Jump to content

కొల్లాం

అక్షాంశ రేఖాంశాలు: 8°53′N 76°36′E / 8.88°N 76.60°E / 8.88; 76.60
వికీపీడియా నుండి
(కొల్లం నుండి దారిమార్పు చెందింది)
Kollam
Quilon, Desinganadu
From top clockwise: RP Mall, Tangasseri Lighthouse, British Residency, Kollam Junction railway station, Ashtamudi Lake, Kollam Port, Asramam Adventure Park, Chinnakada Clock Tower
Etymology: Black pepper: kola ("black pepper")
Nickname(s): 
"Prince of Arabian sea"
"Cashew Capital of the World"[1]
"The Gateway to Backwaters"
"Fountain of Youth" [2][3]
Location of the city within Kollam Metropolitan Area
Location of the city within Kollam Metropolitan Area
Kollam is located in India
Kollam
Kollam
Location of Kollam in India
Kollam is located in Kerala
Kollam
Kollam
Kollam (Kerala)
Coordinates: 8°53′N 76°36′E / 8.88°N 76.60°E / 8.88; 76.60
Country India
RegionSouth India
StateKerala
DistrictKollam
Former NameQuilon, Coulão
Native LanguageMalayalam
Established1099
Founded byRama Varma Kulashekhara
Boroughs7 Zones
Central Zone-1, Central Zone-2, Eravipuram, Vadakkevila, Sakthikulangara, Kilikolloor, Thrikadavoor
Government
 • TypeMayor–Council
 • BodyKollam Municipal Corporation
 • MayorPrasanna Earnest (CPI(M))
 • MPN.K Premachandran
 • MLAMukesh
 • District CollectorAfsana Parveen IAS
 • City Police CommissionerMerin Joseph IPS
విస్తీర్ణం
 • Metropolis165 కి.మీ2 (64 చ. మై)
 • Rank4
Elevation
3 మీ (10 అ.)
జనాభా
 (2021)[4][5][6][7]
 • Metropolis13,42,509
 • Rank5 (41th IN)
 • జనసాంద్రత8,100/కి.మీ2 (21,000/చ. మై.)
 • Metro18,71,086
Demonym(s)Kollamite, Kollathukaaran, Kollamkaran
Languages
 • OfficialMalayalam
English
Time zoneUTC+౦5:30 (IST)
PIN
691 XXX
Telephone codeKollam-91-0474
Vehicle registrationKollam: KL-02, 23, 24, 25
HDIHigh
Literacy91.18%[9]
UN/LOCODEIN QUI
IN KUK

కొల్లాం, దీని పూర్వపు పేరు క్విలాన్ [10] చారిత్రక పేరు దేశింగనాడు.[11] ఇది రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి ఉత్తరాన 71 కి.మీ. (44 మై.) దూరంలో ఉంది.[12] భారతదేశ మలబార్ తీరంలో అరేబియా సముద్రంలో భాగమైన లక్కడివ్ సముద్రం సరిహద్దులో ఉన్న ఒక పురాతన ఓడరేవు నగరం.[13] ఈ నగరం అష్టముడి సరస్సు, కల్లాడ నది ఒడ్డున ఉంది.[14] [15] [16]ఇది కొల్లాం జిల్లాకు ప్రధాన కేంద్రం. కొల్లాం కేరళలో నాల్గవ అతిపెద్ద నగరం. ఇది జీడిపప్పు తయారీ , కొబ్బరికాయల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.ఈ నగరం కేరళ సముద్ర వెనుక జలాలకు దక్షిణ ద్వారం, ప్రముఖ పర్యాటక ప్రదేశం.2016 మార్చిలో ఇండియా టైమ్స్ తమ సర్వేలో , కొల్లాం నగరం భూమిపై అతి తక్కువ కాలుష్యం ఉన్న తొమ్మిది నగరాల్లో ఒకటిగా ఎంచుకుంది. [17] బుకింగ్.కమ్ ట్రావెలర్ వెబ్సైట్ అవార్డుల సమీక్ష ప్రకారం, 2020 సంవత్సరానికి భారతదేశంలో అత్యంత స్వాగతించే మొదటి 10 ప్రదేశాలలో కొల్లాం నగరం ఒకటిగా పేర్కొంది.[18]

భౌగోళికం

[మార్చు]

కొల్లాం నగరానికి ఉత్తరాన నీందకర, త్రిక్కరువ, దక్షిణాన మయ్యనాడ్, తూర్పున త్రిక్కోవిల్వట్టం, కొట్టంకర, పశ్చిమాన లక్కడివ్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. అష్టముడి సరస్సు నగరం నడిబొడ్డున ఉంది. కొల్లాం నగరం తిరువనంతపురం నుండి సుమారు 71 కి.మీ. (44 మై.) దూరంలో, కొచ్చి నుండి 140 కి.మీ. (87 మై.) దూరంలో కోజికోడ్ నుండి 350 కి.మీ. (220 మై.) దూరంలో ఉంది. జాతీయ జలమార్గం 3, ఇతిక్కర నది, ముఖ్యమైన జలమార్గాలు రెండూ కొల్లాం నగరం గుండా వెళతాయి.పరవూర్ సరస్సును అష్టముడి సరస్సును పొడవైన కొల్లాం కాలువ 7.7 కి.మీ. (4.8 మై.) రెండిటిని కలుపుతోంది. కల్లాడ నది, నగర శివారు ప్రాంతాల గుండా ప్రవహించే మరొక నది, అష్టముడి సరస్సులో కలుస్తుంది. ఇతిక్కర నది పరవూర్్సరస్సు వరకు ప్రవహిస్తుంది. నగరంలోని కట్టకాయల్ అనే మంచినీటి సరస్సు అష్టముడి సరస్సుతో వట్టక్కాయల్ అనే మరో నీటి సరస్సును కలుపుతుంది. [19] [20] [21]

చరిత్ర

[మార్చు]

కొల్లం ఒక పురాతన వాణిజ్య పట్టణం - రోమన్లు, చైనీస్, అరబ్బులు, ఇతర ప్రాశ్చాత్యదేశాలతో వర్తకం చేయడం - అరేబియా సముద్రంలోని ఎర్ర సముద్రపు ఓడరేవులతో అనుసంధానించిన బైబిల్ కాలం, సోలమన్ పాలన నాటి చారిత్రిక అనులేఖనాలలో ప్రస్తావించారు. (రోమన్ నాణేలు పురాతన కాలానికి మద్దతునిస్తుంది).[22] [23] పురాతన పట్టణాన్ని తమిళనాడుకు కలిపే షెంకోట్టా గ్యాప్‌లోని ఆర్యంకావు ద్వారా అంతర్గత వాణిజ్యం జరిగింది. ఎద్దుల బండి ద్వారా మిరియాల భూభాగంలో జరిగే వాణిజ్యం, అల్లెపీ, కొచ్చిన్‌లను కలిపే జలమార్గాల ద్వారా జరిగే వాణిజ్యం వర్తక సంబంధాలను ఏర్పరుచుకుంది.తద్వారా ఇది తొలి భారతీయ పారిశ్రామిక టౌన్‌షిప్‌లలో ఒకటిగా ఎదగడానికి వీలు కల్పించింది. తర్వాత తమిళనాడుకు ఏర్పాటు చేసిన రైలు మార్గాలు ఇంకా బలమైన వాణిజ్య సంబంధాలకు మద్దతునిచ్చాయి.సముద్రపు ఎగుమతులను ప్రాసెస్ చేసే కర్మాగారాలు, జీడిపప్పుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ దాని వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.[24] ఇది జీడిపప్పు ప్రాసెసింగ్, కొబ్బరికాయల తయారీకి ప్రసిద్ధి చెందింది. అష్టముడి సరస్సు కేరళ బ్యాక్ వాటర్స్ కు దక్షిణ ద్వారంగా పరిగణించుతారు. ఇది కొల్లాం వద్ద ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. కొల్లాం పట్టణ ప్రాంతంలో దక్షిణాన పరవూర్, తూర్పున కుందర, నగరానికి ఉత్తరాన కరునాగపల్లి వంటి సబర్బన్ పట్టణాలు ఉన్నాయి.కొల్లాం నగర శివారులో ఎరవిపురం, కొట్టియం, కన్ననల్లూర్, చవర అనేవి ఇతర ముఖ్యమైన పట్టణాలు

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [7] కొల్లాం నగరంలో 3,49,033 మంది జనాభా ఉన్నారు.దీని జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 5,400 మంది. లింగ నిష్పత్తి (1,000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య) 1,112, ఇది రాష్ట్రంలో అత్యధికం. కొల్లాం జనాభాలో రాష్ట్ర స్థాయిలో ఏడవ స్థానంలో ఉండగా, జిల్లా స్థాయిలో కొల్లాం నగరం నాల్గవ స్థానంలో ఉంది. కొల్లాం నగర సగటు అక్షరాస్యత రేటు 93.77%, [25] ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 95.83%, స్త్రీలు అక్షరాస్యత 91.95%గా ఉన్నాయి కొల్లాం నగర జనాభా మొత్తం జనాభాలో ఆరేళ్లలోపు వారు 11% మంది ఉన్నారు.

2015 మే లో, కేరళ ప్రభుత్వం త్రిక్కడవూరు పంచాయతీని విలీనం చేయడం ద్వారా కొల్లాం నగర పాలకసంస్థను విస్తరించాలని నిర్ణయించింది. కాబట్టి మొత్తం నగర జనాభా 3,84,892తో,[26][27] ప్రాంతం 73.03 కిమీ2 (28.20 చ.మై) పెరిగింది. నగరంలో అత్యధికంగా మాట్లాడే భాష, అధికారిక భాష మలయాళం, అయితే నగరంలోని కొన్ని వర్గాలకు తమిళం అర్థం అవుతుంది. నగరంలో స్థిరపడిన ఆంగ్లో-ఇండియన్లు, కొంకణి బ్రాహ్మణులు, తెలుగు చెట్టి, బెంగాలీ వలస కార్మికుల సంఘాలు కూడా ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం, కొల్లాం నగరపాలక సంస్థను ఆరు జోన్‌లుగా విభజించారు, ఒక్కో దానికి స్థానిక జోనల్ కార్యాలయాలు ఉన్నాయి.[28]

  • సెంట్రల్ మండలం (కంటోన్మెంట్ ప్రాంతం),
  • శక్తికులంగర మండలం,
  • వడక్కెవిల మండలం,
  • కిలికొల్లూరు మండలం,
  • ఎరవిపురం మండలం,
  • త్రిక్కడవూరు మండలం,

2014లో, కొల్లాం నగరపాలక సంస్థ మాజీ మేయర్ ఎర్నెస్ట్ దక్షిణ భారతదేశపు ఉత్తమ మహిళా మేయర్‌గా ప్రసన్న ,రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం రాయల్ వారిచే ఎంపిక చేయబడింది.[29]

మతాల ప్రభావం

[మార్చు]

కొల్లాం నగరం కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సూక్ష్మరూపం. దాని నివాసితులు వివిధ మత, జాతి, భాషా సమూహాలకు చెందినవారు. నగరం, దాని శివార్లలో ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయాలు, శతాబ్దాల నాటి చర్చిలు, మసీదులు ఉన్నాయి. కొల్లాం మొత్తం జనాభాలో 56.35% మంది హిందూ సమాజానికి చెందినవారు ఉన్నారు. ముస్లింలు 22.05% మంది ఉన్నారు. [30][31]

2011 జనాభా లెక్కల ప్రకారం, కొల్లాంలో మొత్తం ముస్లిం జనాభా 80,935.[32] కర్బలా మైదాన్ పక్కనే ఉన్న మకాని మసీదు నగరానికి ఈద్ గాహ్‌గా ఉపయోగపడుతుంది. కరువా వద్ద ఉన్న 300 ఏళ్ల నాటి జుమా-'అత్ పల్లిలో సూఫీ సన్యాసి సయ్యద్ అబ్దుర్ రహ్మాన్ జిఫ్రీ భౌతికకాయం ఉంది.[33][34]

కొల్లాం నగరం మొత్తం జనాభాలో క్రైస్తవులు 21.17% మంది ఉన్నారు.[35] Theభారతదేశంలోని మొదటి రోమన్ క్యాథలిక్ డియోసెస్ ఆఫ్ క్విలాన్ (కొల్లాం) డియోసెస్‌ను మొదటిసారిగా పోప్ జాన్ XXII 1329 ఆగష్టు 9న స్థాపించాడు. ఇది 1886 సెప్టెంబరు1 న పునఃనిర్మించారు. ఈ డియోసెస్ 1,950 కిమీ2 (750 చ.మై) విస్తీర్ణంలో ఉంది. 48,79,553 జనాభాను కలిగి ఉంది (235% క్యాథలిక్‌ల సంఖ్య. 82%. ) తంగస్సేరీలో ఉన్న ప్రసిద్ధ ఇన్ఫాంట్ జీసస్ కేథడ్రల్, 400 సంవత్సరాల పురాతనమైంది, ఇది రోమన్ క్యాథలిక్ డియోసెస్ ఆఫ్ క్విలాన్ సహ-కేథడ్రల్. సి.ఎస్.ఐ కొల్లాం -కొత్తరక్కర డియోసెస్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలోని ఇరవై నాలుగు డియోసెస్‌లలో ఒకటి .[36] కొట్టారక్కరా కొరకు పెంటెకోస్టల్ మిషన్ కేరళ ప్రాంతం ప్రధాన కార్యాలయం కొల్లాంలో ఉంది.[37]

