రోబో (సినిమా)
| రోబో | |
|---|---|
| దర్శకత్వం | ఎస్.శంకర్ |
| రచన | ఎస్.శంకర్ వి.బాలమురుగన్ సుజాతా రంగరాజన్ |
| నిర్మాత | కళానిధి మారన్ |
| తారాగణం | రజనీకాంత్ ఐశ్వర్యా రాయ్ డానీ డెంజోంగ్ప |
| ఛాయాగ్రహణం | ఆర్. రత్నవేలు |
| కూర్పు | ఆంథోని |
| సంగీతం | ఎ.ఆర్.రెహమాన్ |
నిర్మాణ సంస్థ | సన్ పిక్చర్స్ |
| పంపిణీదార్లు | సన్ పిక్చర్స్ హెచ్.బి.వొ. పిక్చర్స్ |
విడుదల తేదీ | 2010 సెప్టెంబరు 24 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
| బడ్జెట్ | |
రోబో, సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా, ఐశ్వర్య రాయ్ కథానాయికగా శంకర్ దర్శకత్వంలో 2010 అక్టోబరు 1 న విడుదల అయిన తెలుగు చిత్రం. తమిళ చిత్రం "ఎంధిరన్" కు ఇది తెలుగు అనువాదం. దీనికి AR రెహమాన్ సంగీతం అందించాడు. 'రోబో' సినిమా పూర్తిగా సాంకేతిక చిత్రం అయినప్పటికీ, హృదయాన్ని స్పర్శించే 'మానవత్వం' ఆధారిత సన్నివేశాలు కూడా ఉన్నాయి. సినిమా చివర్లో 'మానవులు ఇప్పటికే వివిధ రకాల రెడ్ చిప్స్‌తో అమర్చబడి ఉన్నారు' అని చిట్టి (రోబో) మాటలు ఆలోచింపచేసే కీలక సందేశం.
తారాగణం
[మార్చు]- రజనీకాంత్-చిట్టీ ఇంకా వశీకరన్
- ఐశ్వర్యారాయ్ - సన
- డానీ డెంజోంగ్ప - ప్రొఫెసర్ బోరా
- రోబో శంకర్
- రేవతి శంకరన్
సాంకేతికసిబ్బంది
[మార్చు]- గీత రచయితలు: వనమాలి, సుద్దాల, భువన చంద్ర
- సంభాషణలు: శ్రీ రామ కృష్ణ
- సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
- నిర్మాత: కళానిధి మారన్
- ప్రధాన కథ: సుజాత
- సినిమాటోగ్రఫీ: రత్నవేలు
- ఎడిటింగ్: ఆంథోనీ
- కాస్ట్యూమ్: మేరీ ఇ వోగ్ట్
- స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శంకర్
కథ
[మార్చు]ఒక ప్రముఖ శాస్తవేత్త వశీ గా పిలవబడే డా.వశీకరన్ (రజినీకాంత్), అతని ప్రియురాలు సన(ఐశ్వర్య రాయ్). అతని జీవితకాల ప్రాజెక్టు, భారత సైన్యానికి పనికొచ్చే ఒక రోబోట్‌ను తయారు చేయడం. 10 సంవత్సరాల కృషి తర్వాత, వశీ ఆండ్రోహ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించాడు. వశీ తల్లి దానికి చిట్టి అని పేరు పెట్టింది. చిట్టి శారీరక లక్షణాలలో వశీకరణ్ ని పోలి ఉంటుంది. కానీ ఇది మానవ భావోద్వేగాలను లేదా మానవ ప్రవర్తనను అర్థం చేసుకోదు. సరళంగా చెప్పాలంటే, చిట్టి అనేది కేవలం 1 టెర్రా హెర్ట్జ్ వేగం, 1 జెట్టా బైట్ జ్ఞాపకశక్తి కలిగిన ఒక యంత్రం. కానీ పురుషుడు కాదు. సన (ఐశ్వర్య రాయ్) చిట్టితో చాలా సన్నిహితంగా ఉంటుంది.
ఇదిలా ఉండగా వశీ తన రోబోకు పేటెంట్ కోసమని వెళ్లి, ప్యానెల్ ముందు హాజరవుతాడు. అక్కడ వశీ ప్రత్యర్థి డా. బోరా (డానీ డెంజోంగ్పా) చిట్టికి మానవ భావోద్వేగాలు లేకపోవడం వల్ల పేటెంట్ పొందడానికి అనర్హుడని ప్రకటిస్తాడు.[2][3] దీనితో మరింత కృషి చేసిన డాక్టర్ వశీకరన్ దానికి మానవ భావాలను, తార్కిక సామర్థ్యాలనూ నింపి దాదాపు మానవుడిని చేస్తాడు. కానీ పరిస్థితులు తలక్రిందులవుతాయి. ఆ రోబోట్, సనా (ఐశ్వర్య రాయ్) ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. దీనితో కోపం తెచ్చుకున్న వశీకరన్ దానిని నాశనం చేస్తాడు. కానీ శత్రు శాస్త్రవేత్త అయిన డా. బోరా నాశనం చేయబడిన రోబోట్ (చిట్టి)ని తీసుకొని, దానిని మరమ్మతు చేసి, దానిలో విధ్వంసక యంత్రాంగాన్ని నింపుతాడు. దానిని కొంతమంది అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్లకు అమ్మాలని అతను భావిస్తాడు. కానీ చిట్టిలో సనా పట్ల ప్రేమ క్రూరంగా మారి ఆమెను కిడ్నాప్ చేసేలా చేస్తుంది. ఈ క్రమంలో అది డా. బోరాను కూడా హతమారుస్తుంది. అంతేకాదు తనను తాను అభివృద్ధి పరచుకుని తనలాంటి అనేక రోబోట్‌లను సృష్టించడం ద్వారా సమాజంలో భారీ విధ్వంసం సృష్టిస్తుంది.
వశీ చిట్టి నుండి రెడ్ చిప్‌ను ఎలా తొలగించాడు? భారత ప్రభుత్వం, భారత సైన్యం, భారత న్యాయ వ్యవస్థ ఈ యంత్రాన్ని మన సమాజంలో భాగం కావడానికి అంగీకరించాయా? అనేది ఆసక్తికరమైన క్లైమాక్స్‌లోని మిగిలిన భాగం. నిజానికి ఈ ప్రశ్న కన్నా గ్రాఫిక్స్ తో రోబో ఎలా విన్యాసాలు చేసింది. ఏం వినాశనం తెచ్చిపెట్టిందన్నదే ఆసక్తి కరం.[4]
బయటిలింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.facebook.com/?ref=home#!/group.php?gid=116616778391250
- ↑ Arikatla, Venkat (2010-10-01). "'Robo' Review: A Right Movie For All Human Beings" (in ఇంగ్లీష్). Retrieved 2025-12-10.
{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Robot Movie Review". Cine Josh (in ఇంగ్లీష్). 2010-10-01. Retrieved 2025-12-10.
- ↑ Srikanya (2010-10-01). "'రోబో' రామాయణం(రివ్యూ)". గ్రేట్ ఆంధ్ర.
{{cite web}}: CS1 maint: url-status (link)