Jump to content

ఫరీదాబాద్

అక్షాంశ రేఖాంశాలు: 28°25′16″N 77°18′28″E / 28.4211°N 77.3078°E / 28.4211; 77.3078
వికీపీడియా నుండి
ఫరీదాబాద్
మెట్రో
పైనుండి, ఎడమ నుండి కుడికి: వాటికా మైండ్‌స్కేప్స్, సూరజ్‌కుండ్ వద్ద ఉన్న సరస్సు, ఫరీదాబాద్ క్రౌన్ ప్లాజా, లార్సెన్ అండ్ టూబ్రో కార్పొరేట్ ఆఫీసు
ఫరీదాబాద్
ఫరీదాబాద్
ఫరీదాబాద్
Coordinates: 28°25′16″N 77°18′28″E / 28.4211°N 77.3078°E / 28.4211; 77.3078
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యాణా
జిల్లాఫరీదాబాద్
మెట్రోపాలిటన్ ప్రాంతంఢిల్లీ
స్థాపన1607
Named forషేక్ ఫరీద్
విస్తీర్ణం
 • Total742.9 కి.మీ2 (286.8 చ. మై)
Elevation
198 మీ (650 అ.)
జనాభా
 (2011)
 • Total14,04,653[1]
 • జనసాంద్రత1,890.7/కి.మీ2 (4,897/చ. మై.)
Demonymఫరీదాబాదీ
భాషలు
 • అధికారికహిందీ, పంజాబీ
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్0129
Vehicle registrationHR-51 (North)
HR-29 (South)
HR-87 (West)
HR-38 (Commercial)
DL-16 (Delhi NCR)
Website

పటం

ఫరీదాబాద్ హర్యానాలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఇది ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. భారత రాజధాని న్యూ ఢిల్లీ సరిహద్దుల్లో, జాతీయ రాజధాని ప్రాంతంలో ఉంది. ఢిల్లీకి చెందిన ప్రధాన ఉపగ్రహ నగరాల్లో ఇదొకటి. రాష్ట్ర రాజధాని చండీగఢ్కు దక్షిణంగా 284 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్పున జిల్లా సరిహద్దుగా యమునా నది ఉంది. 2016 మే 24 న భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ రెండవ జాబితాలో నగరాన్ని చేర్చింది. [2] సిటీ మేయర్స్ ఫౌండేషన్ చేసిన సర్వే ఫరీదాబాద్‌ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎనిమిదవ నగరంగా, భారతదేశంలో మూడవదిగా పేర్కొంది. [3] 2001 ఢిల్లీ ప్రాంతీయ ప్రణాళిక ప్రకారం ఫరీదాబాద్, ఢిల్లీ మెట్రోపాలిటన్ ఏరియా (డిఎంఎ) లో భాగం. [4]

ఆగ్రా కాలువకూ యమునా నదికీ మధ్య కొత్తగా అభివృద్ధి చెందిన నివాస, పారిశ్రామిక ప్రాంతాన్ని (సెక్టరు 66 నుండి 89 వరకు) గ్రేటర్ ఫరీదాబాద్ అని పిలుస్తారు. వెడల్పైన రహదారులు, ఎత్తైన భవనాలు, మాళ్ళు, విద్యాసంస్థలు, ఆరోగ్య, వాణిజ్య కేంద్రాలతో ఈ ప్రాంతం స్వయం సమృద్ధ ఉప నగరంగా అభివృద్ధి చెందుతోంది. 66 నుంచి 74 వరకూ ఉన్న సెక్టర్లు పారిశ్రామిక ప్రాంతం కాగా, 75 నుంచి 89 వరకు నివాస ప్రాంతం. [5]

ఫరీదాబాద్ హర్యానా లోని ప్రధాన పారిశ్రామిక కేంద్రం. హర్యానాలో వసూలు చేసిన ఆదాయపు పన్నులో 50% ఫరీదాబాద్, గుర్గావ్ ల నుండే వస్తుంది. [6] ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు, స్విచ్ గేర్లు, రిఫ్రిజిరేటర్లు, బూట్లు, టైర్లు, వస్త్రాలు దాని ముఖ్యమైన పారిశ్రామిక ఉత్పత్తుల్లో కొన్ని. వ్యవసాయ రంగంలో గోరింట ఉత్పత్తికి ఫరీదాబాద్ ప్రసిద్ధి చెందింది.

2018 లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫరీదాబాద్‌ను ప్రపంచంలోనే రెండవ అత్యంత కలుషిత నగరంగా పరిగణించింది. [7] 2020 లో చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో, అత్యంత అపరిశుభ్రమైన భారత నగరాల్లో ఫరీదాబాద్ 10 వ స్థానంలో నిలిచింది..[8]

భారత ప్రభుత్వం వారు స్మార్ట్ నగరాల కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్న వంద భారత నగరాలలో ఫరీదాబాద్ ఒకటి.

చరిత్ర

[మార్చు]

మొగలు చక్రవర్తి జహంగీర్ కోశాధికారి షేక్ ఫరీద్, ఢిల్లీ, ఆగ్రాల మధ్య ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్డును రక్షించడానికి 1607 లో ఫరీదాబాద్ నగరాన్ని స్థాపించాడు. 1867 లో ఇది మునిసిపాలిటీగా మారింది. పాకిస్తాన్ శరణార్థుల పునరావాసం కోసం, తేలికపాటి పరిశ్రమల అభివృద్ధి కోసం 1950 లో నగరంలో ఒక ప్రాజెక్టును ప్రారంభించారు. స్వతంత్ర భారతదేశంలో, ఫరీదాబాద్ మొదట్లో గుర్గావ్ జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత 1979 ఆగస్టు 15 న దీన్ని స్వతంత్ర జిల్లాగా మార్చారు.

భౌగోళికం

[మార్చు]

శీతోష్ణస్థితి

[మార్చు]
Faridabad
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
15
 
21
8
 
 
19
 
23
10
 
 
21
 
30
15
 
 
27
 
36
21
 
 
29
 
39
26
 
 
61
 
39
28
 
 
214
 
35
27
 
 
228
 
34
26
 
 
100
 
34
25
 
 
21
 
33
19
 
 
5
 
28
13
 
 
14
 
22
8
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm

ఫరీదాబాద్‌లో వేడితో కూడిన, అర్ధ-శుష్క శీతోష్ణస్థితి ( కొప్పెన్ BSh) ఉంటుంది. ఇది పొడి-శీతాకాలపు తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం (Cwa) కంటే కొంచమే తక్కువ. ఈ నగరంలో మూడు విలక్షణమైన భారతీయ ఋతువులు ఉన్నాయి. మొదటిది, ఉక్కపోతతో వేడిగా, ఋతుపవనాలకు ముందుండే వేసవి కాలం. ఇది మార్చి చివరి నుండి జూన్ చివరి వరకు ఉంటుంది. చాలా పొడిగా మొదలై, తరువాత తేమగా మారే శుష్క పరిస్థితులు ఈ ఋతువులో ఉంటాయి. రెండవది తడి లేదా ఋతుపవనాల కాలం. ఇది తరచూ కురిసే భారీ వర్షాలతో, విపరీతమైన తేమతో కూడుకుని ఉంటుంది. మూడవది ఋతుపవనాల తిరోగమనం తరువాత వచ్చే శీతాకాలం. చిరు వెచ్చటి ఎండతో శీతాకాలం చల్లగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Faridabad
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 21
(70)
23
(73)
30
(86)
36
(97)
39
(102)
39
(102)
35
(95)
34
(93)
34
(93)
33
(91)
28
(82)
22
(72)
31
(88)
సగటు అల్ప °C (°F) 8
(46)
10
(50)
15
(59)
21
(70)
26
(79)
28
(82)
27
(81)
26
(79)
25
(77)
19
(66)
13
(55)
8
(46)
19
(66)
సగటు వర్షపాతం mm (inches) 15
(0.6)
19
(0.7)
21
(0.8)
27
(1.1)
27
(1.1)
61
(2.4)
214
(8.4)
228
(9.0)
100
(3.9)
21
(0.8)
5
(0.2)
14
(0.6)
752
(29.6)
Source: Weather 2[9]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