సంస్కృతి

[మార్చు]

కొల్లాం ఫెస్ట్ అనేది కొల్లాం సొంత వార్షిక పండుగ. ఇది ఎక్కువగా కేరళీయులను మాత్రమే కాకుండా వందలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులను కొల్లాం నగరానికి ఆకర్షిస్తుంది. కొల్లం ఫెస్ట్ ప్రధాన వేదిక చారిత్రాత్మక, భారీ ఆశ్రమ మైదానం. కొల్లం ఫెస్ట్ అనేది కొల్లాం సంత కార్యక్రమం. కొల్లం ఫెస్ట్ కొల్లాం గొప్ప సంస్కృతి, వారసత్వం, పర్యాటక సంభావ్యత, కొత్త వెంచర్లలో పెట్టుబడులను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది.[38]

కొల్లాం పూరం ఆశ్రమ ఉత్సవం, శ్రీకృష్ణ స్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా సాధారణంగా ఏప్రిల్ 15న జరుగుతుంది, అయితే అప్పుడప్పుడు ఏప్రిల్ 16న జరుగుతుంది. పూరం ఆశ్రమ మైదానంలో జరుగుతుంది.

ప్రెసిడెంట్స్ ట్రోఫీ బోట్ రేస్ (PTBR) అనేది కొల్లాంలోని అష్టముడి సరస్సులో జరిగే వార్షిక రెగట్టా. 2011 సెప్టెంబరులో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2012 నుండి ప్రతి సంవత్సరం నిర్వహించటానికి షెడ్యూల్ చేయబడింది.[39][40]

పౌర పరిపాలన

[మార్చు]

కొల్లాం నగరం దాని 55 డివిజన్ల నుండి ఎన్నికైన కౌన్సిలర్లతో కూడిన కొల్లాం నగరపాలస సంస్థ పాలకసంస్థ కౌన్సిలర్ల నుండి ఎన్నికైన మేయర్ సారధ్యంలో కొల్లాం నగరపాలన సాగుతుంది. సాధారణంగా మెజారిటీ ఉన్న రాజకీయ పార్టీకి చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తారు.[41] నగరపాలక సంస్థ సెక్రటరీ ప్రధాన అధికారిగా ప్రభుత్వం తరుపున విధులు నిర్వహిస్తాడు.

నగరం పరిధిలో శాంతిభద్రతలు ఇండియన్ పోలీస్ సర్వీస్ కేడర్ అధికారి నేతృత్వంలో కొల్లాం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అతను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) తిరువనంతపురం రేంజ్‌కి నివేదికలు అందజేస్తాడు. పోలీసు పరిపాలన కేరళ ప్రభుత్వ రాష్ట్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది. కొల్లాం నగరం పరిపాలనా సౌలభ్యంకోసం కరునాగపల్లి, కొల్లాం, చత్తన్నూర్, అనే మూడు ఉపవిభాగాలుగా విభజించారు. అవి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి కింద ఉంటాయి.

రవాణా సౌకర్యం

[మార్చు]

రైలు మార్గం

[మార్చు]

కొల్లాం జంక్షన్ మొత్తం 6 ప్లాట్‌ఫారమ్‌లతో, షోరనూర్ జంక్షన్ తర్వాత విస్తీర్ణంలో కేరళలో రెండవ అతిపెద్ద రైల్వే స్టేషన్. స్టేషన్‌లో 17 రైలు పట్టాలు వరుసలు ఉన్నాయి. కొల్లాం జంక్షన్ 1180.5 మీ( 3873 అడుగులు)తో ప్రపంచంలోనే మూడవ పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను కలిగిఉంది. మెయిన్‌లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (MEMU) కొల్లాం జంక్షన్‌లో నిర్వహణ భవనం కలిగి ఉంది. 2012 జనవరి రెండవ వారంలో కొల్లాం నుండి అలప్పుజ్హ, కొట్టాయం నగరాల మీదుగా ఎర్నాకులం వరకు మెయిన్‌లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (MEMU) సేవలు ప్రారంభమయ్యాయి. 2012 డిసెంబరు 1 నాటికి, కొల్లాం, నాగర్‌కోయిల్ మధ్య మెయిన్‌లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ సర్వీస్ వాస్తవంగా మారింది. తరువాత కన్యాకుమారి వరకు విస్తరించింది. కొల్లాం నగరంలోని రైల్వే స్టేషన్లు కొల్లం జంక్షన్ రైల్వే స్టేషన్, ఎరవిపురం రైల్వే స్టేషన్, కిలికొల్లూరు రైల్వే స్టేషన్.

