కురుక్షేత్ర జిల్లా
కురుక్షేత్ర జిల్లా | |
---|---|
దేసం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | కురుక్షేత్ర |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,530 కి.మీ2 (590 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 9,64,655 |
• జనసాంద్రత | 630/కి.మీ2 (1,600/చ. మై.) |
• Urban | 26.10 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.31 |
Time zone | UTC+05:30 (IST) |
Website | http://kurukshetra.gov.in/ |
హర్యానా రాష్ట్రంలోని 22 జిల్లాల్లో కురుక్షేత్ర జిల్లా ఒకటి. హిందువులకు పవిత్ర స్థలమైన కురుక్షేత్ర పట్టణం ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. జిల్లా విస్తీర్ణం 1,530 చ.కి.మీ. 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 9,64,655. ఈ జిల్లా అంబాలా రెవెన్యూ విభాగంలో భాగం. కురుక్షేత్రం, శ్రీమద్ భగవద్గీత ఉద్భవించిన భూమి కూడా. కురుక్షేత్ర లోని జ్యోతిసార్‌లో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడని భావిస్తారు.
పేరు మూలం
[మార్చు]ఈ జిల్లా పేరు పురాతన ప్రాంతం కురుక్షేత్రం నుండి వచ్చింది. అంటే కురుల భూమి అని అర్ధం. మహాభారతంలో వివరించిన కురుక్షేత్ర యుద్ధం ఇక్కడే జరిగింది. శ్రీ కృష్ణుడు యుద్ధానికి ముందు అర్జునుడికి భగవత్గీతను బోధించినది ఇక్కడే.
చరిత్ర
[మార్చు]1973 లో పూర్వపు కర్నాల్ జిల్లా నుండి ఈ జిల్లాను ఏర్పరచారు. తరువాత కైతల్, యమునా నగర్ జిల్లాలను ఏర్పాటు చేసినపుడు ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడదీసి వాటిలో కలిపారు.
అంతర్జాతీయ గీతా మహోత్సవం
[మార్చు]కురుక్షేత్ర కేవలం మహాభారత భూమి మాత్రమే కాదు, ఇది కృష్ణుడు అర్జునుడికి జీవన కర్మ తత్వాలను బోధించిన భూమి కూడా. 5000 సంవత్సరాలుగా, శ్రీమద్ భగవద్గీత మతాలు వర్గాల కతీతమైన గ్రంథంగా ఆవిర్భవించింది. అన్ని యుగాలలోనూ అనుసరణీయమైన నిస్వార్థ కర్మ సందేశాన్ని అందించినందుకు గాను ఇది ప్రపంచవ్యాప్తంగా గౌరవం, ఆరాధన పొందుతోంది
కురుక్షేత్రలో దశాబ్దాలుగా గీతా జయంతిని (గీతోపదేశ జన్మదినం) జరుపుతున్నారు. దీనిని కురుక్షేత్ర ఉత్సవం అని అంటారు. 2016 లో, హర్యానా ప్రభుత్వం దీనికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు నివ్వాలని నిర్ణయించింది. 2016 డిసెంబరు 1 నుండి డిసెంబరు 11 వరకు కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని నిర్వహించింది. సాంప్రదాయిక క్యాలెండరు ప్రకారం డిసెంబరు 10 న గీతా జయంతిని జరుపుకున్నారు. 2016 లో, 10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించారు.[1] 2017 నవంబరు 17 న, 2018 డిసెంబరు 18 న, 2019 డిసెంబరు 8 న అంతర్జాతీయ గీతా మహోత్సవాలు జరిగాయి.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం కురుక్షేత్ర జిల్లా జనాభా 9,64,655.[3] ఇది ఫిజి దేశ జనాభాకు, [4] అమెరికా రాష్ట్రమైన మోంటానాకు సమానం .[5] జనాభా రీత్యా భారతదేశ జిల్లాల్లో ఇది 452 వ అథానంలో ఉంది జిల్లాలో జనసాంద్రత 630/చ.కి.మీ. 2001-2011 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 16.81%. కురుక్షేత్ర జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 889 మంది స్త్రీలున్నారు. అక్షరాస్యత 76.7% ఆఫ్. 2011 జనగణన ప్రకారం, జిల్లా జనాభాలో 81,94% మంది హిందీ మాట్లాడుతారు. 17,47% మందికి పంజాబీ మొదటి భాషగా ఉంది.[6]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 1,75,735 | — |
1911 | 1,58,807 | −9.6% |
1921 | 1,64,560 | +3.6% |
1931 | 1,69,002 | +2.7% |
1941 | 1,97,157 | +16.7% |
1951 | 2,19,455 | +11.3% |
1961 | 3,41,906 | +55.8% |
1971 | 4,65,222 | +36.1% |
1981 | 5,42,423 | +16.6% |
1991 | 6,69,346 | +23.4% |
2001 | 8,25,454 | +23.3% |
2011 | 9,64,655 | +16.9% |
విద్యా సౌకర్యాలు
[మార్చు]కురుక్షేత్ర విశ్వవిద్యాలయం 1956 లో కురుక్షేత్రంలో యూనిటరీ రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. కురుక్షేత్ర లోని ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల 1963 లో స్థాపించారు. తరువాత దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చారు. కురుక్షేత్రలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లను కూడా స్థాపించాఅరు. ఇవి కాకుండా, జ్యోతిసార్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కూడా పేరుగాంచినదే
మూలాలు
[మార్చు]- ↑ Kurukshetra, Kurukshetra Development Board. "International Gita Mahotsav 2016, Kurukshetra, Haryana, India". internationalgitamahotsav2016.com. Archived from the original on 2017-09-14. Retrieved 2017-09-17.
- ↑ http://www.census2011.co.in/census/district/211-kurukshetra.html
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Fiji 883,125 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2013-10-19. Retrieved 2011-09-30.
Montana 989,415
- ↑ 2011 Census of India, Population By Mother Tongue