జెసిబి
JCB Logo | |
రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | భారీ పరికరాలు |
స్థాపన | 1945 |
ప్రధాన కార్యాలయం | రోసెస్టర్, యునైటెడ్ కింగ్డమ్ |
కీలక వ్యక్తులు | సర్ ఆంథోనీ బంఫోర్డ్, ఛైర్మన్ |
ఉత్పత్తులు | నిర్మాణం, కూల్చివేత & వ్యవసాయ యంత్రాలు |
రెవెన్యూ | £ 2.75 బిలియన్ (2012)[1] |
ఉద్యోగుల సంఖ్య | సుమారు 7,000[2] |
వెబ్‌సైట్ | www.jcb.com |
జెసిబి అనునది Joseph Cyril Bamford అనే వ్యక్తి స్థాపించిన ఒక సంస్థ పేరు. జెసిబి అనగా అధికారికంగా జె సి బామ్ఫోర్డ్ ఎక్స్కవేటర్స్ లిమిటెడ్, ఇది ఒక ఒక బ్రిటీష్ బహుళజాతి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం రోసెస్టర్, యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నది. నిర్మించడానికి, కూల్చివేయడానికి, వ్యవసాయరంగానికి అవసరమైన పరికరాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉంది ఈ సంస్థ. ఇది ప్రపంచంలో మూడో అతి పెద్ద నిర్మాణ సామగ్రి తయారీ సంస్థ. ఇది డిగ్గర్స్ (Backhoes), ఎక్స్కవేటర్లు (త్రవ్వి తీసేవి), ట్రాక్టర్లు, డీజిల్ ఇంజిన్లతో సహా 300 కంటే ఎక్కువ రకాల యంత్రాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థకు ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అంతటా 18 ఫ్యాక్టరీలున్నాయి, దీని ఉత్పత్తులను 150 పైగా దేశాల్లో విక్రయిస్తారు. జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్డ్ ద్వారా 1945 లో స్థాపించబడిన ఈ సంస్థ తరువాత ఇతని పేరుతోనే, ఇతని పేరుతో ఉన్న బామ్ఫోర్డ్ సంస్థకు స్వంతంగా కొనసాగింది. సాధారణంగా వ్యవహారికంలో జెసిబి అంటే త్రవ్వి తీసే యంత్రాలు అనే విధంగా ఉపయోగిస్తున్నారు.
చిత్రమాలిక
[మార్చు]-
JCB's first welding set
-
The first vehicle that JCB made (a farm trailer)
-
JCB factory and park at Rocester
-
JCB Fastrac 8250 tractor
మూలాలు
[మార్చు]- ↑ "JCB mit Rekordergebnis 2011". DEMCO JCB. 24 April 2012. Retrieved 24 April 2012.
- ↑ "Company Information". J C Bamford Excavators Limited. Archived from the original on 10 ఆగస్టు 2011. Retrieved 27 September 2010.