చండీగఢ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఛండీగఢ్
Map of India with the location of ఛండీగఢ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
ఛండీగఢ్
 - 30.75° ఉ 76.78° తూ
పెద్ద నగరము ఛండీగఢ్
జనాభా (2001)
 - జనసాంద్రత
900,635 (29వ స్థానం)
 - 7,900/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
114 చ.కి.మీ (33వ స్థానం)
 - 1
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
మార్చి 1948
 - జనరల్(Retd) ఎస్.ఎఫ్ రోడ్రిగ్స్
 - లేడు
 - కేంద్ర పాలితం (సీట్లు లేవు)
అధికార బాష (లు) పంజాబీ, హిందీ
పొడిపదం (ISO) IN-CH
  మొత్తం కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ నగరమే.


చండీగఢ్ (Chandigarh) ఉత్తర భారతదేశంలో ఒక నగరము మరియు కేంద్రపాలిత ప్రాంతం. దీని విశిష్టత ఏమంటే ఇది రెండు రాష్ట్రాలకు (పంజాబ్ మరియు హర్యానా) రాజధాని. కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతం.

చరిత్ర[మార్చు]

జవహర్‌లాల్ నెహ్రూ ప్రేరేపణపై 1950 దశకంలో ఫ్రెంచి భవన నిర్మాణకారుడు లీ కార్బోషర్ (architect Le Corbusier) చండీగఢ్ నగరాన్ని, అందులో చాలా భవనాలను రూపొందించాడు. అప్పుడే స్వతంత్రమైన భారతదేశపు ప్రగతిశీల పధం ఇందులో ప్రతిఫలించాలని వారి సంకల్పం.

నిర్మాణ శైలి[మార్చు]

చండీగఢ్ నగరం చదరాలు అమర్చినట్లుగా సెక్టార్లుగా డిజైన్ చేయబడింది. ప్రతి సెక్టారు షుమారుగా 1.5 కి.మీ x 1.5 కి.మీ. చదరం వైశాల్యం ఉంటుంది. ప్రతి సెక్టారు ఒక చిన్న పట్టణంలా, దాని స్వంత మార్కెట్, పూజా స్థలాలు, స్కూళ్ళు, కాలేజీలు కలిగి ఉంటుంది. 1 నుండి 60 వరకు సెక్టారులు ఉన్నాయి. కాని సెక్టారు నెం.13 మాత్రం లేదు. 13వ సంఖ్య అదృష్టానికి దూరమని లీ కార్బోషర్ నమ్మడమే దీనికి కారణం కావచ్చును.


సెక్టారు-17: నగరానికి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ళతో కళకళలాడుతుంటుంది. నగరవాసులకు సాయంత్రాలు గడపడానికి ఇష్టమైన స్థలం.

సెక్టారు-35: కూడా రెస్టారెంట్లు, బార్ల మయం.

సెక్టారు-4: రాళ్ళ తోట (Rock Garden) - పారవేసిన, వదిలేసిన వస్తువులతో నేక్‌ చంద్ అనే కళాకారుడు 30 సంవత్సరాలు శ్రమించి రూపొందించిన విశేష ఉద్యానవనం.

సెక్టారు-16: గులాబీ తోటలు

సెక్టారు-10: సుఖానా సరస్సు

చండీగఢ్ అక్షరాస్యత 97%. ఇక్కడ ఎన్నో మంచి ప్రమాణాలు గల విద్యా సంస్థలున్నాయి. చండీగఢ్ జనాభాలో షుమారుగా హిందువులు 78.6%, సిక్కులు 16.1%, ముస్లిములు 4%.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చండీగఢ్&oldid=1031222" నుండి వెలికితీశారు