హరి వంశ రాయ్ బచ్చన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Harivansh Rai Bachchan
Harivansh Rai Bachchan.jpg
జననం: 27 నవంబర్ 1907
వృత్తి: కవి

హరి వంశ రాయ్ "బచ్చన్" శ్రీవాస్తవ్ (నవంబర్ 27, 1907జనవరి 18, 2003) మిగతా కవులతో తన కవితలలో వ్యత్యాసం చూపించి ప్రఖ్యాతి గాంచిన హిందీకవి, ఈయన 20 వ శతాబ్దం మొదలులో హిందీ సాహిత్యంలో చాయావాద సాహిత్యోద్యమమునకు (ప్రణయ కవిత్వం) చెందినవాడు. అతని ప్రతిభకు తొలి విజయం అందించింది మధుశాల (मधुशाला).[1] అంతే కాకుండా ఆయన బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తండ్రి కూడా.

విద్యాభ్యాసం మరియు వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన అలహాబాద్ దగ్గర ఉన్న బాబుపట్టి గ్రామం (రాణి గంజ్), ప్రతాప్ గడ్ జిల్లా అప్పటి యునైటెడ్ ప్రోవిన్సెస్ (ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్) లో జన్మించారు. ఆయన ప్రతాప్ నారాయణ్ శ్రీవాస్తవ్, సరస్వతి దేవి ల మొదటి సంతానం. ఆయన్ని బచ్చన్ (చిన్న పిల్ల వాణి వలె) అని ఇంట్లో ముద్దుగా పిలిచేవారు. ఆయన తన ప్రాథమిక విద్య పురపాలక విద్యాలయంలో అభ్యసించారు. తరువాత కుటుంబ పరంపరను అనుసరించి కాయస్థ పాఠశాల(कायस्थ पाठशाला)లో చేరి ఉర్దూ అభ్యసించారు అది ఆయన న్యాయ వాద చదువుకు తొలిమెట్టు. తరువాత ఆయన విద్యాభ్యాసం అలహాబాద్ విశ్వా విద్యాలయం మరియు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సాగింది. ఆ కాలంలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షితులు అయ్యాడు.

కానీ అతని గమ్యం అది కాదు అని గ్రహించి మరల విశ్వవిద్యాలయంలో చేరాడు. 1941 నుండి 1952 వరకు అలహాబాద్ విశ్వవిద్యాలయం లోని ఆంగ్ల విభాగంలో బోధకునిగా సేవలు అందించాడు. తరువాత రెండు సంవత్సరాలు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో W.B యేట్స్ పైన పరిశోధన చేశాడు. ఆ సమయంలోనే 'బచ్చన్' ను శ్రీవాస్తవ్ బదులుగా ఇంటి పేరుగా వాడుకున్నాడు. హరి వంశ రాయ్ యొక్క పరిశోధనా పత్రం అతనికి డాక్టరేట్ సంపాదించి పెట్టింది. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆంగ్ల సాహిత్య విభాగంలో డాక్టరేట్ పొందిన రెండో భారతీయుడు. స్వదేశం తిరిగి వచ్చిన పిమ్మట మరలా బోధకుడిగా మరియు ఆకాశవాణి అలహాబాద్ లో పనిచేశాడు.

1926లో 19 ఏళ్ళ ప్రాయంలో బచ్చన్ తన మొదటి భార్య శ్యామాను వివాహమాడాడు, అప్పటికి ఆమెకి 14 సంవత్సరాలు. కాని ఆమె పది సంవత్సరాలు తరువాత 1936లో మరణించింది. ఆమె చాలా కాలం పాటు టి.బితో బాధపడ్డాడు. బచ్చన్ మరలా 1941లో తేజీ సూరి అనే సిఖ్హు మహిళను వివాహమాడాడు. వారికీ అమితాబ్ మరియు అజితాబ్ అనే సంతానం కలిగారు.

హరివంశ్ రాయ్ 1955లో ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ పది సంవత్సరాల కాలంలో హిందీ అధికారిక భాషగా గుర్తించడానికి విశేష కృషి చేసారు. ఆయన తన రచనలు మరియు కవిత్వాలతో హిందీ భాషకు ఎనలేని సేవ చేశారు. ఒక కవిగా ఆయన మధుశాల కవిత్వానికి ప్రఖ్యాతి గాంచాడు. అంతే కాకుండా ఒమర్ ఖయ్యం రుబియత్, షేక్స్పియర్ రాసిన మాక్బెత్ మరియు ఒతేల్లో లను హిందీకి అనువదించిన చేసిన పుస్తకాలూ ప్రఖ్యాతి గాంచాయి. అంతే కాకుండా భగవద్గీతను కూడా హిందీలోకి అనువదించాడు. ఏది ఏమయినప్పటికీ, ఇందిరా గాంధీ హత్యోదంతం పైన ఆయన చివరి కవిత వ్రాసాడు 'ఎక్ నవంబర్ 1984'.

