అమితాబ్ బచ్చన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Amitabh Bachchan
Amitabh Bachchan.jpg
జన్మ నామం Amitabh Harivansh Bachchan
జననం (1942-10-11) అక్టోబరు 11, 1942 (వయస్సు: 73  సంవత్సరాలు)
Allahabad, British India
ఇతర పేరు(లు) Big B
క్రియాశీలక సంవత్సరాలు 1969 – present
భార్య/భర్త Jaya Bhaduri (1973 - present)

అమితాబ్ బచ్చన్ హిందీ: अमिताभ बच्चन[2]మూస:IPA2[3], ప్రముఖ భారతీయ నటుడు. 1942 లో అక్టోబర్ 11 న ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. అమితాబ్ తండ్రి అమితాబ్ హరివంశ్ బచ్చన్ ప్రముఖ హిందీ కవి. బిగ్ బి మరియు షెహెన్ షా అని కూడా ప్రజలు పిలుస్తారు. 1970 లో బాలీవుడ్ సినిమా ప్రపంచం లో యాంగ్రీ యంగ్ మాన్ గా ప్రసిద్ధికెక్కారు. భారత సినీ జగత్తులో ప్రముఖునిగా విరాజిల్లుతున్నారు.[1][2]

బచ్చన్ ఎన్నో అత్యుత్తమ అవార్డులను అందుకున్నారు. మూడు జాతీయ సినీ అవార్డులు, పన్నెండు ఫిలిం ఫేర్ అవార్డులుతో పాటు అనేక సన్మాన సత్కారాలను అమితాబ్ తన నట జీవితములో పొందారు. ఎక్కువ సార్లు ఫిలిం ఫేర్ అవార్డుకు ఉత్తమ నటుడు కేటగిరిలో నామినేట్ చేయబడిన నటునిగా రికార్డును సృష్టించారు. నటనతో పాటుగా సినీ నిర్మాత గా, నేపధ్య గాయకునిగా, టి వి యాంకరు గా ఎన్నో రంగాలలో తన ప్రతిభను కనపరిచారు. 1984 నుండి 1987 వరకు భారత పార్లమెంటు సభ్యునిగా పని చేశారు.

1973లో సినీ నటి జయబాధురినితో వివాహం జరిగింది. శ్వేత నంద, అభిషేక్ బచ్చన్ వారి పిల్లలు. అభిషేక్ కూడా ఒక కథానాయకుడు మరియు కథానాయకి అయిన ఐశ్వర్య రాయ్ తో వివాహం జరిగింది.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరం లో హిందూ కుటుంబంలో అమితాబ్ జన్మించారు. తండ్రి డా. హరివంశ్ రాయ్ బచ్చన్ పేరుపొందిన హిందీ కవి, తల్లి తేజీ బచ్చన్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఫైసలాబాద్ కు చెందిన సిక్కు వనిత.[7] హరివంశ్ ఇంక్విలాబ్ జిందాబాడ్ అనే నినాదానికి ఉత్తేజం చెంది, బచ్చన్ కి మొదట ఇంక్విలాబ్ అని పేరు పెట్టాడు. అయితే తరువాత "ఎన్నటికి ఆరని దీపం" అని అర్ధం వచ్చేలా అమితాబ్ అని పేరు పెట్టారు. వీరి అసలు ఇంటి పేరు శ్రీవాత్సవ. ఐతే తండ్రి కలం పేరైన బచ్చన్ నే వీరంతా ఇంటి పేరుగా స్వీకరించారు, ఈ పేరు మీదనే అతను రాసిన అన్ని పుస్తకాలను ప్రచురించారు.

హరివంశ్ సంతానంలో అమితాబ్ మొదటి కుమారుడు కాగా రెండోవారు అజితాబ్. అమితాబ్ తల్లికి నాటకరంగంలో అమితాశక్తి వుండేది. కాని ఆవిడ సినిమాలలో వచ్చిన అవకాశాన్ని వదులుకుని గృహిణి గానే జీవితంలో స్థిరపడ్డారు. అమితాబ్ ను సినీరంగంలో ప్రవేశించి పేరుప్రఖ్యాతలు సంపాధించుకోమని ప్రోత్సాహమిచ్చేవారు[9]. అమితాబ్ అలహాబాద్ జ్ఞానప్రబోధిని బాలుర ఉన్నత పాఠశాల, నైనిటాల్ లోని శ్రేవుద్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆయన కళలపై ఆసక్తిని పెంచుకున్నారు. దిల్లి విశ్వవిద్యాలయానికి చెందిన కిలోరిమల్ కళాశాలలో బాచిలర్ ఆఫ్ సైన్సు విభాగంలో పట్టా పుచ్చుకున్నారు. కలకత్తాలోని(ప్రస్తుతము కోల్కతా అని పిలువ బడుతున్నది) బర్డ్ అండ్ కోలో సరుకు బ్రోకరు గా షిప్పింగు కంపెని లో పనిచేస్తూ, సినిమాల్లో వేషాల కోసం 20 సంవత్సరాల వయస్సులోనే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ముంబై చేరుకున్నారు.

కెరీర్[మార్చు]

ప్రారంభ దశ 1969-1972[మార్చు]

దస్త్రం:AmitabhAnand.jpg
ఆనంద్ లో అమితా బచ్చన్ (1970)[10] [11]

అమితాబ్ తన సినీ జీవితాన్ని 'సాత్ హిందుస్తానీ ' చిత్రం లోని ఏడుగురు ప్రధాన నటులలో ఒకనిగా నటించడం ద్వారా ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ దీనికీ దర్శకత్వం వహించగా ఉత్పల్ దత్, మధు, జలాల్ ఆఘా నటించారు.ఈ సినిమా ఆర్ధికంగా విఫలం చెందినప్పటికీ, అమితాబ్ ను ఉత్తమ నూతన నటునిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.[13]

రాజేష్ ఖన్నాతో, అమితాబ్ కలిసి నటించిన ఆనంద్(1971) సినిమా ఆర్ధికంగా విజయం సాధించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలందుకొంది. ఈ సినిమాలో జీవితాన్ని విషాదంగా తీసుకునే వైద్యునిగా నటించిన అమితాబ్ కు ఉత్తమ సహాయ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. అదే సంవత్సరంలో విడుదలైన పర్వానాలో కొద్దిగా విలనిజం ఉన్న పాత్రలో, భగ్న ప్రేమికునిగా నటించారు. ఈ సినిమాలో బచ్చన్ యోగితా బాలీ, నవీన్ నిశ్చల్, ఓంప్రకాష్ లతో కలిసి నటించారు. ఇదే మూసలో మరి కొన్ని సినిమాలలో, రేష్మా అవుర్ షేరా లో కూడా అమితాబ్ నటించినప్పటికీ అవన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. ఇదే సమయంలో ధర్మేంద్రతో జయబాధురి కలిసి నటిస్తున్న 'గుడ్డీ'(1971) సినిమాలో అమితాబ్ అతిధి పాత్రలో నటించారు. తన సినీ జీవిత ప్రారంభంలోనే అమితాబ్ కి ఉన్న లోతైన మంద్ర స్వరంతో మంచి పేరు తెచ్చుకున్నారు. బావర్చి సినిమాలోని కొంత భాగానికి ఆయన గాత్రం అందించారు. 1972 లో ఎస్. రామనాధం దర్శకత్వం వహించిన యాక్షను చిత్రం బాంబే టు గోవా లో ఒక చిన్న పాత్రను అమితాబ్ పోషించాడు. అరుణా ఇరాని, మొహమ్మద్, అన్వర్ ఆలి, నాసిర్ హుస్సేన్ వంటి నటులు ఆ సినిమాలో నటించారు.