వాయు మార్గం

[మార్చు]

కొల్లాం నగరానికి త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సేవలు అందతున్నాయి. ఇది నగరం నుండి జాతీయ రహదారి 66 మీదుగా 56 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రోడ్డు మార్గం

[మార్చు]

త్రివేండ్రం, అలప్పుజా, కొచ్చి, పాలక్కాడ్, కొట్టాయం, కొట్టారక్కర, పునలూర్‌తో సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని నగరాలు, ప్రధాన పట్టణాలకు జాతీయ రహదారి 66, జాతీయ రహదారి 183, జాతీయ రహదారి 744 ద్వారా ఇతర భారతీయ నగరాలతో కొల్లాం నగరం అనుసంధానించబడింది. రోడ్డు రవాణా ప్రభుత్వ యాజమాన్యంలోని కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కె.ఎస్.ఆర్.టి.సి), వ్యక్తులు నిర్వహించే రవాణా సంస్థల బస్ ఆపరేటర్ల ద్వారా ప్రయాణ సేవలు అందించబడుతున్నాయి. అండముక్కంలో సిటీ ప్రైవేట్ బస్టాండ్ ఉంది. అష్టముడి సరస్సు పక్కన కె.ఎస్.ఆర్.టి.సి. బస్ స్టేషన్ ఉంది. కేరళలోని వివిధ పట్టణాలకు బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులు ఈ స్టేషన్ నుండి నడుస్తాయి. కొల్లం నగరానికి సమీపంలో ఉన్న చవర తెక్కుంభగోం వంతెన ప్రజలకు ప్రస్తుత పడవ సేవలతో పాటు కొల్లాం నగరం కనెక్టివిటీకి కొత్త మార్గాన్ని అందించింది.

జల మార్గం

[మార్చు]

రాష్ట్ర జల రవాణా శాఖ అష్టముడి సరస్సు ఒడ్డున ఉన్న కొల్లాం కె.ఎస్.డబ్యు.టి.డి. ఫెర్రీ టెర్మినల్ నుండి వెస్ట్ కల్లాడ, మన్రో ద్వీపం, గుహానందపురం, చవర తెక్కుంభాగోం, దళవపురం, అలప్పుజ్హలకు పడవ సేవలను నిర్వహిస్తుంది. నగరంలోని ఆశ్రమం లింక్ రోడ్డు ఫెర్రీ టెర్మినల్‌కు ఆనుకుని వెళుతుంది.

డబుల్ డెక్కర్ లగ్జరీ బోట్లు ప్రతిరోజూ కొల్లాం - అల్లెపీ మధ్య నడుస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ యజమానులచే విలాసవంతమైన బోట్లు నిర్వహించబడుతున్నాయి. పర్యాటక సీజన్‌లో ప్రధాన బోట్ జెట్టీ నుండి నడుస్తాయి. పశ్చిమ తీర కాలువ వ్యవస్థ దక్షిణాన తిరువనంతపురం నుండి ప్రారంభమై, ఉత్తరాన హోస్‌దుర్గ్‌లో ముగుస్తుంది, పరవూరు, కొల్లాం నగరం, కరునాగపల్లి తాలూకా గుండా వెళుతుంది.

కొల్లాం పోర్ట్ కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ తర్వాత కేరళలో రెండవ అతిపెద్ద ఓడరేవు. కేరళలోని రెండు అంతర్జాతీయ ఓడరేవులలో ఇది ఒకటి. కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాలు 2013లో పని చేయడం ప్రారంభించాయి. 2014 ఏప్రిల్ 4న ఆంటిగ్వాలో రిజిస్టర్ చేయబడిన 145-మీటర్ల (476 అడుగులు) నౌక ఎం.వి అలీనాతో విదేశీ నౌకలు క్రమం తప్పకుండా ఓడరేవుకు చేరుకుంటాయి.

కొల్లాంలో జన్మించిన ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kollam's cashew crunch". The Hindu. 28 April 2018. Retrieved 10 August 2018.
  2. "Kollam, Quilon, Land of cashew, coir, backwaters, Kerala Tourism".
  3. "The Tragic History of the Search for the Fountain of Youth". 14 August 2020.
  4. "CITY WATER BALANCE PLAN (CWBP) FOR AMRUT 2.0" (PDF). Government of Kerala. Archived from the original (PDF) on 2023-01-18. Retrieved 2023-06-06.
  5. "Population Finder - Census of India 2011". Government of India.
  6. "Thrikkadavoor panchayath". Government of Kerala. Archived from the original on 12 June 2015. Retrieved 25 September 2015.
  7. 7.0 7.1 Census March 1, 2001 (via archive.org)
  8. "Demographia World Urban Areas" (PDF). Demographia. Retrieved 23 April 2016.
  9. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India.
  10. "East Is West And Up Is Really Down". mid-day.com. 14 January 2020. Retrieved 14 January 2020.
  11. https://kollam.nic.in/en/history/
  12. "Kollam on the itinerary". The Hindu. 14 September 2018. Retrieved 14 September 2018.
  13. "Kollam - Encyclopaedia Britannica". Britannica. Retrieved 7 February 2020.
  14. Cities of Kerala
  15. "Kerala Cities". Archived from the original on 24 November 2014. Retrieved 19 August 2014.
  16. Alphabetical listing of Places in State of Kerala
  17. "9 of the Least Polluted Cities on Earth You Could Consider Moving To". Indiatimes. 13 March 2016. Retrieved 21 March 2016.
  18. "For 2nd year in row, Kerala tops list of most welcoming places: Report". Financial Express. 22 January 2020. Retrieved 23 January 2020.
  19. "A stream fading into historyg". The Hindu. 20 September 2004. Archived from the original on 1 September 2014. Retrieved 23 January 2020.
  20. "Maruthadi - Maruthadi.Elisting.in". Retrieved 23 January 2020.
  21. "Water Resources - Government of Kerala". 7 March 2015. Archived from the original on 3 November 2016. Retrieved 23 January 2020.
  22. "The legendary beauty of Kollam".
  23. "History of Kollam". Archived from the original on 2 June 2015.
  24. "Kollam Tourism - Official Website". Retrieved 6 January 2014.
  25. "Kollam District". kollam.nic.in. Retrieved 24 June 2010.
  26. "Thrikadavur becomes part of Kollam city". The Hindu. 9 June 2015. Retrieved 11 June 2015.
  27. "Thrikadavur Panchayath". Thrikadavur Panchayath. Archived from the original on 12 June 2015. Retrieved 11 June 2015.
  28. "Building Permit Management System -Kollam Corporation". Archived from the original on 20 December 2014. Retrieved 16 December 2014.
  29. "Award for Kollam Mayor". The Hindu. 2014-04-03. Retrieved 2014-06-06.
  30. "Kollam Era" (PDF). Indian Journal History of Science. Archived from the original (PDF) on 27 May 2015. Retrieved 30 December 2014.
  31. R. Leela Devi (1986). History of Kerala. Vidyarthi Mithram Press & Book Depot. p. 408.
  32. "Population of Kollam City - Census 2011 data". Census2011. Retrieved 25 March 2013.
  33. "Important religious centres in Kollam". Retrieved 6 January 2014.
  34. "Juma-Ath-Mosque". Archived from the original on 29 జూలై 2014. Retrieved 29 July 2014.
  35. "Kollam City Census 2011 data". Census2011. Retrieved 25 March 2013.
  36. "Roman Catholic Diocese of Quilon". Kollam Diocese. Retrieved 25 March 2013.
  37. "CSI Redraws Borders of Dioceses". The New Indian Express. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 19 January 2016.
  38. "Kollam Fest 10 November 2011". Thiraseela.com. Retrieved 3 March 2016.
  39. "presidents trophy boat race". Presidentstrophy.gov.in. Retrieved 20 April 2013.
  40. "President's Trophy boat race on November 1". The Hindu. 24 October 2016. Retrieved 20 April 2013.
  41. "CPI(M) rides to power in five of six corporations in Kerala". The Economic Times. 18 November 2015. Archived from the original on 26 నవంబర్ 2015. Retrieved 25 November 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కొల్లాం&oldid=4358841" నుండి వెలికితీశారు