Jump to content

మిఠాయి చిట్టి

వికీపీడియా నుండి

మిఠాయి చిట్టి తెలుగు చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా సహాయపాత్రలను ధరించింది. కొమ్మినేని శేషగిరిరావు, బాపు, కె.వాసు, పి.చంద్రశేఖరరెడ్డి, రాజాచంద్ర, విజయ బాపినీడు, పి.ఎన్.రామచంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి, వల్లభనేని జనార్ధన్, వంశీ, టి. కృష్ణ, రేలంగి నరసింహారావు , కె.బాపయ్య, కె.ఎస్.ఆర్.దాస్, పి.సాంబశివరావు, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, ఎస్. వి. కృష్ణారెడ్డి, దాసరి నారాయణరావు, రవిరాజా పినిశెట్టి, పూరీ జగన్నాథ్, ఉదయశంకర్ మొదలైన దర్శకుల సినిమాలలో ఈమె నటించింది. ఈమె నిర్మాతగా మిఠాయి మూవీస్ బ్యానర్‌పై మరో పోరాటం, అంతిమ పోరాటం అనే డబ్బింగ్ సినిమాలను కూడా నిర్మించింది.

సినిమాల జాబితా

[మార్చు]

ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:[1]

సంవత్సరము సినిమాపేరు పాత్ర దర్శకుడు ఇతర నటులు
1980మహాశక్తికొమ్మినేని శేషగిరిరావునరసింహ రాజు, మాధవి
1981త్యాగయ్యబాపుజె.వి.సోమయాజులు, కె.ఆర్.విజయ
1981పార్వతీ పరమేశ్వరులుఎం.ఎస్.కోటారెడ్డిచంద్రమోహన్, ప్రభ
1982కలహాల కాపురంకె.వాసుచంద్రమోహన్, సరిత
1982కృష్ణావతారంబాపుకృష్ణ, శ్రీదేవి
1982మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవముఎం.ఆర్.నాగ్జి.రామకృష్ణ, చంద్రకళ
1983నవోదయంపి.చంద్రశేఖరరెడ్డిమాదాల రంగారావు, కవిత
1984అల్లుళ్ళొస్తున్నారుకె.వాసుచిరంజీవి, గీత
1984కుర్రచేష్టలురాజాచంద్రసుమన్, విజయశాంతి
1984కొండవీటి నాగులురాజశేఖరన్కృష్ణంరాజు, రాధిక
1984మహానగరంలో మాయగాడువిజయ బాపినీడుచిరంజీవి, విజయశాంతి
1984మెరుపు దాడిపి.ఎన్.రామచంద్రరావుభానుచందర్, సుమలత
1984రుస్తుంఎ.కోదండరామిరెడ్డిచిరంజీవి, ఊర్వశి
1984శ్రీమతి కావాలివల్లభనేని జనార్ధన్మోహన్ బాబు, రాధిక
1985బంగారు చిలకవంశీఅర్జున్, భానుప్రియ
1986ఇద్దరు మిత్రులుబి.ఎల్.వి.ప్రసాద్సుమన్, సుమలత
1986ఖైదీ రుద్రయ్యఎ.కోదండరామిరెడ్డికృష్ణ, శ్రీదేవి
1986రేపటి పౌరులుటి. కృష్ణరాజశేఖర్, విజయశాంతి
1987భలే మొగుడు రేలంగి నరసింహారావు రాజేంద్రప్రసాద్, రజని
1987మా ఊరి మగాడుకె.బాపయ్యకృష్ణ, శ్రీదేవి
1987ముద్దాయికె.ఎస్.ఆర్.దాస్కృష్ణ, విజయశాంతి
1988అభినందనఅశోక్ కుమార్కార్తీక్, శోభన
1988సంకెళ్ళుపి.సాంబశివరావుదగ్గుబాటి రాజా, రమ్యకృష్ణ
1988సుమంగళివిజయ బాపినీడుకృష్ణంరాజు, జయప్రద
1988స్టేషన్ మాస్టర్కోడి రామకృష్ణరాజశేఖర్, జీవిత
1989దొరికితే దొంగలుకె.మురళీమోహనరావుశోభన్ బాబు, విజయశాంతి
1989పార్థుడుకె.ఎస్.ఆర్.దాస్కృష్ణ, రాధ
1990జయసింహముత్యాల సుబ్బయ్యసుమన్, భానుప్రియ
1990బుజ్జిగాడి బాబాయ్కుర్రా రంగారావునరేష్, నిరోషా
1995బిగ్‌బాస్విజయబాపినీడుచిరంజీవి, రోజా
1995సర్వర్ సుందరంగారి అబ్బాయిగీతాకృష్ణమల్లిక్, ఆమని
1997తారక రాముడుఆర్.వి.ఉదయకుమార్శ్రీకాంత్, సౌందర్య
1997దేవుడురవిరాజా పినిశెట్టినందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ
1997పెళ్ళికోడి రామకృష్ణనవీన్, మహేశ్వరి
1997పెళ్ళిపందిరికోడి రామకృష్ణజగపతి బాబు, రాశి
1998పెళ్ళి పీటలుఎస్. వి. కృష్ణారెడ్డి జగపతి బాబు, సౌందర్య
1998వసంతసి.ఆర్.రెడ్డిపృథ్వీరాజ్, రాశి
1999పిచ్చోడి చేతిలో రాయిదాసరి నారాయణరావుదాసరి నారాయణరావు, ఇంద్రజ
2000ఒక్కడు చాలురవిరాజా పినిశెట్టిరాజశేఖర్, రంభ
2000నాగులమ్మకె.ఎస్.ఆర్.దాస్పృథ్వీ రాజ్, మహేశ్వరి
2000బద్రి పూరీ జగన్నాథ్పవన్ కళ్యాణ్, అమీషా పటేల్
2000బలరాంరవిరాజా పినిశెట్టిశ్రీహరి, రాశి
2000మా అన్నయ్యరవిరాజా పినిశెట్టిరాజశేఖర్, దీప్తి భట్నాగర్
2000విజయరామరాజువీరశంకర్శ్రీహరి, ఊర్వశి
2000సకుటుంబ సపరివార సమేతంఎస్.వి.కృష్ణారెడ్డిఅక్కినేని నాగేశ్వరరావు, సుహాసిని
2000సర్దుకుపోదాం రండిఎస్.వి.కృష్ణారెడ్డిజగపతి బాబు, సౌందర్య
2001ప్రేమతో రాఉదయశంకర్వెంకటేష్, సిమ్రాన్
2002మళ్ళీ మళ్ళీ చూడాలిపవన్స్ శ్రీధర్వేణు, జనని
2003ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు!హరిబాబుఅదిత్య ఓం, కీర్తి చావ్లా
2003కబీర్ దాస్వి.వి.రాజువిజయచందర్, ప్రభ
2003పెళ్ళాంతో పనేంటిఎస్. వి. కృష్ణారెడ్డివేణు, లయ
2005అరె..!నేతాజీకేశవతీర్థ, మౌనిక
2006ఇల్లాలు ప్రియురాలుభానుశంకర్వేణు, దివ్య ఉన్ని

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "All Movies Mitayi Chitti". ఇండియన్ సినిమా. Retrieved 7 December 2022.

ఇతర లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మిఠాయి చిట్టి పేజీ