హరివంశ్ రాయ్ 1966లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. మూడు సంవత్సరాలు తరువాత కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్నాడు. ఆయన హిందీ సాహిత్యానికి చేసిన ఎనలేని సేవలకు గాను 1976లో పద్మ భూషణ్ పురస్కారం వరించింది. ఆయన ప్రపంచ సాహిత్యానికి చేసిన ఎనలేని సేవలకు గాను సరస్వతి సమ్మాన్, సోవిఎట్ల్యాండ్ నెహ్రూ పురస్కారం మరియు ఆఫ్రికా ఆసియా రచయితల సంఘం అందించే లోటస్ పురస్కారాలు వరించాయి. ఎవరైనా ఆయన్ని పరిచయం చేసుకోమంటే సాదా సీదాగా ఆయన పరిచయం చేసుకునేవారు 'మిట్టి కా తన్, మాస్తి కా మన్, క్షణ్-భర్ జీవన్. ('మట్టి శరీరం, ఉల్లాసమైన మనస్సు, జీవితం క్షణ భంగురం').

2003 జనవరి 18న 95 సంవత్సరాల వయస్సులో వివిధ[2][2] శ్వాసకు సంబంధించిన వ్యాధులతో ఆయన పరమపదించాడు. ఆయన భార్య తేజీ బచ్చన్ నలుగు సంవత్సరాలు తరువాత 2007లో చనిపోయింది. ఆవిడ వయస్సు 90 సంవత్సరాలు.

వృత్తి[మార్చు]

ఉపాధ్యాయ జీవితం[మార్చు]

1941 నుండి 1952 వరకు అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో బోధకునిగా సేవలు అందించారు. తరువాత రెండు సంవత్సరాలు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, సెయింట్ కాథెరిన్ కళాశాలలో పనిచేసారు. అక్కడ ఆయన ఆంగ్ల సాహిత్య దిగ్గజం అయిన థామస్ రైస్ హెన్ సాహిత్యాన్ని అవపోసన పట్టాడు. ఆంగ్ల కవి డబ్లు.బి .ఏట్స్. మరియు తాంత్రిక రహస్యాల పైన పరిశోధనల కారణంగా డాక్టరేట్ సంపాదించాడు. ఆ సమయంలోనే ఆయన తన ఇంటి పేరుగా శ్రీవాస్తవకు బదులుగా 'బచ్చన్ అను తన ముద్దు పేరును వాడారు. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ పుచ్చుకున్న రెండో భారతీయుడు.

భారతదేశం తిరిగి వచ్చిన తరువాత కొద్దికాలం పాటు విద్యాబోధన చేసారు మరియు ఆకాశవాణి అలహాబాద్ కేంద్రంలో నిర్మాతగా పనిచేసారు. 1955 లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉద్యోగంలో చేరటానికి ఢిల్లీ చేరారు.హిందీ భారత ప్రభుత్వ అధికార భాషగా గుర్తించడానికి విశేష కృషి చేసారు.

బచ్చన్ తనని తాను ఇలా పరిచయం చేసుకునేవాడు.

मिट्टी का तन, मस्ती का मन, क्षण भर जीवन, मेरा परिचय
మట్టి కణం నేను, ఉల్లాసభరిత మనస్సు నాది, క్షణ భంగురం నా జీవితము - ఇదే నా చిరు పరిచయము
Mitti ka tan, masti ka man, kshan-bhar jivan– mera parichay

.

జనరంజక సంస్కృతి[మార్చు]

అతను రాసిన ఉత్తేజ పూరితమైన కవిత అగ్నీపత్ ("పాత్ ఆఫ్ ఫైర్") 1991లో తన కుమారుడు కరుణ లేని మాఫియా డాన్ గా నటించి దిగ్విజయము చెందిన చిత్రానికి ఆధారముగా ఉపయోగించారు. (మరియు దాని పేరునే ఆ సినిమా కథకు పెట్టారు). ఆ చిత్రము అత్యంత ప్రజాదారణ పొంది అమితాబ్ బచ్చన్ అద్భుత నటనకు జాతీయ పురస్కారం తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో అమితాబ్ ఆ కవితను పదే పదే మననం చేసుకుంటాడు

ఆ కవితలో మానవాళి అనుభవించిన, అనుభవిస్తున్న బాధలు వర్ణిస్తాడు.

