ఆదిత్య చోప్రా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆదిత్య చోప్రా (జననం 21 మే 1971) ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత, స్ర్కీన్ రచయిత, బ్రాడ్ కాస్ట్ నిర్మాత, పంపణీదారు.[1] ఈయన దర్శకత్వం వహించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే) (తెలుగులో ప్రేమించి పెళ్ళాడుతా (1995) ), మొహొబ్బతే (2000), రబ్ నే బనాదీ జోడీ (2008), బేఫికర్ (2016)  వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.[2][3]

45ఏళ్ల చరిత్ర కలిగిన యశ్ రాజ్ ఫిలింస్ కు చైర్మన్ ఆదిత్య. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన వీర్-జారా (2004), ఫనా (2006), బ్యాండ్ బాజా బారాత్ (2010), ఎక్ థా టైగర్ (2012), జబ్ తక్ హై జాన్ (2012), ధూమ్ 3 సిరీస్ లు (2004, 2006, 2013), సుల్తాన్ (2016) వంటి సినిమాలు కమర్షియల్ గానూ, విమర్శనాత్మకంగానూ హిట్ అయ్యాయి. కమర్షియల్ సినిమాలే కాక, కాబూల్ ఎక్స్ ప్రెస్ (2006), చక్ దే ఇండియా (2007), రాకెట్ సింగ్ (2009), దం లగే కే హైషా (2015), ఫ్యాన్ (2016) వంటి ఆఫ్ బీట్ సినిమాలు కూడా తీశారు ఆయన. దర్శకులు, నిర్మాతలు, రచయితల సారథ్యంలో నడిచే మోడల్ ఫిలిం స్టుడియోలకు తెర తీసిన మొట్టమొదటి భారతీయ నిర్మాత ఆదిత్య.[4] ఎక్కువ నిర్మాణం, పోస్ట్-ప్రొడక్షన్ పనులన్నీ యశ్ రాజ్ ఫిలింస్ స్టుడియోలోనే జరిగిపోతాయి. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఆదిత్య పనిచేస్తారు.[5]  అతి ఎక్కువ సంవత్సరాలు ఆడిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా భారతీయ సినిమా రంగంలో రెండవ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది. దీనిని ఆదిత్య దర్శకత్వం వహించి, నిర్మించారు.[6] ఈయన తీసిన వాటిలో 8 సినిమాలు 200కోట్లకు పైగా వసూళ్ళు సాధించాయి.[7]

తొలినాళ్ళ జీవితం, చదువు[మార్చు]

యష్ చోప్రా, ప్రమీలా చోప్రాల పెద్ద కుమారుడు ఆదిత్య. ఆయన 21 మే 1971న జన్మించారు. బాంబే స్కాటిష్ స్కూల్ లో మాధ్యమిక విద్య పూర్తి చేశారు ఆయన. హస్సేరామ్ రిజుమల్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్  ఎకనామిక్స్ నుండి డిగ్రీ పట్టా పొందారు ఆదిత్య.[8] 

వివాహం, కుటుంబం[మార్చు]

2009లో భార్య  పాయల్ ఖన్నాతో విడాకులు పొందారు ఆయన. 21 ఏప్రిల్ 2014న నటి రాణీ ముఖర్జీని ఇటలీ లో వివాహం చేసుకున్నారు ఆదిత్య.[9] డిసెంబర్ 2015 లో వీరికి అదిరా చోప్రా అనే ఆడపిల్ల జన్మించింది.[10]

References[మార్చు]