కెరీర్ లో అత్యుత్తమ సమయం: 1973-1983.[మార్చు]

1973 అమితాబ్ సినీ జీవితాన్ని క్రొత్త మలుపు తిప్పింది. అతని కెరీర్లో గొప్ప అభివృద్ధి పదాన్ని చవి చూపింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహిందిన జంజీర్ (1973) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో అమితాబ్ ఇన్స్పెక్టర్ విజయ్ ఖన్నా పాత్రలో నటించారు. అంతవరకు హాస్యరస ప్రధాన పాత్రల్లో నటించిన అమితాబ్ తన ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమాలో కొత్త తరహా పాత్రలో కనిపించారు. ఈ సినిమా తరువాత నుండి బాలీవుడ్ సినిమా [2] లో " యాంగ్రీ యంగ్ మాన్ " అనే క్రొత్త అవతారాన్ని అమితాబ్ ఎత్తారు. అమితాబ్ ప్రధాన పాత్రను పోషించగా బాక్సాఫీసు దగ్గర హిట్ కొట్టిన సినిమా జంజీర్. ఈ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడి విభాగంలో అమితాబ్ కు నామినేషన్ లభించింది. అమితాబ్ 1973 లో జయబాధురిని వివాహమాడటమే కాకుండా ఆమెతో కలిసి జంజీర్, అభిమాన్ వంటి ఎన్నో సినిమాలలో నటించాడు. అందులో కొన్ని వాళ్ళ పెళ్ళయిన నెల రోజుల తరువాత విడుదలై విజయాన్ని సాధించాయి. తరువాత నమక్ హరాం సినిమాలో అమితాబ్ విక్రమ్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా స్నేహం ప్రధాన కథనంగా కొనసాగుతుంది. ఈ సినిమాకు హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, బెరీష్ చటర్జీ స్క్రిప్టు ను అందించారు. రాజేష్ ఖన్నా, రేఖ లతో పాటూ సహాయనటుడిగా అమితాబ్ నటించగా, ఆయనకు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయనటుడిగా అవార్డు లభించింది.

1974 లో రోటీ కపడా జౌర్ మకాన్ సినిమా అత్యధిక వసూళ్ళను సాధించింది. ఈ సినిమాలో బచ్చన్ సహాయనటుడిగా నటించక ముందు దోస్త్ , కున్వరా బాప్ లాంటి సినిమాలలో అతిధి పాత్రలు పోషించారు. ఈ సినిమాను మనోజ్ కుమార్ రచించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ సినిమాను 1974 డిసెంబర్ 6న విడుదల చేశారు. ఈ సినిమా ఆర్ధిక లాభాలతో పాటూ విమర్సకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సినిమాలో అమితాబ్ తో పాటు మనోజ్ కుమార్, శశికపూర్, జీనత్ అమన్ లు పోటీపడి నటించారు. డిసెంబర్ 6, 1974 సంవత్సరంలో విడుదలైన మజ్బూర్ సినిమాలో బచ్చన్ కథానాయకుడుగా నటించారు. జార్జి కెన్నడి నటించిన జిగ్ జాగ్ అనే హాలీవుడ్ చిత్రానికి అనువాదమే మజ్బూర్. ఐతే ఈ సినిమా బాక్సాఫీస్ [3] వద్ద పెద్దగా విజయం పొందలేదు. 1975 లో బచ్చన్ వివిధ కథాంశాలుతో కూడిన చిత్రాలలో నటించారు. హాస్యప్రధానంగా సాగిన చుప్కే చుప్కే , నేరపూరితమైన ఫరార్ , ప్రేమకథా చిత్రమైన మిలీ లాంటి సినిమాల్లో నటించారు. 1975 లో అత్యంత ప్రముఖంగా చెప్పుకునే రెండు సినిమాల్లో నటించారు. యాష్ చోప్రా దర్శకత్వం వహించిన దీవార్ అందులో ఒకటి. ఈ సినిమాలోని నటనకుగానూ అమితాబ్ కు ఫిల్మ్ ఫేర్ ఉత్తమనటుడి అవార్డు దక్కింది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్ద విజయాన్ని నమోదు చేసుకుని 4 వ స్థానం లో నిలిచింది[17]. ఇండియా టైమ్స్ మూవీస్[4] 25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ ఫిల్మ్ జాబితాలో చేర్చారు. ఇదే సంవత్సరంలో 50 వ వార్షిక ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందించే జ్యూరీ దీవార్ ను 50 ఏళ్లలో వచ్చిన ఉత్తమ సినిమా గా నిర్ణయించి అరుదైన గౌరవాన్ని కల్పించారు. ఇదే సంవత్సరం ఆగస్టు 15 న విడుదలైన షోలే సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ అధిగమించి రూ. 2,36,45,00,000 లను సాధించింది. ఈ మొత్తం మిలియన్ అమెరికన్ డాలర్ లతో సమానం[20]. ఈ సినిమాలో ధర్మేంద్రా, హేమామాలినీ, జయబాధురీ, సంజీవ్ కుమార్, అంజద్ ఖాన్ వంటి ప్రముఖులు కూడా నటించారు. 1999 లో బి.బి.సి ఛానెల్ షోలే సినిమాను ఈ శతాబ్దపు మేటి చిత్రంగా ప్రకటించింది. షోలే వంటి సక్సెస్ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఇచ్చిన విజయాలతో అమితాబ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 1976 నుండి 1984 వరకు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అనేక సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడు విభాగంలో పోటీకి నిలిచారు.షోలే వంటి సినిమాల ద్వారా బాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన అమితాబ్ అదే మూస చట్రం లో ఇరుక్కోకుండా వైవిధ్య భరితమైన పాత్రల ద్వారా చరిత్ర సృష్టించారు. ప్రేమ కథా చిత్రమైన కభీ కభీ (1976), వినోదభరితమైన అమర్ అక్బర్ ఆన్టోని (1977), అంతకుముందు చుప్కే చుప్కే (1975) లాంటి సినిమాలలో నటించారు. 1976 లో యాష్ చోప్రా దర్శకత్వం వహించిన రెండో చిత్రమైన కభి కభి లో నటించారు. ఈ చిత్రంలో బచ్చన్ యువకడైన అమితాబ్ మల్హోత్రా పాత్రను పోషించారు. ఇందులో రాఖి గుల్జార్ పోషించిన పూజ పాత్రతో అమితాబ్ గాడంగా ప్రేమలో పడతాడు.ఈ సినిమా లో భావోద్వేగంతో కూడిన సంభాషణలు అమితాబ్ అంతకు ముందు పోషించిన మొరటు పాత్ర లకు భిన్నంగా వుండి జనాలను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీసు విజయాన్ని సాదించడమే కాకుండా మరొక్క సారి అమితాబ్ కు ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డును సాదించిపెట్టింది. 1977 లో నటించిన అమర్ అక్బర్ ఆంథోని చిత్రం ఫిల్మ్ ఫేర్ ఉత్తమనటుడు అవార్డును బచ్చన్ కు సాధించి పెట్టింది. ఈ చిత్రంలో అమితాబ్ ఆంథోని గోన్సాల్పిస్ గా వినోద్ ఖన్నా, రిషికపూర్ లతో కలసి నటించారు. 1978 అమితాబ్ ను ప్రముఖుణ్ణి చేసింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగు చిత్రాలు అమితాబ్ నటించినవే కావడం విశేషం[24]. అమితాబ్ అప్పుడే సినిమాల్లో డ్యుయెల్ రోల్స్ లో నటించడం ప్రారంభించారు. కసమే వాదే సినిమాలో అమిత్, శంకర్ పాత్రలు పోషించారు. డాన్ సినిమాలో అండర్ వరల్డ్ కు చెందిన డాన్ గాను, అదే పోలికలు కలిగిన విజయ్ పాత్రలోనూ కనిపించారు. ఈ చిత్రానికి అమితాబ్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమనటునిగా అవార్డు లభించిది. అమితాబ్ తన నటనతో త్రిశూల్, ముకద్దర్ కా సికందర్ సినిమాల్లో నటించి ఫిల్మ్ ఫేర్ ఉత్తమనటుడి విభాగంలో పోటీకి నిలిచారు. ప్రఖ్యాత ఫ్రాన్స్ దేశపు దర్శకుడు ఫ్రాన్కొఇస్ ట్రఫౌట్[5] అమితాబ్ ను పరిశ్రమలో ఒకే ఒక్కడు(యునీక్) అని అభివర్ణించారు.

