Jump to content

సిరివెన్నెల సీతారామశాస్త్రి

వికీపీడియా నుండి
సీతారామశాస్త్రి
జననం
(1955-05-20)1955 మే 20
మరణం2021 నవంబరు 30(2021-11-30) (వయసు: 66)
సికిందరాబాదు
ఇతర నామముసిరివెన్నెల సీతారామశాస్త్రి
వృత్తికవి, రచయిత, గాయకుడు, నటుడు
జీవిత సహచరిపద్మావతి
పిల్లలుయోగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు
Parents
  • డా.సి.వి.యోగి (father)
  • సుబ్బలక్ష్మి (mother)

సిరివెన్నెల సీతారామశాస్త్రి గా పేరు గాంచిన చేంబోలు సీతారామశాస్త్రి (మే 20, 1955 - నవంబరు 30, 2021) తెలుగు సినీ గీతరచయిత.[1] ఈయన సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 2019లో భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో 1955 మే 20న డాక్టర్ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు . అతను అనకాపల్లి గాంధీనగరం పురపాలక ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి వరకు , ఆపైన అనకాపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నారు . కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ జననీ జన్మభూమి సినిమాకు[2] పాటలు రాసే అవకాశం కల్పించారు. సిరివెన్నెల సినిమాకు రాసిన విధాత తలపున పాట తో బహుళ ప్రాచుర్యం పొందారు . 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది.

కుటుంబం

[మార్చు]

సిరివెన్నెల సీతారామశాస్త్రికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యెగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు ఉన్నారు.[3]

సినిమా పాటల రచయితగా

[మార్చు]

విధాత తలఁపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశాలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. సీతారామశాస్త్రి వై. సత్యారావు తన గురువుగా చెబుతాడు.[2]

గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రికి సంస్కృతికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేశారు.

ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటలలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుంటే:

మరణం

[మార్చు]

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 నవంబరు 30న మరణించాడు.[4]

సిరివెన్నెల కాంస్య విగ్రహం

[మార్చు]

సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టి,పెరిగిన అనకాపల్లిలో ఆయన కాంస్య విగ్రహన్ని 2026, జనవరి 25 ఆదివారం నాడు తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఆవిష్కరించారు.

సినిమాల జాబితా (గేయ రచయితగా)

[మార్చు]

-

సంవత్సరం చిత్రం దర్శకుడు సంగీత దర్శకుడు పాటలు
1986సిరివెన్నెలకె. విశ్వనాథ్కె.వి. మహదేవన్
1986లేడీస్ టైలర్వంశీఇళయరాజా
  • గోపీలోలా, ఎక్కడ ఎక్కడ
1987గౌతమిక్రాంతి కుమార్ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
1987శ్రుతిలయలుకె. విశ్వనాథ్కె.వి. మహదేవన్
1987స్వయంకృషికె. విశ్వనాథ్రమేష్ నాయుడు
  • పారాహుషార్
1987మహర్షివంశీఇళయరాజా
  • సాహసం నా పథం
1988రుద్రవీణకె. బాలచందర్ఇళయరాజా
  • నమ్మకు నమ్మకు ఈ రేయిని
  • లలిత ప్రియ కమలం
  • తరలిరాద తనే వసంతం
  • చుట్టుపక్కల చూడరా
  • నీతోనే ఆగేనా సంగీతం
  • రండి రండి రండి
1988ఆడదే ఆధారంవిసు
1988ఇల్లు ఇల్లాలు పిల్లలువిసు
1988కళ్ళుఎస్పీబీ
  • తెల్లారింది లెగండో
1988పెళ్ళి చేసి చూడురేలంగి నరసింహారావుహంసలేఖ
1988శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్వంశీఇళయరాజా
1988స్వర్ణ కమలంకె. విశ్వనాథ్ఇళయరాజా
  • అన్ని పాటలు
1989జయమ్ము నిశ్చయమ్మురాజంధ్యాలరాజ్-కోటి
1989స్వరకల్పనవంశీఅమర్
1989సూత్రధారులుకె. విశ్వనాథ్కె.వి.మహదేవన్
1990అన్న-తమ్ముడుకృష్ణరాజ్-కోటి
1990అల్లుడుగారుకె. రాఘవేంద్రరావుకె.వి. మహదేవన్

(to be confirmed)

1990శివరామ్ గోపాల్ వర్మఇళయరాజా
  • బోటనీ పాఠముంది
1990బొబ్బిలిరాజాబి. గోపాల్ఇళయరాజా
  • అన్ని పాటలు
1990చెవిలో పువ్వుఇ.వి.వి.సత్యనారాయణచక్రవర్తి
1991ఆదిత్య 369సింగీతం శ్రీనివాసరావుఇళయరాజా
  • జాణవులే నెరజాణవులే
1991కలికాలంముత్యాల సుబ్బయ్యnot known

(to be confirmed) source:cinegoer.com

1991కూలీ నెం.1కె. రాఘవేంద్రరావుఇళయరాజా
  • కొత్త కొత్తగా ఉన్నది
1991రౌడీ అల్లుడుకె. రాఘవేంద్రరావుబప్పిలహరి
  • చిలుకా క్షేమమా
1991క్షణక్షణంఎం. ఎం. కీరవాణి
  • జాము రాతిరి జాబిలమ్మ
  • కో అంటే కోటి
  • అమ్మాయి ముద్దు ఇవ్వందే
  • అందనంత ఎత్తా తారాతీరం
1991అసెంబ్లీ రౌడీబి. గోపాల్కె.వి.మహదేవన్
1991ఏప్రిల్ 1 విడుదలవంశీఇళయరాజా
  • మాటంటే మాటేనంటా
1992ఆపద్బాంధవుడుకె. విశ్వనాథ్ఎం. ఎం. కీరవాణి
  • అన్ని పాటలు
1992పట్టుదలఇళయరాజా
  • ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
1992పరువు ప్రతిష్ఠరాజ్-కోటి
  • ఒప్పుకోకురా ఓటమినెప్పుడూ
1992స్వాతి కిరణంకె. విశ్వనాథ్కె.వి.మహదేవన్
  • ప్రణతి ప్రణతి
  • శివాని భవాని
  • జాలిగా జాబిలమ్మ
1993అల్లరి ప్రియుడుకె. రాఘవేంద్రరావుఎం. ఎం. కీరవాణి
  • అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
1993మనీశివనాగేశ్వరరావుశ్రీ
  • వారేవా ఏమి ఫేసు
1993మేజర్ చంద్రకాంత్కె. రాఘవేంద్రరావుఎం. ఎం. కీరవాణి
1993గాయంరామ్ గోపాల్ వర్మశ్రీ
  • నిగ్గదీసి అడుగు
  • సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
1993రక్షణఉప్పలపాటి నారాయణరావుఎం. ఎం. కీరవాణి
  • గుప్పు గుప్పు గుప్పుమన్నదంట
1993నిప్పురవ్వఎ.కోదండరామిరెడ్డిబప్పిలహరి, రాజ్-కోటి, ఎ.ఆర్.రెహమాన్
1993అంతంరామ్ గోపాల్ వర్మఆర్ డి బర్మన్, ఎం. ఎం. కీరవాణి , మణిశర్మ
  • ఓ మైనా
  • నీ నవ్వు చెప్పింది నాతో
1994గోవిందా గోవిందారామ్‌గోపాల్‌వర్మరాజ్-కోటి
  • అమ్మ బ్రహ్మదేవుడో
1994నంబర్ వన్ఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
1994శుభలగ్నంఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
  • చిలక ఏ తోడు లేక
1994భైరవద్వీపంసింగీతం శ్రీనివాసరావుమాధవపెద్ది సురేష్

