యనమదల కాశీ విశ్వనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాశీ విశ్వనాథ్
Y.KasiViswanath.jpg
జననంయనమదల కాశీవిశ్వనాథ్
నవంబర్ 26
పురుషోత్తపట్టణం, సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా
నివాసంమాదాపూర్, హైదరాబాదు
వృత్తినటుడు, దర్శకుడు, రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1983 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిహేమలత
పిల్లలుప్రవల్లిక, హారిక
తల్లిదండ్రులు
 • భూగోపాలరావు (తండ్రి)
 • మంగమణి (తల్లి)

యనమదల కాశీ విశ్వనాథ్ తెలుగు సినీ నటుడు, మరియు దర్శకుడు.[1][2] నువ్వు లేక నేను లేను ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా. దర్శకుడు కాక మునుపు ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ దర్శకడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. నటుడిగా ఆయన మొదటి సినిమా రవిబాబు దర్శకత్వం వహించిన నచ్చావులే అనే సినిమా. ఈ సినిమాలో కథానాయకుడి తండ్రి పాత్ర పోషించాడు. ఆ సినిమా నుంచి ఆయన నటుడిగా కొనసాగుతున్నాడు. తొంభైకి పైగా సినిమాల్లో నటించాడు.[3]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

కాశీవిశ్వనాథ్ తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంకు దగ్గర్లోని సీతానగరం మండలం, పురుషోత్తపట్నం లో జన్మించాడు.[4] ఆయన తల్లిదండ్రులు భూగోపాలరావు, మంగమణి. ప్రాథమిక విద్య తన స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. పోలవరం ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుంచి పన్నెండో తరగతి దాకా చదివాడు. రాజమండ్రిలో బీ.కాం పూర్తి చేశాడు.

సినీరంగ ప్రస్థానం[మార్చు]

బాల్యంలో ఆయన బంధువులకు సినిమా హాలు ఉండేది. అందులో ఆయన ఉచితంగా సినిమాలు చూసేవాడు. వాటిని చూసి స్ఫూర్తి పొంది చిన్న కథనాలు రాసుకుని అమ్మకు వివరించేవాడు. ఆమె కూడా ప్రోత్సహించేది. ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు వారి ఊరికి దగ్గరలో బాలచందర్ దర్శకత్వంలో తొలికోడి కూసింది అనే సినిమా షూటింగ్ జరగడం చూశాడు. అప్పటి నుంచి సినీరంగం వైపు ఆకర్షితులయ్యాడు. కుటుంబ సభ్యులకి ఆ విషయాన్ని తెలియ జేశాడు. తనకి సోదరుడి వరసయ్యే గద్దె రత్నాజీ రావు ప్రోత్సాహంతో చెన్నై వెళ్ళి కానూరి రంజిత్ కుమార్ అనే నిర్మాతను కలిశాడు. అప్పుడు ఆయన విజయనిర్మల దర్శకత్వంలో లంకె బిందెలు అనే సినిమా తీస్తున్నాడు. ఈయన ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు.[5][6]

నటించిన సినిమాలు[మార్చు]

 1. నచ్చావులే
 2. Mr. పర్ఫెక్ట్
 3. కళావర్ కింగ్
 4. లడ్డు బాబు
 5. నమో వెంకటేశ
 6. బ్రోకర్
 7. ఎందుకంటే...ప్రేమంట!
 8. శ్రీమన్నారాయణ
 9. రఫ్‌ (2014)
 10. జోరు (2014)[7]
 11. కొత్త జంట (2014)
 12. ఆవిరి (2019)[8]


దర్శకత్వం చేసినవి[మార్చు]

 1. నువ్వు లేక నేను లేను
 2. తొలిచూపులోనే[9]

మూలాలు[మార్చు]

 1. Filmibeat. "Yanamadala Kasi Viswanath profile". filmibeat. Filmibeat. Retrieved 28 May 2019.
 2. MAA Stars. "Kasi Viswanath". maastars.com. Movie Artists Association. Retrieved 28 May 2019.
 3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (6 September 2015). "డాక్టర్ డైలాగులు పేషెంట్‌కి మార్చా". మూలం నుండి 28 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 28 May 2019. Cite news requires |newspaper= (help)
 4. సాక్షి, జిల్లాలు (25 August 2016). "సత్యదేవునిపై సినిమా తీస్తా". మూలం నుండి 28 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 28 May 2019. Cite news requires |newspaper= (help)
 5. NTV, News. "Interview with Director, Actor Kasi Viswanath". youtube. NTV. Retrieved 28 May 2019.
 6. Shiva. "Y. Kasi Viswanath Youtube interview". Youtube. Shiva. Retrieved 28 May 2019.
 7. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. మూలం నుండి 9 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 20 June 2019. Cite news requires |newspaper= (help)
 8. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'ఆవిరి' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. మూలం నుండి 1 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 1 November 2019.
 9. Jeevi. "Telugu cinema Review - Toli choopulone". idlebrain.com. Idlebrain. Retrieved 28 May 2019.

బయటి లింకులు[మార్చు]