పెళ్ళిపందిరి (1997 సినిమా)
పెళ్ళి పందిరి | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
తారాగణం | జగపతి బాబు, రాశి, పృథ్వీ రాజ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1997 |
భాష | తెలుగు |
పెళ్ళిపందిరి 1997లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రము. ఇందులో జగపతి బాబు, పృథ్వీ రాజ్, రాశి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.
కథ
[మార్చు]ప్రకాష్ ఒక ధనవంతుల బిడ్డ. అనాథ అయిన గోవింద్, ప్రకాష్ మంచి స్నేహితులు. ప్రకాష్ తండ్రికి ఇష్టం లేకపోయినా గోవిందుతో స్నేహాన్ని మాత్రం వదులుకోడు. అందుకోసం తల్లిదండ్రులను ఎదిరించడానికి కూడా వెనుకాడడు. పెద్దయిన తర్వాత ప్రకాష్ కు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. ప్రకాష్ వెళ్ళిపోగానే అతని తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లోనే ఉన్న గోవింద్ ను దొంగతనం నేరం మోపి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తుండగా తన స్నేహితుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకూడదని అతనికి చెప్పకుండా గోవిందే ఇల్లు విడిచి వచ్చేస్తాడు. ఒక కాలనీలో చేరుకుని గెటప్ మార్చుకుని అక్కడి వాళ్ళకి చిన్న చితకా పనులు చేస్తూ సాయపడుతుంటాడు.
తారాగణం
[మార్చు]- గోవింద్ గా జగపతి బాబు
- ప్రకాష్ గా పృథ్వీ రాజ్
- రాశి
- రఘునాథ రెడ్డి
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- మల్లికార్జున రావు
- సుధాకర్
- కళ్ళు చిదంబరం
- సుహాసిని
- శరత్ బాబు
- మాస్టర్ ఆనంద్
- మాస్టర్ శ్రీనివాస్
- మిఠాయి చిట్టి
- రాధా ప్రశాంతి
సాంకేతికవర్గం
[మార్చు]సంగీతము
[మార్చు]- దోస్త్ మేరా దోస్త్ , రచన; సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్. పి., బాలసుబ్రహ్మణ్యం, మనో
- నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా , రచన: గురు చరణ్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , గోపికా పూర్ణిమ
- అనగనగా ఒక నిండు చందమామ, రచన: ,సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- ఇదే మంచి రోజంది ముచ్చటగా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
- చూడచక్కని జింకపిల్లరా, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత