ఆకాశంలో సగం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకాశంలో సగం
(2013 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రేమ్‌రాజ్
నిర్మాణం మల్కాపురం శివకుమార్
కథ యండమూరి వీరేంద్రనాథ్
తారాగణం రవిబాబు,
చంద్రమహేష్,
ఆషా సైని,
శ్వేతా బసు ప్రసాద్
సంగీతం యశోకృష్ణ
గీతరచన సుద్దాల అశోక్ తేజ
సంభాషణలు పరుచూరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం కళ్యాణ్‌ సమీ
నిర్మాణ సంస్థ నంది ప్రొడక్షన్స్‌
భాష తెలుగు

యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన "అనైతికం" అనే నవల ఆధారంగా తీసిన సినిమా ఇది.[1] ఈ చిత్రంలో 18 మంది సినిమా దర్శకులు నటించడం ఒక విశేషం.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

ముంబయిలో కుమార్తె (శ్వేతాబసు ప్రసాద్‌)తో కలసి జీవిస్తుంటుంది వసుంధర (మయూరి అలియాస్‌ ఆశాసైనీ). ఆమె ఓ సింగిల్‌ పేరెంట్‌. ఆమెకు భర్త లేడు, ఈ అమ్మాయికి తండ్రి లేడు అంటూ సూటిపోటి మాటలు వినాల్సి రావడంతో, తన తండ్రి ఎవరన్నది చెప్పమంటూ కూతురు, తల్లిని నిలదీస్తుంది. అప్పుడు తల్లి తన డైరీని కూతురికిస్తుంది. ఆ డైరీలో తల్లి రాసుకున్న తన జీవితమే ఫ్లాష్‌బ్యాక్‌గా నడిచే ఈ సినిమా. వసుంధర ఓ మధ్యతరగతి అమ్మాయి. భర్త (దర్శకుడు చంద్రమహేశ్‌) ఓ మామూలు ఉద్యోగి. అందరు అమ్మాయిల లాగే వసుంధరకు కూడా జీవితం మీద కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ, అన్నిటికీ నిరుత్సాహపరుస్తూ మాట్లాడే భర్త మనస్తత్త్వం, సంసారంలోని చిన్న చిన్న సంతోషాల పట్ల కూడా అతనికి ఉన్న అనాసక్తి ఆమెను కుంగదీస్తాయి. పైగా, అన్నిటికీ ఏదో ఒక అడ్డుపుల్ల వేసే ఛాదస్తపు అత్త గారు (కాకినాడ శ్యామల), తన పనిలో తాను మునిగిపోయే బావ గారు (దర్శక - నటుడు 'అల్లరి' రవిబాబు), పూజా పునస్కారాలతో గడిపే తోడి కోడలు, సినిమాలూ షికార్లకూ తిరిగే ఆడపడుచు... ఇలా ఎవరికి వారేగా ఉండే కుటుంబమది.

ఆ పరిస్థితుల్లో భర్తతో కలసి సరదాగా టూర్‌కు ప్లాన్‌ చేస్తుంది వసుంధర. తీరా ఊరెళుతున్న సమయంలోనే 'డిసెంబర్‌ 6' ఘర్షణలు తలెత్తుతాయి. ఆ సమయంలో వసుంధరను ఒంటరిగా వదిలేసి, భర్త పారిపోతాడు. ఒంటరిగా మిగిలిన ఆమె వెంట రౌడీలు పడతారు. అప్పటికి చిత్ర ప్రథమార్ధం ముగుస్తుంది. ఆ తరువాత ఆమె ఏమైంది, ఆమె జీవితం ఎలా అనుకోని మలుపు తిరిగిందన్నది చిత్ర ద్వితీయార్ధం.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. రెంటాల, జయదేవ (27 March 2013). "అసంతృప్తి మిగిల్చే నవలా చిత్రం". ప్రజాశక్తి దినపత్రిక. Archived from the original on 30 జూలై 2013. Retrieved 18 March 2017.