(to be confirmed) source:ghantasala.info

  • ఘాటైన ప్రేమ ఘటన
1994ముద్దులప్రియుడుకె.రాఘవేంద్రరావుఎం. ఎం. కీరవాణి
1994యమలీలఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
1994ప్రియరాగాలుఎం. ఎం. కీరవాణి
1994మనీ మనీశివనాగేశ్వరరావుశ్రీ
1995క్రిమినల్మహేష్ భట్ఎం. ఎం. కీరవాణి
  • తెలుసా మనసా
1995గులాబికృష్ణవంశీశశిప్రీతమ్
  • క్లాస్‌రూమ్‌లో తపస్సు చేయుట
1995శుభసంకల్పంకె.విశ్వనాథ్ఎం. ఎం. కీరవాణి
  • హైలెస్సో హైలెస్స
  • హరి పాదాన
1995సిసింద్రీరాజ్
1995పెదరాయుడురవిరాజా పినిశెట్టికోటి
1995సొగసు చూడతరమాగుణశేఖర్రమణి భరద్వాజ్
1995అనగనగా ఒకరోజురామ్ గోపాల్ వర్మశ్రీ
1996లవ్‌బర్డ్స్ (డబ్బింగ్)పి వాసుఏఆర్‌ రెహమాన్
  • మనసున మనసుగ
1996మావిచిగురుఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
  • మావిచిగురు తిని
  • మాట ఇవ్వమ్మా చెల్లి
1996పవిత్ర బంధం
  • అపురూపమైనదమ్మ ఆడజన్మ
1996మైనాఉప్పలపాటి నారాయణరావుఎం. ఎం. కీరవాణి
1996లిటిల్ సోల్జర్స్గుణ్ణం గంగరాజుశ్రీ
  • సరేలే ఊరుకో
1996వజ్రంఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
1996నిన్నే పెళ్ళాడతాకృష్ణవంశీసందీప్ చౌతా
  • ఎటో వెళ్ళిపోయింది
  • గ్రీకువీరుడు
  • కన్నులో నీ రూపమే
  • ఇంకా ఏదో
  • నాతోరా
1996శ్రీకారం
1996అక్కుమ్ బక్కుమ్
1996సంప్రదాయంఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
1996రాముడొచ్చాడుఎ.కోదండరామిరెడ్డికోటి
1996శ్రీ కృష్ణార్జున విజయంసింగీతం శ్రీనివాసరావుమాధవపెద్ది సురేష్
1997వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్వంశీకీరవాణి
  • ఎక్కడికి ఈ పరుగు
1997పెళ్ళికోడి రామకృష్ణఎస్.ఎ.రాజ్‌కుమార్
  • జాబిలమ్మ నీకు అంత కోపమా
1997ఆరోప్రాణంవీరు కె.వీరు కె.
1997పెళ్ళి చేసుకుందాంముత్యాల సుబ్బయ్యకోటి
  • నువ్వేమి చేసావు నేరం
  • ఎన్నో ఎన్నో
1997గోకులంలో సీతముత్యాల సుబ్బయ్యకోటి
  • పొద్దే లేని లోకం నీది
  • గోకుల కృష్ణ
1997తారకరాముడుకోటి
  • అన్ని పాటలు
1997దేవుడుశిర్పి
1997శుభముహూర్తంకీరవాణి
1997వీడెవడండీ బాబూఇ.వి.విశిర్పి
1997ప్రేమించుకుందాం రామహేష్
  • మేఘాలే తాకింది
  • అలా చూడు ప్రేమలోకం
1997ఆహ్వానంఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
  • దేవతలారా రండి
  • మనసా మాటాడమ్మా
  • పందిరి వేసిన ఆకాశానికి
1997చిన్నబ్బాయికె. విశ్వనాథ్ఇళయరాజా
  • తెలుసుకో తెలుసుకో
  • విన్నపాలు వినమని
  • నిన్న చూసిన ఉదయం
  • అడగకండి
  • అంతా రండోయ్
  • నవ్వులో పుట్టాను
1998సింధూరంకృష్ణవంశీశ్రీ
  • ఓ చెలీ
  • అర్థ శతాబ్దపు
  • ఊరికే ఉండదే
  • ఒలేలే ఒలేలే
1998పవిత్ర ప్రేమముత్యాల సుబ్బయ్యకోటి
  • గుగుమ్మ గుగుమ్మ
  • చైత్రమా రా రా
  • చినుకులే ఒక్కటై
  • ఓ దైవమా
1998ఆవిడా మా ఆవిడేఇ.వి.విశ్రీ
  • అన్ని పాటలు
1998గణేష్మణిశర్మ
  • సిరిసిరిమువ్వలు
1997ప్రేమతో (డబ్బింగ్)మణిరత్నంఎ.ఆర్.రెహమాన్
  • అన్ని పాటలు
1998సూర్యవంశంఎస్ ఎ రాజ్ కుమార్
  • చుక్కలన్ని
  • కిలకిల నవ్వే
1998ఊయలఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
  • జరిగినదంతా నిజమని
1998శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండివై.వి.ఎస్.చౌదరిఎం. ఎం. కీరవాణి
