సెప్టెంబర్ 27
స్వరూపం
సెప్టెంబర్ 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 270వ రోజు (లీపు సంవత్సరములో 271వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 95 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1821: మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది.
- 1962: రేచెల్ కార్సన్ రచించిన పర్యావరణ విజ్ఞాన పుస్తకం సైలెంట్ స్ప్రింగ్ వెల్వడించబడింది. ఈ పుస్తకం పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల కలిగే పర్యావరణ హానిని ప్రపంచానికి తెలియజేసింది.
- 1989: భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి పృథ్విని రెండవసారి విజయవంతంగా ప్రయోగించారు.
- 1998: గూగుల్ తన పుట్టిన రోజుని ఈ రోజుగా పేర్కొంది.
- 2002: జూల అనే సెనెగల్ ఓడ, గాంబియా తీరం దగ్గర బోల్తా కొట్టడంతో సుమారు 1900 మంది (టైటానిక్ కంటే ఎక్కువ మంది) మరణించారు.
- 2008: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
- 2008: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు.
- 2013: భారతదేశంలోని ముంబైలో భవనం కూలిన తర్వాత 60 మంది మరణించారు.
- 2018: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం 158 సంవత్సరాల పాత నిబంధన, సెక్షన్ 497, వివాహేతర సంబంధం చట్టవిరుద్ధం, ఎందుకంటే ఇది మహిళల పట్ల వివక్షతో కూడుకున్నది.
- 2020: వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్‌ల మధ్య భారీ ఘర్షణ చెలరేగి 2020 నవంబరు దాకా కొనసాగింది.
జననాలు
[మార్చు]- 1873: విఠల్ భాయ్ పటేల్, శాససభ్యుడు ఇంకా రాజకీయ నేత.
- 1898: కుందూరి ఈశ్వరదత్తు, పాత్రికేయుడు. ది లీడర్ ఆంగ్ల దినపత్రిక ప్రధాన సంపాదకుడు. (మ.1967)
- 1909: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు. (మ.1969)
- 1915: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (మ.2012).
- 1924: పరవూర్ గోవిందన్ దేవరాజన్, ఒక భారతీయ సంగీత స్వరకర్త.
- 1924: సంధ్య (వేదవల్లి) తెలుగు,తమిళ, చిత్రాల నటి. ఈమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తల్లి . (1971).
- 1926: గరికపాటి వరలక్ష్మి జన్మించారు. ఈమె ప్రముఖ తెలుగు, తమిళ నటి, గాయని ఇంకా దర్శకురాలు.
- 1932: యష్ చోప్రా జన్మించారు. ఈయన హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ దర్శకుడు ఇంకా చిత్ర నిర్మాత.
- 1933: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు. (మ.2009)
- 1936: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2009)
- 1953: మాతా అమృతానందమయి, మానవతా కార్యక్రమాల ద్వారా ఆమె పేరొందారు.
- 1955: మహేష్ మహదేవన్, సంగీత దర్శకుడు (మ.2002)
- 1958: సుజన్ ఆర్. చినోయ్, మాజీ భారత దౌత్యవేత్త ప్రస్తుత మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
- 1961: మాథ్యూ టి. థామస్, భారతీయ రాజకీయవేత్త ఇంకా శాసనసభ సభ్యుడు.
- 1968: రాహుల్ దేవ్ భారతీయ సినీ నటుడు ఇంకా మాజీ మోడల్.
- 1974: రక్షందా ఖాన్, భారతీయ మోడల్, టెలివిజన్ నటి ఇంకా యాంకర్..
- 1984: గాయత్రి జయరామన్, తమిళ, తెలుగు, కన్నడ,మలయాళ చిత్రాల నటి.
మరణాలు
[మార్చు]- 1719: జార్జ్ స్మాల్రిడ్జ్, బ్రిస్టల్ ఇంగ్లీష్ బిషప్. (జ.1662)
- 1833: రాజా రామ్మోహన రాయ్, భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు (జ.1772).
- 1933: కామిని రాయ్, బెంగాలీ కవియత్రి, సామాజిక కార్యకర్త ఇంకా బ్రిటిష్ భారతదేశపు స్త్రీవాది. (జ.1864)
- 1939: దాసు విష్ణు రావు, న్యాయవాది. (జ.1876)
- 1972: షియాలి రామామృత రంగనాథన్, భారతదేశానికి చెందిన లైబ్రేరియన్ ఇంకా గణిత శాస్త్రవేత్త. (జ.1892)
- 1996: నజీబుల్లా, అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు (జ.1947).
- 1997: మండలి వెంకటకృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (జ.1926).
- 2001: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి (జ.1920).
- 2004: శోభ గుర్టు, తేలికపాటి హిందుస్తానీ శాస్త్రీయ శైలిలో భారతీయ గాయని. (జ.1925)
- 2009: రమేష్ బాలశేఖర్, దివంగత శ్రీ నిసర్గదత్త మహారాజ్ శిష్యుడు ఇంకా అలాగే ప్రఖ్యాత అద్వైత మాస్టర్. (జ.1917)
- 2020: జస్వంత్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు (జ.1938)
పండుగలు , జాతీయ/దినాలు
[మార్చు]- ప్రపంచ పర్యాటక దినోత్సవం: 1980 నుండి సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినంగా United Nations World Tourism Organization (UNWTO) ప్రకటించింది. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణిస్తారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 27
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 26 - సెప్టెంబర్ 28 - ఆగష్టు 27 - అక్టోబర్ 27 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |