Jump to content

రక్తస్రావం

వికీపీడియా నుండి
చేతివేలు నుండి రక్తస్రావం
రక్తస్రావం
వర్గీకరణ & బయటి వనరులు
దస్త్రం:Daqfqa
m:en:ICD-9 {{{m:en:ICD9}}}

రక్తస్రావం (Bleeding or Haemorrhage) ఒక విధమైన వ్యాధి లక్షణము.

రక్తస్రావం అనగా రక్త ప్రసరణ వ్యవస్థ నుండి రక్తం నష్టపోవడం.[1] రక్తస్రావం బయటకు కనిపించకుండా శరీరభాగాల లోపల గానీ లేదా బయటకు కనిపించేటట్లుగా గానీ జరగవచ్చును. ఇది యోని, నోరు, ముక్కు, పాయువు మొదలైన నవరంధ్రాల నుండి దేని నుండైనా కానవచ్చును. శరీరంలోని రక్తం అంతా పోవడాన్ని ఎక్సాంగ్వినేషన్ (exsanguination,,[2] చాలా ఎక్కువగా రక్త పోవడాన్ని డీసాంగ్వినేషన్ (desanguination) అని అంటారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి శరీరం నుండి సుమారు 10-15% రక్తం నష్టమైనా ఎలాంటి ప్రమాదం జరుగదు. రక్త దానం (blood donation) ద్వారా సుమారు 8-10% మాత్రమే తొలగిస్తారు.[3]

కారణాలు

[మార్చు]

రక్తస్రావానికి అనేకమైన కారణాలున్నాయి. కొన్ని ఏవిధమైన కారణం లేకుండా కూడా కనిపిస్తాయి.

అకారణ రక్తస్రావం

[మార్చు]

మన శరీరంలోని రక్తం గడ్డకట్టడంలో ఉన్న దోషాల మూలంగా రక్తస్రావం కలుగుతుంది. అటువంటప్పుడు బయట నుండి రక్తస్రావానికి ఎలాంటి కారణాలు కనిపించవు. హీమోఫీలియా, రక్త ఫలకికలు తక్కువకావడం వలన కలిగే రక్తస్రావం దీనికి ఉదాహరణలు.

ప్రమాదాలు

[మార్చు]

ప్రమాదవశంగా కలిగే గాయాలు (Injuries) ఎక్కువగా రక్తస్రావానికి కారణమౌతాయి. గాయాల తీవ్రతను బట్టి రక్తస్రావం ఆధారపడివుంటుంది. అయితే చర్మం చిట్లినప్పుడు మాత్రమే రక్తస్రావం బయటకు కనిపిస్తుంది. కొన్నిసార్లు అలాకాని పక్షంలో రక్తం గూడుకట్టి ఒక గడ్డ (ట్యూమర్) లాగా తయారవుతుంది. రక్తస్రావం కొన్ని అవయవాలలో చాలా ప్రమాదం ఉదా: మెదడులోని రక్తస్రావం ప్రాణాంతకమైనవి. అలాగే ప్లీహం, కాలేయం మొదలైన అవయవాలకు కలిగిన గాయాల వలన కడుపులోనికి ఎక్కువగా రక్తస్రావం జరిగి బయటకు కనిపించకుండా ప్రమాదస్థితి సంభవిస్తుంది.

రక్తస్రావం వర్గీకరణ

[మార్చు]

అమెరికన్ శస్త్రచికిత్స వైద్యుల కళాశాల (American College of Surgeons) రక్తస్రావాన్ని నాలుగు తరగతులుగా విభజించారు.[4]

A subconjunctival hemorrhage is a common and relatively minor post-LASIK complication.
The endoscopic image of linitis plastica, a type of stomach cancer leading to a leather bottle-like appearance with blood coming out of it.
  • మొదటి తరగతి రక్తస్రావం (Class I Haemorrhage) లో సుమారు 15% రక్త ఆయతనం (Blood volume) వరకు కోల్పోవచ్చును. ఇటువంటి రక్తస్రావం వలన శరీరపు జీవ సంబంధ సూచిక (Vital signs) లలో ఎటువంటి మార్పులు కలగవు.
  • రెండవ తరగతి రక్తస్రావం (Class II Haemorrhage) లో 15-30% మధ్య రక్త ఆయతనం (Blood volume) కోల్పోవచ్చును. దీని మూలంగా గుండె వేగంగా కొట్టుకొంటుంది, రక్త పీడనాల మధ్య భేదం తక్కువవుతుంది. దీనికి స్పందించిన దేహంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. చర్మం పాలిపోయినట్లుగా చల్లగా మారుతుంది. వ్యక్తి యొక్క మానసిక ప్రవర్తనలో స్వల్ప మార్పులు కలుగుతాయి. రక్తానికి బదులుగా ద్రవాలు ఎక్కిస్తే సరిపోతుంది. రక్తాన్ని ఎక్కించాల్సిన (రక్త మార్పిడి) అవసరం కలుగదు.
  • మూడవ తరగతి రక్తస్రావం (Class III Haemorrhage) లో 30-40% మధ్య రక్త ఆయతనం (Blood volume) కోల్పోవచ్చును. వ్యక్తి యొక్క రక్త పీడనం (Blood pressure) తగ్గి, గుండె స్పందన రేటు (Heart rate) పెరిగి, దాని మూలంగా షాక్ లోనికి పోతాడు. మానసిక స్థితి క్షీణిస్తుంది. ద్రవాలతో సహా రక్తాన్ని ఎక్కించడం అవసరం.
  • నాలుగవ తరగతి రక్తస్రావం (Class IV Haemorrhage) లో 40% కంటే ఎక్కువ రక్త నష్టం జరుగుతుంది. శరీరం యొక్క వ్యవస్థలన్నీ విఫలమై, వ్యక్తిని బ్రతికించడానికి తీవ్ర ప్రయత్నాలు అవసరమౌతాయి.

ఈ విషయాలన్నింటిలో యౌవనంలోనున్న వ్యక్తులు తొందరగా కోలుకుంటారు. కానీ వృద్ధులు, వ్యాధిగ్రస్తులు రక్తస్రావాన్ని ఎక్కువగా తట్టుకోలేరు. రక్తస్రావం జరిగినప్పుడు ఇలాంటి విషయాల్ని కూడా గుర్తుంచుకోవాలి.

రక్త స్రానములో రకాలు

[మార్చు]

1. అంతర్గత రక్తస్రావము (Internal bleeding) - పుర్రె, ఛాతీ, కడుపు లోపల రక్త స్రావము కూడా అంతర్గతంగా జరుగును. గాయం కంటికి కనపడదు. అంతర్గత రక్త స్రావము లక్షణములు కళ్ళు తిరుగుట, పాలిపోయిన ముఖము, చల్ల బడిన శరీరము, శ్వాస తొందరగ ఆడును, నాడి బలహీనంగా, వేగంగా ఉండును, చెమట పట్టును, దప్పిక వేయును, స్రృహ కోల్పోవచ్చును.

2. బాహ్య రక్తస్రావము (External bleeding) - చేతులు, కాళ్లపై గాయము కనిపిస్తుంది.

అవయవాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bleeding Health Article". Healthline. Archived from the original on 2012-09-04. Retrieved 2007-06-18.
  2. "Dictionary Definitions of Exsanguination". Reference.com. Retrieved 2007-06-18.
  3. "Blood Donation Information". UK National Blood Service. Archived from the original on 2007-09-28. Retrieved 2007-06-18.
  4. Manning, JE "Fluid and Blood Resuscitation" in Emergency Medicine: A Comprehensive Study Guide. JE Tintinalli Ed. McGraw-Hill: New York 2004. p227