Jump to content

రుస్తుం

వికీపీడియా నుండి
రుస్తుం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామి రెడ్డి
నిర్మాణం ఎస్.పి.వెంకన్నబాబు
కథ గిరిజశ్రీ భగవాన్
చిత్రానువాదం ఎ. కోదండరామిరెడ్డి
తారాగణం చిరంజీవి,
ఊర్వశి
సంగీతం చక్రవర్తి
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కూర్పు వెళ్ళై స్వామి
నిర్మాణ సంస్థ మహేశ్వరి మూవీస్
భాష తెలుగు

రుస్తుం 1984 లో వచ్చిన తెలుగు, యాక్షన్ చిత్రం. ఎస్పీ వెంకన్న బాబు మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో నిర్మించగా, ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] ఇందులో చిరంజీవి, ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నమోదైంది.

గ్రామ పంచాయతీ అధిపతి గంగా రాయుడు (రావు గోపాలరావు) ముసలయ్య (మిక్కిలినేని)కూ రౌడీ గంగయ్య (జగ్గారావు)కూ మధ్య తగుచుపై తీర్పు చెప్పడంతో సినిమా మొదలౌతుంది. ముసలయ్య కొన్ని తెలియని పరిస్థితులలో గ్రామాన్ని విడిచిపెట్టి 15 సంవత్సరాల తరువాత తిరిగి వస్తాడు. తన ఆస్తి (ఇల్లు & పొలం) ని గంగయ్య అక్రమించుకున్నాడని అతడికి తెలుస్తుంది. ఆ ఆస్తిని ముసలయ్యకు తిరిగి ఇవ్వడానికి గంగయ్య ఇష్టపడడు. అందుకే వారు పంచాయతీకి వచ్చారు. రాయుడు గంగయ్యకు మద్దతు పలికి, ముసలయ్యకు అన్యాయం చేస్తాడు. రాయుడిని ఎదుర్కోవటానికి తగినంత శక్తి లేకపోవడంతో, అతను మళ్ళీ గ్రామాన్ని విడిచిపెట్టి పోతాడు.

కొత్తగా వచ్చిన హరి (చిరంజీవి) గ్రామంలోకి ప్రవేశించి గంగయ్యతో గొడవపడి తన ఆస్తిని సొంతం చేసుకుని గ్రామ ప్రజలకు మంచి చేస్తాడు. గ్రామ ప్రజలు అతన్ని రుస్తుం అని పిలవడం ప్రారంభిస్తారు. హరి గ్రామ సంక్షేమం కోసం పనిచేస్తాడు. అవసరంలో ఉన్న వారికి వెంటనే సహాయం చేస్తాడు. హరిని గ్రామం నుండి తరిమికొట్టడానికి రాయుడు ఒక ఉచ్చు వేస్తాడు. తన ఉచ్చులో భాగంగా హరిని గ్రామాధిపతిగా చేస్తాడు. ఇంతలో, రాయుడు కుమార్తె పద్మ (ఊర్వశి) హరిని ప్రేమిస్తుంది. హరి కూడా బ్రహ్మయ్య నాయుడు (గుమ్మడి), పార్వతి (అన్నపూర్ణ) దంపతులకు దగ్గరవుతాడు. లక్ష్మి (రాజ్యలక్ష్మి) అనే అమ్మాయి గర్భానికి, ఆమె ఆత్మహత్యకూ హరే కారణమని ప్రజలు అనుమానించడంతో అతడు గ్రామాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. పద్మ కూడా హరిని అనుమానిస్తుంది. లక్ష్మి ఆత్మహత్య వెనుక కారణం తాను కాదని నిరూపించేందుకు చేసిన దర్యాప్తులో, రాయుడు కుమారుడు గిరి (గిరి బాబు) దానికి కారణమని హరి తెలుసుకుంటాడు. జైలు నుండి విడుదలైన బ్రహ్మయ్య నాయుడు తమ్ముడు రుద్రయ్య (సత్యనారాయణ) ను హరిని చంపడానికి రాయుడు మాట్లాడుకుంటాడు.

ఇంతలో, గిరి నగరానికి వెళ్లి, అసలు హరి తమ గ్రామానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవడానికి ముసలయ్యను వెంబడిస్తాడు. హరి, బ్రహ్మయ్య నాయుడు కొడుకేనని గిరికి తెలిసిపోతుంది. చిన్నతనంలో ఒకసారి అతను, రాయుడు చేసిన హత్యను చూస్తాడు. హరి హత్యా స్థలం నుండి పారిపోతాడు. బ్రహ్మయ్య నాయుడి సేవకుడైన ముసలయ్య హరిని రక్షించి నగరానికి తీసుకువెళతాడు. అదే సమయంలో తన కొడుకు కోసం వెతుకుతూ, బ్రహ్మయ్య నాయుడు హత్యా స్థలానికి వస్తాడు. రాయుడు చెప్పిన మోదట రుద్రయ్యను హంతకుడిగా నిర్ధారిస్తాడు. బ్రహ్మయ్య నాయుడు కూడా రుద్రయ్యే హంతకుడని నమ్ముతాడు. దాంతో అతన్ని అరెస్టు చేస్తారు. ముసలయ్య, రుద్రయ్య, హరి రాయుడుకు మంచి పాఠం నేర్పించి గ్రామానికి మంచి చేయాలని యోచిస్తారు. వారి ప్రణాళికలో భాగంగా రుద్రయ్య, హరి నిజమైన ప్రత్యర్థులలాగా పోరాడుతారు. గిరి నుండి నిజం తెలుసుకున్నాక రాయుడు, హరి కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తాడు. నిజం తెలుసుకున్న పద్మ, రాయుడు అసలు స్వరూపాన్ని నిరూపించడంలో హరికి సహాయం చేస్తుంది. క్లైమాక్స్ పోరాటం తరువాత, హరి పోలీస్ ఇన్స్పెక్టరుగా ప్రవేశించి రాయుడిని అరెస్టు చేసినట్లు ఒక ట్విస్ట్ ఉంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

వేటూరి సుందరరామమూర్తి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

సం. పాట గాయనీ గాయకులు నిడివి
1 "ఎలా వున్నదమ్మా" ఎస్పీ బాలు, పి.సుశీల 4:12
2 "నీ బుగ్గ" ఎస్పీ బాలు, పి. సుశీల 4:32
3 "రామన్న రాముడోయి" ఎస్పీ బాలు, పి. సుశీల 5:27
4 "పాడ్యమి నాటి రాత్రి" పి. సుశీల 3:52
5 "తోట కూరా" ఎస్పీ బాలు, పి. సుశీల 4:27

మూలాలు

[మార్చు]
  1. "రుస్తుం నటీనటులు-సాంకేతిక నిపుణులు | Rustum Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2020-08-10.
"https://te.wikipedia.org/w/index.php?title=రుస్తుం&oldid=4209172" నుండి వెలికితీశారు