సోను నిగమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోను నిగమ్
SonuNigam02.jpg
సోను నిగమ్
వ్యక్తిగత సమాచారం
జననం (1973-07-30) 1973 జూలై 30 (వయస్సు: 46  సంవత్సరాలు)[1]
ఫరీదాబాద్, హర్యానా, [1]
రంగంపాప్ సంగీతం, సాంప్రదాయ సంగీతం, నేపథ్యగానం, గజల్ సంగీతం
వృత్తిగాయకుడు, నటుడు, వ్యాఖ్యాత
వాయిద్యాలుగిటారు
జీవిత భాగస్వామిమధురిమ నిగమ్
లేబుళ్ళుసోనీ మ్యూజిక్, టి-సిరీస్, టిప్స్, సరేగమ, వీనస్ రికార్డ్స్ అండ్ టేప్స్
వెబ్‌సైటుsonunigam.in

సోను నిగమ్ (జ. 30 జులై, 1973)[2] ఒక భారతీయ గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత. ఎక్కువగా హిందీ సినిమాల్లో పాడుతాడు. అంతే కాకుండా బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, నేపాలీ లాంటి అనేక భాషల్లో పాటలు పాడాడు. అనేక దేశీ పాప్ ఆల్బమ్స్ విడుదల చేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు.[3] భారతీయ గాయకుల్లో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో ఒకడు.[4][5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

సోనూ నిగం 1973, జులై 30 న ఆగమ్ కుమార్ నిగమ్, శోభ నిగమ్ దంపతులకు హర్యానాలోని ఫరీదాబాదు లో జన్మించాడు.[6] నాలుగేళ్ళ చిరుప్రాయం నుంచే తండ్రితో పాటు వేదికనెక్కి పాటలు పాడటం ప్రారంభించాడు.[7][8] తర్వాత తండ్రితో పాటే అనేక శుభకార్యాల్లో పాటల కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాడు. 18 ఏళ్ళ వయసుకు బాలీవుడ్ లో ప్రవేశం కోసం తండ్రితో పాటు ముంబైకి వచ్చాడు.[9] హిందుస్తానీ గాయకుడు గులాం ముస్తఫా ఖాన్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు.[10]

2002 ఫిబ్రవరి 15 న మాధురితో అతని వివాహం జరిగింది.[11]

వృత్తి జీవితం[మార్చు]

హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్ పురీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మైథిలి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, తుళు, తమిళం, తెలుగు, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ప్రేమ, దేశభక్తి, రాక్, వేదనా భరిత గీతాలను ఆలపించాడు. హిందీ, కన్నడ, ఒరియా, చత్తీఘరీ, పంజాబీ భాషల్లో పాప్ ఆల్బమ్స్ విడుదల చేశాడు. హిందూ, ఇస్లాం భక్తి గీతాల పాటలతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన ఆల్బమ్స్ కూడా రూపకల్పన చేశాడు.

అమెరికా, యూరోపు, మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రదర్శనలిచ్చాడు. 2007 సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సింప్లీ సోను అనే పేరుతో కెనడా, జర్మనీ దేశాల్లో వ్యక్తిగత ప్రదర్శనలిచ్చాడు. ఒక భారతీయుడు ఇలాంటి ప్రదర్శనలివ్వడం అదే మొదటి సారి.[12]

మైకేల్ జాక్సన్ మరణించిన తర్వాత అతని మృతికి నివాళిగా ఒక పాటను విడుదల చేశాడు. ఈ పాటను అతని స్మృతికి నివాళిగా రూపొందించిన ద బీట్ ఆఫ్ అవర్ హార్ట్స్ అనే ఆల్బం లో చేర్చారు.[13]

వివాదాలు[మార్చు]