  • అన్ని పాటలు
1998ఆహావందేమాతరం శ్రీనివాస్
  • అన్ని పాటలు
1998అంతఃపురంకృష్ణవంశీఇళయరాజా
  • సూరీడు పువ్వా
  • అసలేం గుర్తుకురాదు
  • కళ్యాణం కానుంది
1999రాజాఎస్ ఎ రాజ్ కుమార్
  • ఏదో ఒక రాగం
1999మా బాలాజీకోడి రామకృష్ణవందేమాతరం శ్రీనివాస్
1999సీతారామరాజువై.వి.ఎస్. చౌదరికీరవాణి
  • అన్ని పాటలు
1999శీనుమణిశర్మ
  • అల్లో నేరేడు కళ్ళదానా
1999మనసులో మాటఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
  • ఏ రాగముంది
1999నా హృదయంలో నిదురించే చెలిశ్రీ
1999ప్రేమకథరామ్‌గోపాల్‌వర్మసందీప్ చౌతా
  • కొక్కొరొకో
  • దేవుడు కరుణిస్తాడని
1999ప్రేమంటే ఇదేరారమణ గోగుల
  • మనసే ఎదురు తిరిగి
2000ఆజాద్తిరుపతిస్వామిమణిశర్మ
2000చిరునవ్వుతోమణిశర్మ
  • సంతోషం సగం బలం
  • నిన్నలా మొన్నలా లేదురా
2000నువ్వే కావాలివిజయ్ భాస్కర్కోటి
  • ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే
  • అనగనగా ఆకాశం ఉంది
  • కళ్ళలోకి కళ్ళు పెట్టి
2000ఒకేమాటకోటి(to be confirmed)
  • కోలో కోలో కొయిలాలో
2000జయం మనదేరావందేమాతరం శ్రీనివాస్
  • మెరిసేటి జాబిలి నువ్వే
2000చూసొద్దాం రండిరాజా వన్నెంరెడ్డిఎం. ఎం. కీరవాణి
  • చిన్ననాటి
2000సర్దుకుపోదాం రండిఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
  • ఉన్నా
2000శ్రీ శ్రీమతి సత్యభామఎస్.వి.కృష్ణారెడ్డిఎస్.వి.కృష్ణారెడ్డి
  • రామ చిలుక
  • రామ చిలుక (2)
2000నిన్నే ప్రేమిస్తాషిండేఎస్.ఎ. రాజ్‌కుమార్
  • కోయిల పాట బాగుందా
  • కోయిల పాట బాగుందీ
2000అంతా మన మంచికేవీరు కె.
2000నువ్వు వస్తావనివి.ఆర్. ప్రతాప్ఎస్.ఎ. రాజ్‌కుమార్
  • పాటల పల్లకి పై ఊరేగే చిరుగాలీ
2000మురారికృష్ణవంశీమణిశర్మ
  • ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
  • చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్
  • భామా భామా బంగారూ
  • అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
2000రాయలసీమ రామన్న చౌదరిసురేష్ కృష్ణమణిశర్మ
  • చమక్ చమక్‌మను
1992లాఠీఎం. ఎం. కీరవాణి
2001ఆనందంశ్రీను వైట్లదేవి శ్రీ ప్రసాద్
  • ఆనందం
  • కనులు తెరిచినా
  • ఎవరైనా ఎపుడైనా
  • ఎవరైనా ఎపుడైనా (2)
2001మనసంతా నువ్వేవి ఎన్ ఆదిత్యఆర్ పి పట్నాయక్
  • మనసంతా నువ్వే
2001నువ్వు నాకు నచ్చావ్కోటి
  • ఆకాశం దిగి వచ్చి
  • నా చూపే నిను
  • ఒక్కసారి చెప్పలేవా
  • ఓ నవ్వు చాలు
  • ఉన్నమాట చెప్పనీవు
2001ప్రేమతో రామణిశర్మ
  • ప్రేమయ్యిందో ఏమో
2001అమ్మాయి కోసంముప్పలనేని శివవందేమాతరం శ్రీనివాస్
  • బిఏలు చదివినా
2001వేచి ఉంటాఆకాష్
2001బావ నచ్చాడుకె.ఎస్. రవికుమార్ఎం. ఎం. కీరవాణి
  • చందమామ చందమామ
2001ఎదురులేని మనిషిఎస్.ఎ. రాజ్‌కుమార్
  • ఏమైందమ్మా ఈనాడు
  • ఏనాడైనా అనుకున్నానా
2001వాసుకరుణాకరన్హారిస్ జయరాజ్
  • నమ్మవే అమ్మాయి
2002ఒక్కడుగుణశేఖర్మణిశర్మ
  • అన్ని పాటలు
2002ఓ చినదానవిద్యాసాగర్
  • తన చిరునామా
2002సంతోషందశరథ్ఆర్ పి పట్నాయక్
  • నే తొలిసారిగా కలగన్నదీ
  • నువ్వంటే నాకిష్టమని
2002అల్లరిరవిబాబుపాల్ జె.
  • నర నరం ఉలిక్కిపడేట్టు
2002మనసుంటే చాలుశివశంకర్