1979 లో మొదటిసారిగా అమితాబ్ మిస్టర్ నట్వర్ లాల్ సినిమాలో పాడారు. ఈ సినిమాలో రేఖాకు జోడీగా అమితాబ్ నటించారు. ఈ సినిమాలో నటనలోను, గానంలోనూ ప్రతిభ కనపరచడంతో ఆ సంవత్సరానికి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమనటుడు విభాగంలోనూ, ఉత్తమ నేపధ్య గాయకుడు విభాగంలోనూ పోటీలో చివరి వరకు నిలిచారు అమితాబ్. 1979 లో వచ్చిన కాలా పత్తర్ సినిమాకు కూడా ఉత్తమనటుడిగా నామినేట్ అయ్యారు. రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన దోస్తానా(1980) లో కూడా అమితాబ్ కు ఉత్తమనటుడు అవార్డుకు పోటీలో నిలిచారు. 1980లో విడుదలైన అన్ని సినిమాలకన్నా దోస్తానా ఎక్కువ వసూలు చేసి రికార్డును నెలకొల్పింది. యాష్ చోప్రా నిర్మించిన సిల్ సిలా లో 1980[6] లో అమితాబ్ నటించారు. ఈ సినిమాలో తన భార్య జయబాధురితో పాటుగా ప్రియురాలిగా పుకార్లు సృష్టించిన రేఖా తోను కలసి నటించారు. ఇదే కాలంలో అమితాబ్ మరికొన్ని సినిమాల్లో నటించి విజయం సాధించారు. 1980 లో విడుదలైన రాం బలరాం , షాన్ (1980), లావారిస్ (1981), 1982 లో దిలీప్ కుమార్[7] తో కలిసి శక్తి సినిమాలో నటించారు.

దస్త్రం:Amitabh and Rekha in Silsila.jpg
రేఖ అమితా బచ్చన్ తో కలిసి నటించిన సిసిల్లా 1981[30] [31]

1982[మార్చు]

1982 లో అమితాబ్ కు కూలి సినిమా షూటింగులో ఒక ఫైట్ సన్నివేశంలో ప్రేగులపై గాయం అయింది. ఆ సినిమాలో తన సహనటుడైన పునీత్ ఇస్సార్[33] తో కలసి నటిస్తుండగా ఈ ఘటన జరిగింది. అందులో అమితాబ్ తన సహనటుడు కొట్టిన దెబ్బకు ఒక బల్ల మీద పడి అక్కడ నుండి తిరిగి నేలమీద పడాలి. ఐతే బల్ల మీద పడిన సమయంలో బల్ల తాలూకా ఒక మూల అమితాబ్ పొత్తు కడుపులో గుచ్చుకొంది. దీంతో ఆయన పేగు రాసుకొని రక్తస్రావం జరిగింది. అప్పటికప్పుడే అమితాబ్ కు అత్యవసరంగా స్పీనోక్టమి పరీక్ష నిర్వహించారు. తరువాత అమితాబ్ తీవ్రంగా జబ్బుపడి అనేక నెలల పాటు ఆసుపత్రిలో గడిపారు. ఈ సమయంలో అనేకసార్లు ఆయన మృత్యువుకు దగ్గరగా వెళ్లి వచ్చారు. ప్రజలు అమితాబ్ త్వరగా కోలుకోవాలని గుళ్ళకు, గోపురాలకు వెళ్లి ప్రార్ధించారు. కొంతమందైతే ఏకంగా తమ తమ అవయవాలను సైతం బలిగా సమర్పించారు. ఆయన ఆసుపత్రిలో వున్నపుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అనేక మంది అభిమానులు లైనులో నిలబడి మరీ అమితాబ్ ను పరామర్శించేవారు[35]. చాలాకాలం పాటు ఆరోగ్యం కోసం పోరాడి సంవత్సరపు చివర్లో కూలి సినిమా షూటింగులో అమితాబ్ తిరిగి పాల్గొన్నారు. కూలీ సినిమా 1983 లో విడుదలైంది. అప్పటికే జరిగిన దుర్ఘటన ద్వారా సినిమాకు కావల్సినంత ప్రచారం జరగడంతో ఎట్టకేలకు ఆ సినిమా బాక్సాఫీసు[37] వద్ద ఘన విజయం సాధించింది.

కూలీ దర్శకుడు మన్మోహన్ దేశాయ్ ఆ సినిమా ముగింపును ఒక విధంగా అనుకొన్నప్పటికీ, ప్రమాదం జరిగిన తరువాత దాన్ని మార్చివేశారు. అమితాబ్ పాత్ర ఆ సినిమాలో చనిపోతుందని ముందు ఆ చిత్ర యూనిట్ అనుకున్నారు. కాని సినిమాలో అమితాబ్ ను బ్రతికించారు. దీని గూర్చి దర్శకుడు మన్మోహన్ దేశాయ్ వివరణ ఇస్తూ అమితాబ్ నిజజీవితంలో మృత్యువు నెదిరించి గెలిచి బతికినపుడు సినిమాలో ఆ పాత్రను చంపడం సముచితం కాదని చెప్పారు. ఈ సినిమా తెరమీద ప్రదర్శించినపుడు ప్రమాదం జరిగిన దృశ్యం వచ్చినపుడు కొద్ది సేపు రీలును నిలిపి వేసారు. ఆ దృశ్యం కింద కొన్ని వ్యాఖ్యలను వేశారు. ఎందుకంటే ఈ దుర్ఘటన[8] గూర్చి ముందుగానే బాగా ప్రచారం జరిగింది కాబట్టి ఈ దృశ్యాలను చూపించలేదు.

