పెళ్ళి కానుక (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళి కానుక
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం జగపతి బాబు,
లక్ష్మి / పి.భానుమతి ,
జి.రామకృష్ణ
నిర్మాణ సంస్థ ఎన్.వి.ఎస్. క్రియెషన్స్
భాష తెలుగు

పెళ్ళి కానుక 1998 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని ఎన్విఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో నన్నపనేని అన్నా రావు నిర్మించగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, లక్ష్మి, భానుమతీ రామకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నమోదైంది. షారుఖ్ ఖాన్, మహిమా చౌదరి నటించిన 1997 బాలీవుడ్ చిత్రం పర్‌దేస్కు రీమేక్ ఈ సినిమా.

ఢిల్లీలో నివసిస్తున్న సావిత్రమ్మ (భానుమతి రామకృష్ణ) ఐశ్వర్యవంతురాలు. చాలా సంవత్సరాల తరువాత తన గ్రామాన్ని సందర్శించి తన పాత కుటుంబ మిత్రులు సీతారామరాజు (మల్లికార్జున రావు) ను కలుస్తుంది. ఆ సాంప్రదాయిక, సదాచార భారతీయ గృహంలో గడిపిన సమయంలో, సీతారామరాజు కుమార్తె గంగ (లక్ష్మి) గురించి ఆమె తెలుసుకుంటుంది. గ్రామంపైన, దాని సంస్కృతిపైనా గంగ కున్న ప్రేమ గురించి తెలుసుకుంటుంది. పాశ్చాత్య నాగరికత ప్రభావంలో ఉన్న తన మనవడు శ్రీనివాస ప్రసాద్ / చింటూ (వీరేన్ చౌదరి) కు గంగ నిచ్చి పెళ్ళి చేసేందుకు సావిత్రమ్మ సీతారామరాజు చేత వాగ్దానం చేయించుకుంటుంది.

గంగను కలిసేందుకూ, ఆమెను పెళ్ళి చేసుకునేందుకూ తన మనవడి చేత ఒప్పించడానికి తాను చాలా కష్టపడాల్సి ఉంటుందని సావిత్రమ్మకు తెలుసు. ఆమె తన పెంపుడు కొడుకు సాగర్ / ఎయిర్‌పోర్ట్ ( జగపతి బాబు ) ను తన ప్లానులో సహాయం చేయమని అడుగుతుంది. చింటూ వచ్చేసరికి గంగా ఇంటివద్ద పరిస్థితిని సిద్ధం చేయడానికి సాగర్ చింటూ కంటే ముందే గ్రామానికి వస్తాడు. చింటూ అక్కడికి వచ్చాక, చిరాగ్గా వ్యవహరిస్తాడు. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా చేస్తాడు. కొన్నిసార్లు మర్యాద, సంప్రదాయాలు తెలియక చేస్తాడు. గంగ పట్ల తనకూ ఆకర్షణ ఉన్నప్పటికీ సాగర్, పరిస్థితిని చక్కబరుస్తూంటాడు. గంగ చింటూల పెళ్ళి సజావుగా జరిపించాలనే సంకల్పంతో సాగర్, చింటూ గురించి, అతడి అలవాట్ల గురించీ గంగకు అబద్ధాలు చెబుతాడు. చింటూ "మంచి వ్యక్తి" అని ఆమెకు భరోసా ఇస్తాడు. చింటూ చెడు అలవాట్లను కూడా కప్పిపుచ్చుతాడు. చింటూ, గంగలు పెళ్ళికి అంగీకరిస్తారు.

