రోహ్‌తక్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోహ్‌తక్ జిల్లా
रोहतक जिला
హర్యానా పటంలో రోహ్‌తక్ జిల్లా స్థానం
హర్యానా పటంలో రోహ్‌తక్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
ముఖ్య పట్టణంరోహ్‌తక్
మండలాలు1. రోహ్‌తక్, 2. మెహెమ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుRohtak
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం1,668 km2 (644 sq mi)
జనాభా
 (2001)
 • మొత్తం9,40,128
 • జనసాంద్రత560/km2 (1,500/sq mi)
 • Urban
35.06%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత74.56%
 • లింగ నిష్పత్తి847
ప్రధాన రహదార్లుNH-10
అక్షాంశ రేఖాంశాలు28°32′N 76°20′E / 28.54°N 76.34°E / 28.54; 76.34 - 28°54′N 76°34′E / 28.90°N 76.57°E / 28.90; 76.57
Websiteఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో రోహ్‌తక్ (హిందీ: रोहतक ज़िला) ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో జింద్, సోనీపత్ జిల్లాలు, తూర్పు సరిహద్దులో ఝజ్జర్, పశ్చిమ సరిహద్దులో హిస్సార్, సిర్సా, భివాని జిల్లాలు ఉన్నాయి. రోహ్‌తక్ ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ రోహ్‌తక్ వాస్తవ్యుడు.

చరిత్ర

[మార్చు]

క్రీ.పూ 1500 కాలంలో వాయవ్య భారతంలో జరిగిన సంప్రదాయ దాడుల నుండి తప్పించుకునేందుకు గాంధార ప్రజలు ఇక్కడకు తరలి వచ్చారని చెప్పే పలు నిదర్శనాలు ఈ ప్రాంతంలో లభిస్తున్నాయి. ఈ ప్రజలు పాకిస్థాన్ మీదుగా బీహార్ వరకు విస్తరించారు. ఇందుకు నిదర్శనంగా గాంధార సంస్కృతికి చెందిన (క్రీ.పూ 1500-500) సమాధులు, పలు వర్ణాలతో చిత్రించిన క్రీ.పూ 1100-500 కాలం నాటి గ్రే వేర్, క్రీ.పూ 800-600 నాటి బ్లాక్ స్లిప్డ్ వేర్ లభిస్తున్నాయి.

పి జి డబ్ల్యూ

[మార్చు]

సరస్వతీ లోయలో సట్లైజ్ నుండి గంగా నది వరకు వ్యవసాయ, మతసంబంధిత గ్రే కల్ర్డ్ - పెయింటెడ్ పాటరీ వంటి పురాతన వస్తువులు పి జి డబ్ల్యూ (పెయింటెడ్ గ్రే వేర్) సంస్కృతికి చిహ్నంగా లభిస్తున్నాయి. హస్థినాపురం, పానిపట్, పెహోవా, కురుక్షేత్ర, మథుర, ఇంద్రప్రస్థ (ఢిల్లీ) లలో లభిస్తున్న మహాభారత కాలానికి సంబంధించిన వస్తువులు పి జి డబ్ల్యూ సంస్కృతికి చిహ్నంగా ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు, చారిత్రక ఆధారాలు, సంస్కృతి సంప్రదాయాలు వేదసంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. రోహ్‌తక్ ప్రజలు వేదకాల ప్రజలుగా భావించబడుతున్నారు. వ్యవసాయం, మతసంప్రదాయాలను అనుసరించారని భావిస్తున్నారు. ఋగ్వేద కాలానికి సంబంధించిన ప్రజలు ఇనుము సంబంధించిన పనిముట్లు తయారు చేసి ఉపయోగించారని భావిస్తున్నారు. వీరు జనపదాలలో నివసించారు. ఇక్కడ ప్రజలు గణతంత్ర, రాజ సంస్థానాలు ఏర్పాటు చేసుకుని జీవించారని విశ్వసిస్తున్నారు.

మౌర్యసామ్రాజ్యం

[మార్చు]