దీని తరువాత అమితాబ్ మ్యస్తేనియా గ్రేవిస్ అనే నరాల వ్యాధితో బాధపడ్డారు. ఈ జబ్బు అమితాబ్ ను మానసికంగాను, శారీరకంగాను చాల బలహీనపరచింది. దీనివలన అమితాబ్ నట జీవితాన్ని వదలి రాజకీయాలవైపు వెళ్ళాలన్న నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ విధంగా నిరాశావాదానికి గురైన అమితాబ్ ప్రతి సినిమా విడుదల ముందు అది ఎలా ప్రజల చేత స్వీకరించబడుతుందో అని బాధపడేవారు. ప్రతి సినిమా విడుదల ముందు దాని గూర్చి ఎవరైనా అడిగితే నిరాశావాదంతో "ఈ సినిమా ప్లాపవుతుంది!" అని వారికి సమాధానం చెప్పేవాడు.("ఈ సినిమా ప్లాపవుతుంది").[9]

రాజకీయాలు 1984-1987[మార్చు]

1984 లో అమితాబ్ తన నటజీవితాన్ని కొద్దిగా ప్రక్కకు పెట్టి చిరకాల కుటుంబ మిత్రుడైన రాజీవ్ గాంధీకి మద్దతుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలహాబాద్ లోక్ఃసభ స్థానం నుండి అమితాబ్ హెచ్.ఎం.బహుగుణ తో పోటీపడ్డారు. అప్పుడు భారతదేశంలో సాధారణ ఎన్నికల్లో 68.2%[10] ఘన విజయాన్ని సాధించారు. అయితే అమితాబ్ రాజకీయ జీవితం కొద్దికాలం మాత్రమే. మూడు సంవత్సరాల తరువాత రాకీయాలు ఒక మురికిగుంట అని వ్యాఖ్యానించి ఆ పదవికి రాజీనామా చేసారు. ఒక వార్తా పత్రిక బోఫోర్స్ కుంభకోణం లో అమితాబ్, అయన తమ్ముడు అజితాబ్ లు భాగస్వాములని కథనాలను ప్రచురించింది. ఈ విషయమై అమితాబ్ కోర్టుకు వెళ్ళగా,[11] బచ్చన్ సోదరులు నిర్దోషులని, బోఫోర్స్ కుంభకోణం తో వారికి సంబంధం లేదని కోర్టు తీర్పునిచ్చింది.

అమితాబ్ స్థాపించిన ఎ.బి.సి.ఎల్.కంపెనీ నష్టాలను చవిచూసినపుడు తన మిత్రుడు అమర్ సింగ్ అమితాబ్ కు చాలా సహాయపడ్డారు. దీనికి ప్రతిఫలంగా అమితాబ్ అమర్ సింగ్ రాజకీయ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీలలో చేరారు. జయాబచ్చన్ సమాజ్ వాది పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటులో అడుగు పెట్టారు. బచ్చన్ కుటుంబం[45] దీన్ని దృష్టిలో పెట్టుకొని సమాజ్ వాది పార్టీకు సహాయ సహకారాలనందించారు. రాజకీయ ప్రచారంలోను, ప్రకటనల్లోను నటించారు. అయితే ఈ సంఘటనలు కూడా అమితాబ్ కుటుంబానికి చిక్కులు తెచ్చి పెట్టాయి. అమితాబ్ రైతు[12] అని పేర్కొంటూ ఇచ్చిన కొన్ని ధృవీకరణ పత్రాలను కోర్టులు తప్పుగా ప్రకటించాయి.

అమితాబ్ సినీ ప్రస్థానం ఉన్నతంగా ఉన్న సమయంలో స్టార్ డస్ట్ తో మరి కొన్ని పత్రికలూ అమితాబ్ ఫై 15 ఏళ్ళపాటు నిషేధాన్ని పాటించాయి. దీనికి సమర్ధనగా అమితాబ్ విలేకరులు తన వ్యక్తిగత జీవితంలో తొంగి చూడ్డాన్ని అడ్డుకోవాలని, తన సినిమా సెట్ల దగ్గరకు విలేకరులెవ్వరినీ 1989[48] చివరివరకు దరిచేరనీయలేదు.

తగ్గిన డిమాండు, పదవీ విరమణ 1988-1992[మార్చు]

1988 లో షేహంషా చిత్రంతో అమితాబ్ తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అమితాబ్ చాలా కాలం తరువాత నటించిన సినిమా కావడం తో అది బాక్సాఫీసు వద్ద బాగానే వసూళ్ళను సాధించింది.[50] ఈ సినిమా విజయం తరువాత కూడా అమితాబ్ ప్రేక్షకుల ఫై పెద్దగా ప్రభావం చూపలేదు. దీని తరువాత వచ్చిన సినిమాలు వైఫల్యం చెందాయి. 1990 లో విడుదలైన అగ్నిపధ్ సినిమాలో అమితాబ్ మాఫియా డాన్ గా నటించారు. ఈ సినిమాలోని అమితాబ్ నటనకు ఆయన రెండవసారి ఉత్తమ నటునిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 1991 లో విడుదలైన హమ్ చిత్రం బాక్సాఫిస్ వద్ద వసూళ్ళు రాబట్టడంతో ఈ సినిమాతో తన సెకెండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా మారుస్తుందని భావించారు. అయితే ఈ విజయం తాలూకా ప్రభావం కొద్దికాలం మాత్రమే ఉంది. ఈ సంవత్సరాల్లోనే కొద్దికాలం పాటు అమితాబ్ తెరమీద తిరిగి కనబడలేదు. 1992లో విడుదలైన ఖుదా గవా సినిమా తరువాత అమితాబ్ ఇంచుమించు సినీరంగాన్ని వదిలేశారు . అమితాబ్ ఐదేళ్ళు పాటు సినిమాల్లో నటించలేదు. అయితే అంతకు ముందే నటించిన 'ఇన్సానియత్ ' సినిమా 1994 లో విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విఫలం చెందింది.[13]

నటన, నిర్మాణంలో కి తిరిగి రాక 1996-1999[మార్చు]

బచ్చన్ నటన నుండి విరమించుకొన్న సమయం లో అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ ను స్థాపించి నిర్మాతగా మారారు. 1996 లో 1000 కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యం తో వినోదరంగంలోని ఉన్నత శ్రేణి వ్యాపారాన్ని అందుకోవాలన్న దూరదృష్టి తో అమితాబ్ ఆ కంపెనీ ను 2000 సంవత్సరం లో పెట్టారు. భారతదేశంలో వినోద రంగానికి సంబంధించి అన్ని విభాగాల్లోను సేవలందించి, క్రొత్త ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా వ్యాపారాన్ని కొనసాగించాలని ఆలోచనతో ఆ కంపెనీని స్థాపించారు. ప్రధాన స్రవంతిలో నడిచే వ్యాపార సినిమాలను నిర్మించి దాని పంపిణీ హక్కులని పొందడం, ఆడియో కాసెట్లు, వీడియో డిస్కులను విక్రయించడం, టెలివిజన్ రంగానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను అందించడం, సినీ రంగానికి చెందిన వివిధ ఫంక్షన్లను నిర్వహించడం వంటివి ఈ కంపెనీ ద్వారా చేశారు అమితాబ్. 1996 లో ఈ కంపెనీ ప్రారంభించిన కొత్తలో తేరే మేరె సప్నే సినిమాను నిర్మించారు అమితాబ్. ఈ సినిమా పెద్దగా వసూళ్ళను సాధించలేక నష్టాల్ని మూట కట్టింది. కాని ఈ సినిమాలో నటించిన అర్షద్ వార్సి, సిమ్రాన్ లు తమ సిని జీవితంలో ఎదగడానికి ఉపయోగపడింది. ఎ.బి.సి.ఎల్.ద్వారా మరికొన్ని సినిమాలను నిర్మించినా అందులో ఏవి లాభాల్ని సాధించలేకపోయాయి.

