రాధా ప్రశాంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధా ప్రశాంతి
రాధా ప్రశాంతి
జననం
తమటాల కృష్ణవేణి

ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, కాశీనగర్
ఇతర పేర్లుటైగర్ రాధాప్రశాంతి
వృత్తిసినీ నటి, రంగస్థల కళాకారిణి
గుర్తించదగిన సేవలు
పరువు ప్రతిష్ఠ
బంగారు కుటుంబం
ఎర్రసూర్యుడు
జీవిత భాగస్వామిఉప్పుడి కిరణ్‌కుమార్ రెడ్డి
పిల్లలుఇద్దరు
తల్లిదండ్రులుతమటాల వెంకన్న నాయుడు, తమటాల పగడాలమ్మ
పురస్కారాలుస్త్రీ శక్తి పురస్కారం - కన్నగి అవార్డు

రాధా ప్రశాంతి ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 100కు పైగా సినిమాలలో నటించింది. ఈమె నటిగా మాత్రమే కాకుండా కష్టంలో ఉన్న వారికి దానధర్మాలు చేసి మంచి పేరు గడించింది. ఎన్నో గుప్తదానాలను చేసింది. ఈమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 2013లో కన్నగి స్త్రీ శక్తి పురస్కారం ప్రకటించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె అసలు పేరు కృష్ణవేణి. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా (అప్పటి గంజాం జిల్లా)లోని కాశీనగర్ అనే గ్రామంలో తమటాల వెంకన్న నాయుడు, తమటాల పగడాలమ్మ దంపతులకు ఈమె మొదటి సంతానంగా జన్మించింది. ఈమెకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. ఈమె చిన్న వయసులోనే తండ్రి కేన్సర్ వ్యాధితో మరణించాడు. వెంపటి చినసత్యం వద్ద ఈమె కూచిపూడి నృత్యాన్ని అభ్యసించింది. తమ గ్రామంలోని ఔత్సాహిక నటులతో కలిసి ఈమె నాటకాలను ప్రదర్శించడం ప్రారంభించింది. తరువాత కొన్ని వేల నాటకాలలో నటించింది. వీటిని చూసిన సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఈమెకు సినిమాలలో అవకాశం కల్పించారు. ఈమెకు ఉప్పుడి కిరణ్‌కుమార్ రెడ్డితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సినిమా రంగం

[మార్చు]

సినిమారంగంలో ప్రవేశించాక ఈమె పేరును ప్రశాంతిగా మార్చారు. అయితే ఈమె ఆ సమయంలో ఉన్నత స్థానంలో ఉన్న సినిమా నాయిక రాధ పోలికలు కలిగి ఉండడంతో ఈమె పేరుకు రాధ జోడించి రాధాప్రశాంతి అని పిలవసాగారు. ఈమె అన్ని దక్షిణాది భాషా చలన చిత్రాల్లోనూ, హిందీ చిత్రాలలోనూ సుమారు 100 సినిమాలలో నటించింది. కథానాయిక, తల్లి, చెల్లి మొదలైన ఇతర సహాయక పాత్రలలో నటించింది.

ఈమె నటించిన సినిమాల పాక్షిక జాబితా:

విడుదల సం సినిమా పేరు పాత్ర దర్శకుడు ఇతర వివరాలు
1993 పరువు ప్రతిష్ట వి.సి. గుహనాథన్
1994 అల్లరోడు సుందరి కె.అజయ్ కుమార్
1994 టాప్ హీరో ఎస్. వి. కృష్ణారెడ్డి
1994 పావం IA ఇవాచన్ రాయ్ పి. థామస్ మలయాళ సినిమా
1994 బంగారు కుటుంబం పుష్ప స్నేహితురాలు దాసరి నారాయణరావు
1994 భలే పెళ్లాం క్రాంతి కుమార్
1994 మరో క్విట్ ఇండియా పరుచూరి సోదరులు
1994 శ్రీదేవి నర్సింగ్ హోం గెద్దాడ ఆనంద్ బాబు
1995 ఎర్రసూర్యుడు పి.చంద్రశేఖరరెడ్డి
1995 మధ్యతరగతి మహాభారతం ఉదయభాస్కర్
1996 కూతురు తమ్మారెడ్డి భరద్వాజ
1997 ఎన్‌కౌంటర్ ఎన్. శంకర్
1997 ఓంకారం ఉపేంద్ర
1997 గోకులంలో సీత ముత్యాల సుబ్బయ్య
1997 పెళ్ళి చేసుకుందాం ముత్యాల సుబ్బయ్య
1997 పెళ్ళి పందిరి కోడి రామకృష్ణ
1997 లవ్ కుశ్ వి.మధుసూదనరావు హిందీ సినిమా
1998 పెళ్ళి కానుక కోడి రామకృష్ణ
1998 మావిడాకులు ఉపాధ్యాయిని ఇ.వి.వి. సత్యనారాయణ
1998 శ్రీరాములయ్య ఎన్. శంకర్
1998 వెలుగు నీడలు మౌర్య
1999 ఆవిడే శ్యామల కోడి రామకృష్ణ
2000 బలరాం రవిరాజా పినిశెట్టి
2000 దేవుళ్ళు నిర్మల అక్క కోడి రామకృష్ణ
2001 నరసింహ నాయుడు బి. గోపాల్
2001 మదువె ఆగోణ బా వి.ఎస్.రెడ్డి కన్నడ సినిమా పెళ్ళి చేసుకుందాం సినిమాకు రీమేక్
2007 షిర్డీ విపిన్
2008 అప్పుచేసి పప్పుకూడు రేలంగి నరసింహారావు

టెలివిజన్ ధారావాహికలు

[మార్చు]
ధారావాహిక పేరు పాత్ర దర్శకుడు ప్రసారమైన టెలివిజన్ ఛానెల్
కార్తీకదీపం మినిస్టర్ భార్య సెల్వ రోషన్ స్టార్ మా

సేవారంగం

[మార్చు]

ఈమె తన భర్తతో కలిసీ స్టెప్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా అనాథలు, వికలాంగులు, వితంతువులు, నిరాశ్రయులకు ఆర్థిక సహాయం చేస్తున్నది. దీనితో పాటు అంధులకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.[1]

గుర్తింపులు

[మార్చు]
రాష్ట్రపతి ద్వారా స్త్రీ శక్తి పురస్కారం అందుకుంటున్న రాధా ప్రశాంతి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ (9 March 2014). "రాధా కె.ప్రశాంతికి స్త్రీశక్తి పురస్కారం". సాక్షి దినపత్రిక. Retrieved 12 February 2024.

బయటిలింకులు

[మార్చు]