క్రీ.పూ 4వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో 2వ దఫా నగరీకరణ జరిగింది. ఖొఖ్రా కాట్ మౌండ్ వద్ద నిర్వహించబడిన త్రవ్వకాలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి.ఉత్తర హర్యానా లోని తోప్రా వద్ద, హిస్సార్ జిల్లా, ఫతేబాద్ అశోకస్తంభాలు మౌర్యసామ్రాజ్యం విస్తరణకు చిహ్నాలుగా ఉన్నాయి. ఈ కాలం ప్రాకృతిక భాష, బౌద్ధమత విస్తరణ, ఇటుకలతో నిర్మాణాలు, నాణ్యాలు, బ్రాహ్మీ భాష సృష్టి జరిగాయి. మౌర్యసామ్రాజ్య పతనం తరువాత ఈ ప్రాంతంలో గిరిజన యుధేయాల ప్ర్రజాపాలన సాగింది. తరువాత క్రైస్తవ శకం ఆరంభానికి ముందు గ్రీకు, శాకాలు, కుషాణులు పాలించారు. మద్య ఆసియా నుండి ఆరంభమైన కుషాణుల పాలన ఉత్తర భారతం వరకు వ్యాపించింది. ఈ కాలంలో ఎత్తైన గోపురాలతో కూడిన శిఖరాల నిర్మాణం జరిగిందని మద్య, పశ్చిమ ఆసియా, ఐరోపా దేశాలతో వాణిజ్యం జరిగిందని భావిస్తున్నారు. పలు విదేశీ వస్తువులు భారతదేశంలో ప్రవేశించి దేశాన్ని సుసంపన్నం చేసాయి. ప్రారంభకాల చారిత్రక సమయంలో బానిసత్వం, కులవ్యవస్థ, స్త్రీల స్థితి క్షీణించడం, అస్పృశ్యత వంటివి కొత్తగా ఆరంభం అయ్యాయి.

కుషాణులు

[మార్చు]

3వ శతాబ్దంలో కుషాణుల విచ్ఛిన్నం తరువాత రోహ్‌తక్ గిరిజన జాతులైన యుధేయులు స్వతంత్ర ప్రజాపాలన సాగించారని కొన్ని ముద్రలు, నాణ్యాలు ఇతర ఆధారాల వలన తెలుస్తోంది. 4వ శతాబ్దంలో వారిని మగధ సామ్రాజ్యానికి చెందిన గుప్తులు అణిచి వేసారు. తరువాత ఈ ప్రాంతంలో రాజరిక వ్యవస్థ ఆరంభం అయింది. వ్యవసాయ ఆదాయం, పాలనా వికేద్రీకరణ, సరికొత్త వారసత్వ సాంఘిక సంప్రదాయం మొదలైంది. హూణుల దాడి తరువాత, ఈ ప్రాంతంలో తిరిగి అరాచకం తలెత్తింది.

క్రైస్తవ శకం

[మార్చు]

క్రైస్తవ శకం ఆరంభకాలంలో ఈ ప్రాంతం ఇండో- గ్రీకులు, కుషాణులు, హూణుల వంటి సంప్రదాయ దాడులకు గురైంది. స్థూపాలు, స్తంభాలు, శిల్పాలు, అలంకరించిన ఆలయ కుడ్యాలలోని ఇటుకలు, వర్ణచిత్రాలతో కూడిన పైకప్పులు అందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఈ కాలంలో కాలక్షేపంగా వాయించిన భేరీలు అందుకు నిదర్శనంగా ఉన్నాయి.

ప్రభాకర వర్ధనుడు

[మార్చు]

సా.శ. 6వ శతాబ్దంలో ఈ ప్రాంతం పుష్పభుటీలు లేక వర్ధనాలు ధానేశ్వర్ సామ్రాజ్య పాలకుల ఆధీనంలో ఉంది.ఈ ప్రాంతంలో శక్తివంతమైన ప్రభాకరవర్ధన మహారాజు హూణుల పాలనను అనతమొందించాడు.రోహ్‌తక్, థానేశ్వర్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత పుష్పభూటి రాకుమారుడు హర్షవర్ధనుడి కనౌజ్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. హర్షవర్ధనుడి మరణం తరువాత తిరిగి అరాచక పరిస్థితి ఎదురైంది.ఉజ్జయినికి చెందిన ప్రతీహారులు ఈ ప్రాంతంలో తిరిగి ప్రశాంతతను నెలకొల్పారు. 9వ శతాబ్దంలో ప్రతీహారులు ఉత్తర భారతదేశాన్ని జయించి కనౌజును రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు.

విభాగాలు

[మార్చు]

విభాగాల వివరణ

[మార్చు]
విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 2 తాలూకాలు : రోహ్‌తక్, మేహం
ఉపవిభాగం 3 రోహ్‌తక్, కలనౌర్, సంప్ల.
రోహ్‌తక్ తాలూకా 3 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు: రోహ్‌తక్, కలనౌర్, సంప్ల.
మేహం తాలూకా 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు: మేహం, లఖన్ - మజ్రా
ప్రజలు జాట్ ప్రజలు

ఆర్ధికం

[మార్చు]

జిల్లా అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. జిల్లాలోని 42.19% ప్రజలు వ్యవసాయం పైన, అందుకు సంబంధించిన వృత్తుల పైనా ఆధారపడి జీవిస్తున్నారు. 7.68% కుటీర పరిశ్రమల మీద,. మిగిలిన వారు ఇతర వృత్తుల మీదా ఆధారపడి జీవిస్తున్నారు.