1977 లో అమితాబ్ తన కంపెనీ ఎ.బి.సి.ఎల్.ద్వారా నిర్మించబడిన మృత్యుదాత సినిమా ద్వారా తన నట జీవితాన్ని తిరిగి ప్రారంభిద్దామని అనుకొన్నారు. మృత్యు దాత అమితాబ్ పాత విజయాల్ని గుర్తుకు తెచ్చినా ఆర్ధికంగా విజయం సాధించలేకపోవడంతో పాటు, విమర్శకుల దృష్టిని ఆకట్టుకోలేకపోయింది. బెంగళూరులో 1996 లో మిస్ వరల్డ్ పోటీలను స్పాన్సరు చేసిన ఎ.బి.సి.ఎల్.కోట్ల కొద్దీ రూపాయలను నష్టపోయింది. ఈ పోటీల్లో న్యాయపరమైన చిక్కులతో పాటు ఇతర సమస్యలను కూడా కొని తెచ్చుకొంది ఈ కంపెనీ. విచారణ సమయం లో, ఎ.బి.సి.ఎల్.కంపెనీ తమ ఉన్నతోద్యోగుల కు చాలా ఎక్కువగా జీతాలు చెల్లించిందన్న సత్యం బయటపడింది. ఇటువంటి సమస్యలతో సతమతమై ఆ కంపెని 1997 లో కుప్ప కూలింది. భారత పరిశ్రమల బోర్డు ఎ.బి.సి.ఎల్. ను దివాలా తీసినట్టుగా ప్రకటించింది.బోంబే ఉన్నత న్యాయస్థానం 1999 ఏప్రియల్ లో అమితాబ్ కున్న 'ప్రతీక్ష' భవనంతో పాటు మరి రెండిళ్ళ ను కెనరా బ్యాంకు వారికి అప్పు తీర్మానం నిమిత్తము ఎవరికీ అమ్మకూడదని ఉత్తర్వులనిచ్చింది. అయతే ఆ భవనాన్ని అంతకు ముందే సహారా ఇండియా ఫైనాన్స్ వారికి తాకట్టు పెట్టి కంపెనీ కొసమై అప్పు తీసుకొన్నానని తెలిపారు అమితాబ్.[14]

1998 లో విడుదలై కొద్దిపాటి విజయాన్ని సాధించిన బడే మియా చోటే మియా చిత్రం ద్వారా అమితాబ్ తిరిగి సినిమాల్లో నిలదొక్కు కోవాలని ప్రయత్నించారు.[13] సూర్యవంశం [15] సినిమా లో అమితాబ్ నటన కు సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే 1999 లో విడుదలైన లాల్ బాద్షా , హిందూస్తాన్ కి కసమ్ బాక్సాఫీసు దగ్గర విజయాన్ని సాధించలేకపోయాయి.

టెలివిజన్ ప్రస్థానం[మార్చు]

2000 సంవత్సరంలో బ్రిటిష్ టెలివిజన్ గేమ్ షో అయిన మిలయనీర్ కావాలని ఎవరు కోరుకుంటారు?ను అనుసరించి భారతదేశంలో మొదలైన 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమంలో అమితాబ్ యాంకరుగా నటించడం ద్వారా భారత బుల్లితెర మీద అడుగుపెట్టారు.2000 సంవత్సరంలోనే కెనరా బ్యాంకు అమితాబ్ మీద నడుస్తున్న కోర్టు కేసులను వెనక్కి తీసుకోవడం జరిగింది.కెబిసి కార్యక్రమం 2005 నవంబరు వరకు కొనసాగింది. ఆ గేమ్ షో అది టెలికాస్ట్ కాబడిన అన్ని దేశాల్లోను ఘనవిజయం సాధించింది. అలాగే మన దేశంలో కూడా ఆ కార్యక్రమం మంచి విజయాన్ని అమితాబ్ కు కట్టబెట్టింది. దీని ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతులు అమితాబ్ ను తిరిగి బాలీవుడ్ లోకి ప్రవేశం కల్పించాయి. 2009 లో ఆస్కార్ అవార్డు సాధించిన స్లమ్ డాగ్ మిలియనీర్ లో కౌన్ బనేగా కరోడ్ పతి? కార్యక్రమాన్ని చూపెట్టారు.అందులో అమితాబ్ పాత్రను పోషించిన అనిల్ కపూర్ హీరోను జంజీర్ సినిమాలో నటించినదెవరు? అని ప్రశ్నిస్తాడు. దానికి అమితాబ్ బచ్చన్ అని సమాధానమిస్తాడు కథానాయకుడు.http://wiki.answers.com/Q/Quiz_questions_in_slum_dog_millionaire. ఫెరోజ్ అబ్బాస్ ఖాన్ http://www.imdb.com/name/nm2073234/ సినిమా అంతా అమితాబ్ బచ్చన్ లానే నటించాడు అనిల్ కపూర్ కార్యక్రమం వ్యాఖ్యాత గా నటించాడు .http://www.imdb.com/title/tt1010048/fullcredits#cast

తిరిగొచ్చిన విశిష్టత 2000-ప్రస్తుతము[మార్చు]

యాష్ చోప్రా నిర్మించిన 'మొహబతెం' బాక్సాఫీసు బద్దలుకొడుతూ 2000 లో విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు.అమితాబ్ ఇందులో షారుఖ్ ఖాన్ కు వ్యతిరేకంగా సంప్రదాయాలకు తలొగ్గే ముసలి తండ్రి పాత్రను పోషించారు.ఈ తరహా సంప్రదాయ పాత్రలు పోషించిన సినిమాలు మంచి ఫలితాలను సాధించాయి. ఏక్ రిస్తా: ప్రేమానుబంధం (2001), కభీ ఖుషీ కభీ గమ్ (2001), బాగ్ బన్ (2003) లాంటివి కొన్ని. నటుడిగా అమితాబ్ విమర్శకుల నుండి ప్రశంసలందుకొనే విధంగా నటించారు. ఆక్స్ (2001), ఆంఖే (2002), ఖాకీ (2004), దేవ్ (2004), బ్లాక్ (2005) లాంటి సినిమాలు బచ్చన్ లోని నటుడ్ని వేరేకోణం చూపెట్టాయి.ఈ విజయాల్ని అమితాబ్ తెలివిగా ఉపయోగించుకొని టెలివిజన్ లోని, ప్రకటనల బోర్డులలోని కనిపించి అనేక ఉత్పత్తులను, సేవలను అమ్మడంలో ఆయా కంపెనీలకు లాభం కల్పించారు.2005, 2006 సంవత్సరాలలో అమితాబ్ తన కొడుకు అభిషేక్ తో కలసి నటించి బాలీవుడ్ కు మంచి హిట్ సినిమాలను అందించారు. అవి బంటీ ఔర్ బబ్లీ (2005), గాడ్ ఫాదర్ , సర్కార్ (2005), కభీ అల్విద న కహెన (2006).అవి అన్ని బాక్సాఫీసు [59][61] దగ్గర విజయం సాధించాయి. అయితే తరువాత విడుదలైన బాబుల్ (2006), ఏకలవ్య [63] నిశ్శబ్ద్ (2007) చిత్రాలు బాక్సాఫీసు ను ఏల లేకపోయాయి.అయిన వీటిలో నటించిన అమితాబ్ కు విమర్శకుల నుండి ప్రశంసల జల్లు కురిసింది.[65] కన్నడ దర్శకుడు నాగతి హిల్లి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'అమృతధార 'కన్నడ సినిమాలో అమితాబ్ అతిధి పాత్రను పోషించాడు.