హర్యానాలో వసూలైన మొత్తం ఆదాయపు పన్నులో ఫరీదాబాద్, గుర్గావ్ జిల్లాల వాటాయే దాదాపు 56% వరకు ఉంటుందని ఫరీదాబాద్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ పేర్కొంది. స్మార్ట్ సిటీస్ మిషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయబోయే వంద భారతీయ నగరాల్లో ఫరీదాబాద్ కూడా ఎంపికయింది. [10]

వ్యవసాయం

[మార్చు]
అమూల్ వారి బనాస్ డెయిరీ

ఫరీదాబాద్, భారతదేశంలో అతిపెద్ద గోరింటాకు (మెహెందీ) ఎగుమతిదారు. ఫరీదాబాద్ హెన్నా తయారీ సంఘం ప్రకారం, ఇక్కడి వార్షిక గోరింట అమ్మకం విలువ ₹ 250 కోట్లు - ₹ 300 కోట్లు.

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు

[మార్చు]
NPTI Corporate Office, Faridabad
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కార్పొరేట్ ఆఫీస్, ఫరీదాబాద్

వివిధ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఫరీదాబాద్‌లో ఉన్నాయి. వీటిలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, ప్లాంట్ క్వారంటైన్ అండ్‌ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ ల్యాబ్‌లు ఉన్నాయి. హర్యానా లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, భారత ప్రభుత్వ రెవెన్యూ శాఖలోని సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్‌తో సహా పేలుడు పదార్థాల విభాగం, కార్మిక శాఖ కార్యాలయాల వంటి అనేక కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం కూడా ఫరీదాబాద్‌లో ఉంది. [11]

భారత ప్రభుత్వ రెవెన్యూ శాఖకు చెందిన అపెక్స్ సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ & నార్కోటిక్స్ కార్యాలయం నగరం లోని సెక్టర్ 29 లో ఉంది. భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారి కార్పొరేట్ కార్యాలయం ఇక్కడే ఉంది. [12] ఫరీదాబాద్. నగరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కూడా ఉంది. ఇది అకౌంటింగ్ ఆర్థిక సేవలకు శిక్షణా అకాడమీగా పనిచేస్తుంది.

ఎన్‌హెచ్‌పిసి సంస్థ ప్రధాన కార్యాలయం కూడా నగరంలో ఉంది. ఇది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర పిఎస్‌యు సంస్థ. ఇది భారతదేశంలో అతిపెద్ద జలవిద్యుదుత్పత్తి సంస్థ.

జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి కార్యాలయం కూడా ఒకటి నగరంలోని ఎన్‌ఐటి-5 ప్రాంతంలో ఉంది.

NHPC కార్పొరేట్ కార్యాలయం, ఫరీదాబాద్

పరిశ్రమలు

[మార్చు]

ఫరీదాబాద్, హర్యానా రాష్ట్ర పారిశ్రామిక రాజధాని. 2013 నాటికి, హర్యానాలో నమోదైన మొత్తం 11,665 పనిచేసే కర్మాగారాలలో, 2,499 ఫరీదాబాద్‌లోనే ఉన్నాయి. 2,116 కర్మాగారాలతో గుర్గావ్‌ ఆ తరువాతి స్థానంలో ఉంది. ఒక అధ్యయనం ప్రకారం, గత 2 దశాబ్దాలుగా ఫరీదాబాద్‌లో వృద్ధి క్షీణిస్తోంది. పెట్టుబడుల్లో ఫరీదాబాద్ వాటా 1% కన్నా తక్కువ. నగరంలోని మొత్తం పెట్టుబడుల్లో 93% పెట్టుబడి కాగిత పరిశ్రమలోనే ఉంది. 2012–13 హర్యానా ఆదాయంలో ఫరీదాబాద్ పారిశ్రామిక ఉత్పత్తి వాటా 29% నుండి 22%కి తగ్గింది. [13]

