మనోజ్ కె. జయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోజ్ కె. జయన్
2016లో మనోజ్ కె. జయన్
జననం
మనోజ్ కడంపూత్రమదం జయన్

(1966-03-15) 1966 మార్చి 15 (వయసు 58)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థసదరన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, త్రివేండ్రం
క్రియాశీల సంవత్సరాలు1988–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఊర్వశి
(m.2000; div.2008)
ఆశ (m.2011-ప్రస్తుతం)
పిల్లలుతేజలక్ష్మి (కుమార్తె) (b.2001)
అమృత్ (కుమారుడు) (b.2012)
తల్లిదండ్రులుకె. జి. జయన్ (తండ్రి)
వి. కె. సరోజిని (తల్లి)

మనోజ్ కె. జయన్ మలయాళం, తమిళ చిత్రసీమలకు చెందిన భారతీయ నటుడు. ఆయన కొన్ని తెలుగు, కన్నడ చిత్రాలను కూడా చేసాడు. దక్షిణ భారత సినిమాలలోనే కాక బాలీవుడ్ చిత్రంలో కూడా నటించాడు.

సర్గం (1992)లో హరిహరన్ "కుట్టన్ థంపురాన్", పజాస్సి రాజా (2009)లో "తలక్కల్ చందు", ఫరూక్ అబ్దుల్ రహిమాన్ కలియాచన్‌లోని "కుంజీరామన్" పాత్రలకుగాను ఆయనకు రెండవ ఉత్తమ నటుడిగా మూడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి. "కుట్టన్ తంపురన్" (సర్గం), "తిరుమంగళత్ నీలకందన్ నంబూతిరి" (పెరుమ్తచ్చన్), "కుంజున్ని నంబూతిరి" (పరిణయం), "ఉన్నికృష్ణన్" (వెంకళం), "అనంతకృష్ణ వారియర్" (సోపానం), "దిగంబరన్" (ఆనంద), "తలక్కల్ చందు" (పఝస్సి రాజా) చిత్రాలలో ఆయన నటించాడు.

ఆయన జయ-విజయ కాంబోలో గాయకుడు జయన్ కుమారుడు. ఆయన గాయకుడు కూడా.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆయన 1966 మార్చి 15న కేరళలోని కొట్టాయం జిల్లాలో ప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కె. జి. జయన్, ఉపాధ్యాయురాలు వి.కె. సరోజిని దంపతులకు జన్మించాడు. ఆయనకి ఒక అన్నయ్య బిజు కె జయన్ (సంగీతకారుడు) ఉన్నాడు. మనోజ్ కె. జయన్ తన ప్రాథమిక విద్య సెయింట్ జోసెఫ్ కాన్వెంట్, కొట్టాయంలో, సేక్రేడ్ హార్ట్ మౌంట్ నుంచి హై స్కూల్ విద్య, ప్రభుత్వ కళాశాల, కొట్టాయం (నట్టకం) నుండి ప్రీ-యూనివర్శిటీ డిగ్రీని పూర్తిచేసాడు. తర్వాత ఆయన నటన నేర్చుకునేందుకు త్రివేండ్రంలోని సదరన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు, అయితే శిక్షణను మధ్యలోనే ఆపేసాడు.[1][2]

ఫిల్మోగ్రఫీ (తెలుగు)

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
1993 సరిగమలు కిట్టప్ప
2003 వీడే వెంకటేశ్వరరావు
2006 నాయుడు LLB
2008 శౌర్యం శివరాం గౌడ్
2022 సెల్యూట్ అజిత్‌ కరుణాకర్‌, డీఎస్పీ [3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన 2000 మే 2న సినీ నటి ఊర్వశిని వివాహం చేసుకున్నాడు. వారికి తేజలక్ష్మి అనే కుమార్తె 2001లో జన్మించింది. అయితే 2008లో వారు విడాకులు తీసుకున్నారు.[4][5] తరువాత, ఆయన ఆశాను 2011 మార్చి 2న వివాహం చేసుకున్నాడు. వారికి 2012 డిసెంబరు 30న కుమారుడు అమృత్‌ జన్మించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "CINIDIARY - A Complete Online Malayalam Cinema News Portal". cinidiary.com. Archived from the original on 20 June 2017. Retrieved 25 July 2018.
  2. "malayalamcinema.com, Official website of AMMA, Malayalam Film news, Malayalam Movie Actors & Actress, Upcoming Malayalam movies". www.malayalamcinema.com. Retrieved 22 November 2022.
  3. "SALUTE Review: రివ్యూ: సెల్యూట్‌ | dulquer salmaan salute review". web.archive.org. 2023-08-29. Archived from the original on 2023-08-29. Retrieved 2023-08-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Urvasi and Manoj K Jayan submit consent letter for separation". Mathrubhumi. Archived from the original on 3 December 2013. Retrieved 19 March 2013.
  5. "Court gives daughter's custody to Manoj K Jayan". Mathrubhumi. 6 July 2012. Archived from the original on 7 July 2012. Retrieved 19 March 2013.
  6. "ഭര്‍ത്താവിനെ അനുസരിക്കുന്നവളാണ് നല്ല ഭാര്യ". Archived from the original on 2 November 2013. Retrieved 29 November 2013.