జాపాన్ టౌన్‌షిప్

[మార్చు]

రోహ్‌తక్ నగరం మదీనా గ్రామంలో జాతీయ రహదారి 10 సమీపంలో జపానీ టౌన్‌షిప్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో పలు పెద్ద సంస్థలు, వాణిజ్య భవనాలు నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.[1]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,058,683,[2]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. రోడ్ ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 469వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 607 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.61%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 868:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.4%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో 83% భూభాగం వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. జిల్లాలో గోధుమ, పప్పుధాన్యాలు, చెరుకు, సజ్జ పంటలు ప్రధాంగా పండినబడ్జుతున్నాయి.

కళలు సంస్కృతి

[మార్చు]

జిల్లా కళా సంస్కృతి కొంతవరకు నిర్లక్ష్యానికి గురైంది. గత దశబ్ధంలో నగరంలో సుమారు 50 హవేలీ (మఠం) సంప్రదాయ పద్ధతిలో నిర్మించబడ్డాయి. ముఖద్వారా శిల్పాలు, కుడ్యశిల్పాలు అనేకం గోడల నుండి విడదీసి పురాతనవస్తు సేకరణ వ్యాపారులకు స్వల్ప ధనానికి విక్రయించబడ్డాయి. ముస్లిం హవేలీలో చక్కగా రాతిచెక్కడాలు, కొయ్య చెక్కడాలతో అలంకరించబడి ఉన్నాయి. వాణిజ్య అభివృద్ధి, స్థలం కొరత కారణంగా గృహయజమానులు తమ పురాతన భవనాలను పడగొట్టి సరికొత్తగా షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించబడుతున్నాయి. నగర సంప్రదాయ నిర్మాణాలను సంరక్షించడానికి ప్రభుత్వాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్

[మార్చు]

ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ జిల్లా ప్రైవేట్ వారసత్వ సంపదను పరిరక్షించే ప్రయత్నాలు చేపట్టింది. అయితే, తగినంత నిధులు లేకపోవడం కారణంగా మౌలిక వసతులను అభివృద్ధిచేయడానికి వీలు పడలేదు. సాంస్కృతిక చరిత్రకారుడు, రణబీర్ సింగ్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కో కంవీనర్ రోహ్‌తక్ కేంద్రంగా పనిచేస్తూ 25 సంవత్సరాల రోహ్‌తక్, హర్యానా కళా, నిర్మాణ వారసత్వం గురించిన సమాచారాన్ని విస్తారంగా నమోదు చేసాడు. ఆయన వద్ద జిల్లా గురించిన పురాతన వారసత్వ నిర్మాణాలు, గ్రామాలు, పట్టణాలు చాయాచిత్రాలు, దస్తావేజులు అనేకం ఉన్నాయి. 2009 నాటికి రాబిన్ సింగ్ వారసత్వ సంపదకు సంబంధించిన ప్రైవేటు, ప్రభుత్వ భవనాలను గురించిన వివరాలు లభిస్తున్నాయి. న్యూ ఢిల్లీ లోని లోడీ వంశానికి చెందిన ఎస్టేట్‌లో ఉన్న గ్రంథాలయంలో ఉన్న ఈ వివరాలు చరిత్రకారులకు, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇల్లాస్ట్రేటెడ్ బుక్‌లో హర్యానా ప్రజల జీవనవిధానం, కళలను గురించిన వివరణలు అనేకం ప్రచురించబడ్డాయి. ఉత్తర ఇండియా కళలు, హర్యానాకు చెందిన హస్థకళలు, నిర్మాణశైలి రణబీర్ సింగ్ సంపాదకత్వంలో వెలువడ్డాయి. పురాతన నైపుణ్యానికి సంబంధించిన కొయ్య కళారూపాలు మార్గ్ కళాపత్రికలో చోటు చేసుకున్నాయి.

