2009
2009 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. 2009లో స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం, కొద్దిరోజులకే వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించడం, రోశయ్య నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగాయి. అక్టోబరు మొదటివారంలో కృష్ణా, తుంగభద్ర వరదల వలన వందలాది గ్రామాలు, మంత్రాలయం, కర్నూలు లాంటి పట్టణాలు నీటమునిగాయి. జాతీయంగా జరిగిన ముఖ్యపరిణామాలలో కేంద్రంలో మళ్ళీ యు.పి.ఏ.అధికారంలో కొనసాగింది. స్వైన్ ఫ్లూ వ్యాధి దేశమంతటా హడలెత్తించింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను పొందినది. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆమరణ దీక్ష చేపట్టడం, కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేయడం, ఆ తరువాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అల్లర్లు, మళ్ళీ కేంద్రం మాటమార్చడంతో తెలంగాణ పోరాటాల అగ్ని గుండంగా మారింది.
సంఘటనలు
[మార్చు]జనవరి 2009
[మార్చు]- జనవరి 5: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.
- జనవరి 6: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
- జనవరి 9: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మెన్ బి.రామలింగరాజు అరెస్టు.
- జనవరి 9: ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
- జనవరి 9: లోక్‌సత్తా అధ్యక్షుడిగా జయప్రకాశ్ నారాయణ్ ఎన్నికైనాడు.
- జనవరి 16: 2008-09 రంజీట్రోఫిని ముంబాయి జట్టు చేజిక్కించుకుంది.
- జనవరి 31: సోమాలియా అధ్యక్షుడిగా షేక్ షరీఫ్ అహ్మద్ ఎన్నికయ్యాడు.
- జనవరి 31: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్‌కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
ఫిబ్రవరి 2009
[మార్చు]- ఫిబ్రవరి 1:ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన మహేశ్ భూపతి, సానియా మీర్జా జంట విజయం సాధించింది.
- ఫిబ్రవరి 1:ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల టెన్నిస్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాథల్ కైవసం చేసుకున్నాడు.
- ఫిబ్రవరి 9: దులీప్ ట్రోఫి క్రికెట్లో వెస్ట్ జోన్ కైవసం చేసుకుంది.
- ఫిబ్రవరి 9: చండీగఢ్‌లో జరిగిన పంజాబ్ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంటు ఫైనల్లో నెదర్లాండ్స్ భారతజట్టుపై నెగ్గి ట్రోఫీ సాధించింది.
- ఫిబ్రవరి 11: బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా జిల్లూర్ రెహమాన్ ఎంపికయ్యాడు.
- ఫిబ్రవరి 11: జింబాబ్వే ప్రధానమంత్రిగా మోర్గాన్ సాంగిరాయ్ ఎన్నికయ్యాడు.
- ఫిబ్రవరి 23: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్‌కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.
- ఫిబ్రవరి 25: అక్రమ ఆస్తుల కేసులో మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌రాంకు ఢిల్లీ హైకోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది.
- ఫిబ్రవరి 25: బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్ రైఫిల్స్ దళం తిరుగుబాటు. 73 మంది సైనికులు మృతిచెందారు.
మార్చి 2009
[మార్చు]- మార్చి 3: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
- మార్చి 4: భారత ప్రధాన ఎన్నికల అధికారిగా నవీన్ చావ్లాను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేసింది.
- మార్చి 6: న్యూయార్క్‌లో జరిగిన మహాత్మా గాంధీ వస్తువుల వేలంలో విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
- మార్చి 7: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.
- మార్చి 8: ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ ల మైత్రి విచ్ఛిన్నం, ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది.
- మార్చి 11: వన్డే క్రికెట్లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.
- మార్చి 12: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ మదర్ థెరీసా శతజయంతి పురస్కారానికి ఎంపికయ్యాడు.
- మార్చి 13: అమెరికాలో నూతన భారత రాయబారిగా మీరానాయర్ నియామకం ఉత్తర్వు జారీచేయబడింది.
