సరిగమలు
స్వరూపం
| సరిగమలు (1993 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | క్రాంతి కుమార్ |
| తారాగణం | వినీత్, రంభ |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | విజేతా ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
సరిగమలు 1993 లో విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీ విజేత ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం కె రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కినది. 1992 లో మళయాళo లో వచ్చిన సర్గం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.ఈ చిత్రంలో వినీత్, మనోజ్ కె జయన్, రంభ జె వి.సోమయాజులు ముఖ్య పాత్రలు పోషించారు.సంగీత ప్రధానమైన ఈ చిత్రానికి సంగీతం బాంబే రవి సమకూర్చారు. ఈ చిత్రం క్రాంతి కుమార్ దర్శకత్వంలో నిర్మించ బడినది.[1]
తారాగణం
[మార్చు]- వినీత్
- రంభ
- మనోజ్ కె జయన్
- జె వి సోమయాజులు
- పి.జె.శర్మ
- భారతి
- శారదా ప్రీతి
- నాగమణి
- సుత్తివేలు
- ప్రసాద్ బాబు
- అల్లు రామలింగయ్య (అతిథి నటుడు)
- నారాయణరావు (అతిథి నటుడు)
- మల్లికార్జునరావు(అతిథి నటుడు)
- తనికెళ్ళ భరణి(అతిథి నటుడు).
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: క్రాంతికుమార్
- కథ, స్క్రీన్ ప్లే: హరిహరన్
- సంగీతం: బాంబే రవి
- మాటలు: గణేష్ పాత్రో
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: కె.ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.జె.జేసుదాస్
- ఛాయా గ్రహణం: హరి అనుమోలు
- ఎడిటింగ్: ఏ.శ్రీకర్ ప్రసాద్
- కాస్ట్యూమ్స్: వేణు- రమేష్
- మేకప్: చంద్ర
- స్టిల్స్: కె.సత్యనారాయణ
- నృత్యం:సుచిత్ర
- ఫైట్స్: సాహుల్
- అసిస్టెంట్ డైరెక్టర్లు: డి.వి.రాజు- ఎస్.ఎస్.రాజమౌళి
- సమర్పణ: కె.రాఘవేంద్రరావు
- నిర్మాతలు: సి.వినయ కుమారి- కె.శారదాదేవి
- నిర్మాణ సంస్థ: శ్రీ విజేత ఫిలింస్
- విడుదల:27:11:1993.
పాటల జాబితా
[మార్చు]- ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగాప్రవాహమే, రచన: వేటూరి, గానం.కె.జె.జేసుదాస్
- కృష్ణ కృప, రచన: వేటూరి, గానం.కె.జె.జేసుదాస్, కె .ఎస్ .చిత్ర
- సరిగమలు ఆపవయ్యా సరసకు చేరవయ్యా, రచన: వేటూరి, గానం.కె.ఎస్.చిత్ర
- గోదావరి పై ఎద కృష్ణమ్మ నీ వాలుజడ, రచన: వేటూరి, గానం.కె ఎస్ చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- రాగసుధ రస పానము జేసి రంజిల్లదేమో మనసా, రచన: వేటూరి, గానం.కె.జె.జేసుదాస్
- సంగీతమే, రచన: వేటూరి, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం .
చిత్ర విశేషాలు
[మార్చు]- ఈ చిత్రం మలయాళంలో నిర్మించబడిన స్వర్గం ఆధారంగా నిర్మించబడింది.
- ఈ సినిమాతో తెలుగు నటి రంభ మలయాళ సినీమా రంగానికి పరిచయం చేయబడింది.
- ఈ సినిమాను తెలుగులో నిర్మించినది ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు.
- రాఘవేంద్రరావు తన ఈ సినిమా మలయాళ మాతృకను చూసి దర్శకునిగా క్రాంతికుమార్ను తీసుకొన్నాడు.
- మలయాళ మాతృకలో నటించిన నటులు వినీత్, మనోజ్ కె.జయన్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయబడ్డారు.
మూలాలు
[మార్చు]- ↑ "Sarigamalu (1993)". Indiancine.ma. Retrieved 2025-08-19.