నిశ్చితార్థం తరువాత, పెళ్ళికి ముందు గంగ ఢిల్లీవెళ్తుంది. చింటూ తల్లిదండ్రులు తన సాంప్రదాయిక వేషధారణను ఏవగించుకుంటున్నారని తెలిసి బాధపడుతుంది. కొత్త పరిసరాలలో, ఆమెకున్న ఏకైక స్నేహితుడు, నమ్మకమైన వ్యక్తీ సాగరే. అతడితో ఆమెకు ఒక ప్రత్యేక బంధం ఏర్పరడడం మొదలౌతుంది. చింటూ, సాగర్ చిత్రీకరించిన రకం మనిషి కాదని ఆమెకు నెమ్మదినెమ్మదిగా తెలుస్తూ పోతుంది. అతను సిగరెట్టు తాగుతాడు, మందు తాగుతాడు, రౌడీలా ప్రవర్తిస్తాడు. చింటూ తన స్నేహితురాళ్ళతో ఉన్న ఫోటోలను బట్టి అతనికి వారితో లైంగిక సంబంధం ఉందని కూడా అర్థమౌతుంది. దీనికి సంబంధించి ఆమె చింటూను అడిగినప్పుడు, అతను గంగతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. సాగర్ ఆమెను రక్షించటానికి వస్తాడు. చింటూపై తిరుగుబాటు చేస్తాడు. సావిత్రమ్మ అక్కడికి రాగానే చింటూ, సాగర్ గంగను పెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, అందువల్లనే అతను తామిద్దరి మధ్య అపార్థాలను సృష్టిస్తున్నాడనీ చింటూ పరిస్థితిని సాగర్‌పైకి నెట్టేస్తాడు. సావిత్రమ్మ సాగర్ ను ఇంటి నుండి వారి ఆగ్రా శాఖకు పంపేస్తుంది. గంగ చింటూను పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకుని తిరిగి తన గ్రామానికి వెళ్లడానికి సిద్ధపడుతుంది. చింటూ, తాను గంగను తిరిగి పంపిస్తాననీ చెప్పి ఆమెను ఆగ్రాకు తీసుకువెళతాడు. అక్కడికి చేరుకున్న తరువాత, చింటూ గంగపై అత్యాచార ప్రయత్నం చేస్తాడు. ఆమె తప్పించుకుంటుంది. సాగర్ ఆమెను రక్షిస్తాడు. అతను ఆమెను తిరిగి గ్రామానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. వారు అక్కడికి చేరుకోకముందే, చింటూ, అతని తల్లిదండ్రులూ గంగా కుటుంబ సభ్యులకు గంగ సాగర్ తో లేచిపోయిందనే ఒక కొత్త కథను చెబుతారు. గంగ కుటుంబ సభ్యులు సాగర్ను తీవ్రంగా కొడతారు. మళ్ళీ గంగను చింటూకు అప్పగిస్తారు. అదే సమయంలో, సావిత్రమ్మ వచ్చి, అన్ని నిజాలను వెల్లడిస్తుంది. ఆమె తన కుటుంబ సభ్యులను నిరాకరించి, సాగర్‌నే తన వారసుడిగా అంగీకరిస్తుంది. ఇప్పుడు, సాగర్‌కు గంగకూ పెళ్ళి చెయ్యాలని ఆమె నిర్ణయించుకుంటుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంతో ఎంఎం కీరవణి సంగీతం అందించారు. అన్ని పాటలు చార్ట్‌బస్టర్‌లే. ఈ సంగీతాన్ని టి సిరీస్ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేశారు.

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."సువ్వి సువ్వి సువ్వాల"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. కె.ఎస్.చిత్ర, మాల్గాడి శుభ4:26
2."రమ్మనీ కంటిరెప్పలా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. కె.ఎస్.చిత్ర3:35
3."బంగారు బొమ్మకి"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. భానుమతీ రామకృష్ణ4:50
4."ఈ గాలీ ఈ నేలా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. కీరవాణి4:35
5."కోవెల పావురమా"చిత్ర4:00
6."మన్నించమ్మా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం3:44
7."సువ్వి సువ్వి సువ్వాల (విషాదం)"చిత్ర1:35
మొత్తం నిడివి:25:10

మూలాలు

[మార్చు]
  1. "పెళ్ళి కానుక స్టోరి | Pelli Kanuka Tollywood Movie Story, Preview in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-06.