ఇక్కడ వాస్తవమైన కవిత పొందుపరచబడింది.-అగ్నీపత్ :

<కవిత> अग्नि पथ! अग्नि पथ! अग्नि पथ!

वृक्ष हों भले खड़े, हो घने, हो बड़े, एक पत्र-छॉंह भी मॉंग मत, मॉंग मत, मॉंग मत! अग्नि पथ! अग्नि पथ! अग्नि पथ!

तू न थकेगा कभी! तू न थमेगा कभी! तू न मुड़ेगा कभी! कर शपथ! कर शपथ! कर शपथ!

ये महान दृश्य है, चल रहा मनुष्य है, अश्रु श्वेत् रक्त से, लथ पथ, लथ पथ, लथ पथ ! अग्नि पथ! अग्नि पथ! अग्नि पथ! </కవిత>

వ్రిక్ష్ హొ భలే ఖడే, హొ ఘనే హొ బడే ఎక్ పాత్ర చ్చావ్ భి మాంగ్ మత్, మాంగ్ మత్, మాంగ్ మత్ అగ్నీపత్ అగ్నీపత్ అగ్నీపత్ .

తునా తఖేగా కభి, తునా తమేగా కభి, తునా ముడేగా కభి , కర్ శపత్, కర్ శపత్, కర్ శపత్, అగ్నీపత్, అగ్నీపత్, అగ్నీపత్ .

ఏ మహాన్ ద్రిశ్య్ హై, చల్ రహ మనుష్య హై, అశ్రు శ్వేత్ రక్త్ సే లతపత్, లతపత్, లతపత్, అగ్నీపత్, అగ్నీపత్, అగ్నీపత్ .

పురస్కారాలు[మార్చు]

బచ్చన్ 1966లో రాజ్య సభకు ఎన్నికయ్యాడు. అంతే కాకుండా 1969లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయన్ని వరించింది. ఆయన హిందీ సాహిత్యానికి చేసిన సేవలకు గాను 1976లో పద్మ భూషణ్ మరియు సరస్వతి సమ్మాన్ వరించాయి. 1994లో "యశ్ భారతి" బిరుదును ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అందించింది. [1] అంతే కాకుండా సోవిఎట్ ల్యాండ్ నెహ్రు పురస్కారం మరియు ఆఫ్రికా ఆసియా రచయితల కూటమిచే ఇవ్వబడే లోటస్ పురస్కారం అందుకున్నాడు.

2003లో భారత ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

గ్రంథాల జాబితా[మార్చు]

కవితలు (काव्य)
 • తేరా హార్ (तेरा हार) (1932)
 • మధుశాల (मधुशाला) (1935)
 • మధుబాల (मधुबाला) (1936)
 • మధుకలష్ (मधुकलश) (1937)
 • నిషా నిమంత్రణ్ (निशा निमंत्रण) (1938)
 • ఎకాంత్ సంగీత్ (एकांत संगीत) (1939)
 • ఆకుల్ అంతర్ (आकुल अंतर) (1943)
 • సత్రంగిని (सतरंगिनी) (1945)
 • హలాహళ్ (हलाहल) (1946)
 • బెంగాల్ కా కావ్య్ (बंगाल का काव्य) (1946)
 • ఖాది కే ఫూల్ (खादी के फूल) (1948)
 • సూత్ కి మాల (सूत की माला) (1948)
 • మిలన్ యామిని (मिलन यामिनी) (1950)
 • ప్రనై పత్రిక (प्रणय पत्रिका) (1955)
 • ధార్ కే ఇదర్ ఉధర్ (धार के इधर उधर) (1957)
 • ఆర్తి ఔర్ అంగారే (आरती और अंगारे) (1958)
 • బుద్ధ ఔర్ నాచ్ ఘర్ (बुद्ध और नाचघर) (1958)
 • త్రిభంగిమ (त्रिभंगिमा) (1961)
 • చార్ ఖేమే చౌన్సాట్ ఖూంటే (चार खेमे चौंसठ खूंटे) (1962)
 • దొ చట్టనే (दो चट्टानें) (1965)
 • బహుత్ దిన బీతే (बहुत दिन बीते) (1967)
 • కట్-తి ప్రతిమోన్ కి అవాజ్ (कटती प्रतिमाओं की आवाज़) (1968)
 • ఉభార్తే ప్రతిమానో కే రూప్ (उभरते प्रतिमानों के रूप) (1969)
 • జాల్ సమెట (जाल समेटा) (1973)