దస్త్రం:Amitabh Bachan award.jpg
అమితాబ్ నటించిన బ్లాక్ చిత్రం ఉత్తమ నటన కు గాను 2005 లో ఉత్తమ నటుని అవార్డును ప్రతిభ దేవిసింగ్ పాటిల్ అవార్డును అమితాబ్ కు అందచేసరు.

2007 మే లో అమితాబ్ నటించిన చీనికం అనేక నటులతో కలసి నటించిన షూట్ అవుట్ ఎట్ లోఖండ వాల ' సినిమాలు విడుధలయాయి.వీటిలో షూట్ అవుట్ ఎట్ లోఖండ వాల ' సినిమా భారతదేశంలో విజయం సాధించింది. చీనికం మటుకు మెల్లగా ప్రజల వద్దకు వెళ్లి యావరేజ్ సినిమా అనిపించుకోంది.[67]

ఆగస్టు 2007 లో ఒకప్పటి పెద్ద హిట్ సినిమా షోలే (1975) ను 'రాం గోపాల్ వర్మ కి ఆగ్ ' అనే పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమా ఫ్లాపవడమే కాకుండా అమితాబ్ ను తీవ్ర విమర్శలకు గురి చేసింది.[16]

అమితాబ్ నటించిన తాళి ఆంగ్ల చిత్రం ద లాస్ట్ లైయర్ ను 2007, సెప్టెంబరు 9 న టోరేంటో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి రీతు పర్నో ఘోష్ దర్శకత్వం వహించగా అమితాబ్ కు 'బ్లాక్' చిత్రం తరువాత, తను నటించిన బ్లాక్ చిత్రానికి గాను విమర్శకుల నుండి అనేక ప్రశంసలు లభించాయి.[70] జానీ డెప్ కథానాయకుడిగా, మీరానాయర్ దర్శకత్వం వహించిన అంతర్జాతీయ సినీమా 'శాంతారాం ' లో అమితాబ్ సహాయనటుడిగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2008 లో మొదలవాల్సి వుండగా, రచయతల సమ్మె కారణంగా సెప్టెంబరు 2008[72] నాటికి వాయిదాపడింది.

అమితాబ్ టైటిల్ రోల్ లో భూతంగా నటించిన భూత్ నాద్ సినిమా మే 9, 2008 న విడుదలైంది. సర్కార్ కు సీక్వెల్ గా తీసిన సర్కార్ రాజ్ జూన్ 2008 న విడుదలైంది. సర్కార్ రాజ్ బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాలు సాధించింది.

బచ్చన్ యొక్క రెండొవ ప్రణాళిక లవ్ ఎర్త్, లవ్ ఎర్త్ ఇండియా 2008 పేరిట చేపట్టిన కార్యక్రమంలో జోన్ బోన్ జోవి తో కలసి ముంబాయిలో డిశెంబరు 8, 2008 న అమితాబ్ ప్రేక్షకులకు కనువిందు చేశారు.

ముంబైలో జనవరి 26, 2008 న ప్రారంభమైన కోకిలబెన్ దీరుబై అంబానీ ఆసుపత్రికి ముఖ్య అతిధిగా[74] అమితాబ్ హాజరు అయ్యారు.

ఆరోగ్యం[మార్చు]

2005 లో ఆసుపత్రిలో చేరడం.[మార్చు]

అమితాబ్ 2005 నవంబర్ లో లీలావతి ఆసుపత్రిలో చిన్న ప్రేవుల చికిత్స కోసమై ఐ సి యు లో చేరారు.[76] దీనికి కొద్దిరోజుల ముందు అయన కడుపు నొప్పితో బాధపడ్డారు. అమితాబ్ ఆసుపత్రి లో చికిత్స తీసుకొన్న సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో పాటుగా అనేక ప్రణాళికలు ఆగిపోయాయి. అమితాబ్ ఆసుపత్రి నుండి 2006 మార్చిలో దిస్చార్గి అయ్యారు.[78]

స్వరం[మార్చు]

అమితాబ్ బచ్చన్ కు తన లోతైన కంఠస్వరం గురించి తెలుసు.అమితాబ్ బచ్చన్ ఆయనకున్న లోతైన, గంభీర స్వరంతో అనేక కార్యక్రమాలలో కదకుడుగా, నేపధ్య గాయకునిగా, ప్రేజెంటర్ గా పాల్గొన్నారు.ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే అమితాబ్ కంఠస్వరానికి అమితంగా ఆకర్షించబడి, బచ్చన్ నటించాల్సిన పాత్ర ఏమి లేకపోడంతో తన సినమా శతరంజ్ కి కిలాడీ సినిమాకి కదకుడుగా అవకాసం ఇచ్చారు.[79]. సినిమాల్లోకి రాకపూర్యం అమితాబ్ ఆలిండియా రేడియో లో ప్రకటనలు చదివే వుద్యోగానికి దరకాస్తు చేసుకొంటే, కంఠం బాగా లేదని తిరస్కరిన్చారు.

విమర్శలు మరియు వివాదాలు[మార్చు]

బారబంకి భూ వివాదం[మార్చు]

ఉత్తర ప్రేదేశ్ శాసనసభకు 2007 లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం అమితాబ్ అప్పటి ముఖ్య మంత్రి ములాయం సింగ్ యాదవ్ ను కీర్తిస్తూ ఒక సినిమాను నిర్మించి విడుదలచేసారు. ఐతే ఆ ఎన్నికల్లో సమాజ్ వాద్ పార్టి చిత్తుగా ఓడిపోయి అధికారాన్ని మాయావతి చేజిక్కించుకున్నారు.