- మార్చి 18: కటక్‌లో జరిగిన దేవధర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటులో ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు ఈస్ట్ జోన్‌పై నెగ్గి 9వ సారి ట్రోఫి చేజిక్కించుకుంది.
- ఏప్రిల్ 12: థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది.
- ఏప్రిల్ 13: మలేషియాలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్మమెంటులో భారత్ 3-1 స్కోరుతో మలేషియాపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.
- ఏప్రిల్ 14: మహీంద్రా గ్రూపునకు చెందిన టెక్ మహీంద్రా సత్యం సాప్ట్వేర్ సంస్థను టేకోవర్ చేసుకుంది.
- ఏప్రిల్ 15: భారతదేశ సార్వత్రిక ఎన్నికలు: దేశవ్యాప్తంగా 124 లోక్‌సభ స్థానాలలో ఎన్నికలు జరిగాయి.
- ఏప్రిల్ 19: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
- ఏప్రిల్ 21: భారతదేశపు ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా నవీన్ చావ్లా బాధ్యతలు చేపట్టాడు.
- ఏప్రిల్ 21: అమెరికాలోని ప్రవాసాంధ్రుల సంఘం (తానా) తదుపరి అధ్యక్షుడిగా తోటకూర ప్రసాద్ ఎన్నికయ్యాడు.
- ఏప్రిల్ 30: 9 రాష్ట్రాల పరిధిలోని 107 లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి.
మే 2009
[మార్చు]- మే 12: మేఘాలయా ముఖ్యమంత్రిగా డి.డి.లపాంగ్ నియమితులయ్యాడు.
- మే 21: జర్మనీ అధ్యక్షుడిగా హర్ట్స్ కొహ్లర్ రెండోసారి ఎన్నికయ్యాడు.
- మే 23: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
- మే 26: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
- మే 28: ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణస్వీకారం.
- మే 28: భారత వైమానిక దళ కొత్త అధిపతిగా వి.వి.నాయక్ బాధ్యతలు చేపట్టాడు.
జూన్ 2009
[మార్చు]- జూన్ 14: ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఎన్నికయ్యాడు.
- జూన్ 15: సంతోష్ ట్రోఫి ఫుట్‌బాల్‌ను గోవా చేజిక్కించుకుంది.
- జూన్ 16: భారత్, రష్యా, చైనాల మధ్య ఏర్పడిన "బ్రిక్" దేశాల తొలి సమావేశం రష్యాలోని ఎకతెరిన్బర్గ్లో నిర్వహించబడింది.
- జూన్ 17: భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అరుణ్ జైట్లీ రాజీనామా చేశాడు.
- జూన్ 19: 32 సంవత్సరముల అనంతరం భారతదేశ ద్రవ్యోల్బణం రుణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది.
- జూన్ 21: ఇండోనేషియా బ్యాడ్మింతన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది.
- జూన్ 23: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి భువనచంద్ర ఖండూరి రాజీనామా.
జూలై 2009
[మార్చు]- జూలై 8: జి-8 దేశాల 35వ శిఖరాగ్ర సమావేశం ఇటలీలోని లాక్విలాలో ప్రారంభమైంది.
- జూలై 12: ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న మెట్రో వంతెన కూలి ఆరుగురు మరణించారు.
- జూలై 15: అలీనోద్యమ 15వ శిఖరాగ్ర సదస్సు ఈజిప్టులో ప్రారంభమైంది.
- జూలై 19: దేశంలో తొలి మహిళా రైలు హౌరా - బెండేల్ల మధ్య ప్రారంభమైనది.
- జూలై 25: జస్టిస్ అమరేశ్వరి భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. [జ.1928]
- జూలై 26: భారతదేశపు తొలి అణుజలాంతర్గామి ఐ.ఎన్.ఎస్.అరిహంత్ విశాఖపట్టణంలో జలప్రవేశం.