వివిధ రచనలు (विविध)
 • బచ్ పన్ కే సాత్ క్షణ్ భర్ (बचपन के साथ क्षण भर) (1934)
 • ఖైయ్యంకి మధుశాల (खय्याम की मधुशाला) (1938)
 • సోపాన్ (सोपान) (1953)
 • మక్బెత్ (1957)
 • జన గీత్ (जनगीता) (1958)
 • ఒథెల్లో (1959)
 • ఒమర్ ఖైయ్యంకి రుబైయన్ (उमर खय्याम की रुबाइयाँ) (1959)
 • కవియోన్ కే సౌమ్య సంత: పంత్ (कवियों के सौम्य संत: पंत) (1960)
 • ఆజ్ కే లోకప్రియ్ హిందీ కవి : సుమిత్రానందన్ పంత్ (आज के लोकप्रिय हिन्दी कवि: सुमित्रानंदन पंत) (1960)
 • ఆధునిక్ కవి : 7 (आधुनिक कवि: ७) (1961)
 • నెహ్రు: రాజ్ నైతిక్ జీవంచిత్ర (नेहरू: राजनैतिक जीवनचित्र) (1961)
 • నయే పురానే ఝరోఖే (नये पुराने झरोखे) (1962)
 • అభినవ్ సోపాన్ (अभिनव सोपान) (1964)
 • చౌసత్ రూసీ కవితాఎయిన్ (चौसठ रूसी कवितायें) (1964)
 • డబ్లు.బి.యేట్స్ అండ్ కాల్పనికాలు (1968)
 • మార్కట్ ద్వీప్ క స్వర్ (मरकट द्वीप का स्वर) (1968)
 • నాగర్ గీత్ (नागर गीत) (1966)
 • బాచ్ పన్ కే లోకప్రియ గీత్ (बचपन के लोकप्रिय गीत) (1967)
 • హామ్లెట్ (1969)
 • భాష అప్ని భావ్ పరాయే (भाषा अपनी भाव पराये) (1970)
 • పంత్ కే సౌ పాత్ర (पंत के सौ पत्र) (1970)
 • ప్రవాస్ కి డయరీ (प्रवास की डायरी) (1971)
 • కింగ్ లియర్ (1972)
 • టూటి చూటి కడియాన్ (टूटी छूटी कड़ियां) (1973)
 • మేరి కవితాయికి ఆది సది (मेरी कविताई की आधी सदी) (1981)
 • సోహం హన్స్ (सोहं हंस) (1981)
 • ఆటవె దశక్ కి ప్రతినిధి శ్రేశ్ట్ కవితాఎయిన్ (आठवें दशक की प्रतिनिधी श्रेष्ठ कवितायें) (1982)
 • మేరి శ్రేశ్ట్ కవితాఎయిన్ (मेरी श्रेष्ठ कवितायें) (1984)
 • జో బీత్ గై సో బాత్ గై

ఆత్మా కథ / రచనవాలి (आत्मकथा / रचनावली)
 • క్యా భూలూన్ క్యా యాద్ కరూన్ (क्या भूलूं क्या याद करूं) (1969)
 • నీడ్ కా నిర్మాణ్ ఫిర్ (नीड़ का निर्माण फिर) (1970)
 • బసేరే సే దూర్ (बसेरे से दूर) (1977)
 • దశద్వార్ సే సోపాన్ తక్ (दशद्वार से सोपान तक) (1985), మధ్యాహ్నపు సమయంలో [2][3]
 • బచ్చ్చన్ రచనవాలి కే నౌ ఖండ్ (बच्चन रचनावली के नौ खण्ड) (1983)

సూచనలు[మార్చు]

 1. హరివంశ్ రాయ్ బచ్చన్, 1907-2003 Archived 2010-08-22 at the Wayback Machine. సంతాపం, ఫ్రంట్ లైన్, (ది హిందూ), ఫిబ్రవరి 01 - 14, 2003.
 2. 2.0 2.1 http://news.bbc.co.uk/1/hi/world/south_asia/2673563.stm

బాహ్య లింక్‌లు[మార్చు]

వంశవృక్షం[మార్చు]