రెసుల్ పూకుట్టి
రెసుల్ పూకుట్టి | |
---|---|
జననం | విళక్కుపర, కొల్లాం, కేరళ | 1971 మే 30
వృత్తి | సినిమా సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, ఆడియో మిక్సర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1997 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సాదియా[1] |
పిల్లలు | 2 |
రెసుల్ పూకుట్టి[2] కేరళకు చెందిన సినిమా సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, ఆడియో మిక్సర్.[3][4] స్లమ్‌డాగ్ మిలియనీర్ కోసం రిచర్డ్ ప్రైక్, ఇయాన్ ట్యాప్‌లతోపాటు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు.[5] బ్రిటిష్ సినిమాలతోపాటు హిందీ, తమిళం, మలయాళ భాషలలో పనిచేశాడు. 2010లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.
జీవిత విషయాలు
[మార్చు]రెసుల్ 1970 మే 30న కేరళ రాష్ట్రంలోని కొల్లం సమీపంలోని విలక్కుపరలో జన్మించాడు. తండ్రి ప్రైవేట్ బస్ టిక్కెట్ చెక్ చేసేవాడు. రెసుల్ 6 కి.మీ.ల దూరం సమీపంలోని పాఠశాలకు నడిచి వెళ్ళి చదువుకున్నాడు. తన గ్రామంతో కరెంటు లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకున్నాడు.[6][7]
1987-1990 సమయంలో కాయంకులంలోని మిలాద్-ఇ-షెరీఫ్ మెమోరియల్ కళాశాల నుండి భౌతికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేశాడు.[8] బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ కోసం తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చేరాడు, అయినప్పటికీ అతను దానిని పూర్తి చేయలేకపోయాడు. 1995లో పూణే నగరంలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాడు. అడ్వకేట్‌గా చూడాలన్న తన తండ్రి కోరిక మేరకు ఎల్‌ఎల్‌బీ పరీక్షలు రాసి 2012లో అడ్వకేట్‌గా చేరాడు.[9]
వ్యక్తిగత జీవితం
[మార్చు]పూకుట్టికి షాదియాతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు.[10]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|
2004 | ముసాఫిర్ | హిందీ | |
2007 | ట్రాఫిక్ సిగ్నల్ | హిందీ | |
2007 | గాంధీ, మై ఫాదర్ | హిందీ | |
2007 | సావరియా | హిందీ | |
2007 | దస్ కహానియన్ | హిందీ | |
2008 | స్లమ్‌డాగ్ మిలియనీర్ | ఆంగ్లం | ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం అకాడమీ అవార్డును గెలుచుకుంది |
2009 | కేరళ వర్మ పఝస్సి రాజా | మలయాళం | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ శబ్దగ్రహణం |
2010 | రోబో | తమిళం | |
2011 | రా.వన్ | హిందీ | |
2011 | అదామింటే మకాన్ అబు | మలయాళం | |
2012 | స్నేహితుడు | తమిళం | |
2012 | ది బెస్ట్ ఎక్సోటిక్ మారిగోల్డ్ హోటల్ | ఆంగ్లం | |
2012 | ఇంగ్లీష్ వింగ్లీష్ | హిందీ | |
2013 | కుంజనాంతంటే కదా | మలయాళం | |
2014 | విక్రమసింహ | తమిళం | |
2014 | అంఖోన్ దేఖి | హిందీ | |
2014 | హైవే | హిందీ | |
2014 | యాన్ | తమిళం | |
2015 | అన్ ఫ్రీడమ్ | హిందీ, ఆంగ్లం | |
2015 | పతేమరి | మలయాళం | |
2016 | రెమో | తమిళం | |
2016 | నిరుత్తర | కన్నడం | |
2017 | కాబిల్ | హిందీ | |
2017 | సౌండ్ స్టోరీ | మలయాళం | |
2018 | కమ్మర సంభవం | మలయాళం | |
2018 | 2.0 | తమిళం | |
2019 | కోలాంబి | మలయాళం | |
2019 | ఓత సెరుప్పు సైజ్ 7 | తమిళం | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ శబ్దగ్రహణం |
2020 | ట్రాన్స్ | మలయాళం | |
2021 | కాదన్ అరణ్య హాతి మేరే సాతీ |
తమిళం తెలుగు హిందీ |
|
2021 | పుష్ప | తెలుగు | [11] |
2022 | రాధేశ్యామ్ | తెలుగు, హిందీ | |
2022 | శభాష్ మిథు | హిందీ | |
2022 | ఆడుజీవితం | మలయాళం |
అవార్డులు
[మార్చు]- 2019: జూలియస్ రచించిన సాక్స్ కి ఉత్తమ సౌండ్ డిజైనింగ్ గోల్డెన్ జ్యూరీ ఫిల్మ్ అవార్డు
- 2016: ఇండియాస్ డాటర్ అనే డాక్యుమెంటరీకి గోల్డెన్ రీల్ ఉత్తమ సౌండ్ అవార్డు
- 2012: రా.వన్ సినిమాకు ఉత్తమ సౌండ్ డిజైన్‌కి జీ సినీ అవార్డు