ఆగష్టు 2009
[మార్చు]- ఆగష్టు 2: బ్రిటన్ పౌరసత్వం పొందడానికి నివాసకాల వ్యవధిని గతంలో ఉన్న 5 సం.ల నుంచి 10 సం.లకు పెంచారు.
- ఆగష్టు 4: భారతదేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది.
- ఆగష్టు 5: టర్కీ అధ్యక్షుడిగా మహ్మద్ అలీ సహేన్ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకొంది.
- ఆగష్టు 7: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మార్గరేట్ ఆల్వా ప్రమాణస్వీకారం.
- ఆగష్టు 10: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి.
- ఆగష్టు 10: పంజాబ్ ఉప-ముఖ్యమంత్రిగా సుఖ్బీర్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.
- ఆగష్టు 11: భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్‌గా సి.రంగరాజన్ నియమించబడ్డాడు.
- ఆగష్టు 12: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా వీక్షించగలిగే సాంకేతిక పరిజ్ఞానం 'భువన్'ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
- ఆగష్టు 13: ఇండియన్ క్రికెట్ లీగ్ ఆటగాళ్ళు ఐపిఎల్‌లో ఆడడానికి బిసిసిఐ అంగీకరించింది.
- ఆగష్టు 15: భారత విప్లవ వీరుడు భగత్ సింగ్ 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఆవిష్కరించబడింది.
- ఆగష్టు 30: చైనీస్ గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ జోడిగా దిజు, గుత్తాజ్వాలా రికార్డు సృష్టించారు.
- ఆగష్టు 31: నెహ్రూ కప్ ఫుట్‌బాల్‌ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో సిరియాను 6-5 గోల్స్ తేడాతో ఓడించింది.
- ఆగష్టు 31: భారత నౌకాదళ ప్రధానాధికారిగా నిర్మల్ వర్మ పదవీ బాధ్యతలు చేపట్టాడు.
సెప్టెంబర్ 2009
[మార్చు]- సెప్టెంబర్ 2: హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహా ఐదుగురు మరణించారు.
- సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.
- సెప్టెంబర్ 8: ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ కైవసం చేసుకున్నాడు.
- సెప్టెంబర్ 15: తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.
- సెప్టెంబర్ 15: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నూతన డైరెక్టర్‌గా జపాన్‌కు చెందిన యుకియా అమనో నియామకం.
- సెప్టెంబర్ 23: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
- సెప్టెంబరు 24: జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ప్రారంభమైనది.
- సెప్టెంబర్ 27: పిట్స్‌బర్గ్‌లో జి-20 సమావేశాలు జరిగాయి.
- సెప్టెంబర్ 30: జర్మనీ ఛాన్సలర్‌గా వరుసగా రెండోసారి ఏంజెలా మెర్కెల్ ఎన్నిక.
- సెప్టెంబర్ 30: రెండు దశాబాదలుగా కొనసాగుతున్న బోఫోర్స్ కుంభకోణం కేసును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
అక్టోబరు 2009
[మార్చు]- అక్టోబరు 2: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయంలతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
- అక్టోబరు 3: కృష్ణానది వరదల వలన కృష్ణా, గుంటూరు జిల్లాలలోని వందలాది గ్రామాలు నీటమునిగాయి.
- అక్టోబరు 3: 2016 ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి బ్రెజిల్ పట్టణం రియో-డిజనీరో హక్కులను పొందినది.
- అక్టోబరు 6: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్‌ను వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది.
- అక్టోబరు 10: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి అధ్యక్షుడిగా జాక్వస్ రోగే తిరిగి ఎన్నికయ్యాడు.
- అక్టోబరు 12: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక సంఘ అర్హత నియమాలను సడలిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
- అక్టోబరు 19: భారతదేశంలోనే అతిపొడవైన ఫ్లైఓవర్ హైదరాబాదులో ప్రారంభమైనది.
- అక్టోబరు 22: మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది.
- అక్టోబరు 25: ఇస్రో అధిపతిగా కె.రాధాకృష్ణన్ నియమించబడ్డాడు.
నవంబర్ 2009
[మార్చు]- నవంబర్ 7: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అశోక్ చవాన్ ప్రమాణస్వీకారం చేశాడు.
- నవంబర్ 14: భారత హాకీ జట్టు కెప్టెన్‌గా రాజ్యపాల్ సింగ్ నియమించబడ్డాడు.
- నవంబర్ 20: ఫిలిప్పీన్స్ అధ్యక్షురాలు గ్లోరొయో అరోయో రాజీనామా.
- నవంబర్ 21: అసోం, త్రిపుర గవర్నర్లుగా జె.బి.పట్నాయక్, డి.వై.పాటిల్ నియమితులయ్యారు.
- నవంబర్ 27: భారత క్రికెట్ జట్టు 100వ టెస్టు విజయం సాధించింది.
- నవంబర్ 27: గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధిమ్చిన పార్టీగా అవతరించింది.
డిసెంబర్ 2009
[మార్చు]- డిసెంబర్ 5: గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌గా బండ కార్తీక్ రెడ్డి నియమించబడింది.
- డిసెంబర్ 6: టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్‌లో భారత్ తొలిసారి మొదటి ర్యాంకు సాధించింది.
- డిసెంబర్ 7: రుమేనియా అధ్యక్షుడిగా ట్రాయియెన్ బాసెస్కూ విజయం సాధించాడు.
- డిసెంబర్ 8: డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది.
- డిసెంబర్ 8: భారత పర్యావరణ రాయబారిగా మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఎన్నికయ్యాడు.
- డిసెంబర్ 10: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది.
- డిసెంబర్ 11: అసోం గవర్నర్‌గా జె.బి.పట్నాయక్ నియమించబడ్డాడు.
- డిసెంబర్ 12: 2009-ప్రపంచ సుందరిగా జిబ్రాల్టర్కు చెందిన ఆల్డోరినో ఎంపికైనది.
- డిసెంబర్ 12: 36వ మహిళల జాతీయ ప్రిమియర్ చదరంగం టైటిల్‌ను ద్రోణవల్లి హారిక సాధించింది.
- డిసెంబర్ 13: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను భారత ఫుట్‌బాల్ జట్టు కైవసం చేసుకుంది.
- డిసెంబర్ 15: వన్డే క్రికెట్లో 414/7 పరుగులు చేసి భారత క్రికెట్ జట్టు అత్యధిక పరుగుల రికార్డును అధికమించింది.
- డిసెంబర్ 15: ప్రపంచ చదరంగం చాంపియన్‌షిప్‌ను రష్యాకు చెందిన బోరిస్ గెల్పాండ్ గెలుచుకున్నాడు.
- డిసెంబర్ 15: ఐక్యరాజ్య సమితి పర్యావరణ దూతగా కెన్యాకు చెందిన పర్యావరణవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వంగరి మాతై ఎంపికైనది.
- డిసెంబర్ 19: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు.
- డిసెంబర్ 23: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేస్తూ డిసెంబర్ 10న చేసిన వ్యాఖ్యలను కేంద్రం వెనక్కి తీసుకుంది.
- డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.
- డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి గవర్నర్‌గా ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణస్వీకారం చేశాడు.
- డిసెంబర్ 30: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.
మరణాలు
[మార్చు]- జనవరి 1: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవులలో ఒకరు. (జ.1947)
- జనవరి 6: జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి జీ.ఎం.షా.
- జనవరి 28: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910)
- జనవరి 31: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన హాస్యనటుడు, రంగస్థల నటుడు (జ.1933).
- ఫిబ్రవరి 1: భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు రణబీర్ సింగ్ హుడా
- ఫిబ్రవరి 19: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి (జ. 1920)
- ఫిబ్రవరి 24: సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్.మోహన్.
