కభీ ఖుషీ కభీ గమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కభీ ఖుషీ కభీ గమ్
కభీ ఖుషీ కభీ గమ్
దర్శకత్వంకరణ్ జోహార్
స్క్రీన్ ప్లేకరణ్ జోహార్
షీనా పారిఖ్
కథకరణ్ జోహార్
నిర్మాతయష్ జోహార్
తారాగణంఅమితాభ్ బచ్చన్
జయ బచ్చన్
షారుఖ్ ఖాన్
కాజల్
హృతిక్ రోషన్
కరీనా కపూర్
ఛాయాగ్రహణంకిరణ్ దేవహంస్
కూర్పుసంజయ్ సంక్లా
సంగీతంపాటలు:
జతిన్ లలిత్
సందేశ్ శాండిల్య
ఆదేశ్ శ్రీవాత్సవ
నేపథ్య సంగీతం:
బబ్లూ చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుయశ్ రాజ్ ఫిల్మ్‌స్
విడుదల తేదీ
14 డిసెంబరు 2001
సినిమా నిడివి
210 నిమిషాలు[1]
దేశంభారత దేశం
భాషహిందీ
బడ్జెట్40 కోట్లు[2]
బాక్సాఫీసుest.135 కోట్లు[3]

కభీ ఖుషీ కభీ గమ్... (కొన్ని సార్లు సంతోషం కొన్ని సార్లు విషాదం), (K3Gగా కూడా ప్రసిద్ధి), ఒక కుటుంబగాథా చలనచిత్రం. ఇది హిందీ భాషలో నిర్మించబడింది. 2001లో విడుదలైన ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించగా, యశ్ జోహార్ నిర్మించాడు. ఈ సినిమాలో అమితాభ్ బచ్చన్, జయ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్‌లు ప్రధాన పాత్రలను ధరించారు. ఈ సినిమాలో రాణీ ముఖర్జీ అతిథిపాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలోని పాటలకు జతిన్ లలిత్, సందేశ్ శాండిల్య, ఆదేశ్ శ్రీవాత్సవలు సంగీతాన్ని సమకూర్చగా, బబ్లూ చక్రవర్తి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలను సమీర్, అనిల్ పాండేలు రచించారు. ఒక భారతీయ కుటుంబం తాము దత్తత తీసుకున్న కుమారుని పెళ్ళి విషయంలో పడిన అపోహల గురించిన కథ ఈ సినిమాలో చూపబడింది.

కథ[మార్చు]

యశ్వవర్ధన్ (యష్) రాయ్‌చంద్ (అమితాభ్ బచ్చన్) ఢిల్లీలో ఒక బిజినెస్ టైకూన్. అతని భార్య నందిని (జయ బచ్చన్). వారు తమ పిల్లలైన రాహుల్ (షారుఖ్ ఖాన్), రోహన్ (హృతిక్ రోషన్) లను ప్రేమగా సాకుతారు. యష్ వారిని ప్రేమగా చూస్తూనే వారికి జీవిత విలువలు, ఆదర్శాలు, సభ్యత, సంస్కృతి నేర్పుతాడు. నందినికి మాత్రం రాహుల్ అంటే ప్రత్యేకమైన ప్రేమ. పిల్లలు లేక బాధపడుతూండే రోజులలో అతన్ని దత్తత తెచ్చుకుంది ఆమె. తన జీవితంలో నవ్వుల్ని నింపాడన్న అభిమానం ఆమెది. దత్తత విషయం రహస్యంగా ఉంచాలనుకున్నా రాహుల్‌కి ఎనిమిదవ యేటే ఆ విషయం తెలిసిపోయింది. అది తెలిసినప్పటి నుండి తల్లి మీద మరింత ప్రేమ పెంచుకుంటాడు. ఆమె మాట జవదాటకుండా ఉంటాడు. యష్ రాహుల్‌కు నైనా (రాణీ ముఖర్జీ) ఇచ్చి పెళ్ళి చేయాలని భావిస్తాడు. అయితే రాహుల్ అంజలీ శర్మ (కాజల్) ను ఇష్టపడుతున్నట్టు నైనా గమనించి అతడిని ప్రోత్సహిస్తుంది. యష్‌కు ఆ విషయం తెలిసి ఉగ్రుడౌతాడు. తండ్రిని సమాధాన పరచడానికి అంజలిని పెళ్ళి చేసుకోనని అతడికి మాట ఇస్తాడు. తన తండ్రికిచ్చిన మాట గురించి అంజలికి తెలియజేయడానికి వెళ్లిన రాహుల్ అక్కడ అంజలి తండ్రి (అలోక్ నాథ్) చనిపోయి ఉండడం గమనించి తన తండ్రికిచ్చిన మాటను పక్కకు పెట్టి అంజలిని పెళ్ళి చేసుకుంటాడు. ఈ పెళ్ళిని తండ్రి అంగీకరించక పోవడంతో రాహుల్ ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. నందిని కుమిలిపోతుంది.

రాహుల్, అంజలి, ఆమె చెల్లెలు పూజ (కరీనా కపూర్) లండన్ వెళ్లిపోతారు. అక్కడ రాహుల్, అంజలికి క్రిష్ (జిబ్రాన్ ఖాన్) పుడతాడు. రోషన్ బోర్డ్ పాఠశాల నుండి చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. తల్లి తన అన్న రాహుల్ గురించి కుమిలిపోవడం గమనించి మళ్ళీ తమ కుటుంబాలను కలపాలని నిశ్చయించుకుంటాడు. రాహుల్ కోసం లండన్ వెళ్లి అక్కడ కింగ్స్ కాలేజీలో చేరతాడు. పూజ కూడా అక్కడే చదువుతూ ఉంటుంది. పూజ, రాహుల్ ఇద్దరూ కలసి తమ కుటుంబాలను కలపడానికి ప్రయత్నాలు చేసి చివరకు విజయం సాధిస్తారు.[4]

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

కరణ్ జోహార్ తన తొలి సినిమా కుచ్ కుచ్ హోతాహై (1998) విజయవంతమైన తర్వాత తరాల మధ్య ఉన్న అంతరాలను ప్రతిబింబించే కథపై పనిచేయడం మొదలు పెట్టాడు. నిజానికి మొదట ఇద్దరు కోడళ్ల చుట్టూ కథ అల్లుకున్నాడు. అయితే ఆదిత్య చోప్రా సూచనపై కథను ఇద్దరు సోదరుల చుట్టూ నడిపించాడు.[5]

ఈ "కభీ ఖుషీ కభీ గమ్"కు ప్రేరణ యష్ చోప్రా 1976లో తీసిన "కభీ కభీ" అనే సినిమా.[6] ఈ సినిమా అసలైన షూటింగ్ ప్రారంభించడానికి ముందు కరణ్, కాస్ట్యూమ్‌ డిజైనర్లు (మనీష్ మల్హోత్రా, షబినా ఖాన్, రాకీ) కలిసి అమెరికా, లండన్, మిలన్, న్యూఢిల్లీలలో పలు చోట్ల పాత్రలకు తగిన దుస్తులకోసం షాపింగ్ చేశారు.[7] ఈ సినిమా నిర్మాణానికి కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ను, ప్రొడక్షన్ డిజైనర్ శర్మిష్ఠా రాయ్‌ని, సినిమాటోగ్రాఫర్ కిరణ్ దేవ్‌హంస్‌ను నియమించుకున్నాడు. [8]

చిత్రీకరణ[మార్చు]

ఈ సినిమా తొలి షెడ్యూలు 2000, అక్టోబర్ 16న ప్రారంభమైంది. మొదట హృతిక్ రోషన్, కరీనా కపూర్, షారుఖ్ ఖాన్, కాజల్‌ల పై "బడే చుడియా" అనే పాటను చిత్రీకరించారు. అమితాభ్ బచ్చన్, జయ బచ్చన్ అక్టోబర్ 20న షూటింగులో చేరారు. ఈ నటుల బిజీ షెడ్యూలు వల్ల కరణ్ జోహార్ వత్తిడికి తట్టుకోలేక సెట్స్‌లో సొమ్మసిల్లి పడి పోయాడు.[9] అయినా పడక మీద నుండే ఈ పాట షూటింగును పూర్తి చేశాడు.[10]

సినిమా తొలిసగంలో కనిపించే "చాందినీచౌక్" ముంబైలోని ఫిల్మ్‌సిటీలోని ఒక స్టూడియోలో సెట్టింగ్ వేసి చిత్రీకరించారు. [11]

రాయ్‌చంద్ కుటుంబం నివసించే భవనంగా చిత్రీకరించిన ఇంగ్లాండులోని వాడెస్డన్ మానర్ (చిత్రంలో)

ఈ సినిమా రెండవ సగం లండన్‌లో షూట్ చేశారు. లండన్ నగరంలోని వేల్స్ మిలీనియం సెంటర్, బ్లూవాటర్ షాపింగ్ సెంటర్, బ్లెన్‌హీమ్‌ ప్యాలెస్, సెయింట్ పాల్ కేథడ్రల్, థేమ్స్ నదీ తీరాలలో సన్నివేశాలను చిత్రీకరించారు. రాయ్‌చంద్ నివసించే భవనం బయటి సన్నివేశాలను వాడెస్డన్ మానర్‌ వద్ద చిత్రీకరించారు.[12]

కాజల్, షారుఖ్ ఖాన్‌లపై ఒక పాటను ఈజిప్టులోని కైరో నగరంలో పిరమిడ్ల వద్ద తీశారు.[13] సరైన వెలుతురు లేని కారణంగా ఈ పాట చిత్రీకరణ పూర్తి చేయడానికి చాలా రోజులు పట్టింది.[14]

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు జతిన్ లలిత్, సందేశ్ శాండిల్య, ఆదేశ్ శ్రీవాత్సవ సంగీతం సమకూర్చారు. ఈ పాటలను సమీర్, అనిల్ పాండే రచించారు. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. ఈ పాటలను సోనీ మ్యూజిక్ సంస్థ 2001, అక్టోబరు 16న విడుదల చేసింది.[15][16]

కభీ ఖుషీ కభీ గమ్‌ పాటల జాబితా
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."కభీ ఖుషీ కభీ గమ్"సమీర్జతిన్ లలిత్లతా మంగేష్కర్7:55
2."బోలే చుడియా"సమీర్జతిన్ లలిత్కవితా కృష్ణమూర్తి, అల్కా యాజ్ఞిక్, సోను నిగమ్, ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్6:50
3."యు ఆర్ మై సోనియా"సమీర్సందేశ్ శాండిల్యఅల్కా యాజ్ఞిక్, సోను నిగమ్‌5:45
4."సూరజ్ హువా మద్ధమ్"అనిల్ పాండేసందేశ్ శాండిల్యఅల్కా యాజ్ఞిక్, సోను నిగమ్‌7:08
5."సే షవ షవ"సమీర్ఆదేశ్ శ్రీవాత్సవఅల్కా యాజ్ఞిక్, సునిధి చౌహాన్, ఉదిత్ నారాయణ్, సుధేష్ భోస్లే, ఆదేశ్ శ్రీవాత్సవ, అమితాభ్ బచ్చన్6:50
6."యే లడ్కా హై అల్లా"సమీర్జతిన్ లలిత్అల్కా యాజ్ఞిక్, ఉదిత్ నారాయణ్5:28
7."కభీ ఖుషీ కభీ గమ్— విషాదం (పార్ట్ 1)"సమీర్జతిన్ లలిత్సోను నిగమ్‌1:53
8."దీవానా హై దేఖో"సమీర్సందేశ్ శాండిల్యఅల్కా యాజ్ఞిక్, సోను నిగమ్‌, కరీనా కపూర్5:46
9."కభీ ఖుషీ కభీ గమ్— విషాదం (పార్ట్ 2)"సమీర్జతిన్ లలిత్లతా మంగేష్కర్1:53
10."సోల్ ఆఫ్ K3G" సందేశ్ శాండిల్యవాద్యాలు2:18
11."వందేమాతరం"బంకించంద్ర ఛటోపాధ్యాయసందేశ్ శాండిల్యకవితా కృష్ణమూర్తి, ఉషా ఉతుప్4:15
Total length:56:01

విడుదల, స్పందన[మార్చు]

2001 దీపావళి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు కానీ ఒక నెల ఆలస్యంగా 2001, డిసెంబరు 14వ తేదీన మొదటి సారి తెరపై ప్రదర్శించబడింది.[17] ఈ సినిమా నిడివి ఎక్కువ కావడం మూలాన రోజుకు 4 ప్రదర్శనలకు బదులు 3 ప్రదర్శనలు మాత్రం ఇచ్చారు. అంతే కాకుండా ఎక్కువ రద్దీ కారణంగా అనేక థియేటర్లు టికెట్టు ధరలను పెంచాయి.[18]


విమర్శకుల స్పందన[మార్చు]

Actress Kajol at a party
ఈ చిత్రంలో కాజల్ నటన విమర్శకుల ప్రశంసలకు పాత్రమైంది.

ఈ సినిమాపై విమర్శకులందరూ సానుకూలంగా స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, అవుట్‌లుక్ వంటి పత్రికలు సమీక్షలు వ్రాశాయి. బి.బి.సి., వెరైటీ వంటి విదేశీ మాధ్యమాలు కూడా ఈ సినిమాను ప్రశంసించాయి. అయితే ఈ సినిమా నిడివి గురించి, స్క్రిప్టు గురించి కొంత వ్యతిరేక వ్యాఖ్యానాలు వినిపించాయి.

బాక్సాఫీసు[మార్చు]

కభీ ఖుషీ కభీ గమ్‌ విడుదల నుండే అన్ని రికార్డులను బద్దలు చేసింది. ఈ సినిమా మొదటి వారాంతంలో భారతదేశంలో 14కోట్లు వసూలు చేసింది.[3] ఇది గత రికార్డు కన్నా 70% అధికం. రెండవ, మూడవ వారాల వసూళ్లు కూడా రికార్డులు సృష్టించాయి.రెండవ వారం 10.5 కోట్లు వసూలు చేస్తే, మూడవ వారం 8 కోట్లు సంపాదించింది.[19] 55 కోట్లతో ఈ సినిమా 2001లో రెండవ అత్యంత ఎక్కువ వ్యాపారం చేసిన సినిమాగా నిలిచి, బ్లాక్‌బస్టర్ స్థాయిని చేరుకుంది.[3][20]

ఈ సినిమా విదేశాలలో 125 ప్రింట్లతో 8.9 మిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది.[3][21]

పురస్కారాలు[మార్చు]

కభీ ఖుషీ కభీ గమ్... సినిమా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలకు 15 ప్రతిపాదనలు లభించగా వాటిలో ఐదు అవార్డులు దక్కించుకుంది.[22][23]

ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ (IIFA) అవార్డులను 8 కైవసం చేసుకుంది.[24][25]

ఈ సినిమా నామినేట్ చేయబడిన, గెలుపొందిన అవార్డుల వివరాలు:

