ఊర్వశి (నటి)
ఊర్వశి | |
---|---|
జననం | కవిత రంజిని[1] |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 2 |
బంధువులు |
|
కవితా రంజిని (జననం 25 జనవరి 1969) భారతీయ సినిమా రంగంలో "ఊర్వశి" గా సుపరిచితురాలు. ఆమె భారతీయ సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత.[2] ఆమె ప్రధానంగా మలయాళ, తమిళ చిత్రాలలో నటించింది. ఆమె "ఉల్సవెమెలం", "పిడక్కొఝి కూవున్న నూట్టండు" సినిమాలను రాసింది. తరువాత వాటిని నిర్మించింది. 2005లో విడుదలైన "అచువింటే అమ్మా" చిత్రంలో[3] ఆమె నటనక్ గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని అందుకుంది.
జీవిత విశేషాలు
[మార్చు]ఊర్వశి 1969 జనవరి 25న సినిమానటుడైన చావర వి.పి.నాయర్, విజయలక్ష్మి దంపతులకు కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె అక్కలైన శివాంజలి, కల్పన లు కూడా నటీమణులు. ఆమె సోదరులైన కమల్ రాయ్, దివంగత ప్రిన్స్ లు కూడా కొన్ని మలయాళ చిత్రాలలో నటించారు. తన సోదరుడు ప్రిన్స్ తన 26 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు.[4] ఆమె ప్రాథమిక విద్యను తిరువనంతపురంలోని ఫోర్ట్ గర్ల్స్ మిషన్ హై స్కూల్ నుండి నాల్గవ తరగతి వరకు చదివింది. తరువాత కోడంబక్కం కార్పొరేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో తొమ్మిదో తరగతి వరకు చదివింది. తరువాత ఆమె కుటుంబంతో పాటు చెన్నై వెళ్ళింది. అప్పటికి ఆమె తన సినీ కెరీర్‌లో మూడు చిత్రాలలోనటిస్తున్నందున ఆమె చదువు కొనసాగించలేకపోయింది.[5] ఆమె మూడు సినిమాలలో నటించడం చూసిన భాగ్యరాజ్ ఆమెను "ముంతనై ముడిచి" సినిమాలోనటించడానికి బుక్ చేసాడు. ముంతనై ముడిచి కాల్‌షీట్స్‌లో ప్రాధాన్యత పొందడానికి ఆ ముగ్గురు దర్శకులు ఆమెకు సహాయం చేశారు. ఈ సినిమా విజయవంతమైనచో తమ సినిమాలను విడుదల చేసి లాభాలు పొందవచ్చని వారు ఆశించారు.
ఊర్వశి 2000 మే 2న సినిమా నటుడైన మనోజ్ కె. జయన్ ను వివాహం చేసుకుంది. వారికి ఒక కూమర్తె 2001 నవంబరులో కలిగింది. 2008లో తన మొదటి భర్త మనోజ్ కె. జయన్ నుండి విడాకులు తీసుకున్న తరువాత, ఊర్వశి నవంబర్ 2013లో చెన్నైకి చెందిన బిల్డర్ శివప్రసాద్‌ను వివాహం చేసుకుంది. వారికి ఆగస్టు 2014లో కుమారుడు జన్మించాడు.[6]
తెలుగు చిత్రాలు
[మార్చు]- రుస్తుం
- యమకింకరుడు
- సందడే సందడి
- అల్లరి రాముడు (2002)
- స్వరాభిషేకం
- ఆడవాళ్ళకు మాత్రమే (1994)
- భలే తమ్ముడు (1985)
- మగువలు మాత్రమే (2020)
- కోస్టి (2023)
మూలాలు
[మార్చు]- ↑ "Kavitha Ranjini is the real name of actress Urvashi - Times of India".
- ↑ "നായികമാര് എന്തിന് ഭയക്കണം?, Interview - Mathrubhumi Movies". Mathrubhumi.com. 2010-07-21. Archived from the original on 2014-10-15. Retrieved 2014-08-13.
- ↑ "ഏകാന്തതയുടെ കടല് ഞാന് നീന്തിക്കടക്കും - articles,infocus_interview - Mathrubhumi Eves". Mathrubhumi.com. Archived from the original on 2014-10-15. Retrieved 2014-08-13.
- ↑ "Friday Review uh kkk ch jo khelz must c free urdu \ spam p shav KFC : The Urvashi formula". The Hindu. 2009-03-20. Archived from the original on 2009-03-24. Retrieved 2018-03-09.
- ↑ PK Sreenivasan. "മുന്താണെ മുടിച്ചും പതിനാലുകാരി കവിതയും" (in తమిళము). Archived from the original on 2018-07-15. Retrieved 2018-03-09.
- ↑ "Actress Urvashi's Second Marriage with Sivaprasad". 2014-03-30. Retrieved 2018-03-09.