2002లాహిరి లాహిరి లాహిరిలోవై.వి.ఎస్. చౌదరిఎం. ఎం. కీరవాణి
  • అ ఆ ఇ ఈ
2003డాడీసురేష్ కృష్ణఎస్ ఎ రాజ్‌కుమార్
  • నా ప్రాణమా సుస్వాగతం
  • గుమ్మాడి గుమ్మాడీ
2003వసంతంఎస్ ఎ రాజ్‌కుమార్
  • గాలీ చిరుగాలీ
2003ఎలా చెప్పనుకోటి
  • అన్ని పాటలు
2003మన్మథుడువిజయ భాస్కర్దేవి శ్రీ ప్రసాద్
  • నేను నేనులా లేనే
  • నా మనసునే
  • డోంట్ మ్యారీ
  • గుండెల్లో ఏముందో
  • చెలియా చెలియా
2003సింహాద్రిరాజమౌళిఎం. ఎం. కీరవాణి
  • అమ్మయినా నాన్నయినా
2004గుడుంబా శంకర్మణిశర్మ
  • చిట్టి నడుమునే చూస్తున్నా
2004వర్షంశోభన్దేవి శ్రీ ప్రసాద్
  • అన్ని పాటలు
2004శ్రీ ఆంజనేయంకృష్ణవంశీమణిశర్మ
  • ఊరేగి రావయ్య
  • రామ రామ
  • పూల ఘుమ ఘుమ
  • అవ్వాయి తువ్వాయి
  • తికమక మకతిక
2004ఆర్యసుకుమార్దేవి శ్రీ ప్రసాద్
  • నువ్వుంటే
2005నువ్వొస్తానంటే నేనొద్దంటానాప్రభుదేవాదేవి శ్రీ ప్రసాద్
  • అన్ని పాటలు
2005చక్రంకృష్ణవంశీచక్రి
  • జగమంత కుటుంబం
  • ఒకే ఒక మాట
  • రంగేళి హోలీ
  • కొంచెం కారంగా
2005సంక్రాంతిఎస్ ఎ రాజ్‌కుమార్
  • ఆశ ఆశగా
2006హ్యాపీకరుణాకరన్యువన్ శంకర్ రాజా
  • నీ కోసం
2006శివ 2006 (డబ్బింగ్)రామ్ గోపాల్ వర్మఇళయరాజా
2007బొమ్మరిల్లుభాస్కర్దేవి శ్రీ ప్రసాద్
  • నమ్మక తప్పని నిజమైనా
2007ఆటవి.ఎన్. ఆదిత్యదేవి శ్రీ ప్రసాద్
  • ఆట ఆట
  • నిన్ను చూస్తుంటే
  • హోయన
2007చిరుతపూరీ జగన్నాథ్మణిశర్మ
  • ఏక్‌బార్ ఏక్‌బార్
2007క్లాస్‌మేట్స్విజయ్ భాస్కర్కోటి
  • గుండె చాటుగా
2007ఒక్కడున్నాడుచంద్రశేఖర్ యేలేటిఎం. ఎం. కీరవాణి
  • అడుగడుగునా పడిపోయినా
2007ఆడవారి మాటలకు అర్థాలే వేరులేయువన్ శంకర్ రాజా
  • అల్లంత దూరాల ఆ తారక
2007అతిథిమణిశర్మ
  • సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
2008విశాఖ ఎక్స్‌ప్రెస్వర ముళ్ళపూడివిజయ్ కూరాకుల
2008వానఎమ్.ఎస్. రాజుకమలాకర్
  • ఆకాశ గంగా
  • ఎదుట నిలిచింది
  • డోలారే
  • సిరిమల్లె వాన
2008పరుగుభాస్కర్మణిశర్మ
  • పరుగులు తీయకే పసిదానా
  • హృదయం ఓర్చుకోలేనిదీ
2008హరే రామ్మిక్కీ జె. మేయర్
  • అన్ని పాటలు
2008గమ్యంఇ.ఎస్. మూర్తి
  • ఎంతవరకు ఎందుకొరకు
  • సమయమా
2008జల్సాత్రివిక్రమ్దేవి శ్రీ ప్రసాద్
  • సరీగమా పదనీస్సా
  • My Heart is Beating అదోలా
  • ఛలోరే ఛలోరే ఛల్
  • You & I
2008కంత్రిమణిశర్మ
  • అమ్మహో అనిపించేలా
2008రెడీశ్రీను వైట్లదేవి శ్రీ ప్రసాద్
  • గెట్ రెడీ
  • నా పెదవులు నువ్వైతే
2008అష్టా చమ్మాఇంద్రగంటికళ్యాణి మాలిక్
2008కొత్త బంగారు లోకంమిక్కీ జె. మేయర్
  • ఒకే అనేశా
  • నేననీ నీవనీ
  • నీ ప్రశ్నలు నీవే
2009శశిరేఖా పరిణయంకృష్ణవంశీమణిశర్మ
  • ఏదో ఏదో
  • ఇలా ఎంతసేపు
  • నిన్నే నిన్నే
2009మహాత్మకృష్ణవంశీవిజయ్ ఆంటోని
  • ఏం జరుగుతోంది
  • ఇందిరమ్మ ఇంటి పేరు
  • తల ఎత్తి
  • దైలామో దైలామో
2009కిక్సురేందర్ రెడ్డిథమన్
  • అన్ని పాటలు
2014అలా ఎలా?అనీష్ కృష్ణభీమ్స్ సెసిరోలియో
2018దేవదాస్శ్రీరామ్ అదిత్యమణిశర్మ
  • వారు వీరు
  • ఏమో ఏమో
  • మనసేదో వెతుకుతూ ఉంది
2020అల వైకుంఠపురములోత్రివిక్రమ్థమన్
  • సామజవరగమన
2021శ్యామ్‌ సింగరాయ్‌రాహుల్‌ సాంకృత్యన్‌మిక్కీ జె. మేయర్
  • రెండు పాట‌లు [5]