ఫైజాబాద్ కోర్ట్ 2007 లో దళితుల కోసమే ప్రత్యేకించిన వ్యవసాయ భూమిని అమిటాబ్ బచ్చన్ అక్రమంగా పొందారని రూలింగ్ నిచ్చింది.[81] ఆ కేసు లో అమితాబ్ పోర్జరీ నేరానికి పాల్పడినట్లు తేలితే అమితాబ్ పై తను వ్యవసాయదారుడునని ఇచ్చిన అపిదవిట్ల పై విచారణ జరగొచ్చని అందరూ ఊహించారు.[83] జూలై 19, 2007 న ఆ భూవివాదం బైటపడిన వెంటనే అమితాబ్ ఉత్తర ప్రదేశ్ కు చెందిన బరబంకి లోను, పూనే లోను ఉన్న భూములను ప్రభుత్వాలకు తిరిగి అప్పజెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కు అమితాబ్ లేఖ రాస్తూ పూనే లో తన భూములను పేదలకు పంచమని అన్నారు.[17] ఐతే లక్నో కోర్ట్ ఆ భూములన్నిటి మీద స్టే ఆర్డరు ఇస్తూ యదాతద స్థితిని కొనసాగించాలని పేర్కొంది.

ఉత్తర ప్రేదేశ్ రాష్ట్రంలోని బరబంకి జిల్లాలోని దౌలత్ పూర్ భూములన్నిటి మీద అమితాబ్ తన సర్వ హక్కులను వదులుకుంటూ అక్టోబర్ 12 2007 న ఒక అఫిడవిట్ సమర్పించారు.[18] లక్నో లో ఉన్న అలహాబాద్ ఉన్నత న్యాయ స్తనం బెంచ్ అమితాబ్ దోషపూరితంగా దళితుల భూమిని కలిగి ఉన్నాడని ఆరోపణలను డిసెంబర్ 11, 2007 న తోసిపుచ్చి అమితాబ్ కు క్లీన్ చిట్ ను ఇచ్చింది.ఏక సభ్యునితో ఉన్న లక్నో బెంచ్ లో న్యాయమూర్తి తీర్పునిస్తూ అమితాబ్ ఉద్దేశపూర్వకంగా బరబంకి లో గల భూముల రికార్డులను తారుమారు చేయడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు అని పేర్కొన్నారు.[19][20]

పై విధం గా తనకనుకూలంగా తీర్పు రావడంతో అమితాబ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ పూనే జిల్లాలో గల మావల్ తాలూకాలో గల భూములను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడం లేదన్నారు.[21]

రాజ్ ధాకరే విమర్శలు[మార్చు]

భారతదేశంలో ని ఒక షాపింగు మాల్ కోసమై పాల్గొన్న బచ్చన్

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ధాకరే 2008 జనవరిలో వివిధ రాజకీయ ర్యాలీల్లో పాల్గొంటూ అమితాబ్ ను తీవ్రంగా విమర్శించారు. అమితాబ్ మహారాష్ట్ర కంటే తన సొంత రాష్ట్రమైన ఉత్తర్ప్రేదేశ్ అభివ్రుద్దినే ఎక్కువ కోరుకొంటారని విమర్శించారు. అమితాబ్ తన కోడలైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు మీదుగా ఉత్తర్ప్రేదేశ్ లోని బరబంకి లో బాలికల పాఠశాల ను ప్రారంభించడం రాజ్ ధాకరే కు నచ్చలేదు. ఆ పనేదో మహారాష్ట్ర లో చేయొచ్చు కదా అన్నది రాజ్ అభిప్రాయం[22]. ఐతే మీడియా రిపోర్టులు ప్రకారం రాజ్ ధాకరే విమర్శలకు వేరే కారణం ఉంది. అమితాబ్ తన కొడుకు అభిషేక్ వివాహానికి రాజ్ ను ఆహ్వానించకపోవడమే కాకుండా తన విరోధి ఐన ఉద్ధవ్ ను పెళ్ళికి పిలచారు.[23][24]

సమాజ వాది పార్టీ పార్లమెంటు సభ్యులైన జయాబచ్చన్ రాజ్ ధాకరే ఆరోపణలకు స్పందిస్తూ, రాజ్ ధాకరే కనుక భూమిని ఉచితంగా ఇస్తే మహారాష్ట్ర లో కూడా ఒక బాలికల పాఠశాలను ప్రారంభిస్తామని తెలిపారు. జయా బచ్చన్ మీడియా తో మాటలాడుతూ "రాజ్ ధాకరే"కు ముంబైలోని కోహినూర్ మిల్స్ ను మహారాష్ట్ర లోని పెద్ద సంఖ్యలో భూములున్నాయని విన్నాను.ఒక వేళ అక్కడ ఏమైనా భూమిని మాకు విరాళంగా ఇస్తే అక్కడ కూడా ఐశ్వర్య రాయ్ పేరిట పాఠశాలను ప్రారంభిస్తాము."[25] ఏమైనా సరే ఈ విషయం మీద స్పందించడానికి అమితాబ్ ఇష్టపడలేదు.

బాల ధాకరే ఈ ఆరోపణలని తీవ్రంగా వ్యతిరేకించారు. అమితాబ్ చాలా మనసున్న మనిషనీ మహారాష్ట్ర పై అపారమైన ప్రేమాభిమానాలు కలిగి ఉన్నవాడని బాల ధాకరే వివరణ ఇచ్చారు.మహారాష్ట్ర, మరీ ముఖ్యంగా ముంబై నగరం అమితాబ్ కు పేరు ప్రతిష్ట లను ఇచ్చింది అని పేర్కొన్నారు. అమితాబ్ ప్రస్తుతమున్న పరిస్థితికి ముంబై వాసులు ఇచ్చిన ప్రేమాభిమానాలే కారణం. ముంబై ప్రజలు అమితాబ్ ను ఎల్లవేళలా ఒక గొప్ప కళాకారునిగా గుర్తించారు.ఇలాంటి వ్యక్తి మీద సంకుచితంగా ప్రాంతీయతత్త్వాన్ని అంటగట్టడం కేవలం మూర్ఖత్వమే అవుతుందని బాల ధాకరే పేర్కొన్నారు. అమితాబ్ ఈ భూమ్మీదే ఒక సూపర్ స్టార్ అన్నారు. ప్రపంచం మొత్తం అమితాబ్ కు నీరాజనాలు పలికి గౌరవిస్తుందన్నారు. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ మరిచిపోకూడదు అని తెలిపారు.అమితాబ్ ఎలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా నటన పైనే దృష్టిని కేంద్రీకరించాలని పేర్కొన్నారు."[26]

ఇదంతా జరిగిన నెలన్నర రోజుల తరువాత మార్చి 23, 2008న అమితాబ్ ఒక స్థానిక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరుగుతుంటాయని, తరువాత కాలంలో ఆ ఘటనలకు విలువ ఏమీ ఉండదనీ కావున వాటిపై నేనీమీ స్పందించనని అన్నారు."[27] ఐతే అంతర్జాతీయ భారతీయ ఫిల్మ్ అకాడమీ వారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ మార్చి 28, 2008 న ఒక విలేఖరి వలసదారుల వ్యతిరేకుల గురుంచి జవాబిమ్మని అడుగగా భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని దానిని ఎవరూ కాదనలేరని అన్నారు.[28] అంతేకాకుండా రాజ్ ధాకరే వ్యాఖ్యలు ఏమీ ప్రభావం చూపలేదని అమితాబ్ బచ్చన్ తెలిపారు.[29]

లభించిన గుర్తింపు, గౌరవాలు అవార్డులు:[మార్చు]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

ఇటీవల చిత్రాలు:[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు
2006 ఫ్యామిలీ విరెన్ షా
డర్నా జరూరీ హై ప్రొఫెసరు
కభి అల్విద నా కెహనా సమర్జిత్ సింగ్ తల్వార్(అలియాస్ సెక్సీ శ్యాం) సెక్సీ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు గా నామినేషన్
బాబుల్ బలరాజ్ కపూర్
2007 ఏకలవ్య: రాజరక్షకుడు ఏకలవ్య
నిశ్శబ్ద్ విజయ్
చీని కుం భుద్ధదేవ్ గుప్తా
షూట్ అవుట్ ఎట్ లోఖండ్ వాల డింగ్ర ప్రత్యేక పాత్ర
ఝూం బరాబర్ ఝూం సూత్రదార్ ప్రత్యేక పాత్ర
రామ్ గోపాల్ వర్మ కి ఆగ్ బబ్బన్ సింగ్
ఓం శాంతి ఓం తనకు తానే ప్రత్యేక పాత్ర
2008 జోదా అక్బర్ కథకుడు
భూత నాథ్ భూత నాథ్ (కైలాష్ నాధ్)
సర్కార్ రాజ్ సుభాష్ నగ్రె "సర్కార్"
గాడ్ తుస్సి గ్రేట్ హో గాడ్ ఆల్మైటీ
ద లాస్ట్ లియర్ హరీష్ "హర్రీ" మిశ్రా స్ట్రా ద బెస్ట్ వారి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపు .
2009 డిల్లి 6 దాదాజీ ప్రత్యేక పాత్ర
అల్లావుద్దీన్ జిన్ నిర్మాణం-తర్వాత
జానీ మస్తాన్ జాన్ ఫేరియర్ నిర్మాణం-తర్వాత
జమానత్ శివశంకర్ నిర్మాణం-అవ్వలేదు
తలిస్మాన్ చలనచిత్రములు
పా నిర్మాణం తరువాత నవంబర్ 14 న విడుదలవబోతుంది. రిలీసింగ్ నవంబర్ 14, 2009 అభిషేక్ బచన్, విద్యాబాలన్ ల కొడుకు గా అమితాబ్ నటిస్తారు.
తీన్ పత్తి నిర్మాణం మొదలవలేదు.

నిర్మాత[మార్చు]

సంవత్సరం సినిమా
1996 తేరే మేరె సప్నా
1997 ఉల్లాసం
మృత్యుదాత
1998 మేజర్ సాబ్
2001 ఆక్స్
2005 విరుద్ద్
2006 ఫ్యామిలీ-టైస్ అఫ్ బ్లడ్

తెరవెనుక గాయకుడు..[మార్చు]

సంవత్సరం సినిమా
1979 ద గ్రేట్ గాంబ్లేర్
మిష్టర్. నట్వర్లాల్
1981 లవారిస్
నసీబ్
సిల్సిలా
1983 మహాన్
పుకార్
1984 షరాబీ
1989 తూఫాన్
జాదుగర్
1992 ఖుదా గవా
1998 మేజర్ సాబ్
1999 సూర్యవంశం
2001 ఆక్స్
కభి ఖుషి కభీ గం
2002 ఆంఖేన్
2003 అర్మాన్
బాగ్భన్
2004 దేవ్
ఏత్బార్
2006 బాబుల్
2007 నిశబ్ద్ద్
చీని కం
2008 భూతనాథ్

ఇంకా రీడింగ్[మార్చు]

సంతకము[మార్చు]

సూచనలు /రేఫెరెన్సెస్[మార్చు]

 1. అమితాబ్ బచ్చన్ ద యాంగ్రీ యంగ్ మేన్
 2. 2.0 2.1 బాలీవుడ్ ను పెంచే ఫిల్మ్ ఏజెంటు
 3. బాక్సాఫీస్ ఇండియా
 4. Kanwar, Rachna (October 3, 2005). "25 Must See Bollywood Movies". Indiatimes movies. Retrieved 2007-12-06. 
 5. "Truffaut labeled Bachchan a one-man industry". China Daily. Retrieved 1 February 2008.  Unknown parameter |dateformat= ignored (help)
 6. బాక్సాఫీస్ ఇండియా.కాం
 7. "Bachchan's box office success". boxofficeindia.com. Archived from the original on 20 July 2012. Retrieved 10 April 2007.  Unknown parameter |dateformat= ignored (help)
 8. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Footage_of_Coolie_fight_scene అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 9. Mohamed, Khalid. "Reviews on: To Be or Not To Be Amitabh Bachchan". mouthshut.com. Retrieved 11 March 2007.  Unknown parameter |dateformat= ignored (help)
 10. "Amitabh Bachchan: Stint in Politics". HindustanTimes.com. Archived from the original on 2006-01-09. Retrieved 2005-12-05. 
 11. "Interview with Amitabh Bachchan". sathnam.com. 
 12. "Bollywood's Bachchan in trouble over crime claim". AFP. October 4, 2007. 
 13. 13.0 13.1 "Box Office 1994". Box Office India. Archived from the original on 2012-07-20. 
 14. Patil, Vimla (March 4, 2001). "Muqaddar Ka Sikandar". 
 15. Taliculam, Sharmila. "He's back!". 
 16. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; udxlrh అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 17. "Amitabh Bachchan is not a farmer: UP court". Rediff.com. June 1, 2007. Retrieved 2008-04-27. 
 18. "Big B abandons claim on farmland". Times of India.  Text "October 12, 2007" ignored (help)
 19. "హై కోర్ట్ భూ వివాదం లో అమితాబ్ కు క్లీన్ చీట్ ఇచ్చింది." అపున్ కా చాయిస్. కాం . డిసెంబర్ 12, 2007.
 20. "ఉత్తరప్రదేశ్ భూ కుంభకోణం లో అమితాబ్ కు క్లీన్ చిట్ లభించింది."అల్ బాలివుడ్.కామ్. డిసెంబర్ 11, 2007.
 21. "No question of proceeding further on Amitabh's land: Rane". hindu.com. 
 22. "Big B draws Raj Thakeray's ire over 'UP interests'". The Times of India. Retrieved 2008-05-30. 
 23. "Rift between Raj and Big B over a wedding invite". Daily News & Analysis. Retrieved 2008-04-04. 
 24. "Rift between Raj and Big B over a wedding invite". MSN. 2008-02-05. Retrieved 2008-04-04. 
 25. "I don't know who Raj Thackeray is: Jaya Bachchan". The Indian Express. Retrieved 2008-05-30. 
 26. "Bal Thackeray: Amitabh loves Maharashtra". The Hindu. 2008-02-07. Retrieved 2008-04-04. 
 27. "Amitabh breaks silence, dismisses Raj's charges against him". Daily News & Analysis. Retrieved 2008-04-04. 
 28. "The Indian Constitution allows me to live anywhere: Amitabh Bachchan". The Indian. Retrieved 2008-04-04. 
 29. "Everyone has the right to freedom of expression: Bachchan". The Hindu. 2008-03-28. Retrieved 2008-04-04. 

బాహ్య లింకులు[మార్చు]

వంశవృక్షం[మార్చు]