Jump to content

కాకినాడ శ్యామల

వికీపీడియా నుండి
కాకినాడ శ్యామల
జననంకాకినాడ,తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం India
వృత్తిభారతీయ చలనచిత్ర నటి
క్రియాశీలక సంవత్సరాలు1978-ప్రస్తుతం
మతంహిందూ మతం

కాకినాడ శ్యామల ప్రముఖ రంగస్థల, సినిమానటి. ఈమె దాదాపు 200 సినిమాల వరకు తెలుగు, తమిళ భాషలలో నటించింది.[1]

విశేషాలు

[మార్చు]

ఈమె పుట్టింది పెరిగింది కాకినాడలో. ఈమె చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. జోసెఫ్ కాన్వెంటు బోర్డింగ్ స్కూలులో 8వ తరగతి వరకు చదివింది. ఈమెకు చిన్నతనం నుండే సినిమాలలో పాటలు పాడాలన్న కోరిక ఉండేది. ఈమె తొలిసారి "వేరు పడి తీరాలి" అనే నాటకంలో నటించి రంగస్థలంపై కాలుమోపింది. ఈమె నాటకాలలో నటించడం మొదట కుటుంబసభ్యులకు యిష్టం లేకున్నా ఆ తరువాత ఆమెను ప్రోత్సహించారు. ఈమె చింతామణి, వసంతసేన, ఛాయ, ప్రమీల వంటి పౌరాణిక పాత్రలలో ఈమె రాణించింది. మరో మొహెంజొదారో, కన్యాశుల్కం, రాగరాగిణి, లావాలో ఎర్రగులాబీ, రాజీవం మొదలైన సాంఘిక నాటకాలలో నటించి అనేక బహుమతులు పొందింది. ఈమె మరోచరిత్ర సినిమాలో తొలిసారి వెండితెరపై నటించింది.[2]

సినిమాల జాబితా

[మార్చు]

ఈమె నటించిన తెలుగు సినిమాలలో కొన్ని:

  1. మరోచరిత్ర (1978) - baalu తల్లి
  2. గుప్పెడు మనసు (1979)
  3. నిత్య సుమంగళి
  4. దశ తిరిగింది (1979)
  5. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
  6. తరంగిణి (1982)
  7. నాలుగు స్తంభాలాట (1982)
  8. ఆలయశిఖరం (1983)
  9. బలిదానం (1983)
  10. ఆనంద భైరవి (1984)
  11. మయూరి (1984)
  12. ప్రేమించు పెళ్ళాడు (1985) - సుభద్ర
  13. బాబాయ్ అబ్బాయ్ (1985) - అరుణ తల్లి
  14. మొగుడు పెళ్ళాలు (1985)
  15. దేశోద్ధారకుడు (1986) - ధర్మారాయుడి భార్య
  16. రెండు రెళ్ళు ఆరు (1986) - వార్డెన్
  17. రుద్రవీణ (1986)
  18. గాంధీనగర్ రెండవ వీధి (1987) - సర్పకం
  19. చినబాబు (1988) -
  20. జానకిరాముడు (1988) - దుర్గమ్మ
  21. మంచి దొంగ (1988)
  22. రంభ-రాంబాబు (1990) - జానకమ్మ
  23. ఆకాశంలో సగం (2013) - వసుంధర అత్త

మూలాలు

[మార్చు]
  1. సరితకి తల్లిని కాబోయి కమల్‌కి తల్లినయ్యాను
  2. గొరుసు, జగదీశ్వరరెడ్డి (18 March 2012). "సరితకి తల్లిని కాబోయి కమల్‌కి తల్లినయ్యాను". ఆంధ్రజ్యోతి.