ఎస్కార్ట్స్ లిమిటెడ్, [14] ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, హావెల్స్ ఇండియా లిమిటెడ్, [15] జెసిబి ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ (ఆర్ అండ్ డి), [16] లార్సెన్ & టౌబ్రో (ఎల్ అండ్ టి), [17] వర్ల్పూల్ ఇండియా లిమిటెడ్, ఎబిబి గ్రూప్, గుడ్‌ఇయర్ ఇండియా లిమిటెడ్, బాటా ఇండియా లిమిటెడ్, ఐషర్ ట్రాక్టర్ లిమిటెడ్, బీబే కిడ్స్‌వేర్ [18]వంటి పెద్ద కంపెనీలకు ఫరీదాబాద్ నిలయం. ఐవేర్ ఇ-టైలర్ లెన్స్కార్ట్, హెల్త్‌కేర్ స్టార్టప్ లైబ్రేట్ వారి ప్రధాన కార్యాలయాలు ఫరీదాబాద్‌లో ఉన్నాయి. [19] [20] 5,000 కి పైగా ఆటో విడిభాగాల ఉత్పత్తిదారులు ఫరీదాబాద్‌లో ఉన్నారు. లఖానీ అర్మాన్ గ్రూప్ ఫరీదాబాద్ (హర్యానా) వద్ద తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. [21]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఫరీదాబాద్ న్యూ ఢిల్లీ - ముంబై రైలు మార్గంలో ఉంది. న్యూ ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లు ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ నుండి సుమారు 25 కి.మీ. దూరంలో ఉన్నాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద నగరాలకు ఇక్కడి నుంచి రైళ్ల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ, ఫరీదాబాద్‌ల మధ్య స్థానిక రైళ్లు నడుస్తాయి.

ఢిల్లీ మెట్రో వయొలెట్ లైన్

ఢిల్లీ మెట్రో వారి వయొలెట్ లైన్ ఫరీదాబాద్‌ ఢిల్లీల మధ్య నడుస్తుంది. ఫరీదాబాద్‌కు వయొలెట్ లైన్ విస్తరణను 2015 సెప్టెంబరు 6 న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాడు. మొదట్లో ఈ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉండేవి. సంత్ సూరదాస్ సిహి, రాజా నహర్ సింగ్ బల్లభగఢ్ అనే రెండు కొత్త స్టేషన్లను చేర్చి మెట్రోను బల్లభగఢ్ వరకు పొడిగించారు.

ఫరీదాబాద్, గుర్గావ్‌లను మెట్రో ద్వారా అనుసంధానించాలని హర్యానా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో వయొలెట్ లైన్ ఫరీదాబాద్ కారిడార్ 11 స్టేషన్లతో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) లో అత్యంత పొడవైన మెట్రో కారిడార్. ఈ కారిడార్ మొత్తం పొడవు 14 కి.మీ.

ఢిల్లీ ఫరీదాబాద్ స్కైవే

ఢిల్లీ ఫరీదాబాద్ స్కైవే (బదర్పూర్ ఫ్లైఓవర్) ద్వారా ఫరీదాబాద్ నుండి ఢిల్లీకి అత్యాధునిక రహదారి సౌకర్యం ఉంది. [22] [23]

విమాన సౌకర్యం

[మార్చు]

ఫరీదాబాద్‌కు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందిస్తోంది. ఇది ఫరీదాబాద్ నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఇక్కడి నుండి దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. [24]

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం ఫరీదాబాద్ జనాభా 14,04,653, అందులో 7,50,446 మంది పురుషులు, 6,54,207 మంది మహిళలు ఉన్నారు. [1] నగర జనాభాలో అక్షరాస్యత 83.04%.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఉన్నత విద్య

[మార్చు]

ఫరీదాబాద్‌లో ఉన్నత విద్యా కోర్సులు అందించే అనేక విద్యాసంస్థ లున్నాయి. ఈ కళాశాలలు సైన్స్, మెడిసిన్, ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, ఎంసిఎ, వంటి వివిధ రంగాలలో కోర్సులను అందిస్తున్నాయి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందించే కళాశాలల్లో కొన్ని:

