కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ
Appearance
కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ నిరసన కవులలో[1] ఒకడిగా ప్రసిద్ధుడు, సహజత్వాన్ని పోషిస్తూనే సాహిత్యానికి కొత్తదనాన్ని తెచ్చిన కవి, వృత్తి రీత్యా నిజాయితీపరుడుగా రిటైర్ అయిన విద్యుత్ శాఖ డివిషనల్ ఇంజనీర్, రాజమండ్రి సమీపాన కోరుకొండ మండలం అచ్చుతాపురం గ్రామం లో 1947, డిసెంబర్ 31న కొత్తపల్లి నారాయణ దాసు, ఆళ్వారమ్మ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులిద్దరూ ఆంధ్ర వాల్మీకి శ్రీ వావిలికొలను సుబ్బారావు ( వాసుదాస ) స్వామి వారి శిష్యులు, వాసుదాస స్వామి ఆధ్యాత్మిక, సాహిత్య ప్రభావం ఈ కుటుంభం ఫై అప్పటికే సుదీర్ఘం గా ఉంది.
రచనలు
[మార్చు]- వెలుతురు పిట్టలు (1974)
పిట్టల్లా , పిట్టల గొంతులు వీడిన పాటల్లా, పాటలు చేరిన గాలుల్లా, ఎగిరే స్వేచ్ఛ నా జీవితేచ్చ ****** శిలువెక్కగలిగిన వాడే సింహాసనానికి అర్హుడు ****** చివరినుంచి మొదలుకు నడిచిన నాకు చివరవతల ఏముందో చెప్పేదెవరూ ? హై స్కూల్ లో కలం పట్టినప్పటికీ, ఈ పద చిత్రాల్ని కాకినాడ లో మహా కవి ఆవంత్స సోమసుందర్ గురువుగారయిన భాగ్యంతో సృజించాడు. ఇంజనీరింగ్ తో పాటూ "వెలుతురు పిట్టల"కు రెక్కలు వచ్చాయి. గురువు గారి సుదీర్ఘ పరిచయం ( 60 పేజీలకు పైగా ముందుమాట ) తో కావ్యం ప్రచురణ అయ్యింది. అవార్డులను గెలవటమే కాక, మహా కవి ఆరుద్ర "సమగ్ర ఆంధ్ర సాహిత్యం" లోనూ, ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు (USA ) గారి Hibiscus on the Lake: Twentieth-Century Telugu Poetry from India లో స్థానం పొందింది.
- అక్షరంలో అంతరిక్షం (1995)
- స్వస్థాన మిత్రుడు
- వామన విశ్వం
పురస్కారాలు
[మార్చు]- నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం - వెలుతురు పిట్టలు గ్రంథానికి
- ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం - వెలుతురు పిట్టలు గ్రంథానికి
- తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం - అక్షరంలో అంతరిక్షం గ్రంథానికి
మూలాలు
[మార్చు]- ↑ Velcheru Narayana Rao (2003). Hibiscus on the Lake: Twentieth-century Telugu Poetry from India. Univ of Wisconsin Press. pp. 260–261. ISBN 978-02-991-7704-1. Retrieved 15 April 2015.