- మార్చి 11: గాంధేయవాది, వినోబా భావే సన్నిహితురాలైన విమలా థాకర్.
- మార్చి 11: కె.ఎన్.వై.పతంజలి, తెలుగు రచయిత. (జ.1952)
- మార్చి 22: తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. (జ. 1923)
- ఏప్రిల్ 24: చరిత్రకారుడు ఏ.కె.కులకర్ణి
- ఏప్రిల్ 24: శాస్త్రవేత్త, వయాగ్రా రూపకర్త రాబర్ట్ ఫర్స్గాట్.
- ఏప్రిల్ 26: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్.
- ఏప్రిల్ 27: హిందీ సినిమా నటుడు ఫిరోజ్ ఖాన్.
- ఏప్రిల్ 29: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (జ.1929)
- మే 12: గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1915)
- మే 17: ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్.
- మే 25: రచయిత్రి ఓగేటి సత్యవాడ ఇందిరాదేవి.
- జూన్ 7: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939)
- జూన్ 20: సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్.
- జూన్ 25: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (జ.1958)
- జూన్ 25: అసోం గవర్నర్ శివచరణ్ మాధూర్.
- జూన్ 27: ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయశాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి.
- జూలై 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ఆదిలాబాదు జిల్లా నేత గొడం రామారావు.
- జూలై 16: కర్ణాటక సంగీత కళాకారిణి డి.కె.పట్టమ్మళ్.
- ఆగస్టు 24: కన్నెగంటి వేంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడు. [జ. ]
- జూలై 25: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (జ.1928)
- జూలై 28: లీలా నాయుడు, నటీమణి, ప్రపంచ సుందరి. (జ.1940)
- సెప్టెంబర్ 2: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (జ.1949)
- సెప్టెంబర్ 12: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్.
- సెప్టెంబర్ 12: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్.
- సెప్టెంబర్ 22: ఎస్.వరలక్ష్మి, తెలుగు సినిమా నటీమణి, గాయని. (జ.1927)
- అక్టోబరు 7: భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్యారేలాల్ ఖండేల్వాల్.
- అక్టోబరు 9: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హక్కులనేత కె.బాలగోపాల్.
- అక్టోబరు 25: తంగి సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యుడు. (జ. 1931)
- నవంబర్ 17: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1936)
- డిసెంబర్ 3: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)
- డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ మాజీ చేనేత, జౌళిశాఖా మంత్రి, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు పులి వీరన్న.
- డిసెంబర్ 25: అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1912)
- : జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (జ.1911)
అవార్డులు / పురష్కారాలు
[మార్చు]- మ్యాన్ ఆఫ్ బుకర్ అంతర్జాతీయ పురస్కారం: ఎలిన్ మన్రో (కెనడా)
- ఇందిరాగాంధీ శాంతిబహుమతి: ఎల్ బదారీ.
- విశిష్ట హిందీ సేవా సమ్మాన్: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
- బుకర్ బహుమరి: హిలరీ మాటెల్ (బ్రిటన్ రచయిత్రి)
నోబెల్ బహుమతులు
[మార్చు]- శాంతి: బరాక్ ఒబామా.
- అర్థశాస్త్రం: ఇలినార్ ఆస్ట్రమ్, ఆలివర్ విలియంసన్.
- సాహిత్యం: హెర్టా ముల్లర్.
- రసాయనశాస్త్రం: వెంకటరామన్ రామకృష్ణన్, థామస్-ఏ-స్టీల్జ్, అడా-ఇ-యోమత్.
- భౌతికశాస్త్రం: చార్లెస్-కె-కావొ, విల్లార్డ్-ఎస్-బాయిల్, జార్జి-ఇ-స్మిత్.
- వైద్యం: ఎలిజబెత్ బ్లాక్బర్న్, కరోల్ గ్రీడర్, జాక్ జోస్టక్.