యష్ చోప్రా
యష్ చోప్రా | |
---|---|
జననం | యశ్ రాజ్ చోప్రా 1932 సెప్టెంబరు 27 |
మరణం | 2012 అక్టోబరు 21 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 80)
జాతీయత | భారతీయుడు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1959–2012 |
యష్ రాజ్ ఫిల్మ్స్ | |
జీవిత భాగస్వామి | పమేలా సింగ్ (m. 1970) |
పిల్లలు | |
సన్మానాలు | పద్మభూషణ్ పురస్కారం (2005) |
సంతకం | |
దస్త్రం:YashChopraSignature.svg |
యష్ రాజ్ చోప్రా (పంజాబీ: ਯਸ਼ ਰਾਜ ਚੋਪੜਾ; హింది: यश राज चोपड़ा) (27 సెప్టెంబరు 1932 – 21 అక్టోబరు 2012) [3] భారతీయ హిందీ సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత.[4] ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర (1961) ఆయన రెండో సినిమా.
ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సోదరులు ఇద్దరూ కలసి 1950, 60 దశకల్లో మరిన్ని సినిమాలు చేశారు. వక్త్ (1965) సినిమా హిట్ కావడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందడంతో యష్ చోప్రాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.
1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్: ఎ పోయం ఆఫ్ లవ్ (1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. అమితాబ్ బచ్చన్ కెరీర్ నిలబెట్టిన దీవార్ (1975) సినిమా, కభీ కబీ (1976), త్రిశూల్ (1978) వంటి హిట్లు అందుకున్నారు.
70వ దశకం చివరిభాగం నుండి 1989 వరకు యష్ ఎన్నో వైఫల్యాలను రుచి చూశారు. ఈ సమయంలో ఆయన నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన దూస్రా ఆద్మీ (1977), మషాల్ (1984), ఫాస్లే (1985), విజయ్ (1988) వంటి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 1989లో ఆయన తీసిన చాందినీ సినిమా మంచి మ్యూజికల్ హిట్టే కాదు, కమర్షియల్ గా విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందికొంది.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]27 సెప్టెంబరు 1932న పాకిస్థానీ పంజాబ్ లోని లాహోర్ లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మిచారు.[5][7][8] ఆయన తండ్రి బ్రిటిష్ పంజాబ్ పరిపాలన సంస్థ పిడబ్ల్యూడి డివిజన్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారు. 8మంది సంతానంలో యష్ ఆఖరివారు.[9] ప్రముఖ దర్శకుడు బి.ఆర్.చోప్రా ఆయన అన్నదమ్ముల్లో ఒకరు. యష్ జోహర్ భార్య, కరణ్ జోహర్ తల్లి అయిన హిరూ జోహర్ ఆయన అక్కాచెల్లెళ్ళలో ఒకరు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1970 లో ఆయన ప్రమీలా సింగ్ ను పెళ్ళి చేసుకున్నారు. ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా వీరి కుమారులు[5] ఆదిత్య కూడా సినిమా దర్శకుడు, నిర్మాతే. యష్ రాజ్ ఫిలింస్ కు వైస్ చైర్మన్, జనరల్ మేనజర్ గా వ్యవహరిస్తున్నారు. ఉదయ్ ముందు సహాయ దర్శకునిగా పనిచేసినా, 2000లో అన్న తీసిన మొహొబ్బతే సినిమాతో నటునిగా మారారు.[10]
మరణం
[మార్చు]21 అక్టోబరు 2012న డెంగీ జ్వరంతో మరణించారు.