ముస్లింలు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే లౌడ్ స్పీకర్లలో ప్రార్థన చేయడం తనకు నిద్రా భంగం కలుగుతోందని తన ట్విటర్ ఖాతాలో ప్రకటించడం వివాదానికి దారి తీసింది.[14] తరువాత తను ఏ మతానికి వ్యతిరేకం కాదనీ, మసీదుల్లోనైనా, దేవాలయాల్లోనైనా శబ్ద పరిమితికి మించిన స్పీకర్లు వాడకానికే తను వ్యతిరేకమని ప్రకటించాడు.[15] తన నిద్ర నిజంగా పాడవుతుందనేదానికి సాక్ష్యంగా ఉదయం తన ఇంట్లో తీసిన వీడియోను ఎక్కించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.[16] పశ్చిమ బెంగాల్ ఐక్య మైనారిటీ సమితి అధ్యక్షుడు సయ్యద్ షా అతీఫ్ అలీ అల్ ఖురేషీ ఇతని తలను గుండు గీసిన వారికి పది లక్షల నజరానా ప్రకటించాడు. ఇందుకు సమాధానంగా సోనూ తన గుండు తానే గీసుకున్నాడు.[17]

ఈ వివాదాలకు కారణమైన తన ట్విటర్ ఖాతా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించేందుకు సరైంది కానిదిగా భావించి మే 24, 2017 న తొలగించాడు.[18]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Biography". The Times of India. TNN. 18 January 2011. మూలం నుండి 23 September 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 23 September 2016.
 2. Sen, Sushmita (30 July 2015). "Happy Birthday Sonu Nigam: Lesser Known Facts and Popular Tracks of the Singing Sensation". International Business Times, India Edition. Retrieved 14 May 2016.
 3. "It's Nigam, not Niigaam, Says Sonu". The Times of India. 8 September 2010. Retrieved 3 April 2012.
 4. "sonu nigam creates magic in kannada". August 19, 2010. Cite web requires |website= (help)
 5. "The golden singer of Karnataka". Jul 30, 2014. Cite web requires |website= (help)
 6. "Sonu Nigam: About Me". Sonu Nigam. మూలం నుండి 8 డిసెంబర్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 28 November 2015. Cite web requires |website= (help)
 7. "Sonu Nigam: My mother was my best ally — The Times of India". The Times Of India.
 8. India Today: An Encyclopedia of Life in the Republic: An …, Volume 1. Books.google.co.in. 2011-09-23. Retrieved 2014-08-25.
 9. "Sonu Nigam". మూలం నుండి 15 సెప్టెంబర్ 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 25 July 2008. Cite web requires |website= (help)
 10. "A look at the rise and careers of Sonu Nigam and Atif Aslam ahead of their concert tomorrow". Abu Dahbi Media. Retrieved 27 November 2015. Cite web requires |website= (help)
 11. "Sonu Nigam weds city belle". The Times of India. PTI. 15 February 2002. మూలం నుండి 8 November 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 8 November 2016. Cite uses deprecated parameter |dead-url= (help)
 12. "Sonu Nigam's Tour to Germany". Retrieved 25 July 2008. Cite web requires |website= (help)
 13. "Michael Jackson Trubute portrait". మూలం నుండి 18 డిసెంబర్ 2010 న ఆర్కైవు చేసారు. Retrieved 15 November 2010. Cite web requires |website= (help)
 14. "Sonu Nigam on Azaan row: I stand by my statement - Times of India". The Times of India. Retrieved 2017-04-18.
 15. "Sonu Nigam tweets more clarification: Mentioned temples, gurudwaras too". Hindustan Times (ఆంగ్లం లో). 2017-04-19. Retrieved 2017-04-19.
 16. "Sonu Nigam posts video of azaan from his home, sparks controversy yet again". Hindustan Times (ఆంగ్లం లో). 2017-04-27. Retrieved 2017-04-23.
 17. "Rs 10 lakh to shave Sonu Nigam; Bengal "fatwa imam" says it's not a fatwa". Hindustan Times (ఆంగ్లం లో). 2017-04-19. Retrieved 2017-05-26.
 18. "Sonu Nigam quits Twitter, rants at length in support of Paresh Rawal, Abhijeet" (ఆంగ్లం లో). Cite news requires |newspaper= (help)