  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్
  • లింగాయ విశ్వవిద్యాలయం
  • మానవ్ రచ్నా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ
  • జాతీయ విద్యుత్ శిక్షణా సంస్థ
  • ESIC మెడికల్ కాలేజీ
  • రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌సిబి)
  • ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI)
  • వైఎంసిఎ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
  • అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (AJNIFM)

నగర ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 7 May 2012. Retrieved 10 October 2015.
  2. "Lucknow, Warangal...2nd List of Smart Cities Is Out: 10 Facts". Archived from the original on 27 May 2016. Retrieved 24 May 2016.
  3. "City Mayors: World's fastest growing urban areas (1)". www.citymayors.com. Archived from the original on 25 November 2010. Retrieved 18 February 2018.
  4. "Evaluation Study of DMA Towns in National Capital Region" (PDF). Town and Country Planning Organisation. Ministry of Urban Development. September 2007. Archived from the original (PDF) on 20 March 2017. Retrieved 19 March 2017.
  5. "Acme Spaces". acmespaces.com. Archived from the original on 24 November 2015.
  6. "The Tribune". 28 December 2005. Archived from the original on 13 June 2007. Retrieved 27 May 2007.
  7. Dasgupta, Neha (16 May 2018). "With world's worst air, Indian city struggles to track pollution". Yahoo News. United States. Reuters. Archived from the original on 16 May 2018. Retrieved 16 May 2018.

    "Indian city struggles with 'world's worst air'". Washington Post. United States. 16 May 2018. Archived from the original on 4 July 2018. Retrieved 16 May 2018.
  8. "top ten cleanest and dirtiest cities in India in 2020". GQIndia.
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Weather 2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. "Why only 98 cities instead of 100 announced: All questions answered about smart cities project". Firstpost. Archived from the original on 19 January 2017. Retrieved 21 January 2016.
  11. Isha, Dewri (26 November 2018). "Haryana Ladli Yojana| What are the benefits of Ladli Yojna in Haryana". sarkariduniya. Archived from the original on 28 November 2018. Retrieved 28 November 2018.
  12. HOME, Npti Delhi, 25 మార్చి 2012, archived from the original on 8 నవంబరు 2015, retrieved 31 అక్టోబరు 2015
  13. "70% of Haryana's investment comes from Gurgaon, says industry body". Archived from the original on 1 May 2018. Retrieved 12 May 2020.
  14. "Best Tractor Manufacturing Companies India, Top Tractor Companies in India, Most Selling Tractor in India- Escorts Group - Escorts Group". www.escortsgroup.com. Archived from the original on 12 July 2008. Retrieved 21 April 2019.
  15. "File not found". Archived from the original on 22 December 2015. Retrieved 18 December 2015.
  16. Manohar, Asit (26 March 2012). "IOC Faridabad unit to pump in bio-fuel; R&D unit gearing to reduce pressure on conventional fuel". Times of India. Archived from the original on 8 December 2015. Retrieved 4 December 2015.
  17. L&T-Gulf Private Limited Archived 4 మార్చి 2016 at the Wayback Machine
  18. "Archived copy". Archived from the original on 8 December 2015. Retrieved 30 November 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  19. Abhishek Law. "Eye-wear e-tailer Lenskart looks at 150% growth this fiscal". The Hindu Business Line. Archived from the original on 11 February 2016. Retrieved 4 December 2015.
  20. "Faridabad: Rents climbing, sleepy town is hot property". The Times of India. Archived from the original on 22 June 2015. Retrieved 4 December 2015.
  21. "Footwear industry struggles to find foothold in Faridabad". economictimes.indiatimes. Archived from the original on 2020-08-27. Retrieved 27 August 2020.
  22. "Two bridges across Yamuna to link Noida and Haryana". The Times of India. Archived from the original on 6 November 2015. Retrieved 27 July 2015.
  23. "Nod for road joining Greater Noida, Faridabad". The Times of India. Archived from the original on 6 November 2015. Retrieved 27 July 2015.
  24. "Indira Gandhi Delhi International Airport – Fact Sheet". newdelhiairport.in. Archived from the original on 6 November 2015. Retrieved 12 November 2015.