- 2010: పజాస్సి రాజా[12] సినిమాకు ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డు
- 2010: శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ (డి.లిట్)[13]
- 2010: భారత ప్రభుత్వ పద్మశ్రీ[14]
- 2009: ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ – స్పెషల్ హానర్ జ్యూరీ అవార్డు[15]
- 2009: చక్కులతమ్మ స్వరవర్ష పురస్కారం[16]
- 2009: బహదూర్ అవార్డు[17]
- 2009: స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు ఇయాన్ ట్యాప్, రిచర్డ్ ప్రైక్‌లతోపాటు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం అకాడమీ అవార్డు[18]
- 2009: స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకి గ్లెన్ ఫ్రీమాంటిల్, రిచర్డ్ ప్రైక్, టామ్ సేయర్స్, ఇయాన్ ట్యాప్‌లతోపాటు ఉత్తమ సౌండ్‌గా బాఫ్టా అవార్డు[19]
- 2005: ముసాఫిర్ సినిమాకు ఉత్తమ ఆడియోగ్రఫీకి జీ సినీ అవార్డు[3]
మూలాలు
[మార్చు]- ↑ It's been an unbelievable ride' The Times of India, 24 January 2009.
- ↑ "Resul Pookutty, happy 42nd birthday!". 30 May 2013.
- ↑ 3.0 3.1 "Resul – the other Indian Oscar nominee". NDTV Movies. Archived from the original on 14 February 2009. Retrieved 2023-05-14.
- ↑ K.K. GOPALAKRISHNAN (23 September 2005). "Directing sound". The Hindu. Chennai, India. Archived from the original on 14 September 2006. Retrieved 2023-05-14.
- ↑ "The 81st Academy Awards (2009) Nominees and Winners". oscars.org. Retrieved 2023-05-14.
- ↑ Indian Express article
- ↑ Tough journey for sound wizard Resul Pookutty The Economic Times, 24 February 2009.
- ↑ "Resul Pookutty: The man who treasures silence | India News - Times of India". The Times of India.
- ↑ "Oscar winner Resul Pookutty enrols as advocate". The Times of India. 5 March 2012. Retrieved 2023-05-14.
- ↑ Sen, Zinia (25 February 2009). "Pookutty: What do I dream about?". The Times of India. Archived from the original on 17 July 2012.
- ↑ "Resul Pookutty welcomed on-board Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil starrer Pushpa". The Times of India.
- ↑ "There is no award like a National Award: Resul Pookutty". The Times of India. 15 September 2010. Retrieved 2023-05-14.
- ↑ "Mohanlal, Pookutty get D.Litt". The Hindu. Kochi. 17 March 2010. Archived from the original on 2 April 2010.
- ↑ "Nobel laureate Venky, Ilayaraja, Rahman, Aamir to receive Padma awards". The Hindu. Retrieved 2023-05-14.
- ↑ "Pazhassi Raja selected as best film". The Hindu. Thiruvananthapuram. 4 January 2010. Archived from the original on 6 January 2010.
- ↑ "Chakulathamma Swarvarsha Puraskaram for Resul".
- ↑ "Bahadur Award 2009 for Resul". Archived from the original on 18 July 2011.
- ↑ "Slumdog gets 10 Oscar noms". Rediff News. Retrieved 2023-05-14.
- ↑ IANS. "Resul Pookutty: The other Indian at the Oscars". Sify. Archived from the original on 30 January 2009. Retrieved 2023-05-14.
బయటి లింకులు
[మార్చు]- అధికారిక వెబ్‌పేజీ Archived 2010-01-20 at the Wayback Machine
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రెసుల్ పూకుట్టి పేజీ
- రెసూల్ పూకుట్టి – వెరైటీలో ప్రొఫైల్
- రెసూల్ పూకుట్టి – ఫిల్మోగ్రఫీ ప్రొఫైల్
- ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రెసూల్ తిరిగి వచ్చాడు
- ఇంటర్వ్యూ-చాటింగ్
- సౌండ్ రిజల్యూషన్ – రెసూల్ పూకుట్టి ఫౌండేషన్ గురించి రెసుల్ పూకుట్టి మాట్లాడాడు – ఫ్రైడ్ ఐ Archived 2011-05-07 at the Wayback Machine