విక్రమసింహ
స్వరూపం
విక్రమసింహ | |
---|---|
దర్శకత్వం | సౌందర్య రజనీకాంత్ |
రచన | కె. ఎస్. రవికుమార్ |
నిర్మాత |
|
తారాగణం | |
Narrated by | ఎ. ఆర్. రెహమాన్ (తమిళము) అమితాబ్ బచ్చన్ (హిందీ) |
ఛాయాగ్రహణం | పద్మేష్ |
కూర్పు | ఆంధోని[1] |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 23 మే 2014 |
సినిమా నిడివి | 124 minutes[2] |
దేశం | భారత్ |
భాష | తమిళ |
బడ్జెట్ | ₹1.25 బిలియను (US$16 million)[3] |
విక్రమసింహ 2014లో విడుదలైన తెలుగు అనువాద చిత్రము. తమిళ చిత్రం కోచ్చడియాన్ దీనికి మాతృక.
కథ
[మార్చు]కళింగపట్నం-కొత్తపట్నం. వీటికి రాజా మహేంద్ర (జాకీషరాఫ్), ఉగ్రసింహ (నాజర్) మహారాజులు. ఇరువురికి అస్సలు సరిపడదు. మహేంద్రకు పెద్ద బలం, సర్వ సైన్యాధ్యక్షుడు రానా (రజనీకాంత్). ఒక దశలో రెండు రాజ్యాలు యుద్దానికి దిగుతాయి. అలాంటి సమయంలో రానా శత్రురాజు ఉగ్రసింహతో చేతులు కలిసి, తన సైన్యాన్ని వెనక్కు నడిపిస్తాడు. దీంతో మహేంద్ర ఆగ్రహంతో రానాను బహిష్కరిస్తాడు. కానీ ఆ తరువాత రానా వెళ్లి ఉగ్రసింహను చంపాలని చూస్తాడు. అసలు రానా ఆలోచన ఏమిటి? అసలు విక్రమసింహా ఎవరు? చివరకు ఏం జరిగింది.. అంటే దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అదేమిటి? చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన కథ.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- రచన: కె.ఎస్. రవికుమార్
- సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
- కూర్పు: ఆంటోనీ
- ఛాయాగ్రహణం: రాజీవ్ మీనన్
- నిర్మాతలు: సునీల్‌లల్లా, సునంద మురళీ మనోహర్, ప్రషీత చౌదరి
- దర్శకత్వం: సౌందర్య రజనీకాంత్ అశ్విన్
- సంస్థ: ఆరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ గ్లోబల్,
- విడుదల: 23 మే, 2014.
మూలాలు
[మార్చు]- ↑ Nikhil Raghavan (15 September 2012). "Arts / Cinema : Making the cut and how!". The Hindu. Chennai, India. Archived from the original on 19 అక్టోబరు 2012. Retrieved 1 జూన్ 2014.
- ↑ Sudhish Kamath (8 September 2013). "Kochadaiiyaan is here!". The Hindu. Chennai, India.
- ↑ "Kochadaiyaan to release in April 2013". IndiaGlitz. 5 November 2012.