పురాతన నిర్మాణాలు

[మార్చు]
  • 12వ శతాబ్ధానికి చెందిన ప్రఖ్యాత " అస్తల్ బొహర్ " స్థూపం. ఈ స్థూపాన్ని ప్రస్తుత మహంత్ చంద్ నాథ్ అధునికీకరణ చేసాడు.
  • సిద్ధ్ బబా చైరంగి నాథ్ క్రీ.పూ 18వ శతాబ్దంలో జీవించిన సిద్ధ్ బాబా చౌరంగి నాథ్ సమాధిని నిర్మించాడు. ఈ ఆవరణలో సిద్ధ బాబా తోటా నాథ్ ఆలయం కూడా ఉంది. ఇందులో రాజపుత్రుల శైలిలో 19వ శతాబ్ధానికి చెందిన అందమైన చిత్రాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత మహంత్ ఈ వర్ణచిత్రాలను ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నాడు. ప్రస్తుత మహంత్ చంద్ నాథ్ సిద్ధ్ బాబా మస్త్ నాథ్,

తోటానాథ్, మేఘ్ నాథ్, మొహర్ నాథ్, చెట్ నాథ్ సంబంధిత ఙాపక చిహ్నాలతో ఢిల్లీ లోని అక్షరధాం వంటి ఆలయనిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలో పడగొట్టబడిన భవనాలలో కొన్ని వర్ణచిత్రాలు నిర్మూలించబడ్డాయి. అవి ఇప్పుడు రణబీర్ సింగ్ చాయాచిత్రాలలో మాత్రం లభ్యమౌతున్నాయి.

  • అందమైన శిలాకృతులతో నిర్మితమైన బర్రా బజార్‌లో ఉన్న " దిగంబర్ జైన్ మందిర్ " 2006లో 1 లక్ష రూపాయలకు మాత్రమే విదేశీయులకు విక్రయించబడింది. రైల్వే రోడ్డు, పాత పట్టణంలో ఉన్న పలు పురాతన భవనాల స్థానంలో ప్రస్తుతం ఆధునిక తరహా భవనాలు నిర్మించబడుతున్నాయి. పురాతన సంప్రదాయాలను ప్రతిబింబుస్తున్న పలు నిర్మాణాలు ప్రస్తుతం దీనావస్థలో ఉన్నాయి.

విద్య

[మార్చు]

రోహ్‌తక్ నగరంలో " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు రోహ్‌తక్ " ఉంది. 1976లో రోహ్‌తక్ నగరంలో " మహర్షి దయానంద్ యూనివర్శిటీ " స్థాపించబడింది. రోహ్‌తక్ నగరంలో వైవిధ్యమైన పలు తరహా విద్యలను అందిస్తున్న 22 కాలేజీలు ఉన్నాయి. నగరంలో 4 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 పాలిటెక్నిక్ ఇంస్టిట్యూషన్లు ఉన్నాయి. సమీపకాలంలో స్థాపించబడిన పలు సంస్థలు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి.ఇ.డి విద్యను అందిస్తున్నాయి. జిల్లాలో బి.డి.ఎస్ మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. ఇది ఎం.బి.బి.ఎస్, బి.డి.ఎస్, ఇతర వైద్య సంబంధిత విద్యను అందిస్తుంది.

పాఠశాలలు

[మార్చు]

జిల్లాలో మోడెల్ స్కూల్, పఠానియా పబ్లిక్ స్కూల్, డి.ఎ.వి పబ్లిక్ స్కూల్, బాబా మస్త్ నాథ్ పబ్లిక్ స్కూల్, ఎస్.ఆర్.ఎస్ పబ్లిక్ స్కూల్, ఐ.బి స్కూల్, ఇండస్ పబ్లిక్ స్కూల్, స్కాలర్స్ రోసరీ పబ్లిక్ స్కూల్, ఎం.డి.ఎన్ పబ్లిక్ స్కూల్, విద్యాభవన్ సీనియర్ సెకండరీ స్కూల్, కిడ్జీ స్కూల్, వికల్ప్ పబ్లిక్ స్కూల్, శిక్షా భారతీ సీనియర్ సెకండరీ స్కూల్, డి.జి.వి స్కూల్, ది సంస్కృతి స్కూల్ వంటి పలు పాఠశాలలు ఉన్నాయి. అంతేకాక గోయంకా పబ్లిక్ స్కూల్, శ్రీ రాం పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి పాఠశాలలు సరికొత్తగా స్థాపించబడుతున్నాయి. ఇవన్నీ ఢిల్లీ లోని అత్యున్నత పాఠశాలలకు శాఖలుగా ఉన్నాయి.

ప్రయాణవసతులు

[మార్చు]

రోహ్‌తక్ జిల్లా సమీప నగరాలు, పట్టణాలతో రహదార్లు, రైలు మార్గాలతో అనుసంధానించబడి ఉంది. జిల్లా కేంద్రం దేశరాజధాని ఢిల్లీకి 70కి.మీ దూరంలో ఉంది. జాతీయరహదారి 71 పలు ప్రధాన వ్యాపార కూడళ్ళతో వేలాది వాహనాల ప్రయాణానికి అనుకూలంగా ఉంది.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Government to set up Japanese township in Rohtak". The Times Of India. 2010-11-11. Archived from the original on 2012-09-26. Retrieved 2014-08-25.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567