రుద్రవీణ (సినిమా)

వికీపీడియా నుండి
(రుద్రవీణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రుద్రవీణ
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
నిర్మాణం కె.నాగేంద్రబాబు
కథ కె.బాలచందర్,
గణేశ్ పాత్రో
చిత్రానువాదం కె.బాలచందర్
తారాగణం చిరంజీవి,
శోభన,
జెమినీ గణేశన్,
దేవి లలిత,
బ్రహ్మానందం,
పి.ఎల్.నారాయణ,
ప్రసాద్ బాబు
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం కె.ఎస్.చిత్ర,
ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ,
కె.జె.జేసుదాసు,
మనో
నృత్యాలు ఎస్.రఘురాం,
గిరిజ
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు గణేశ్ పాత్రో
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కూర్పు గణేష్ కుమార్
నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్
నిడివి 170 ని.
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రుద్రవీణ మార్చి 4, 1988లో కె.బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రధానమైన తెలుగు సినిమా. చిరంజీవి, శోభన ఇందులో ప్రధాన పాత్రధారులు.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

సంగీత ప్రావీణ్యుడైన గణపతి శాస్త్రి (జెమిని గణేశన్) కి గౌరవప్రథమైన బిళహరి బిరుదు ఉంటుంది. గణపతి శాస్త్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు (ప్రసాద్ బాబు) మూగవాడు, కానీ సన్నాయి నాదంలో దిట్ట. చిన్న కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి (చిరంజీవి) తండ్రి వద్దే సంగీతంలో శిక్షణ పొందుతున్నా అభినవ భావాలు గల వ్యక్తి. కుమార్తె తంబూరా వాయిద్యంలో ప్రావీణ్యురాలు.

లలిత శివజ్యోతి (శోభన) నాట్యంలో ప్రావీణ్యం ఉన్నా, కేవలం అధమ సామాజిక వర్గానికి చెందినది కావటం వలన, గుడిలోకి తన ప్రవేశం నిషిద్ధం కావటం వలన, గుడికి దూరంగా, కొండపై నటనమాడుతూ ఉంటుంది. లలిత నాట్యానికి ముగ్ధుడైన సూర్యం తనతో పరిచయం పెంచుకొంటాడు. లలితకు జరుగుతోన్న అన్యాయానికి బాధ పడతాడు. లలిత తండ్రి (పి. ఎల్. నారాయణ) ఒక లాయరు.

ఒకరోజు తండ్రితో కలిసి సాధన చేస్తున్న సూర్యానికి తలుపు వద్ద ఒక స్త్ర్రీ భిక్షాటన వినిపిస్తుంది. ఆ భిక్షగత్తె దీన గళంతో ఏకాగ్రతని కోల్పోయిన సూర్యాన్ని మందలిస్తాడు గణపతి శాస్త్రి. తరువాత జరిగే సంగీత కచేరీలో "మానవ సేవే మాధవ సేవ" అని అర్థం వచ్చేలా సూర్యం పాడటంతో తనని శిష్యునిగా ధిక్కరిస్తాడు గణపతి శాస్త్రి. చారుకేశ (రమేష్ అరవింద్) అనే మరో యువకుడిని శిష్యునిగా స్వీకరిస్తాడు. తండ్రి ధిక్కరింపుకు గురి అయిన సూర్యం, లలిత ఇంటిలో తలదాచుకొంటాడు.

తన కూతురినే ప్రేమించటం హర్షించిన గణపతి శాస్త్రిని చారుకేశ వరకట్నంగా తన బిళహరి బిరుదుని ఇవ్వమంటాడు. చేసేది లేక ఇచ్చిన గణపతి శాస్త్రికి తర్వాత చారుకేశ అసలు బ్రాహ్మణుడే కాదని తెలుస్తుంది.

ఇల్లు వదలి సమాజసేవ బాటని పట్టిన సూర్యం సంఘ సంక్షేమ ప్రయత్నాలని గుర్తించి ప్రధాన మంత్రి అతనిని సత్కరించటానికి తమ ఊరికి వస్తున్నాడని గణపతి శాస్త్రికి తెలుస్తుంది. ఆ సభలో కుమారుడిని దగ్గర నుండి చూడాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవటం గమనించిన సూర్యం అతను తన తండ్రి అని, సభా వేదిక పై అతనిని తీసుకు వచ్చి, తండ్రిగా అతనిని సత్కరించటంతో చిత్రం సుఖాంతమౌతుంది.

తారాగణం

[మార్చు]

విశేషాలు

[మార్చు]
  • తమిళ చిత్రం ఉన్నాల్ ముడియుం తంబి (నీకు సంభవం తమ్ముడా) దీనిని అనుసరించి తీసారు. కమల్ హాసన్ ఇందులో కథానాయకుడు. సీత నాయకి. రెండు చిత్రాలలోను తండ్రి పాత్రని జెమిని గణేశన్ పోషించారు.
  • ఈ చిత్రంలో అన్ని పాటలు జనాదరణ పొందినవే. కాగా, మాటకీ పాటకీ మధ్యస్తంగా అనిపించే 'రండి రండి రండి' పా(మా)ట ఒక ప్రయోగం. ఇది తమిళ అనువాదంలో లేదు.
  • 'లలిత ప్రియ కమలం' పాట తెలుగులో జేసుదాసు ఆలపించగా, ఇదే పాటని తమిళం లో బాలు ఆలపించారు.

పాటలు

[మార్చు]

ఈ సినిమా కోసం 9 పాటలను చిత్రీకరించారు.[1]

పాట గీతరచన గానం సంగీతం నటీనటులు
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా
చెప్పాలని ఉంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా చిరంజీవి
తరలి రాదా తనే వసంతం
తన దరికిరాని వనాలకోసం
సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా చిరంజీవి
తులసీ దళములచే త్యాగరాజస్వామి కె.జె.జేసుదాసు ఇళయరాజా
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా చిరంజీవి
నీతోనె ఆగేనా సంగీతం, బిళహరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి కె.జె.జేసుదాసు ఇళయరాజా చిరంజీవి
మానవ సేవ ద్రోహమా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కె.జె.జేసుదాసు ఇళయరాజా చిరంజీవి
రండి.. రండి.. రండి దయచేయండీ
తమరి రామ మాకెంతో సంతోషం సుమండీ
సిరివెన్నెల సీతారామ శాస్త్రి నాగూర్ బాబు, ఎస్.పి.శైలజ ఇళయరాజా పి.ఎల్.నారాయణ, శోభన
లలిత ప్రియ కమలం విరిసినది సిరివెన్నెల సీతారామ శాస్త్రి కె.జె.జేసుదాసు, కె.ఎస్.చిత్ర ఇళయరాజా చిరంజీవి, శోభన

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1988 రుద్రవీణ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - జాతీయ సమైక్యత చిత్రం గెలుపు
చిరంజీవి నంది ఉత్తమ నటుడు (జ్యూరి) పురస్కారం - తెలుగు గెలుపు
ఇళయరాజా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయకుడు గెలుపు

చెప్పాలని ఉంది పాటలో కొన్ని వాక్యాలు

[మార్చు]

శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం లో నుండి తీసుకొనబడిన ఈ పాటలో కొన్ని వాక్యాలు:

సకల జగతిని శాశ్వతంగా నందనం వరియించుదాకా...
ప్రతీ మనిషి జీవితంలో వసంతం విరబూయుదాకా...
నేను సైతం నేను సైతం నేను సైతం...

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిరంజీవి నటించిన సినిమాల జాబితా

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]