యమునా నగర్ జిల్లా
స్వరూపం
యమునా నగర్ జిల్లా
यमुना नगर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | యమునా నగర్ |
మండలాలు | 1. జగద్రి, 2. ఛచ్రౌలి, 3. బిలాస్‌పూర్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,756 కి.మీ2 (678 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 10,41,630 |
• జనసాంద్రత | 590/కి.మీ2 (1,500/చ. మై.) |
జనాభా వివరాలు | |
• లింగ నిష్పత్తి | 862 |
Website | అధికారిక జాలస్థలి |
హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో యమునా నగర్ జిల్లా (హిందీ: यमुनानगर जिला) ఒకటి. ఇది 1989 నవంబరు 1 న ఏర్పడింది. ఈ జిల్లా వైశాల్యం 1,756 చ.కి.మీ. యమునా నగర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా ఉత్తర సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్, తూర్పు సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్, దక్షిణ సరిహద్దులో కర్నాల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కురుక్షేత్ర జిల్లా, పశ్చిమ సరిహద్దులో అంబాలా జిల్లా ఉన్నాయి.
విభాగాలు
[మార్చు]జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: జగద్రి, ఛచ్రౌలి, బిలాస్పూర్. జిల్లాను బిలాస్పూర్, సధౌరా, ముస్తాఫాబాద్, రాడౌర్, జగద్రి, చచ్చురౌలి అనే 6 డెవెలెప్మెంటు బ్లాకులుగా విభజించారు.
- జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: సధౌరా, జగద్రి, యమునా నగర్. రాడౌర్, విలే సధౌరా, జగద్రి, యమునా నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు అంబాలా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 12,14,162,[1] |
ఇది దాదాపు. | బహరియన్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
640 భారతదేశ జిల్లాలలో.స్థానం | 393వ స్థానంలో ఉంది.[1] |
జనసాంద్రత (/చ.కి.మీ). | 687 [1] |
2001-11 కుటుంబ నియంత్రణ శాతం. | 16.56%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 877:1000,[1] |
జాతీయ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత | 78.9%.[1] |
జాతీయ సరాసరి (72%) కంటే. | అధికం |
ప్రధాన నగరాలు , పట్టణాలు
[మార్చు]- యమునా నగర్, ఒక మునిసిపల్ కార్పొరేషన్, యమునా నగర్ జిల్లా కేంద్రం.
- జగర్ధి, ఇది యమునా నగర్ పక్కనే ఉంది. ఈ ట్విన్ నగరాలలో జగర్ధి పురాతనమైనది.
- చచ్చురౌలి
- సధౌరా
- సప్త బద్రి
- ఆది బద్రి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Bahrain 1,214,705 July 2011 est.