నటుడిగా

[మార్చు]

ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని... అని పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా,[2] తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది[2] పురస్కారం లభించటం విశేషం.



పురస్కారాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఉత్తమ గేయరచయితగా :

కళాసాగర్ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1986 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
  • 1992 - అంకురం - ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
  • 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
  • 1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా

మనస్విని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

కిన్నెర పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1998 - మనసులో మాట - ఏరాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా

భరతముని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1992 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
  • 1996 - పవిత్రబంధం - అపురూపమైనదమ్మ ఆడజన్మ - ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
  • 1999 - భారతరత్న - మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!

అఫ్జా పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1999 - భారతరత్న - పారా హుషార్ భాయీ భద్రం సుమా సిపాయీ
  • 2000 - నువ్వు వస్తావని - పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి

వంశీ బర్ఖిలీ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 2000 - నువ్వే కావాలి సినిమా గేయ రచయితగా :
  • కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు
  • అనగనగా ఆకాశం వుంది - ఆకాశంలో మేఘం ఉంది
  • ఎక్కడ వున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి

రసమయి పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :

  • 1988 - కళ్ళు - తెల్లారింది లెగండోయ్ కొక్క్కొరొక్కొ, మంచాలింక దింగండోయ్ కొక్క్కొరొక్కొ

బుల్లి తెర పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :

  • 1999 - తులసి దళం, టి.వి. సీరియల్ - హాయిగా వుంది, నిదురపో

సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు

  • 2021 - లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డు (మరణానంతరం)[10]

సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత

  • 2015: "ఇటు ఇటు ఇటు" (కంచె)

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "sirivennela seetharama sastry: మదికన్నుల... సిరివెన్నెల". EENADU. Retrieved 2025-05-21.
  2. 1 2 3 4 హిందూ దిన పత్రిక వెబ్సైట్ నుండి Poet who loves to churn the mind Archived 2008-03-07 at the Wayback Machine సీతారామశాస్త్రి గురించి వ్యాసంజూన్ 11,2008న సేకరించబడినది.
  3. ↑ 10TV (30 November 2021). "సిరివెన్నెల కుమారులిద్దరూ సినీ పరిశ్రమలోనే.. | Sirivennela Family". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ↑ "Popular Telugu lyricist Sirivennela Sitaramasastri is No More, Died of Lung Cancer". Moviezupp. 2021-11-30. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-30.
  5. ↑ 10TV (30 November 2021). "సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు ఇవే.. | Sirivennela". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  7. ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  8. ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  9. ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  10. ↑ "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)