అవార్డు విభాగం నామినీ ఫలితం
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ నటి కాజల్ గెలుపు
ఉత్తమ సహాయనటి జయ బచ్చన్
ఉత్తమ సంభాషణల రచయిత కరణ్ జోహార్
ఉత్తమ కళాదర్శకుడు శర్మిష్టా రాయ్
ఉత్తమ సన్నివేశం[26] కభీ ఖుషీ కభీ గమ్...
ఉత్తమ చిత్రం యశ్ జోహార్ Nominated
ఉత్తమ దర్శకుడు కరణ్ జోహార్
ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్
ఉత్తమ సహాయ నటుడు అమితాభ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటుడు హృతిక్ రోషన్
ఉత్తమ సహాయ నటి కరీనా కపూర్
ఉత్తమ సంగీత దర్శకుడు జతిన్ లలిత్
ఉత్తమ గేయ రచయిత అనిల్ పాండే
ఉత్తమ గేయ రచయిత సమీర్
ఉత్తమ గాయకుడు సోను నిగమ్
స్క్రీన్ అవార్డులు ఉత్తమ నటి కాజల్ గెలుపు
జోడీ నెం 1 షారుఖ్ ఖాన్ & కాజల్
వాలెన్సీనెస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఉత్తమ చిత్రం (ప్రత్యేక జ్యూరీ అవార్డు) యశ్ జోహార్
ఉత్తమ చిత్రం (ప్రేక్షకుల జ్యూరీ అవార్డు) యశ్ జోహార్
ఉత్తమ చిత్రం (స్టూడెంట్ జ్యూరీ అవార్డు) యశ్ జోహార్
ఉత్తమ నటి కాజల్
బ్ల్యూనార్డ్ అవార్డు జతిన్ లలిత్, సందేశ్ శాండిల్య, ఆదేశ్ శ్రీవాత్సవ
ఐఫా అవార్డులు ఉత్తమ సహాయనటి జయ బచ్చన్
ఉత్తమ నేపథ్యగాయకుడు సోను నిగమ్‌
ఉత్తమ సంభాషణల రచయిత కరణ్ జోహార్
ఉత్తమ కళాదర్శకత్వం శర్మిష్ఠా రాయ్
ఉత్తమ నేపథ్య సంగీతం బబ్లూ చక్రవర్తి
ఉత్తమ శబ్దగ్రాహకుడు అనిల్ మాథుర్ & నకుల్ కాంటే
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ మనీష్ మల్హోత్రా
ఉత్తమ మేకప్ కళాకారుడు మికీ కాంట్రాక్టర్
జీ సినీ అవార్డులు ఉత్తమ గాయకుడు సోను నిగమ్‌
ఉత్తమ నటి కాజల్

మూలాలు[మార్చు]

నోట్స్
  1. "Kabhi Khushi Kabhi Gham (PG)". British Board of Film Classification. Archived from the original on 21 February 2014. Retrieved 2 February 2013.
  2. Dhawan, Himanshu (28 January 2002). "Look who's laughing". India Today. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 10 May 2012.
  3. 3.0 3.1 3.2 3.3 "Kabhi Khushi Kabhie Gham..." Box Office India. Archived from the original on 18 July 2016. Retrieved 24 August 2015.
  4. సంపాదకుడు (16 December 2001). "అర్థం చేసుకుందాం ఆస్వాదిద్దాం కభీఖుషీ కభీగమ్". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (6): 54–55. Retrieved 9 April 2018.
  5. Jha, Subhash K. (21 December 2001). "Cherished moments in film-making". The Hindu. Archived from the original on 4 May 2012. Retrieved 7 May 2012.
  6. "An exclusive interview with director Karan Johar". Rediff. 9 December 1998. Archived from the original on 4 March 2016. Retrieved 2 May 2012.
  7. "Fashion Speak". Rediff. 12 December 1998. Archived from the original on 14 November 2012. Retrieved 2 May 2012.
  8. "Kabhi Khushi Kabhie Gham (2001) | Hindi Movie Critic Review By Taran Adarsh — Bollywood Hungama". Bollywood Hungama. 11 December 2001. Archived from the original on 10 జూలై 2012. Retrieved 4 May 2012.
  9. Omar 2006, pp. 70–71
  10. Making of Kabhi Khushi Kabhie Gham... DVD special feature. From the 36–38-minute mark.
  11. Deepanjana Pal (September 2013). "Places Other Than This". The Big Indian Picture. Archived from the original on 5 డిసెంబరు 2013. Retrieved 9 ఏప్రిల్ 2018.
  12. "On Location – London calling: Kabhi Khushi Kabhi Gham". The Indian Express. Retrieved 16 December 2012.
  13. Chattopadhyay, Sohini (15 April 2005). "Hot Spots". The Telegraph (Calcutta). Archived from the original on 11 September 2012. Retrieved 10 May 2012.
  14. "'K3G will be the biggest film after Sholay'". Rediff. 12 December 2001. Archived from the original on 14 November 2012. Retrieved 7 May 2012.
  15. "Kabhi Khushi Kabhie Gham...: Lata Mangeshkar: Music". Amazon.com. Archived from the original on 1 May 2012. Retrieved 8 May 2012.
  16. "iTunes — Music — Kabhi Khushi Kabhie Gham (Original Motion Picture Soundtrack) by Various Artists". Itunes.apple.com. 28 November 2001. Archived from the original on 5 January 2012. Retrieved 8 May 2012.
  17. Wallia, Kajal (7 November 2001). "No big Hindi film release this Diwali". The Times of India. Retrieved 8 May 2012.
  18. "K3G — Cheers to a great start!". The Times of India. 17 December 2001. Retrieved 8 May 2012.
  19. "Ten Years On: Kabhi Khushi Kabhie Gham". Boxofficeindia.com. Archived from the original on 6 June 2013. Retrieved 15 December 2011.
  20. "Box Office 2001". Boxofficeindia.com. Archived from the original on 14 అక్టోబరు 2013. Retrieved 9 ఏప్రిల్ 2018.
  21. "International Box Office Results". BoxofficeMojo. Archived from the original on 11 November 2012. Retrieved 7 May 2012.
  22. "Filmfare Nominees And Winners" (PDF). The Times Group. pp. 110–112. Archived (PDF) from the original on 19 October 2015. Retrieved 12 January 2017.
  23. "Filmfare Awards 2002". Awardsandshows.com. Archived from the original on 21 మార్చి 2016. Retrieved 9 ఏప్రిల్ 2018.
  24. "Rare opportunity for Malaysian fans". The Hindu. 26 April 2002. Archived from the original on 31 March 2012. Retrieved 4 May 2012.
  25. "Lagaan scoops Bollywood awards". BBC News. 6 April 2002. Archived from the original on 23 November 2008. Retrieved 13 January 2008.
  26. "Best Dialogue/Filmfare-Sony Best Scene: Karan Johar". Filmfare. April 2002. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 9 ఏప్రిల్ 2018.
గ్రంథసూచి
  • Eckstein, Lars (2008), Multi-Ethnic Britain 2000+: New Perspectives in Literature, Film and the Arts, Rodopi, ISBN 9042024976.
  • Hirji, Faiza (2010), Dreaming in Canadian: South Asian Youth, Bollywood, and Belonging, UBC Press, ISBN 0774817984.
  • Mazumdar, Ranjani (2007), Bombay Cinema: An Archive of the City, University of Minnesota Press, ISBN 0816649421.
  • Mazur, Eric (2011), Encyclopedia of Religion and Film, ABC-CLIO, ISBN 0313330727.
  • Bhattacharya Mehta, Rini; Pandharipande, Rajeshwari (2010), Bollywood and Globalization: Indian Popular Cinema, Nation, and Diaspora: Anthem South Asian Studies, Anthem Press, ISBN 1843318334.
  • Omar, Fuad (2006), Bollywood: An Insider's Guide, Lulu.com, ISBN 1847280099.
  • Oonk, Gijsbert (2007), Global Indian Diasporas: Exploring Trajectories of Migration and Theory, Amsterdam University Press, ISBN 9053560351.
  • Punathambekar, Aswin (2005). "Bollywood in the Indian-American Diaspora: Mediating a transitive logic of cultural citizenship" (PDF). International Journal of Cultural Studies. SAGE Publications. 8 (2): 151–173. doi:10.1177/1367877905052415. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2018-04-09.
  • Stringer, Julian (2003), Movie Blockbusters, Routledge, ISBN 0415256089.

ఇవి కూడా చదవండి[మార్చు]

  • అయ్యంగార్, నిరంజన్ (2002). ద మేకింగ్ ఆఫ్ కభీ ఖుషీ కభీ గమ్. ధర్మ పబ్లికేషన్స్ (ఇండియా బుక్ హౌస్ సౌజన్యంతో). ISBN 81-7508-338-7.

బయటి లింకులు[మార్చు]