగరం. గతంలో దీన్ని అబ్దుల్లాపూర్ అని పిలిచేవారు. ఇది యమునా నగర్ జిల్లా ముఖ్య పట్టణం. నగర పాలన మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఈ పట్టణం ప్లైవుడ్ యూనిట్లకు, కాగిత పరిశ్రమలకూ ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద పరిశ్రమలకు కలపను అందిస్తుంది. పాత పట్టణాన్ని జగద్రి అంటారు. యమునా నగర్-జగద్రి రైల్వే స్టేషను (YJUD) నగరానికి సేవలు అందిస్తుంది. పేరు జగద్రి అని ఉన్నప్పటికీ, ఈ స్టేషను యమునా నగర్ లోనే ఉంది. యమునా నగర్‌లో జగద్రి వర్క్‌షాప్ అనే మరో రైల్వే స్టేషను కూడా ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ పట్టణం 1989 నవంబరులో ప్రత్యేక జిల్లాగా ఏర్పడే ముందు అంబాలా జిల్లాలో భాగంగా ఉండేది. ఈ ప్రదేశాన్ని ఇంతకుముందు అబ్దుల్లాపూర్ అని పిలిచేవారు. తరువాత దీనిని జమ్నానగర్ అని, ఆ తరువాత యమునా నగర్ అని పేరుమార్చారు. స్వాతంత్ర్యానికి ముందు పట్టణం ఎక్కువగా రైల్వే స్టేషన్ చుట్టూ విస్తరించి, ఒక చిన్న గ్రామం లాగా ఉండేది. విభజన తరువాత పశ్చిమ పంజాబ్ నుండి శరణార్థుల వలసల ఫలితంగా ఇది బాగా విస్తరించింది.

భౌగోళికం

[మార్చు]

యమునా నగర్ జిల్లా గుండా యమునా నది ప్రవహిస్తుంది. ఇది పొరుగున ఉన్న సహరాన్‌పూర్ జిల్లాతో తూర్పు సరిహద్దుగా ఉంది. సహరాన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందున ఇది రాష్ట్ర సరిహద్దు కూడా. యమునా నదీ వ్యవస్థను సత్లజ్ నదీ వ్యవస్థనూ జిల్లా వేరుచేస్తుంది.

వాతావరణం

[మార్చు]

యమునా నగర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 45.5 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత -0.5 డిగ్రీలుగా నమోదైంది. 2016 జూలై 14 న జగద్రిలో 24 గంటల్లో 383 మి.మీ.రికార్డు వర్షపాతం నమోదైంది

పట్టణంలో సగటు వర్షపాతం 891 మి.మీ. చచ్రౌలి, బిలాస్‌పూర్ తహసీళ్ళు హర్యానాలో అత్యధిక వర్షపాతం కలిగిన తహసీళ్ళు. వాటిని "హర్యానా చిరపుంజీలు" అని పిలుస్తారు.

జనాభా

[మార్చు]

2011 జనాభా గణాంకాల ప్రకారం, యమునా నగర్ పట్టణ సముదాయంలో 3,83,318 జనాభా ఉంది, వీరిలో పురుషులు 2,05,346, ఆడవారు 1,77,972. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 40,950. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 2,93,475, వీరిలో పురుషులు 1,63,791, మహిళలు 1,29,684.

రైల్వేలు

[మార్చు]

యమునా నగర్‌లో యమునా నగర్-జగద్రీ, జగద్రి వర్క్‌షాప్ రైల్వే స్టేషన్ అనే రెండు రైల్వే స్టేషన్లున్నాయి. ఇది అమృత్సర్ - కోల్‌కతా రైలు మార్గంలో ఉంది. యమునా నది పై ఉన్న 1042 మీటర్ల వంతెన యమునా నగర్-జగద్రిని, సహరాన్‌పూర్తో కలుపుతుంది. ఈ వంతెనకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టారు.

రోడ్లు

[మార్చు]

యమునా నగర్ నుండి ఢిల్లీకి చక్కటి రోడ్లున్నాయి..హర్యానా లోని పానిపట్, కర్నాల్, అంబాలా, కురుక్షేత్ర, కైతల్, రోహ్‌తక్ నగరాలకు కూడా రోడ్లున్నాయి. యమునా నగర్ నుండి రాష్ట్ర రాజధాని చండీగఢ్‌కు పోయే రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించడం పూర్తైంది.

పట్టణ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). Censusindia.gov.in. Retrieved 21 November 2015.
  2. "Provisional Population Totals, Census of India 2011" (PDF). Censusindia.gov.in. Retrieved 21 November 2015.
  3. "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 85–86. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 24 మార్చి 2019.
  4. IANS (28 January 2010). "Haryana grants second language status to Punjabi". Hindustan Times. Retrieved 24 March 2019.