అవార్డులు
[మార్చు]- జాతీయ ఉత్తమ చిత్రం (నిర్మాత)
- 1961, ధర్మపుత్ర సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రం
- 1990, చాందినీ చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
- 1994, దార్ చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
- 1996, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
- 1998, దిల్ తో పాగల్ హై చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
- 2005, వీర్-జారా చిత్రానికి జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్
- ఫిలింఫేర్ అవార్డులు
- 1965, వక్త్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
- 1969, ఇత్తెఫక్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
- 1973, దాగ్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
- 1975, దీవార్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
- 1991, లమ్హే సినిమా ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం
- 1995, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
- 1997, దిల్ తో పాగల్ హై సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
- 2004, వీర్-జారా సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం
- 2006, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
- 2007, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
- 2008, ఫిలింఫేర్ పవర్ పురస్కారం
- 2013, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం
అప్సర అవార్డులు
- 2008, ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమా
- 2008, చక్ దే ఇండియా చిత్రానికి అప్సరా ఉత్తమ చిత్రం పురస్కారం
ఐఫా (ఐఐఎఫ్ఎ అవార్డులు)
- 2005, వీర్-జారా సినిమాకు ఐఫా ఉత్తమ దర్శకుడు పురస్కారం
- 2005, వీర్-జారా సినిమాకు ఐఫా ఉత్తమ చిత్రం పురస్కారం
- 2008, చక్ దే ఇండియా సినిమాకు ఉత్తమ చిత్రం పురస్కారం
సినిమాలు
[మార్చు]నిర్మాతగా..
[మార్చు]
|
|
|
|
దర్శకునిగా...
[మార్చు]సంఖ్య | చిత్రం | సంవత్సరం |
---|---|---|
1 | ధూల్ కా ఫూల్ | 1959 |
2 | ధర్మపుత్ర | 1961 |
3 | వక్త్ | 1965 |
4 | ఆద్మీ ఔర్ ఇన్సాన్ | 1969 |
5 | ఇట్టెఫాక్ | 1969 |
6 | దాగ్:ఎ పోయెం ఆఫ్ లవ్ | 1973 |
7 | జోషిలా | 1973 |
8 | దీవార్ | 1975 |
9 | కభీ కభీ | 1976 |
10 | త్రిశూల్ | 1978 |
11 | కాలా పత్తర్ | 1979 |
12 | సిల్సిలా | 1981 |
13 | మషాల్ | 1984 |
14 | ఫాస్లే | 1985 |
15 | విజయ్ | 1988 |
16 | చాందినీ | 1989 |
17 | లమ్హే | 1991 |
18 | పరంపరా | 1992 |
19 | దర్ర్ | 1993 |
20 | దిల్ టు పాగల్ హై | 1997 |
21 | వీర్-జారా | 2004 |
22 | జబ్ తక్ హై జాన్ | 2012 |
References
[మార్చు]- ↑ Morefield, Jeanne (1 April 2014). Empires Without Imperialism: Anglo-American Decline and the Politics of Deflection. Oxford University Press. ISBN 9780199387250. Retrieved 13 September 2016 – via Google Books.
- ↑ Bowen, H. V.; Mancke, Elizabeth; Reid, John G. (31 May 2012). Britain's Oceanic motherchodw antic and Indian Ocean Worlds, C.1550-1850. Cambridge University Press. ISBN 9781107020146. Retrieved 13 September 2016 – via Google Books.
- ↑ "The Life and Times of Yash Chopra". India Times. Retrieved 28 October 2012.
- ↑ Tejaswini Ganti (24 August 2004). Bollywood: A Guidebook to Popular Hindi Cinema. Psychology Press. pp. 101–. ISBN 978-0-415-28853-8. Retrieved 29 October 2012.
- ↑ 5.0 5.1 5.2 "The life and times of Yash Chopra". Pune Mirror. 22 October 2012. Archived from the original on 13 డిసెంబరు 2013. Retrieved 29 October 2012.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Face of romance in Bollywood: Iconic filmmaker Yash Chopra's five-decade long illustrious career
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Rachel Dwyer (1 July 2002). Yash Chopra. British Film Institute. p. 13. ISBN 978-0-85170-874-4. Retrieved 31 October 2012.
- ↑ End of a Love Story India Today- November 5, 2012
- ↑ "Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn". India Today. 22 October 2012. Archived from the original on 25 అక్టోబరు 2012. Retrieved 28 October 2012.
{{cite news}}
: Cite has empty unknown parameter:|1=
(help) - ↑ name=Ganti2004
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Yash Chopra honoured with the title of Ambassador of Interlaken
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Yash Chopra honored with the title of 'Ambassador of Interlaken'". Bollywood Hungama. Retrieved 29 October 2012.
- మూలాల లోపాలున్న పేజీలు
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1932 జననాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు